యెహెజ్కేలు Chapter 18 TELIRV Bible Verse Images

యెహెజ్కేలు 18 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యెహెజ్కేలు 18 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యెహెజ్కేలు 18:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా వాక్కు మళ్ళీ నాకు వినిపించింది.

యెహెజ్కేలు 18:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“తండ్రులు ద్రాక్షలు తిన్నప్పుడు పిల్లల పళ్లు పులిశాయి” అనే సామెత మీరు ఇశ్రాయేలు ప్రదేశం విషయంలో వాడినప్పుడు, దాని అర్థం ఏంటి?

యెహెజ్కేలు 18:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా జీవం తోడు, ఈ సామెత ఇశ్రాయేలీయుల్లో ఇంక మీరు పలకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 18:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“చూడు! ప్రతివాడూ నావాడే. తండ్రులూ, కొడుకులూ, అందరి ప్రాణాలూ నావే! పాపం చేసినవాడు చస్తాడు!

యెహెజ్కేలు 18:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు నీతిమంతుడుగా ఉండి, నీతిన్యాయాలు జరిగించేవాడై ఉండి,

యెహెజ్కేలు 18:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పర్వతాల మీద భోజనాలు చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరపకుండా, ఋతుస్రావంలో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవకుండా, అప్పు తీసుకున్నవాడికి అతని తాకట్టు వస్తువు తిరిగి ఇచ్చేస్తూ, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యక, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,

యెహెజ్కేలు 18:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పర్వతాల మీద భోజనాలు చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరపకుండా, ఋతుస్రావంలో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవకుండా, అప్పు తీసుకున్నవాడికి అతని తాకట్టు వస్తువు తిరిగి ఇచ్చేస్తూ, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యక, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,

యెహెజ్కేలు 18:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వడ్డీకి అప్పు ఇవ్వకుండా, అధిక లాభం తీసుకోకుండా, అన్యాయం చెయ్యకుండా, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చి,

యెహెజ్కేలు 18:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నమ్మకంగా నా ఆదేశాలు పాటిస్తూ, నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే, వాడే నీతిమంతుడు. అతడు నిజంగా బ్రతుకుతాడు” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 18:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని ఆ నీతిమంతునికి, ఇలాంటివేవీ చెయ్యకుండా రక్తం ఒలికించే ఒక హింసాత్మకుడైన కొడుకు ఉంటే, వాడు బలాత్కారం చేస్తూ, ప్రాణహాని చేస్తూ, చెయ్యరాని పనులు చేసి,

యెహెజ్కేలు 18:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చెయ్యాల్సిన మంచి పనులు ఏవీ చెయ్యకుండా ఉంటే, అంటే, పర్వతాల మీద భోజనం చెయ్యడం, తన పొరుగువాడి భార్యను చెరచడం,

యెహెజ్కేలు 18:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవసరతలో ఉన్నవాళ్ళను, పేదలను బాధ పెట్టి బలవంతంగా నష్టం కలిగించడం, తాకట్టు వస్తువు తిరిగి ఇవ్వకపోవడం, విగ్రహాలవైపు చూసి అసహ్యమైన పనులు జరిగించడం,

యెహెజ్కేలు 18:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పిచ్చి వడ్డీ తీసుకోవడం, అధిక లాభం తీసుకోవడం, మొదలైన పనులు చేస్తే, వాడు బ్రతకాలా? వాడు బ్రతకడు! ఈ అసహ్యమైన పనులన్నీ చేశాడు గనుక అతడు తప్పకుండా చస్తాడు. అతని ప్రాణానికి అతడే బాధ్యుడు.

యెహెజ్కేలు 18:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అతనికి ఒక కొడుకు పుట్టినప్పుడు, ఆ కొడుకు తన తండ్రి చేసిన పాపాలన్నీ చూసి, తనమట్టుకు తాను దేవునికి భయపడి, అలాంటి పనులు చెయ్యకపోతే, అంటే,

యెహెజ్కేలు 18:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పర్వతాలమీద భోజనం చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరచకుండా,

యెహెజ్కేలు 18:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరినీ బాధ పెట్టకుండా, తాకట్టు వస్తువు ఉంచుకోకుండా, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యకుండా, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,

యెహెజ్కేలు 18:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేదవాడి మీద అన్యాయంగా చెయ్యి వేయకుండా, లాభం కోసం అప్పివ్వకుండా, వడ్డీ తీసుకోకుండా, నా ఆదేశాలు పాటిస్తూ నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే అతడు తన తండ్రి చేసిన పాపం కారణంగా చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు!

యెహెజ్కేలు 18:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని తండ్రి క్రూరంగా ఇతరులను బాధపెట్టి, బలవంతంగా తన సహోదరులను దోపిడీ చేసి, తన ప్రజల్లో తగని పనులు చేశాడు గనుక తన పాపం కారణంగా తానే చస్తాడు.

యెహెజ్కేలు 18:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని మీరు “తండ్రి పాపశిక్ష కొడుకు ఎందుకు మొయ్యడు?” అంటారు. ఎందుకంటే, కొడుకు నీతిన్యాయాలకు అనుగుణంగా, నా శాసనాలనే అనుసరించి వాటి ప్రకారం చేస్తున్నాడు గనుక అతడు కచ్చితంగా బ్రతుకుతాడు!

యెహెజ్కేలు 18:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపం చేసినవాడే చస్తాడు. తండ్రి పాపశిక్ష కొడుకు, కొడుకు పాప శిక్ష తండ్రి మొయ్యరు. నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది. దుష్టుడి దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుంది.

యెహెజ్కేలు 18:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే దుష్టుడు తాను చేసిన పాపాలన్నీ విడిచి, నా శాసనాలన్నీ అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయం జరిగిస్తే అతడు చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు.

యెహెజ్కేలు 18:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనికి విరోధంగా అతడు చేసిన అతిక్రమాలు జ్ఞాపకానికి రావు. అతడు పాటించే నీతినిబట్టి అతడు బ్రదుకుతాడు.

యెహెజ్కేలు 18:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“దుష్టులు నశిస్తే నేను గొప్పగా ఆనందిస్తానా? అతడు తన ప్రవర్తన సరిచేసుకుని బ్రతకడమే నాకు ఆనందం.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 18:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“కాని, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసి, దుష్టులు చేసే అసహ్యమైన పనులు జరిగిస్తే అతడు బ్రతుకుతాడా? అతడు నాకు నమ్మకద్రోహం చేసి రాజద్రోహం జరిగించాడు గనుక అతడు చేసిన నీతి పనులు ఏమాత్రం జ్ఞాపకానికి రావు. కాబట్టి అతడు చేసిన పాపం కారణంగా చస్తాడు.

యెహెజ్కేలు 18:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని మీరు, ‘యెహోవా మార్గం న్యాయం కాదు’ అంటారు. ఇశ్రాయేలీయులారా, నా మాట వినండి! మీ మార్గాలే గదా అన్యాయమైనవి.

యెహెజ్కేలు 18:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే అతడు వాటిని బట్టి చస్తాడు. తాను పాపం చేసిన కారణంగానే అతడు చస్తాడు.

యెహెజ్కేలు 18:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని ఒక దుష్టుడు తాను చేస్తూ వచ్చిన దుష్టత్వం నుంచి వెనుదిరిగి నీతిన్యాయాలు జరిగిస్తే తన ప్రాణం రక్షించుకుంటాడు.

యెహెజ్కేలు 18:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు గమనించుకుని తాను చేస్తూ వచ్చిన అతిక్రమాలన్నీ చెయ్యకుండా మాని వేశాడు గనక అతడు చావకుండా కచ్చితంగా బ్రతుకుతాడు.

యెహెజ్కేలు 18:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని ఇశ్రాయేలీయులు ‘యెహోవా మార్గం న్యాయం కాదు’ అని అంటున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గం న్యాయం ఎందుకు కాదు? మీ మార్గం అన్యాయం ఎందుకు కాదు?

యెహెజ్కేలు 18:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వాళ్లకు శిక్ష వేస్తాను. మనస్సు తిప్పుకుని మీ అతిక్రమాలు మీ శిక్షకు కారణం కాకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టండి.

యెహెజ్కేలు 18:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు చేసిన అతిక్రమాలన్నీ మీ మీద నుంచి విసిరేసి మీరు మీ కోసం ఒక కొత్త హృదయం, ఒక కొత్త మనస్సు నిర్మించుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చావాలి?

యెహెజ్కేలు 18:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నశించేవాడి చావు కారణంగా నేను ఆనందించేవాణ్ణి కాదు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. “కాబట్టి మీరు మనస్సు మార్చుకుని బ్రతకండి.”

Available Bible Translations

American Standard Version (ASV)
Ezekiel 18 (ASV) »
King James Version (KJV)
Ezekiel 18 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 18 (GW) »
Berean Bible (BSB)
Ezekiel 18 (BSB) »
World English Bible (WEB)
Ezekiel 18 (WEB) »
French Bible (LSG)
Ézéchiel 18 (LSG) »
German Bible (LUTH1912)
Hesekiel 18 (LUTH1912) »
Hebrew Bible (HEB)
יחזקאל 18 (HEB) »
Portuguese Bible (BSL)
Ezequiel 18 (BSL) »
Vietnamese Bible (VIE)
Ê-xê-ki-ên 18 (VIE) »
Spanish Bible (RVA)
Ezequiel 18 (RVA) »
Italian Bible (RIV)
Ezechiele 18 (RIV) »
Chinese Simplified (CUVS)
以 西 结 书 18 (CUVS) »
Chinese Traditional (CUVT)
以 西 結 書 18 (CUVT) »
Albanian Bible (ALB)
Ezekieli 18 (ALB) »
Swedish Bible (SV1917)
Hesekiel 18 (SV1917) »
Ukrainian Bible (UKR)
Єзекіїль 18 (UKR) »
Hungarian Bible (KAR)
Ezékiel 18 (KAR) »
Bulgarian Bible (BULG)
Езекил 18 (BULG) »
Norwegian Bible (NORSK)
Esekiel 18 (NORSK) »

యెహెజ్కేలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List