2 రాజులు Chapter 20 TELIRV Bible Verse Images

2 రాజులు 20 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 రాజులు 20 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 రాజులు 20:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజుల్లో, హిజ్కియాకు జబ్బు చేసి చావుబతుకుల్లో ఉన్నాడు. ఆమోజు కొడుకూ ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చి “నీవు చనిపోతున్నావు. ఇక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా చెప్తున్నాడు” అని చెప్పాడు.

2 రాజులు 20:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు తిప్పుకుని,

2 రాజులు 20:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనెలా నడుచుకున్నానో, నీ దృష్టిలో అనుకూలంగా అంతా నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు.

2 రాజులు 20:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెషయా మధ్య ప్రాంగణంలోనుంచి అవతలకు వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై,

2 రాజులు 20:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నీవు మళ్ళీ నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్లి, అతనితో ఇలా చెప్పు. నీ పితరుడు దావీదుకు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమంటే, నీవు కన్నీళ్లు విడవడం చూశాను. నేను నీ ప్రార్థన అంగీకరించాను. నేను నిన్ను బాగు చేస్తాను. మూడో రోజు నీవు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావు.

2 రాజులు 20:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్షు నీకు ఇస్తాను. ఇంకా నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం ఈ పట్టణాన్ని నేను కాపాడుతూ, నిన్నూ, ఈ పట్టాణాన్నీ, అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను” అన్నాడు.

2 రాజులు 20:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత యెషయా “అంజూరపుపళ్ళ ముద్ద తెప్పించండి” అని చెప్పాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగు పడ్డాడు.

2 రాజులు 20:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“యెహోవా నన్ను స్వస్థపరుస్తాడు అనడానికీ, నేను మూడో రోజు ఆయన మందిరానికి ఎక్కి వెళ్తాననడానికీ, సూచన ఏంటి?” అని హిజ్కియా యెషయాను అడిగాడు. యెషయా

2 రాజులు 20:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“తాను చెప్పిన మాట యెహోవా నెరవేరుస్తాడు అనడానికి ఆయన ఇచ్చిన సూచన ఏమంటే, నీడ పది మెట్లు ముందుకు నడవాలా? లేక అది పదిమెట్లు వెనక్కు నడవాలా?” అన్నాడు.

2 రాజులు 20:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు హిజ్కియా “నీడ పది మెట్లు ముందుకు నడవడం తేలికే. కాని నీడ పది గడులు వెనక్కి నడవాలి” అన్నాడు.

2 రాజులు 20:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు.

2 రాజులు 20:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కాలంలో బబులోనురాజు, బలదాను కొడుకు అయిన బెరోదక్ బలదాను హిజ్కియా జబ్బుగా ఉన్నాడన్న విషయం తెలిసి, ఉత్తరం రాసి కానుకలు ఇచ్చి రాయబారులను అతని దగ్గరికి పంపాడు.

2 రాజులు 20:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వర్తమానికులు వచ్చారన్న మాట హిజ్కియా విని వాళ్ళను లోపలికి రప్పించి, తన రాజనగరంలోనూ, రాజ్యంలోనూ ఉన్న అన్ని వస్తువుల్లో, దేనినీ దాచకుండా, తన వస్తువులు ఉన్న కొట్టూ, వెండి బంగారాలూ, సుగంధ ద్రవ్యాలూ, సువాసన తైలం, ఆయుధశాల, తన వస్తువుల్లో ఉన్నవన్నీ వాళ్లకు చూపించాడు.

2 రాజులు 20:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి “ఆ మనుషులు ఏమన్నారు? నీ దగ్గరికి ఎక్కడ నుంచి వచ్చారు?” అని అడిగాడు. హిజ్కియా “బబులోను అనే దూరదేశం నుంచి వారు వచ్చారు” అని చెప్పాడు.

2 రాజులు 20:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నీ ఇంట్లో వారు ఏమేమి చూశారు?” అని అతడు అడిగాడు. హిజ్కియా “నా వస్తువుల్లో దేన్నీ దాచకుండా నా ఇంట్లో ఉన్నవన్నీ నేను వాళ్లకు చూపించాను” అన్నాడు.

2 రాజులు 20:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెషయా హిజ్కియాతో “యెహోవా చెప్పే మాట విను.

2 రాజులు 20:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రానున్న రోజుల్లో ఏమీ మిగులకుండా నీ రాజనగరులో ఉన్నవన్నీ, ఈ రోజు వరకూ నీ పూర్వికులు సమకూర్చి దాచిపెట్టినదంతా, వారు బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతారని యెహోవా చెప్తున్నాడు.

2 రాజులు 20:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా నీ కడుపున పుట్టిన నీ కొడుకుల సంతతిని వారు బబులోను రాజు నగరానికి తీసుకు వెళ్తారు. అక్కడ వారు నపుంసకులు అవుతారు” అన్నాడు.

2 రాజులు 20:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు హిజ్కియా “నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. నా కాలంలో మాత్రం సమాధానం, స్థిరత్వం ఉంటాయి కదా?” అని యెషయాతో అన్నాడు.

2 రాజులు 20:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హిజ్కియా చేసిన ఇతర పనులు గురించీ, అతని పరాక్రమం అంతటి గురించీ, అతడు కొలను తవ్వించి, కాలువ వేయించి పట్టణంలోకి నీళ్లు రప్పించిన దాన్ని గురించీ, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

2 రాజులు 20:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హిజ్కియా తన పూర్వీకులతోబాటు చనిపోయాడు. అతని కొడుకు మనష్షే అతని స్థానంలో రాజయ్యాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Kings 20 (ASV) »
King James Version (KJV)
2 Kings 20 (KJV) »
GOD’S WORD® (GW)
2 Kings 20 (GW) »
Berean Bible (BSB)
2 Kings 20 (BSB) »
World English Bible (WEB)
2 Kings 20 (WEB) »
French Bible (LSG)
2 Rois 20 (LSG) »
German Bible (LUTH1912)
2 Könige 20 (LUTH1912) »
Marathi Bible (MARIRV)
2 राजे 20 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
2 રાજાઓ 20 (GUJIRV) »
Hebrew Bible (HEB)
מלכים ב 20 (HEB) »
Portuguese Bible (BSL)
2 Reis 20 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Các Vua 20 (VIE) »
Spanish Bible (RVA)
2 Reyes 20 (RVA) »
Italian Bible (RIV)
2 Re 20 (RIV) »
Chinese Simplified (CUVS)
列 王 记 下 20 (CUVS) »
Chinese Traditional (CUVT)
列 王 紀 下 20 (CUVT) »
Albanian Bible (ALB)
2 Mbretërve 20 (ALB) »
Swedish Bible (SV1917)
2 Kungaboken 20 (SV1917) »
Russian Bible (RUSV)
4 Царств 20 (RUSV) »
Ukrainian Bible (UKR)
2 царів 20 (UKR) »
Hungarian Bible (KAR)
2 Királyok 20 (KAR) »
Bulgarian Bible (BULG)
4 Царе 20 (BULG) »
Japanese Bible (JPN)
列王紀下 20 (JPN) »
Norwegian Bible (NORSK)
2 Kongebok 20 (NORSK) »

2 రాజులు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List