2 సమూయేలు Chapter 23 TELIRV Bible Verse Images

2 సమూయేలు 23 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 సమూయేలు 23 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 సమూయేలు 23:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.

2 సమూయేలు 23:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నాలుకపై ఉంది.

2 సమూయేలు 23:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల దేవుడు మాటలాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం పలికాడు. మనుషులను నీతిన్యాయాలతో పరిపాలించేవాడు, దేవునిపట్ల భయభక్తులు కలిగి ఏలేవాడు,

2 సమూయేలు 23:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు సూర్యోదయాన తొలిసంధ్య కాంతిలాగా మబ్బు లేని ఉదయం లాగా వాన వెలిసిన తరువాత కాంతులీనే కిరణాల్లో మొలకెత్తిన లేత గడ్డిలాగా ఉంటాడు.

2 సమూయేలు 23:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా సంతానం దేవుని ఎదుట అలాటి వారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? ఆ నిబంధన అన్నివిధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి, అంతా సఫలమయ్యేలా చేస్తాడు.

2 సమూయేలు 23:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముళ్ళను అవతల పారవేసినట్టు దుర్మార్గులను విసిరి వేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేత్తో పట్టుకోలేని ముళ్ళలాగా ఉన్నారు.

2 సమూయేలు 23:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇనుప పరికరమైనా, ఈటె కోల అయినా లేకుండా మనుషులు ముళ్ళను తాకరు. దేనినీ వదలకుండా వాటన్నిటినీ ఉన్న చోటనే తగలబెడతారు.”

2 సమూయేలు 23:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు యోధుల పేర్లు ఇవి: ముఖ్య వీరుల్లో మొదటివాడు యోషే బెష్షెబెతు. ఇతడు తక్మోనీ వంశం వాడు. అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతం చేశాడు.

2 సమూయేలు 23:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కొడుకు ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు యోధుల్లో ఒకడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే, ఇతడు వారిని ఎదిరించాడు. ఇశ్రాయేలీయులు వెనక్కు తగ్గితే ఇతడు నిలబడి

2 సమూయేలు 23:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అరచెయ్యి బిగుసుకు పోయి చేతికి కత్తి అతుక్కుపోయే దాకా ఫిలిష్తీయులను ఎదుర్కొన్నాడు. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. దోపుడు సొమ్ము తీసుకుపోవడానికి మాత్రం ప్రజలు అతని వెనకాల వచ్చారు.

2 సమూయేలు 23:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతని తరువాత హరారు ఊరివాడైన ఆగే కొడుకు షమ్మా. ఒకసారి ఫిలిష్తీయులు అలచందల చేలో గుంపు గూడి ఉండగా ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులను ఎదిరించి నిలవలేక పారిపోయారు.

2 సమూయేలు 23:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడితడు ఆ పొలం మధ్యలో నిలబడి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా అడ్డుకున్నాడు. వారిని హతం చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్నిచ్చాడు.

2 సమూయేలు 23:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముప్ఫై మంది వీరుల్లో ముఖ్యులైన ముగ్గురు కోతకాలంలో అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీయుల సైన్యం రెఫాయీము లోయలో ఉన్నారు.

2 సమూయేలు 23:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు తన సురక్షితమైన చోట, గుహలో ఉన్నాడు. ఫిలిష్తీయ సేన బేత్లెహేములో శిబిరం వేసుకుని ఉన్నారు.

2 సమూయేలు 23:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు మంచి నీటి కోసం తహ తహ లాడుతూ “బేత్లెహేము పురద్వారం దగ్గరున్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బావుణ్ణు!” అన్నాడు.

2 సమూయేలు 23:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల సైన్యం కావలి వాళ్ళను ఛేదించుకుని పోయి, బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావి నీళ్లు తోడుకుని దావీదు దగ్గరికి తెచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు తాగలేదు. యెహోవా సన్నిధిలో అ నీళ్ళు పారబోసి “యెహోవా, ఈ నీళ్ళు తాగడం నాకు దూరం అగు గాక.

2 సమూయేలు 23:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళు ప్రాణాలకు తెగించి పోయి ఇవి తెచ్చారు కదా. ఈ నీళ్ళు వీరి రక్తంతో సమానం” అని చెప్పి తాగడానికి నిరాకరించాడు. ఆ ముగ్గురు మహావీరులు ఈ పరాక్రమ కార్యాలు చేశారు.

2 సమూయేలు 23:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సెరూయా కొడుకు, యోవాబు సోదరుడు అబీషై ఈ ముప్ఫై మందికి నాయకుడు. ఇతడొక యుద్ధంలో మూడు వందల మందిని ఈటెతో సాము చేసి హతం చేశాడు. ఇతడు ఆ ముగ్గురితో సమానంగా పేరు పొందాడు.

2 సమూయేలు 23:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతడు ఆ ముప్ఫై మందిలో గొప్పవాడై, వారికి అధిపతి అయ్యాడు. కానీ ఆ మొదటి ముగ్గురికీ సాటి కాలేదు.

2 సమూయేలు 23:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కబ్సెయేలు ఊరివాడైన బెనాయా యెహోయాదా కొడుకు. అతడు పరాక్రమశాలి. మహా ప్రతాపం చూపించాడు. ఇతడు ఇద్దరు మోయాబు శూరులను హతం చేశాడు. మంచు కురుస్తున్న కాలంలో ఇతడు బావిలో దాక్కుని ఉన్న ఒక సింహాన్ని చంపేశాడు.

2 సమూయేలు 23:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా అతడు మహాకాయుడైన ఒక ఐగుప్తు వాణ్ని చంపాడు. ఈ ఐగుప్తీయుడి చేతిలో ఈటె ఉంటే బెనాయా దుడ్డుకర్ర తీసుకు అతడి మీదికి పోయాడు. వాడి చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాణ్ణి చంపేశాడు.

2 సమూయేలు 23:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ పరాక్రమ క్రియలు యెహోయాదా కొడుకు బెనాయా చేశాడు కాబట్టి ఆ ముగ్గురు బలాఢ్యులతోబాటు లెక్కలోకి వచ్చాడు.

2 సమూయేలు 23:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ముప్ఫై మందిలోకీ ఘనుడయ్యాడు. అయినా మొదటి ముగ్గురితో సాటి కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుల నాయకునిగా నియమించాడు.

2 సమూయేలు 23:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ముప్ఫై మంది ఎవరంటే, యోవాబు సోదరుడు అశాహేలు, బేత్లెహేము వాడైన దోదో కొడుకు ఎల్హానాను,

2 సమూయేలు 23:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,

2 సమూయేలు 23:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పత్తీయుడైన హేలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కొడుకు ఈరా,

2 సమూయేలు 23:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అనాతోతు వాడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,

2 సమూయేలు 23:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై,

2 సమూయేలు 23:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెటోపాతీయుడైన బయనాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,

2 సమూయేలు 23:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పిరాతోనీయుడైన బెనాయా, గాయషు లోయప్రాంతాల్లో ఉండే హిద్దయి,

2 సమూయేలు 23:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,

2 సమూయేలు 23:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కొడుకుల్లో యోనాతాను,

2 సమూయేలు 23:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారుకు పుట్టిన అహీయాము,

2 సమూయేలు 23:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మాయాకాతీయుడైన అహస్బయి కొడుకు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కొడుకు ఏలీయాము,

2 సమూయేలు 23:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కర్మెలీయుడైన హెస్రో, అర్బీయుడైన పయరై,

2 సమూయేలు 23:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోబావాడైన నాతాను కొడుకు ఇగాలు, గాదీయుడైన బానీ,

2 సమూయేలు 23:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలు మోసేవాడు.

2 సమూయేలు 23:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

2 సమూయేలు 23:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హిత్తీయుడైన ఊరియా. ఈ కోవలో చేరినవారు మొత్తం ముప్ఫై ఏడుగురు.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Samuel 23 (ASV) »
King James Version (KJV)
2 Samuel 23 (KJV) »
GOD’S WORD® (GW)
2 Samuel 23 (GW) »
Berean Bible (BSB)
2 Samuel 23 (BSB) »
World English Bible (WEB)
2 Samuel 23 (WEB) »
French Bible (LSG)
2 Samuel 23 (LSG) »
German Bible (LUTH1912)
2 Samuel 23 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
2 ਸਮੂਏਲ 23 (PANIRV) »
Gujarati Bible (GUJIRV)
2 શમુએલ 23 (GUJIRV) »
Hebrew Bible (HEB)
שמואל ב 23 (HEB) »
Portuguese Bible (BSL)
2 Samuel 23 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Sa-mu-ên 23 (VIE) »
Spanish Bible (RVA)
2 Samuel 23 (RVA) »
Italian Bible (RIV)
2 Samuele 23 (RIV) »
Chinese Simplified (CUVS)
撒 母 耳 记 下 23 (CUVS) »
Chinese Traditional (CUVT)
撒 母 耳 記 下 23 (CUVT) »
Albanian Bible (ALB)
2 Samuelit 23 (ALB) »
Swedish Bible (SV1917)
2 Samuelsboken 23 (SV1917) »
Russian Bible (RUSV)
2 Царств 23 (RUSV) »
Hungarian Bible (KAR)
2 Sámuel 23 (KAR) »
Bulgarian Bible (BULG)
2 Царе 23 (BULG) »
Norwegian Bible (NORSK)
2 Samuel 23 (NORSK) »

2 సమూయేలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List