యాకోబు పత్రిక Chapter 2 TELIRV Bible Verse Images

యాకోబు పత్రిక 2 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యాకోబు పత్రిక 2 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యాకోబు పత్రిక 2:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా సహోదరులారా, మహిమ స్వరూపి అయిన మన ప్రభు యేసు క్రీస్తును విశ్వసించే వారుగా పక్షపాతం లేకుండా ఉండండి.

యాకోబు పత్రిక 2:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి.

యాకోబు పత్రిక 2:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్నవాడి మీద ఉంచి, “దయచేసి ఈ మంచి చోట కూర్చోండి,” అని చెప్పి, పేదవానితో, “నువ్వు అక్కడ నిలబడు,” లేదా, “నా కాళ్ళ దగ్గర కూర్చో,” అంటే,

యాకోబు పత్రిక 2:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని తేడా చూపుతున్నట్టే కదా?

యాకోబు పత్రిక 2:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా?

యాకోబు పత్రిక 2:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ మీరు పేదవాణ్ణి అవమానానికి గురి చేశారు. మిమ్మల్ని అణగదొక్కేదీ, చట్ట సభలకు ఈడ్చేదీ ధనవంతులు కాదా?

యాకోబు పత్రిక 2:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిమ్మల్ని పిలిచిన వాడి మంచి పేరు ఈ ధనికుల వల్లనే కదా దూషణకు గురౌతున్నది?

యాకోబు పత్రిక 2:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు,” అని లేఖనాల్లో రాసి ఉన్న దైవ రాజాజ్ఞ పాటిస్తే, మీ ప్రవర్తన సరిగా ఉన్నట్టే.

యాకోబు పత్రిక 2:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది.

యాకోబు పత్రిక 2:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే, ఆజ్ఞలన్నిటినీ మీరిన అపరాధి అవుతాడు.

యాకోబు పత్రిక 2:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“వ్యభిచారం చెయ్యవద్దు” అని చెప్పిన దేవుడు, “హత్య చెయ్యవద్దు” అని కూడా చెప్పాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే.

యాకోబు పత్రిక 2:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిజమైన స్వాతంత్రం ఇచ్చే ధర్మశాస్త్రం విషయంలో తీర్పుకు గురయ్యే వారికి తగినట్టుగా మాట్లాడండి. అదే విధంగా ప్రవర్తించండి.

యాకోబు పత్రిక 2:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.

యాకోబు పత్రిక 2:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా?

యాకోబు పత్రిక 2:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక సోదరునికి గాని, సోదరికి గాని కట్టుకోడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే,

యాకోబు పత్రిక 2:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీలో ఒకడు అలాటి వారితో, “శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను” అని చెబితే ఏం ప్రయోజనం?

యాకోబు పత్రిక 2:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదే విధంగా, క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే, అదీ చచ్చినదే.

యాకోబు పత్రిక 2:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా ఒకడు, “నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి” అనవచ్చు. క్రియలు లేని నీ విశ్వాసం నాకు చూపించు. అప్పుడు నేను నా క్రియల ద్వారా నా విశ్వాసం చూపిస్తాను.

యాకోబు పత్రిక 2:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే. కానీ దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి.

యాకోబు పత్రిక 2:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా?

యాకోబు పత్రిక 2:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పణ చేసినప్పుడు, క్రియల వల్ల నీతిమంతుడుగా తీర్పు పొందలేదా?

యాకోబు పత్రిక 2:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని విశ్వాసం క్రియలతో కలిసి పని చేసింది. అతని క్రియల ద్వారా విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహిస్తున్నావు గదా.

యాకోబు పత్రిక 2:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” అని లేఖనాల్లో ఉన్న విషయం నెరవేరింది. అంతేకాక అబ్రాహాముకు దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది.

యాకోబు పత్రిక 2:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనిషిని విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా దేవుడు నీతిమంతుడుగా ఎంచడం మీరు చూశారు.

యాకోబు పత్రిక 2:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలానే వేశ్య రాహాబు కూడా వార్తాహరులను ఆహ్వానించి వేరొక మార్గంలో వారిని పంపివేయడాన్ని బట్టి తన క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలుగా ఎంచ బడింది గదా?

యాకోబు పత్రిక 2:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే.

Available Bible Translations

American Standard Version
James 2 (ASV) »
King James Version
James 2 (KJV) »
GOD’S WORD® (GW)
James 2 (GW) »
Berean Bible
James 2 (BSB) »
World English Bible
James 2 (WEB) »
Louis Segond 1910
Jacques 2 (LSG) »
Luther Bibel 1912
Jakobus 2 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
याकूब 2 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਾਕੂਬ 2 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাকোবের 2 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாக்கோபு 2 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
याकोब 2 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યાકૂબનો 2 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯಾಕೋಬನು 2 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
يَعقُوب 2 (AVD) »
תנ ך עברי מודרני
אגרת יעקב 2 (HEB) »
Bíblia Sagrada Português
Tiago 2 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Gia-cơ 2 (VIE) »
Reina Valera Antigua
Santiago 2 (RVA) »
La Sacra Bibbia
Giacomo 2 (RIV) »
圣 经 简体中文和合本
雅 各 书 2 (CUVS) »
聖 經 繁體中文和合本
雅 各 書 2 (CUVT) »
Bibla e Shenjtë
Jakobit 2 (ALB) »
Svenska Bibeln 1917
Jakobsbrevet 2 (SV1917) »
Библия на русском
Иакова 2 (RUSV) »
Українська Біблія
Якова 2 (UKR) »
Szent Biblia - Magyar
Jakab 2 (KAR) »
Българска Библия
Яков 2 (BULG) »
Det Norsk Bibel
Jakob 2 (NORSK) »
Kitaabka Quduuska Ah
Yacquub 2 (SOM) »
De Heilige Schrift
Jakobus 2 (NLD) »
Dansk Bibel 1871
Jakob 2 (DA1871) »

యాకోబు పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4 5

TELIRV Book Selection List