1 తిమోతి పత్రిక Chapter 5 TELIRV Bible Verse Images

1 తిమోతి పత్రిక 5 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 తిమోతి పత్రిక 5 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 తిమోతి పత్రిక 5:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వయసులో పెద్దవాణ్ణి కఠినంగా మందలించ వద్దు. అతనిని తండ్రిగా భావించి హెచ్చరించు.

1 తిమోతి పత్రిక 5:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యువకులను సోదరులుగా, వయసు పైబడిన స్త్రీలను తల్లులుగా, యువతులను సోదరీలుగా ఎంచి పూర్ణ పవిత్రతతో హెచ్చరించు.

1 తిమోతి పత్రిక 5:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిజమైన వితంతువులను గౌరవించు.

1 తిమోతి పత్రిక 5:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఏ వితంతువుకైనా పిల్లలు గాని, మనవలు గాని ఉంటే, వీరు మొదట తమ ఇంటివారి పట్ల తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవునికి ఎంతో ఇష్టం.

1 తిమోతి పత్రిక 5:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిజంగా వితంతువు ఒక్కతే ఉండి, దేవుని మీదనే తన నమ్మకం పెట్టుకుని, ఆయన సాయం కోసం రేయింబగళ్ళు ప్రార్ధిస్తూ, విన్నపాలు చేస్తూ ఉంటుంది.

1 తిమోతి పత్రిక 5:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే విలాసాల్లో బతికే వితంతువు బతికి ఉన్నా చచ్చినట్టే.

1 తిమోతి పత్రిక 5:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు నింద పాలు కాకుండేలా వీటిని కూడా బోధించు.

1 తిమోతి పత్రిక 5:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.

1 తిమోతి పత్రిక 5:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అరవై ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు ఉండి, గతంలో ఒక్క పురుషుడికే భార్యగా ఉన్న స్త్రీని మాత్రమే విధవరాలిగా నమోదు చెయ్యి.

1 తిమోతి పత్రిక 5:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె మంచి పనుల్లో పేరు పొంది ఉండాలి. అంటే, పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, లేదా ప్రతి మంచి పనీ చేయడానికి పూనుకుని ఉండడం. అలాటి వారిని విధవరాళ్ళ జాబితాలో చేర్చవచ్చు.

1 తిమోతి పత్రిక 5:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పడుచు వితంతువులను లెక్కలో చేర్చవద్దు. క్రీస్తుకు విరోధంగా వారి వాంఛలు ఎక్కువైపోతే పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.

1 తిమోతి పత్రిక 5:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇలా వారు తమ మొదటి నిర్ణయాన్ని వదిలేసి తమ మీదికి అపరాధం తెచ్చుకుంటారు.

1 తిమోతి పత్రిక 5:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఇంటింటికీ తిరుగుతూ, సోమరులవుతారు. అంతేగాక, వారు పనికిమాలిన మాటలు మాటలాడుతూ, వాగుడుకాయలై ఇతరుల విషయాల్లో తల దూర్చేవారుగా తయారవుతారు.

1 తిమోతి పత్రిక 5:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి యువతులు పెళ్ళి చేసుకుని పిల్లలను కని ఇంటి పనులు చూసుకుంటూ, శత్రువుకు నిందించే అవకాశమివ్వకుండా ఉండాలని నా ఉద్దేశం.

1 తిమోతి పత్రిక 5:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్పటికే కొంతమంది దారి తప్పి సాతాను వెంట వెళ్ళిపోయారు.

1 తిమోతి పత్రిక 5:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏ విశ్వాసురాలి ఇంట్లోనైనా వితంతువులు ఉంటే, వారి గురించిన భారం సంఘానికి లేకుండా ఆమె తానే వారికి సహాయం చేయాలి.

1 తిమోతి పత్రిక 5:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి.

1 తిమోతి పత్రిక 5:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇందుకు అనుగుణంగా లేఖనంలో, “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అనీ, “పనివాడు తన జీతానికి అర్హుడు” అనీ ఉంది.

1 తిమోతి పత్రిక 5:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే తప్ప సంఘ పెద్ద మీద నిందారోపణ అంగీకరించ వద్దు.

1 తిమోతి పత్రిక 5:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిగతా వారు భయపడేలా పాపం చేసిన వారిని అందరి ఎదుటా గద్దించు.

1 తిమోతి పత్రిక 5:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విరోధ బుద్ధితో గానీ భేద భావంతో గానీ ఏమీ చేయక ఈ నియమాలను పాటించాలని దేవుని ఎదుటా, క్రీస్తు యేసు ఎదుటా, దేవుడు ఎన్నుకున్న దూతల ఎదుటా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.

1 తిమోతి పత్రిక 5:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరి మీదా త్వరపడి చేతులుంచవద్దు. ఇతరుల పాపాల్లో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రునిగా ఉండేలా చూసుకో.

1 తిమోతి పత్రిక 5:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక నుండి నీళ్ళు మాత్రమే గాక నీ కడుపులో తరచుగా వచ్చే వ్యాధి కోసం కొద్దిగా ద్రాక్షారసం తాగు.

1 తిమోతి పత్రిక 5:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొందరి పాపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అవి వారి తీర్పుకు ముందే నడుస్తున్నాయి. మరి కొంతమంది పాపాలు వారి వెంటే వెళుతున్నాయి.

1 తిమోతి పత్రిక 5:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే కొన్ని మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన వాటిని సైతం దాచి ఉంచడం సాధ్యం కాదు.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Timothy 5 (ASV) »
King James Version (KJV)
1 Timothy 5 (KJV) »
GOD’S WORD® (GW)
1 Timothy 5 (GW) »
Berean Bible (BSB)
1 Timothy 5 (BSB) »
World English Bible (WEB)
1 Timothy 5 (WEB) »
French Bible (LSG)
1 Timothée 5 (LSG) »
German Bible (LUTH1912)
1 Timotheus 5 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Timóteo 5 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Ti-mô-thê 5 (VIE) »
Spanish Bible (RVA)
1 Timoteo 5 (RVA) »
Italian Bible (RIV)
1 Timoteo 5 (RIV) »
Chinese Simplified (CUVS)
提 摩 太 前 书 5 (CUVS) »
Chinese Traditional (CUVT)
提 摩 太 前 書 5 (CUVT) »
Albanian Bible (ALB)
1 Timoteut 5 (ALB) »
Swedish Bible (SV1917)
1 Timotheosbrevet 5 (SV1917) »
Russian Bible (RUSV)
1 Тимофею 5 (RUSV) »
Ukrainian Bible (UKR)
1 Тимофію 5 (UKR) »
Hungarian Bible (KAR)
1 Timóteus 5 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Тимотей 5 (BULG) »
Norwegian Bible (NORSK)
1 Timoteus 5 (NORSK) »

1 తిమోతి పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6

TELIRV Book Selection List