1 పేతురు పత్రిక Chapter 1 TELIRV Bible Verse Images

1 పేతురు పత్రిక 1 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 పేతురు పత్రిక 1 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 పేతురు పత్రిక 1:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు క్రీస్తు అపొస్తలుడు అయిన పేతురు పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అనే ప్రాంతాల్లో చెదరిపోయి పరదేశులుగా ఉంటున్న ఎంపిక అయిన వారికి శుభమని చెప్పి రాస్తున్న సంగతులు.

1 పేతురు పత్రిక 1:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తండ్రి అయిన దేవుని భవిష్యద్‌ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ వలన పవిత్రీకరణ పొంది, యేసు క్రీస్తుకు విధేయత చూపడానికి ఆయన రక్త ప్రోక్షణకు వచ్చిన మీపై కృప నిలిచి ఉండుగాక. మీకు శాంతిసమాధానం విస్తరించు గాక.

1 పేతురు పత్రిక 1:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.

1 పేతురు పత్రిక 1:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది.

1 పేతురు పత్రిక 1:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి.

1 పేతురు పత్రిక 1:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా దీన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు.

1 పేతురు పత్రిక 1:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది.

1 పేతురు పత్రిక 1:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు.

1 పేతురు పత్రిక 1:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ విశ్వాసానికి ఫలాన్ని అంటే మీ ఆత్మల రక్షణ పొందుతున్నారు.

1 పేతురు పత్రిక 1:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి ఎంతో శ్రద్ధతో విచారించి పరిశీలించారు.

1 పేతురు పత్రిక 1:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేసిన విషయాలు అంటే క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత రాబోయే గొప్ప విషయాలు ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకొనేందుకు ఆలోచించి పరిశోధించారు.

1 పేతురు పత్రిక 1:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తమ కోసం కాక మీ కోసమే తాము సేవ చేశారనే సంగతి ఆ ప్రవక్తలకు వెల్లడి అయింది. పరలోకం నుంచి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. దేవదూతలు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు.

1 పేతురు పత్రిక 1:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.

1 పేతురు పత్రిక 1:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు.

1 పేతురు పత్రిక 1:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.

1 పేతురు పత్రిక 1:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది.

1 పేతురు పత్రిక 1:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు, “తండ్రీ” అని పిలిచే వారైతే భూమిమీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి.

1 పేతురు పత్రిక 1:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు.

1 పేతురు పత్రిక 1:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు.

1 పేతురు పత్రిక 1:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విశ్వం ఉనికిలోకి రాక ముందే దేవుడు క్రీస్తుని నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్ష పరిచాడు.

1 పేతురు పత్రిక 1:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుడాయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి.

1 పేతురు పత్రిక 1:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి.

1 పేతురు పత్రిక 1:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు.

1 పేతురు పత్రిక 1:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటి వారు. వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది

1 పేతురు పత్రిక 1:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గానీ ప్రభువు వాక్కు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.” ఈ సందేశమే మీకు సువార్తగా ప్రకటించడం జరిగింది.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Peter 1 (ASV) »
King James Version (KJV)
1 Peter 1 (KJV) »
GOD’S WORD® (GW)
1 Peter 1 (GW) »
Berean Bible (BSB)
1 Peter 1 (BSB) »
World English Bible (WEB)
1 Peter 1 (WEB) »
French Bible (LSG)
1 Pierre 1 (LSG) »
German Bible (LUTH1912)
1 Petrus 1 (LUTH1912) »
Hindi Bible (HINIRV)
1 पतरस 1 (HINIRV) »
Punjabi Bible (PANIRV)
1 ਪਤਰਸ 1 (PANIRV) »
Marathi Bible (MARIRV)
1 पेत्र 1 (MARIRV) »
Arabic Bible (AVD)
١ بطرس 1 (AVD) »
Portuguese Bible (BSL)
1 Pedro 1 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Phi-rơ 1 (VIE) »
Spanish Bible (RVA)
1 Pedro 1 (RVA) »
Italian Bible (RIV)
1 Pietro 1 (RIV) »
Chinese Simplified (CUVS)
彼 得 前 书 1 (CUVS) »
Chinese Traditional (CUVT)
彼 得 前 書 1 (CUVT) »
Albanian Bible (ALB)
1 Pjetrit 1 (ALB) »
Swedish Bible (SV1917)
1 Petrusbrevet 1 (SV1917) »
Russian Bible (RUSV)
1 Петра 1 (RUSV) »
Ukrainian Bible (UKR)
1 Петра 1 (UKR) »
Hungarian Bible (KAR)
1 Péter 1 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Петрово 1 (BULG) »
Norwegian Bible (NORSK)
1 Peter 1 (NORSK) »

1 పేతురు పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4 5

TELIRV Book Selection List