2 సమూయేలు Chapter 22 TELIRV Bible Verse Images

2 సమూయేలు 22 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 సమూయేలు 22 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 సమూయేలు 22:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు. అతడిలా ప్రార్థించాడు.

2 సమూయేలు 22:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు.

2 సమూయేలు 22:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం. హింస నుండి నన్ను కాపాడేవాడు.

2 సమూయేలు 22:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను.

2 సమూయేలు 22:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మృత్యుకెరటాలు నన్ను చుట్టుకున్నాయి. భక్తిహీనుల వరద పొంగు నన్ను ముంచెత్తింది.

2 సమూయేలు 22:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాతాళ పాశాలు నన్ను కట్టి వేశాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి.

2 సమూయేలు 22:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను. నా దేవునికి విన్నవించుకున్నాను. ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు. నా మొర్ర ఆయన చెవులకు చేరింది.

2 సమూయేలు 22:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు భూమి కంపించింది. అదిరింది. పరమండలపు పునాదులు వణికాయి. ఆయన కోపానికి అవి కంపించాయి.

2 సమూయేలు 22:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది. ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి. అవి నిప్పు కణాలను రగిల్చాయి.

2 సమూయేలు 22:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది.

2 సమూయేలు 22:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు.

2 సమూయేలు 22:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు. దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు.

2 సమూయేలు 22:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి.

2 సమూయేలు 22:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు.

2 సమూయేలు 22:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు. ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు.

2 సమూయేలు 22:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా యుధ్ధ ధ్వనికి ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి.

2 సమూయేలు 22:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నురగలు కక్కుతున్న జలరాసుల్లో నుండి నన్ను బయటికి తీశాడు.

2 సమూయేలు 22:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి, నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు.

2 సమూయేలు 22:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు. కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు.

2 సమూయేలు 22:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకుని వచ్చాడు. నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు.

2 సమూయేలు 22:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు. నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వ క్షేమ స్థితి కలిగించాడు.

2 సమూయేలు 22:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు.

2 సమూయేలు 22:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి. ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు.

2 సమూయేలు 22:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. పాపానికి దూరంగా ఉన్నాను.

2 సమూయేలు 22:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు.

2 సమూయేలు 22:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు. యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు.

2 సమూయేలు 22:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిష్కళంకుల యెడల నీవు నిష్కళంకంగా ఉంటావు. వక్ర బుద్ది గలవారి యెడల వికటంగా ఉంటావు.

2 సమూయేలు 22:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాతన పడే వారిని రక్షిస్తావు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేస్తావు.

2 సమూయేలు 22:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నీవు నాకు దీపం. యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు.

2 సమూయేలు 22:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను. నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను.

2 సమూయేలు 22:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని మార్గం పరిపూర్ణం యెహోవా వాక్కు నిర్మలం ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు.

2 సమూయేలు 22:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?

2 సమూయేలు 22:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు నాకు బలమైన కోట. ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు.

2 సమూయేలు 22:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. పర్వతాలపై నన్ను నిలుపుతాడు.

2 సమూయేలు 22:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి.

2 సమూయేలు 22:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు నీ రక్షణ డాలును నాకు అందిస్తావు. నీ అనుగ్రహం నన్ను గొప్పచేస్తుంది.

2 సమూయేలు 22:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు.

2 సమూయేలు 22:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను. వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను.

2 సమూయేలు 22:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను వారిని మింగి వేశాను. ముక్కలుచెక్కలు చేశాను. వారిక లేవలేరు. వారు నా కాళ్ళ కింద ఉన్నారు.

2 సమూయేలు 22:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నడికట్టు బిగించి కట్టినట్టు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపజేస్తావు. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేస్తావు.

2 సమూయేలు 22:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా శత్రువుల మెడలను నా ముందు వంచావు. నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను.

2 సమూయేలు 22:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు. వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు.

2 సమూయేలు 22:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను. వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను.

2 సమూయేలు 22:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా స్వజనుల కలహాల్లో నుండి కూడా నీవు నన్నువిడిపించావు. ప్రజల అధికారిగా నన్ను నిలిపావు. నేను ఎరుగని ప్రజానీకం నన్ను సేవిస్తారు.

2 సమూయేలు 22:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు. వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు.

2 సమూయేలు 22:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు.

2 సమూయేలు 22:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక.

2 సమూయేలు 22:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.

2 సమూయేలు 22:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిస్తాడు. నా మీద దాడి చేసే వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు. హింసాత్మకుల నుండి నన్ను కాపాడుతావు.

2 సమూయేలు 22:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ నామానికి స్తుతి పాడుతాను.

2 సమూయేలు 22:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు. తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపే వాడు ఆయన.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Samuel 22 (ASV) »
King James Version (KJV)
2 Samuel 22 (KJV) »
GOD’S WORD® (GW)
2 Samuel 22 (GW) »
Berean Bible (BSB)
2 Samuel 22 (BSB) »
World English Bible (WEB)
2 Samuel 22 (WEB) »
French Bible (LSG)
2 Samuel 22 (LSG) »
German Bible (LUTH1912)
2 Samuel 22 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
2 ਸਮੂਏਲ 22 (PANIRV) »
Gujarati Bible (GUJIRV)
2 શમુએલ 22 (GUJIRV) »
Hebrew Bible (HEB)
שמואל ב 22 (HEB) »
Portuguese Bible (BSL)
2 Samuel 22 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Sa-mu-ên 22 (VIE) »
Spanish Bible (RVA)
2 Samuel 22 (RVA) »
Italian Bible (RIV)
2 Samuele 22 (RIV) »
Chinese Simplified (CUVS)
撒 母 耳 记 下 22 (CUVS) »
Chinese Traditional (CUVT)
撒 母 耳 記 下 22 (CUVT) »
Albanian Bible (ALB)
2 Samuelit 22 (ALB) »
Swedish Bible (SV1917)
2 Samuelsboken 22 (SV1917) »
Russian Bible (RUSV)
2 Царств 22 (RUSV) »
Hungarian Bible (KAR)
2 Sámuel 22 (KAR) »
Bulgarian Bible (BULG)
2 Царе 22 (BULG) »
Norwegian Bible (NORSK)
2 Samuel 22 (NORSK) »

2 సమూయేలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List