2 తిమోతి పత్రిక Chapter 1 TELIRV Bible Verse Images

2 తిమోతి పత్రిక 1 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 తిమోతి పత్రిక 1 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 తిమోతి పత్రిక 1:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానం ప్రకారం దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు అనే నేను నా ప్రియ పుత్రుడు తిమోతికి రాసిన ఉత్తరం.

2 తిమోతి పత్రిక 1:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తండ్రియైన దేవుని నుండీ మన ప్రభువు క్రీస్తు యేసు నుండీ కృప, కనికరం, సమాధానం నీకు కలుగు గాక.

2 తిమోతి పత్రిక 1:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రార్థనల్లో నిన్ను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ నా పూర్వీకులవలే కల్మషంలేని మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను.

2 తిమోతి పత్రిక 1:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుని, నిన్ను చూసి నా ఆనందాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాను.

2 తిమోతి పత్రిక 1:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీలోని కపటం లేని విశ్వాసం నాకు తెలుసు. ఆ విశ్వాసం మొదట మీ అమ్మమ్మ లోయిలోనూ, మీ అమ్మ యునీకేలోనూ ఉంది. అది నీలో కూడా ఉన్నదని నా పూర్తి నమ్మకం.

2 తిమోతి పత్రిక 1:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కారణంగానే నేను నీమీద నా చేతులు ఉంచడం ద్వారా నీకు కలిగిన దేవుని కృపావరాన్ని ప్రజ్వలింపజేసుకోమని నిన్ను ప్రోత్సహిస్తున్నాను.

2 తిమోతి పత్రిక 1:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహం కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు.

2 తిమోతి పత్రిక 1:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నువ్వు మన ప్రభువు విషయమైన సాక్ష్యం గురించి గానీ, ఆయన ఖైదీనైన నన్ను గురించి గానీ సిగ్గుపడకుండా, దేవుని శక్తితో సువార్త మూలంగా వాటిల్లే కష్టాల్లో భాగం పంచుకో.

2 తిమోతి పత్రిక 1:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన మన క్రియలనుబట్టి కాక తన సంకల్పాన్నిబట్టి, కాలం ఆరంభానికి ముందే మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు.

2 తిమోతి పత్రిక 1:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కృప ఇప్పుడు క్రీస్తు యేసు అనే మన రక్షకుడు ప్రత్యక్షం కావడం ద్వారా వెల్లడి అయింది. ఆయన మరణాన్ని నాశనం చేసి జీవాన్నీ అమర్త్యతనూ సువార్త ద్వారా వెలుగులోకి తెచ్చాడు.

2 తిమోతి పత్రిక 1:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సువార్త విషయంలో నేను ప్రచారకుడుగా, అపొస్తలుడుగా, బోధకుడుగా నియామకం పొందాను.

2 తిమోతి పత్రిక 1:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కారణం చేత నేనీ కష్టాలు అనుభవిస్తున్నాను. నేను నమ్మినవాడు నాకు తెలుసు కాబట్టి సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించినదాన్ని రాబోతున్న ఆ రోజు వరకూ ఆయన కాపాడగలడని నాకు పూర్తి నమ్మకం ఉంది.

2 తిమోతి పత్రిక 1:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తు యేసులో ఉంచవలసిన విశ్వాసంతో, ప్రేమతో నేను నీకు నేర్పిన క్షేమకరమైన బోధ నమూనాను పాటించు.

2 తిమోతి పత్రిక 1:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు నీకు అప్పగించిన ఆ మంచిదాన్ని మనలో నివాసమున్న పరిశుద్ధాత్మ వలన కాపాడుకో.

2 తిమోతి పత్రిక 1:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆసియలోని వారంతా నన్ను విడిచిపోయారని నీకు తెలుసు. ఫుగెల్లు, హెర్మొగెనే అలాటివారే.

2 తిమోతి పత్రిక 1:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు ఒనేసిఫోరు కుటుంబంపై కనికరం చూపు గాక.

2 తిమోతి పత్రిక 1:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు రోమ్ నగరానికి వచ్చినప్పుడు నేను ఖైదీనని సిగ్గుపడకుండా చాలాసార్లు నన్ను శ్రద్ధగా వెతికి, కనుగొని, ఆదరించాడు.

2 తిమోతి పత్రిక 1:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పైగా అతడు ఎఫెసులో నాకు ఎంత ఉపచారం చేశాడో నీకు బాగా తెలుసు. ఆ దినాన అతడు ప్రభువు వలన కనికరం పొందేలా ప్రభువు అనుగ్రహించు గాక.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Timothy 1 (ASV) »
King James Version (KJV)
2 Timothy 1 (KJV) »
GOD’S WORD® (GW)
2 Timothy 1 (GW) »
Berean Bible (BSB)
2 Timothy 1 (BSB) »
World English Bible (WEB)
2 Timothy 1 (WEB) »
French Bible (LSG)
2 Timothée 1 (LSG) »
German Bible (LUTH1912)
2 Timotheus 1 (LUTH1912) »
Portuguese Bible (BSL)
2 Timóteo 1 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Ti-mô-thê 1 (VIE) »
Spanish Bible (RVA)
2 Timoteo 1 (RVA) »
Italian Bible (RIV)
2 Timoteo 1 (RIV) »
Chinese Simplified (CUVS)
提 摩 太 后 书 1 (CUVS) »
Chinese Traditional (CUVT)
提 摩 太 後 書 1 (CUVT) »
Albanian Bible (ALB)
2 Timoteut 1 (ALB) »
Swedish Bible (SV1917)
2 Timotheosbrevet 1 (SV1917) »
Russian Bible (RUSV)
2 Тимофею 1 (RUSV) »
Ukrainian Bible (UKR)
2 Тимофію 1 (UKR) »
Hungarian Bible (KAR)
2 Timóteus 1 (KAR) »
Bulgarian Bible (BULG)
2 Тимотей 1 (BULG) »
Norwegian Bible (NORSK)
2 Timoteus 1 (NORSK) »

2 తిమోతి పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4

TELIRV Book Selection List