2 తిమోతి పత్రిక Chapter 2 TELIRV Bible Verse Images

2 తిమోతి పత్రిక 2 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 2 తిమోతి పత్రిక 2 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


2 తిమోతి పత్రిక 2:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా కుమారా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడవుగా ఉండు.

2 తిమోతి పత్రిక 2:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అనేకుల ముందు నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగలిగిన, నమ్మకమైన వ్యక్తులకు అప్పగించు.

2 తిమోతి పత్రిక 2:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తు యేసు కోసం మంచి సైనికుడిలా కష్టాలు భరించు.

2 తిమోతి పత్రిక 2:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన జీవితంలో ఇతర వ్యాపకాల్లో చిక్కుకోకుండా తనను సైన్యంలో చేర్చుకున్నవాణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు.

2 తిమోతి పత్రిక 2:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక క్రీడాకారుడు నియమాల ప్రకారం పూర్తిచేయకపోతే అతనికి బహుమానం దొరకదు.

2 తిమోతి పత్రిక 2:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కష్టపడిన వ్యవసాయదారుడే రాబడిలో మొదటి భాగం పొందడానికి అర్హుడు.

2 తిమోతి పత్రిక 2:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను చెప్పే మాటలు ఆలోచించు. అన్ని విషయాల్లో ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు.

2 తిమోతి పత్రిక 2:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా సువార్త ప్రకారం, దావీదు సంతానంలో పుట్టి చనిపోయినవారిలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో.

2 తిమోతి పత్రిక 2:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సువార్త విషయంలో నేను ఒక నేరస్థుడిలా సంకెళ్ళపాలై కష్టాలు అనుభవిస్తున్నాను. అయితే దేవుని వాక్యానికి మాత్రం సంకెళ్ళు లేవు.

2 తిమోతి పత్రిక 2:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుచేత ఎన్నికైనవారు నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులోని రక్షణ పొందాలని నేను వారి కోసం అన్నీ ఓర్చుకుంటున్నాను.

2 తిమోతి పత్రిక 2:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మనం ఆయనతో చనిపోతే ఆయనతో బతుకుతాం.

2 తిమోతి పత్రిక 2:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కష్టాలు సహిస్తే ఆయనతోబాటు రాజ్య పరిపాలన చేస్తాం. ఆయన ఎవరో మనకు తెలియదు అంటే ఆయన కూడా మనం ఎవరో తెలియదు అంటాడు.

2 తిమోతి పత్రిక 2:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు కాబట్టి, మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడే,” అనే మాటలు నమ్మదగినవి.

2 తిమోతి పత్రిక 2:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వినేవారిని చెడగొట్టడానికే తప్ప మరి ఏ ప్రయోజనమూ లేని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట విశ్వాసులకు హెచ్చరిస్తూ ఈ సంగతులు వారికి గుర్తు చెయ్యి.

2 తిమోతి పత్రిక 2:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో.

2 తిమోతి పత్రిక 2:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భక్తిహీనతకు కారణమయ్యే వట్టి మాటలు వదిలివెయ్యి. ఆ మాటలు మరింత భక్తిహీనతకు దారితీస్తాయి.

2 తిమోతి పత్రిక 2:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పుండు కుళ్ళి ఎలా వ్యాపిస్తుందో వారి మాటలు కూడా అలా వ్యాపిస్తాయి. హుమెనై, ఫిలేతు అలాటివారే.

2 తిమోతి పత్రిక 2:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు “పునరుత్థానం గతించిపోయింది” అని చెబుతూ సత్యం విషయంలో తప్పటడుగు వేసి, మరి కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు.

2 తిమోతి పత్రిక 2:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే “ప్రభువుకు తన వారెవరో తెలుసు,” “ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివాడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి” అని రాసి ఉన్న దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది.

2 తిమోతి పత్రిక 2:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ధనవంతుల ఇంట్లో వెండివీ, బంగారువీ గాక కొయ్య, మట్టి గిన్నెలు కూడా ఉంటాయి. వాటిలో కొన్ని గౌరవప్రదమైన వాడకానికీ కొన్ని ఘనహీనమైన వాడకానికీ ఉంటాయి.

2 తిమోతి పత్రిక 2:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా ఘనహీనమైన వాటిలో చేరకుండా తనను శుద్ధి చేసుకుంటే వాడు పవిత్రమై, యజమాని వాడుకోవడానికి అర్హుడై అన్ని మంచి కార్యాలకూ సిద్ధపడి, ఘనత కోసమైన గిన్నెగా ఉంటాడు.

2 తిమోతి పత్రిక 2:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి.

2 తిమోతి పత్రిక 2:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిహీనమైన, మూఢత్వంతో కూడిన తర్కాలు జగడాలకు కారణమౌతాయని గ్రహించి వాటిని వదిలెయ్యి.

2 తిమోతి పత్రిక 2:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి.

2 తిమోతి పత్రిక 2:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.

2 తిమోతి పత్రిక 2:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Timothy 2 (ASV) »
King James Version (KJV)
2 Timothy 2 (KJV) »
GOD’S WORD® (GW)
2 Timothy 2 (GW) »
Berean Bible (BSB)
2 Timothy 2 (BSB) »
World English Bible (WEB)
2 Timothy 2 (WEB) »
French Bible (LSG)
2 Timothée 2 (LSG) »
German Bible (LUTH1912)
2 Timotheus 2 (LUTH1912) »
Portuguese Bible (BSL)
2 Timóteo 2 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Ti-mô-thê 2 (VIE) »
Spanish Bible (RVA)
2 Timoteo 2 (RVA) »
Italian Bible (RIV)
2 Timoteo 2 (RIV) »
Chinese Simplified (CUVS)
提 摩 太 后 书 2 (CUVS) »
Chinese Traditional (CUVT)
提 摩 太 後 書 2 (CUVT) »
Albanian Bible (ALB)
2 Timoteut 2 (ALB) »
Swedish Bible (SV1917)
2 Timotheosbrevet 2 (SV1917) »
Russian Bible (RUSV)
2 Тимофею 2 (RUSV) »
Ukrainian Bible (UKR)
2 Тимофію 2 (UKR) »
Hungarian Bible (KAR)
2 Timóteus 2 (KAR) »
Bulgarian Bible (BULG)
2 Тимотей 2 (BULG) »
Norwegian Bible (NORSK)
2 Timoteus 2 (NORSK) »

2 తిమోతి పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4

TELIRV Book Selection List