మార్కు Chapter 10 TELIRV Bible Verse Images

మార్కు 10 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share మార్కు 10 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


మార్కు 10:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు ఆ ప్రాంతం విడిచి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తరువాత యొర్దాను నదికి అవతల ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారు. ఎప్పటిలాగే యేసు వారికి ఉపదేశం చేశాడు.

మార్కు 10:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించే ఉద్దేశంతో, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మమేనా?” అని అడిగారు.

మార్కు 10:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు.

మార్కు 10:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు, “విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు” అన్నారు.

మార్కు 10:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు, “మీరు దేవునికి లోబడని వారు, కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు.

మార్కు 10:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు.

మార్కు 10:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు.

మార్కు 10:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిద్దరు ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు.

మార్కు 10:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషీ వేరు చేయకూడదు” అని వారితో చెప్పాడు.

మార్కు 10:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు.

మార్కు 10:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు, “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే.

మార్కు 10:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు.

మార్కు 10:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు తమ చిన్న బిడ్డలను తాకాలని కొంతమంది వారిని తీసుకు వచ్చారు గాని, శిష్యులు వారిని అడ్డుకున్నారు.

మార్కు 10:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది చూసి యేసుకు చాలా బాధ కలిగింది. ఆయన శిష్యులతో, “చిన్న బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆపకండి. దేవుని రాజ్యం చిన్నపిల్లల్లాంటి వారిదే.

మార్కు 10:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారు అందులో ఎన్నడూ ప్రవేశించరు” అన్నాడు.

మార్కు 10:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ఆ చిన్నపిల్లలను దగ్గరికి పిలిచి వారిపై చేతులుంచి వారిని దీవించాడు.

మార్కు 10:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.

మార్కు 10:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు, “నేను మంచి వాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు.

మార్కు 10:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి” అన్నాడు.

మార్కు 10:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు ఆయనతో, “బోధకా, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను” అని అన్నాడు.

మార్కు 10:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు అతన్ని చూస్తూ, అతనిపై ప్రేమ భావం కలిగి ఇలా అన్నాడు, “నీకు ఒకటి తక్కువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు” అని అన్నాడు.

మార్కు 10:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు గొప్ప సంపన్నుడు గనక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

మార్కు 10:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం” అని అన్నాడు.

మార్కు 10:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. యేసు మళ్ళీ, “పిల్లలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం!

మార్కు 10:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళడం సులభం” అన్నాడు.

మార్కు 10:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది విని శిష్యులు ఇంకా ఆశ్చర్యపడ్డారు. వారు “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు.

మార్కు 10:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు వారి వైపు చూసి, “మనుషులకు ఇది అసాధ్యమే గాని, దేవునికి కాదు. దేవునికి అన్నీ సాధ్యమే” అన్నాడు.

మార్కు 10:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు ఆయనతో, “ఇదిగో, మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా!” అన్నాడు.

మార్కు 10:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నా కోసం, సువార్త కోసం, తన ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, ఆస్తులను వదిలిపెట్టిన వాడు.

మార్కు 10:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్పుడు ఈ లోకంలో హింసలతో బాటు ఇళ్ళు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, ఆస్తులు, రానున్న లోకంలో శాశ్వత జీవం పొందుతాడు.

మార్కు 10:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని, మొదటివారు చాలా మంది చివరివారు అవుతారు, చివరివారు చాలా మంది మొదటివారు అవుతారు” అన్నాడు.

మార్కు 10:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు, ఆయనతో ఉన్నవారంతా యెరూషలేము బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. ఆయనను అనుసరిస్తున్న ఇతరులు భయపడ్డారు. యేసు మళ్ళీ తన శిష్యులను పక్కకు పిలిచి, తనకు జరగబోయే వాటిని గురించి వారికి చెప్పాడు.

మార్కు 10:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకు, ధర్మశాస్త్ర పండితులకు అప్పగిస్తారు. వారు ఆయనకు మరణశిక్ష విధించి, యూదేతర ప్రజలకు అప్పగిస్తారు.

మార్కు 10:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆయనను హేళన చేసి, ఆయన మీద ఉమ్మివేస్తారు. కొరడా దెబ్బలు కొడతారు, ఆ తరువాత చంపేస్తారు. మూడవ రోజున ఆయన మళ్ళీ సజీవంగా లేస్తాడు” అని వారితో చెప్పాడు.

మార్కు 10:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జెబెదయి కుమారులు యాకోబు, యోహాను ఆయన దగ్గరికి వచ్చి, “బోధకా! మేము అడిగింది మాకు అనుగ్రహిస్తావా?” అని అడిగారు.

మార్కు 10:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన, “నేనేం చెయ్యాలని మీరు కోరుతున్నారు?” అని ప్రశ్నించాడు.

మార్కు 10:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు, “నీవు మహిమలో మాలో ఒకరిని నీ కుడిచేతి వైపు, మరొకరిని ఎడమచేతి వైపు కూర్చోబెట్టుకో” అన్నారు.

మార్కు 10:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను తాగిన దాన్ని మీరు తాగగలరా? నేను పొందే బాప్తిసం మీరు పొందగలరా?” అని అడిగాడు.

మార్కు 10:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు, “పొందగలం” అని జవాబు చెప్పారు. యేసు వారితో, “నేను తాగిన దాన్ని మీరు తాగుతారు, నేను పొందిన బాప్తిసం మీరు పొందుతారు.

మార్కు 10:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని, నా కుడి వైపు, నా ఎడమవైపు కూర్చోడానికి అనుమతించేది నేను కాదు. ఆ స్థానాలు ఎవరి కోసం సిద్ధం చేసి ఉన్నాయో వారికే అవి దొరుకుతాయి” అన్నాడు.

మార్కు 10:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది విని మిగతా పదిమందికి యాకోబు, యోహానుల మీద కోపం వచ్చింది.

మార్కు 10:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యేసు వారిని దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు, “అన్యజనుల అధికారులు ప్రజల మీద తమ ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు. వారిలో ప్రముఖులు వారిపై అధికారం చెలాయిస్తారు.

మార్కు 10:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు కావాలనుకొనేవాడు సేవకుడై ఉండాలి.

మార్కు 10:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీలో మొదటివాడు కావాలని కోరేవాడు అందరికీ దాసుడై ఉండాలి.

మార్కు 10:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే మనుష్య కుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు, సేవ చేయడానికీ, అందరి పక్షాన తన ప్రాణాన్ని వెలగా ధార పోయడానికి వచ్చాడు.”

మార్కు 10:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత వారు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వారితో ఉన్న జనసమూహం ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఉన్నాడు. అతడు భిక్షగాడు.

మార్కు 10:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ గుడ్డివాడు, వస్తున్నది నజరేయుడైన యేసు అని తెలుసుకుని, “యేసూ! దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని కేకలు పెట్టసాగాడు.

మార్కు 10:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చాలా మంది అతణ్ణి గద్దించి ఊరుకోమన్నారు. కాని ఆ గుడ్డివాడు, “దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు.

మార్కు 10:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అన్నాడు. ప్రజలు ఆ గుడ్డివానితో, “ధైర్యంగా ఉండు! లే! ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అన్నారు.

మార్కు 10:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ గుడ్డివాడు తాను కప్పుకొన్న పైబట్టను అవతల పారవేసి, గభాలున లేచి యేసు దగ్గరికి వెళ్ళాడు.

మార్కు 10:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు, “ఏం కావాలి?” అని అడిగాడు. ఆ గుడ్డివాడు, “రబ్బీ! నాకు మళ్లీ చూపు ప్రసాదించు” అని వేడుకున్నాడు.

మార్కు 10:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు, “నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది, ఇక వెళ్ళు” అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయనతో వెళ్ళాడు.

Available Bible Translations

American Standard Version
Mark 10 (ASV) »
King James Version
Mark 10 (KJV) »
GOD’S WORD® (GW)
Mark 10 (GW) »
Berean Bible
Mark 10 (BSB) »
World English Bible
Mark 10 (WEB) »
Louis Segond 1910
Marc 10 (LSG) »
Luther Bibel 1912
Markus 10 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मरकुस 10 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮਰਕੁਸ 10 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মার্ক 10 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மாற்கு 10 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मार्क 10 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
માર્ક 10 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮಾರ್ಕನು 10 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَرْقُس 10 (AVD) »
Bíblia Sagrada Português
Marcos 10 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Mác 10 (VIE) »
Reina Valera Antigua
Marcos 10 (RVA) »
La Sacra Bibbia
Marco 10 (RIV) »
圣 经 简体中文和合本
马 可 福 音 10 (CUVS) »
聖 經 繁體中文和合本
馬 可 福 音 10 (CUVT) »
Bibla e Shenjtë
Marku 10 (ALB) »
Svenska Bibeln 1917
Markus 10 (SV1917) »
Библия на русском
Марка 10 (RUSV) »
Українська Біблія
Марка 10 (UKR) »
Szent Biblia - Magyar
Márk 10 (KAR) »
Българска Библия
Марко 10 (BULG) »
Det Norsk Bibel
Markus 10 (NORSK) »
Biblia Takatifu
Marko 10 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Markos 10 (SOM) »
De Heilige Schrift
Markus 10 (NLD) »
Dansk Bibel 1871
Markus 10 (DA1871) »

మార్కు (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

TELIRV Book Selection List