యెహెజ్కేలు Chapter 28 TELIRV Bible Verse Images

యెహెజ్కేలు 28 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యెహెజ్కేలు 28 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యెహెజ్కేలు 28:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు.

యెహెజ్కేలు 28:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నరపుత్రుడా, తూరు రాజ్యం పాలించే వాడితో ఇలా చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నువ్వు అహంకారంతో, ‘నేను దేవుణ్ణి. సముద్రాల మధ్యలో దేవుడు కూర్చునే చోట నేను కూర్చుంటాను’ అంటున్నావు. నువ్వు మనిషివే. దేవుడివి కావు. నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు.

యెహెజ్కేలు 28:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు దానియేలు కంటే తెలివి గలవాడివనీ తెలియనిదంటూ నీకేదీ లేదనీ అనుకుంటున్నావు!

యెహెజ్కేలు 28:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ తెలివి తేటలతో నేర్పుతో ధనవంతుడివై, నీ ఖజానాల్లో వెండి బంగారాలను పోగుచేసుకున్నావు.

యెహెజ్కేలు 28:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ గొప్ప తెలివితేటలతో నీ వ్యాపారంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు. నీ సంపద బట్టి నీ హృదయం గర్వించింది.

యెహెజ్కేలు 28:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు, నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు.

యెహెజ్కేలు 28:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను విదేశీయులను, ఇతర రాజ్యాలనుంచి క్రూరులను, నీ మీదికి రప్పిస్తాను. తెలివితో నువ్వు నిర్మించుకున్న నీ అందమైన పట్టణాల మీద వాళ్ళు తమ కత్తులు ఝళిపించి నీ వైభవాన్ని ధ్వంసం చేస్తారు.

యెహెజ్కేలు 28:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు నిన్ను నీ సమాధిలో పడేస్తారు. సముద్రాల్లో మునిగి చచ్చేవాళ్ళలాగా నువ్వు చస్తావు.

యెహెజ్కేలు 28:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిన్ను చంపేవాళ్ళ ఎదుట, ‘నేను దేవుణ్ణి’ అంటావా? నువ్వు మనిషివే గానీ దేవుడివి కాదు గదా! నిన్ను పొడిచేవాళ్ళ చేతుల్లో నువ్వు ఉంటావు.

యెహెజ్కేలు 28:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు విదేశీయుల చేతుల్లో సున్నతిలేని వాళ్ళ చావు చస్తావు. ఈ విషయం చెప్పింది నేనే. ఇదే యెహోవా ప్రభువు సందేశం.”

యెహెజ్కేలు 28:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.

యెహెజ్కేలు 28:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నరపుత్రుడా, తూరు రాజును గురించి శోకగీతం ఎత్తి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఒకప్పుడు నువ్వు పరిపూర్ణంగా గొప్ప తెలివితేటలతో అందాల రాశిలా ఉండే వాడివి.

యెహెజ్కేలు 28:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని తోట, ఏదెనులో నువ్వున్నావు! అన్ని రకాల ప్రశస్త రత్నాలు నీకు అలంకాంరంగా ఉండేవి. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని రాయి, మరకతం, నీలం, పద్మరాగం, మాణిక్యం, బంగారంలో పొదిగిన ఆభరణాలు నువ్వు అలంకరించుకున్నావు. నిన్ను సృజించిన రోజే అవి నీకు తయారయ్యాయి.

యెహెజ్కేలు 28:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అభిషేకం పొందిన కెరూబులా నేను నిన్ను నియమించాను. దేవుని పర్వతం మీద నువ్వున్నావు. నిప్పుకణికల వంటి రాళ్ల మధ్య నువ్వు నడిచేవాడివి.

యెహెజ్కేలు 28:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిన్ను సృష్టించిన రోజునుంచి నీలో పాపం కనిపించే వరకూ నీ ప్రవర్తన లోపం లేకుండా ఉంది.

యెహెజ్కేలు 28:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే నీ వ్యాపారం ఎక్కువ కావడం వలన నువ్వు దౌర్జన్యంతో నిండిపోయి, పాపం చేశావు. కాబట్టి కావలిగా ఉన్న కెరూబూ, దేవుని పర్వతం మీద నిప్పుకణికల్లాంటి రాళ్లమధ్య నువ్వుండకుండా నేను నిన్ను తోలివేసి, నిర్మూలం చేశాను.

యెహెజ్కేలు 28:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సౌందర్యాన్ని చూసుకుని గర్వించావు. నీ వైభవాన్ని చూసుకుని నీ తెలివి పాడు చేసుకున్నావు. అందుకే నేను నిన్ను భూమి మీద పడేశాను. రాజులు నిన్ను చూసేలా వాళ్ళ ఎదుట నిన్నుంచాను.

యెహెజ్కేలు 28:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ విస్తార పాపాలను బట్టి, నీ అన్యాయ వ్యాపారాన్ని బట్టి, నీ పవిత్ర స్థలాలను నువ్వు అపవిత్రం చేశావు. కాబట్టి నీలోనుంచి అగ్ని వచ్చేలా చేశాను. అది నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను చూస్తున్నవాళ్ళందరి ఎదుట నిన్ను బూడిదగా చేస్తాను.

యెహెజ్కేలు 28:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజల్లో నిన్ను ఎరిగిన వారంతా నిన్ను బట్టి వణికిపోతారు. నిర్ఘాంతపోతారు. నువ్విక ఉండవు.”

యెహెజ్కేలు 28:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.

యెహెజ్కేలు 28:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నరపుత్రుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు తిప్పి దాన్ని గురించి ప్రవచించు.

యెహెజ్కేలు 28:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, సీదోను, నేను నీకు విరోధిని. నీ మధ్య నాకు ఘనత వస్తుంది. నేను నీ మధ్య తీర్పు తీరుస్తూ ఉన్నపుడు నేను యెహోవానని నీ ప్రజలు తెలుసుకుంటారు. నన్ను నేను పవిత్రునిగా మీ మధ్య కనుపరచుకుంటాను.

యెహెజ్కేలు 28:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ఘోరమైన అంటురోగాన్ని మీ మధ్య పంపిస్తాను. మీ వీధుల్లో రక్తపాతం జరుగుతుంది. అన్ని వైపుల నుంచి నీ మీద కత్తి దూస్తారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.

యెహెజ్కేలు 28:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల చుట్టూ గుచ్చుకునే ముళ్ళ కంపల్లాగా నొప్పి కలిగించే గచ్చతీగల్లాగా వారిని తృణీకరించిన ప్రజలు ఇంక ఎవరూ ఉండరు. అప్పుడు నేనే యెహోవా ప్రభువునని వాళ్ళు తెలుసుకుంటారు.”

యెహెజ్కేలు 28:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే “ప్రజల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను దగ్గర చేర్చి, ప్రజల ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకుంటాను. అప్పుడు నా సేవకుడు యాకోబుకు నేనిచ్చిన తమ దేశంలో వాళ్ళు నివసిస్తారు.

యెహెజ్కేలు 28:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు అందులో భయం లేకుండా నివసించి ఇళ్ళు కట్టుకుని ద్రాక్షతోటలు నాటుకుంటారు. వారి చుట్టూ ఉండి వాళ్ళను తృణీకరించే వారందరికీ నేను శిక్ష విధించిన తరువాత వాళ్ళు భయం లేకుండా నివసించేటప్పుడు నేను తమ యెహోవా దేవుడినని వాళ్ళు తెలుసుకుంటారు.”

Available Bible Translations

American Standard Version
Ezekiel 28 (ASV) »
King James Version
Ezekiel 28 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 28 (GW) »
World English Bible
Ezekiel 28 (WEB) »
Louis Segond 1910
Ézéchiel 28 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 28 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 28 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 28 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 28 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 28 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 28 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 28 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 28 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 28 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 28 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 28 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 28 (RVA) »
La Sacra Bibbia
Ezechiele 28 (RIV) »
圣 经 简体中文和合本
以 西 结 书 28 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 28 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 28 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 28 (SV1917) »
Библия на русском
Иезекииль 28 (RUSV) »
Українська Біблія
Єзекіїль 28 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 28 (KAR) »
Българска Библия
Езекил 28 (BULG) »
Det Norsk Bibel
Esekiel 28 (NORSK) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 28 (SOM) »
De Heilige Schrift
Ezechiël 28 (NLD) »
Dansk Bibel 1871
Ezekiel 28 (DA1871) »

యెహెజ్కేలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List