2 కొరింథీయులకు Chapter 11 TELIRV Bible Verse Images

2 కొరింథీయులకు 11 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 కొరింథీయులకు 11 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 కొరింథీయులకు 11:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా బుద్దిహీనతను దయతో సహించమని కోరుతున్నాను, నిజానికి మీరు సహిస్తూనే ఉన్నారు.

2 కొరింథీయులకు 11:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ గురించి నేను రోషంతో ఉన్నాను. మీ పట్ల నాకు దైవిక రోషం ఉంది. ఎందుకంటే పవిత్ర కన్యగా ఒక్క భర్తకే, అంటే క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. అయితే,

2 కొరింథీయులకు 11:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.

2 కొరింథీయులకు 11:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే ఎవరైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక మరొకరిని ప్రకటించినా, లేక మీరు పొందని వేరొక ఆత్మను పొందినా, మీరు అంగీకరించని వేరొక సువార్త మీరు అంగీకరించినా, మీరు వాటిని బాగానే సహిస్తున్నారు.

2 కొరింథీయులకు 11:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ “గొప్ప అపొస్తలుల” కంటే నేనేమాత్రం తక్కువ వాణ్ణి కానని అనుకుంటున్నాను.

2 కొరింథీయులకు 11:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలా బోధించాలో నేను నేర్చుకోక పోయినా తెలివిలో నేర్పులేని వాడిని కాను. అన్ని రకాలుగా అన్ని విషయాల్లో దీన్ని మీకు తెలియజేసాం.

2 కొరింథీయులకు 11:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకు దేవుని సువార్త ఉచితంగా ప్రకటిస్తూ మిమ్మల్ని హెచ్చించడానికి నన్ను నేనే తగ్గించుకుని తప్పు చేశానా?

2 కొరింథీయులకు 11:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను “దోచుకున్నాను.”

2 కొరింథీయులకు 11:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మీతో ఉన్నప్పుడు నాకు అక్కర కలిగితే మీలో ఎవరి మీదా భారం మోపలేదు. మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చిన సోదరులు నా అవసరాలు తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండాా చూసుకున్నాను. ఇంకా అలానే చేస్తూ ఉంటాను.

2 కొరింథీయులకు 11:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తు సత్యం నాలో ఉండడం వలన అకయ ప్రాంతాల్లో నా అతిశయాన్ని ఎవరూ ఆపలేకపోయారు.

2 కొరింథీయులకు 11:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమించనందుకా? నేను ప్రేమిస్తున్నట్టు దేవునికే తెలుసు.

2 కొరింథీయులకు 11:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను.

2 కొరింథీయులకు 11:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు.

2 కొరింథీయులకు 11:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు.

2 కొరింథీయులకు 11:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.

2 కొరింథీయులకు 11:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మళ్ళీ చెబుతున్నాను. నేను బుద్ధిహీనుడినని ఎవరూ అనుకోవద్దు. అలా అనుకుంటే, నేను కొంచెం అతిశయపడేలా, నన్ను బుద్ధిహీనుడిగానే చేర్చుకోండి.

2 కొరింథీయులకు 11:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గొప్పలు చెప్పుకుంటూ నేను అతిశయంగా చెప్పే ఈ విషయాలు ప్రభువు మాటగా చెప్పడం లేదు, బుద్ధిహీనుడిలా చెబుతున్నాను.

2 కొరింథీయులకు 11:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చాలామంది శరీరానుసారంగా అతిశయిస్తున్నారు. నేనూ అతిశయిస్తాను.

2 కొరింథీయులకు 11:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెలివిగల మీరు బుద్ధిహీనులను సంతోషంతో సహిస్తున్నారు.

2 కొరింథీయులకు 11:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా మిమ్మల్ని బానిసలుగా చేసినా, మీలో విభేదాలు కలిగించినా, మిమ్మల్ని వశం చేసుకున్నా, తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నా, చెంప దెబ్బ కొట్టినా మీరు సహిస్తున్నారు.

2 కొరింథీయులకు 11:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు చేసినట్టు చేయలేని బలహీనులమని సిగ్గుతో చెబుతున్నాను. అయితే, ఎవరైనా ఎపుడైనా అతిశయిస్తుంటే-బుద్ధిహీనుడిలా మాట్లాడుతున్నాను-నేనూ అతిశయిస్తాను.

2 కొరింథీయులకు 11:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రాహాము సంతానమా? నేను కూడా.

2 కొరింథీయులకు 11:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు క్రీస్తు సేవకులా? (వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను) నేను కూడా ఇంకా ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి. వారికంటే చాలా ఎక్కువగా కష్టపడ్డాను. అనేక సార్లు చెరసాల పాలయ్యాను. లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను. అనేకమార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను.

2 కొరింథీయులకు 11:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదుల చేత ఐదు సార్లు “ఒకటి తక్కువ నలభై” కొరడా దెబ్బలు తిన్నాను.

2 కొరింథీయులకు 11:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూడు సార్లు నన్ను బెత్తాలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టారు. మూడుసార్లు నేనెక్కిన ఓడలు పగిలిపోయాయి. ఒక పగలు, ఒక రాత్రి సముద్రంలో గడిపాను.

2 కొరింథీయులకు 11:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరచుగా ప్రయాణాల్లో అపాయాలకు గురయ్యాను. నదుల్లో అపాయాలూ దోపిడీ దొంగల వలన అపాయాలూ నా సొంత ప్రజల వలన అపాయాలూ యూదేతరుల వలన అపాయాలూ పట్టణాల్లో అపాయాలూ అరణ్యాల్లో అపాయాలూ సముద్రంలో అపాయాలూ కపట సోదరుల వల్ల అపాయాలూ నాకు ఎదురయ్యాయి.

2 కొరింథీయులకు 11:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కష్ట పడ్డాను. వేదన అనుభవించాను. నిద్ర కరువైన అనేక రాత్రులు గడిపాను. చలితో, ఆకలి దప్పులతో, తినడానికి ఏమీ లేక, బట్టల్లేక ఉన్నాను.

2 కొరింథీయులకు 11:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విషయాలు మాత్రమే కాకుండా క్రీస్తు సంఘాలన్నిటిని గురించిన దిగులు రోజూ నా మీద భారంగా ఉంది.

2 కొరింథీయులకు 11:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీలో ఒకడు బలహీనుడైతే, నేనూ బలహీనుణ్ణి కాకుండా ఉండగలనా? ఒకడు ఇతరుల వల్ల పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా?

2 కొరింథీయులకు 11:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతిశయపడాల్సి వస్తే నేను నా బలహీనతలను కనపరిచే వాటిలోనే అతిశయిస్తాను.

2 కొరింథీయులకు 11:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎప్పటికీ స్తుతి పాత్రుడైన మన ప్రభు యేసు తండ్రి అయిన దేవునికి నేను అబద్ధమాడడం లేదని తెలుసు.

2 కొరింథీయులకు 11:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దమస్కులో అరెత అనే రాజు కింద ఉన్న అధికారి నన్ను పట్టుకోవడం కోసం దమస్కు పట్టణానికి కాపలా పెట్టాడు.

2 కొరింథీయులకు 11:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నన్ను కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో దించితే అతని చేతికి చిక్కకుండా తప్పించుకున్నాను.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Corinthians 11 (ASV) »
King James Version (KJV)
2 Corinthians 11 (KJV) »
GOD’S WORD® (GW)
2 Corinthians 11 (GW) »
Berean Bible (BSB)
2 Corinthians 11 (BSB) »
World English Bible (WEB)
2 Corinthians 11 (WEB) »
French Bible (LSG)
2 Corinthiens 11 (LSG) »
German Bible (LUTH1912)
2 Korinther 11 (LUTH1912) »
Portuguese Bible (BSL)
2 Coríntios 11 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Cô-rinh-tô 11 (VIE) »
Spanish Bible (RVA)
2 Corintios 11 (RVA) »
Italian Bible (RIV)
2 Corinzi 11 (RIV) »
Chinese Simplified (CUVS)
哥 林 多 后 书 11 (CUVS) »
Chinese Traditional (CUVT)
歌 林 多 後 書 11 (CUVT) »
Albanian Bible (ALB)
2 Korintasve 11 (ALB) »
Ukrainian Bible (UKR)
2 коринтян 11 (UKR) »
Hungarian Bible (KAR)
2 Korinthus 11 (KAR) »
Norwegian Bible (NORSK)
2 Korinter 11 (NORSK) »

2 కొరింథీయులకు (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

TELIRV Book Selection List