కొలస్సీ పత్రిక Chapter 1 TELIRV Bible Verse Images

కొలస్సీ పత్రిక 1 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కొలస్సీ పత్రిక 1 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కొలస్సీ పత్రిక 1:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని సంకల్పం ప్రకారం యేసు క్రీస్తుకు అపొస్తలుడైన పౌలూ మన సోదరుడు తిమోతీ కొలస్సై పట్టణంలో ఉన్న దేవుని పరిశుద్ధులకూ,

కొలస్సీ పత్రిక 1:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తులో విశ్వాసముంచిన సోదరులకూ శుభాకాంక్షలతో రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుండి కృపా శాంతీ మీకు కలుగు గాక!

కొలస్సీ పత్రిక 1:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరలోకంలో మీకోసం భద్రంగా ఉంచిన నిశ్చయమైన నిరీక్షణనుబట్టి మీరు క్రీస్తు యేసుపై నిలిపిన విశ్వాసాన్ని గూర్చీ, పరిశుద్ధులందరి పట్ల మీరు చూపుతున్న ప్రేమను గూర్చీ, మేము విని మీ గురించి ప్రార్థన చేసే ప్రతిసారీ మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సత్యవాక్కు అయిన సువార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ నిరీక్షణను గూర్చి మొదటిసారి మీరు విన్నారు.

కొలస్సీ పత్రిక 1:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరలోకంలో మీకోసం భద్రంగా ఉంచిన నిశ్చయమైన నిరీక్షణనుబట్టి మీరు క్రీస్తు యేసుపై నిలిపిన విశ్వాసాన్ని గూర్చీ, పరిశుద్ధులందరి పట్ల మీరు చూపుతున్న ప్రేమను గూర్చీ, మేము విని మీ గురించి ప్రార్థన చేసే ప్రతిసారీ మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సత్యవాక్కు అయిన సువార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ నిరీక్షణను గూర్చి మొదటిసారి మీరు విన్నారు.

కొలస్సీ పత్రిక 1:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరలోకంలో మీకోసం భద్రంగా ఉంచిన నిశ్చయమైన నిరీక్షణనుబట్టి మీరు క్రీస్తు యేసుపై నిలిపిన విశ్వాసాన్ని గూర్చీ, పరిశుద్ధులందరి పట్ల మీరు చూపుతున్న ప్రేమను గూర్చీ, మేము విని మీ గురించి ప్రార్థన చేసే ప్రతిసారీ మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సత్యవాక్కు అయిన సువార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ నిరీక్షణను గూర్చి మొదటిసారి మీరు విన్నారు.

కొలస్సీ పత్రిక 1:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ సువార్త మీరు విని దేవుని కృపను నిజంగా తెలుసుకున్నప్పటి నుంచీ అది మీలో ఫలించి అభివృద్ధి చెందినట్టే ప్రపంచమంతటా ఈ సువార్త ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంది.

కొలస్సీ పత్రిక 1:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది ప్రియమైన మా తోటి దాసుడూ, యేసుక్రీస్తుకు నమ్మకమైన సేవకుడూ అయిన ఎపఫ్రా నుండి ఆ విషయాలు నేర్చుకున్న ప్రకారమే.

కొలస్సీ పత్రిక 1:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆత్మలో మీ ప్రేమను గూర్చి అతడు మాకు తెలియజేశాడు.

కొలస్సీ పత్రిక 1:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ ప్రేమ మూలంగా మీ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం.

కొలస్సీ పత్రిక 1:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి మంచి కార్యం విషయంలోనూ మీరు ఫలిస్తూ, దేవునికి సంబంధించిన జ్ఞానంలో పెరుగుతూ, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేలా, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము ప్రార్ధిస్తున్నాం.

కొలస్సీ పత్రిక 1:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని ప్రతివిధమైన సామర్థ్యం ఇచ్చి బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.

కొలస్సీ పత్రిక 1:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెలుగు నివాసులుగా తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.

కొలస్సీ పత్రిక 1:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలోకి తరలించాడు.

కొలస్సీ పత్రిక 1:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి.

కొలస్సీ పత్రిక 1:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు.

కొలస్సీ పత్రిక 1:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి.

కొలస్సీ పత్రిక 1:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.

కొలస్సీ పత్రిక 1:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం కలిగేటందుకు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేవడంలో ఆయన ప్రథముడు.

కొలస్సీ పత్రిక 1:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనలో దైవత్వం సర్వసంపూర్ణత నివసించాలనీ,

కొలస్సీ పత్రిక 1:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కుమారుడి ద్వారా సమస్తాన్నీ తనతో రాజీ చేసుకోవాలనీ దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న వాటినన్నిటినీ తన కుమారుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా ఆయన ఈ కార్యం చేశాడు.

కొలస్సీ పత్రిక 1:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకప్పుడు మీరు కూడా దేవునికి పరాయివారుగా ఉన్నారు. మీ ఆలోచనల్లోనూ మీరు చేసిన దుష్క్రియల వలనా దేవునికి శత్రువులుగా ఉన్నారు.

కొలస్సీ పత్రిక 1:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే రక్త మాంసాలున్న క్రీస్తు శరీరంలో మరణం వల్ల ఆయన మిమ్మల్ని తనతో రాజీ చేసుకున్నాడు. తన ఎదుట మిమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా నిలబెట్టుకోడానికి ఆయన ఇలా చేశాడు.

కొలస్సీ పత్రిక 1:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది జరగాలంటే మీరు దృఢంగా విశ్వాసంలో సుస్థిరంగా నిలిచి ఉండి, ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికీ, మీకూ ప్రకటించిన సువార్త వల్ల కలిగిన నిబ్బరం నుండి తొలగిపోకుండా ఉండాలి. ఈ సువార్తకు పౌలు అనే నేను సేవకుణ్ణి అయ్యాను.

కొలస్సీ పత్రిక 1:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్పుడు మీ కోసం నేను పడుతున్న హింసల్లో సంతోషిస్తున్నాను. సంఘం అనే తన శరీరం కోసం క్రీస్తు పడిన యాతనల్లో కొదువగా ఉన్న వాటిని నా వంతుగా నా శరీరంలో సంపూర్ణం చేస్తున్నాను.

కొలస్సీ పత్రిక 1:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రహస్య సత్యంగా ఉన్న దేవుని వాక్కును సంపూర్ణంగా తెలియజేయడానికి దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ప్రకారం నేను సంఘానికి సేవకుణ్ణి అయ్యాను.

కొలస్సీ పత్రిక 1:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ రహస్యం యుగయుగాలుగా తరతరాలుగా మర్మంగా ఉంది కానీ ఇప్పుడు దేవుడు తన పవిత్రులకు దాన్ని తెలియజేశాడు.

కొలస్సీ పత్రిక 1:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్యజనుల్లో ఈ మర్మం అనే దివ్య సంపదను తెలియజేయాలని దేవుడు తలంచాడు. ఈ మర్మం మీలో ఉన్న యేసు క్రీస్తే. ఆయనే మహిమను గూర్చిన ఆశాభావం.

కొలస్సీ పత్రిక 1:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేము ప్రకటిస్తున్నది ఈయననే. ప్రతి వ్యక్తినీ క్రీస్తులో పరిపూర్ణుడిగా చేసి దేవుని ముందు నిలబెట్టాలి. ఈ ఉద్దేశంతోనే మేము సమస్త జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాం బోధిస్తున్నాం.

కొలస్సీ పత్రిక 1:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీని కోసం నేను శ్రమిస్తూ ఉన్నాను. నాలో బలంగా పని చేస్తున్న ఆయన మహత్తర శక్తిని నేను వినియోగించుకుంటూ ప్రయాసపడుతున్నాను.

Available Bible Translations

American Standard Version (ASV)
Colossians 1 (ASV) »
King James Version (KJV)
Colossians 1 (KJV) »
GOD’S WORD® (GW)
Colossians 1 (GW) »
Berean Bible (BSB)
Colossians 1 (BSB) »
World English Bible (WEB)
Colossians 1 (WEB) »
French Bible (LSG)
Colossiens 1 (LSG) »
German Bible (LUTH1912)
Kolosser 1 (LUTH1912) »
Portuguese Bible (BSL)
Colossenses 1 (BSL) »
Vietnamese Bible (VIE)
Cô-lô-se 1 (VIE) »
Spanish Bible (RVA)
Colosenses 1 (RVA) »
Italian Bible (RIV)
Colossesi 1 (RIV) »
Chinese Simplified (CUVS)
歌 罗 西 书 1 (CUVS) »
Chinese Traditional (CUVT)
歌 羅 西 書 1 (CUVT) »
Albanian Bible (ALB)
Kolosianëve 1 (ALB) »
Swedish Bible (SV1917)
Kolosserbrevet 1 (SV1917) »
Ukrainian Bible (UKR)
колоссян 1 (UKR) »
Hungarian Bible (KAR)
Kolossé 1 (KAR) »
Bulgarian Bible (BULG)
Колосяни 1 (BULG) »
Norwegian Bible (NORSK)
Kolosserne 1 (NORSK) »

కొలస్సీ పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4

TELIRV Book Selection List