యిర్మీయా Chapter 41 TELIRV Bible Verse Images

యిర్మీయా 41 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యిర్మీయా 41 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యిర్మీయా 41:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని ఏడో నెలలో ఎలీషామా మనవడూ, నెతన్యా కొడుకూ, రాజవంశం వాడూ, రాజు ప్రధానుల్లో ఒకడైన ఇష్మాయేలూ, అతనితోపాటు మరో పదిమంది మనుషులు కలిసి, మిస్పాలో ఉన్న అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి వచ్చి అక్కడ అతనితోపాటు మిస్పాలో భోజనం చేశారు.

యిర్మీయా 41:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నెతన్యా కొడుకు ఇష్మాయేలు, అతనితోపాటు ఉన్న ఆ పదిమంది మనుషులు లేచి, బబులోను రాజు ఆ దేశం మీద అధికారిగా నియమించిన షాఫాను మనవడూ, అహీకాము కొడుకైన గెదల్యాను ఖడ్గంతో హతం చేశారు.

యిర్మీయా 41:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత ఇష్మాయేలు మిస్పాలో గెదల్యా దగ్గర ఉన్న యూదులందరినీ, అక్కడ ఉన్న యోధులైన కల్దీయులను చంపాడు.

యిర్మీయా 41:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది అతడు గెదల్యాను చంపిన రెండో రోజు. కానీ ఎవరికీ తెలియదు.

యిర్మీయా 41:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గడ్డాలు గీయించుకుని, బట్టలు చింపుకుని, శరీరాలు గాయపరచుకున్న 80 మంది పురుషులు యెహోవా మందిరానికి తీసుకెళ్ళడానికి నైవేద్యాలు, ధూపద్రవ్యాలు చేతపట్టుకుని షెకెము నుంచి, షిలోహు నుంచి, షోమ్రోను నుంచి వచ్చారు.

యిర్మీయా 41:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెతన్యా కొడుకు ఇష్మాయేలు దారిపొడుగునా ఏడుస్తూ, వాళ్ళను ఎదుర్కోడానికి మిస్పాలోనుంచి బయలుదేరి వెళ్లి వాళ్ళను కలుసుకుని, వాళ్ళతో “అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి రండి,” అన్నాడు.

యిర్మీయా 41:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే, వాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించినప్పుడు, నెతన్యా కొడుకు ఇష్మాయేలూ, అతనితోబాటు ఉన్నవాళ్ళు, వాళ్ళను చంపి గోతిలో పడేశారు.

యిర్మీయా 41:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని, వాళ్ళల్లో పదిమంది మనుషులు ఇష్మాయేలుతో “మమ్మల్ని చంపొద్దు, పొలంలో దాచిన గోధుమలు, బార్లీ, నూనె, తేనె మొదలైన ద్రవ్యాలు మా దగ్గర ఉన్నాయి,” అన్నారు. కాబట్టి అతడు వాళ్ళను, వాళ్ళతో ఉన్నవాళ్ళను కూడా చంపలేదు.

యిర్మీయా 41:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇష్మాయేలు గెదల్యాతోబాటు చంపిన మనుషుల శవాలన్నీ పారేసిన గొయ్యి, రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి తవ్వించినదే. నెతన్యా కొడుకు ఇష్మాయేలు తాను చంపిన వాళ్ళ శవాలతో దాన్ని నింపాడు.

యిర్మీయా 41:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇష్మాయేలు, మిస్పాలో ఉన్న మిగిలిన జనమంతటినీ, రాజకుమార్తెలందరినీ, అంటే, రాజదేహ సంరక్షకుల అధికారి నెబూజరదాను అహీకాము కొడుకు గెదల్యాకు అప్పగించిన ప్రజలందరినీ, బందీలుగా తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళను తీసుకెళ్ళి అమ్మోనీయుల దగ్గర చేరాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు,

యిర్మీయా 41:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కారేహ కొడుకు యోహానాను, అతనితోపాటు ఉన్న సేనాధిపతులందరూ నెతన్యా కొడుకు ఇష్మాయేలు చేసిన హాని అంతటి గురించి విన్నారు.

యిర్మీయా 41:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి వాళ్ళు పురుషులందరినీ తీసుకుని, నెతన్యా కొడుకు ఇష్మాయేలుతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళారు. గిబియోనులో ఉన్న పెద్ద కొలను దగ్గర అతన్ని కనుగొన్నారు.

యిర్మీయా 41:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కారేహ కొడుకు యోహానాను, అతనితోపాటు ఉన్న సేనాధిపతులందరినీ చూసినప్పుడు, ఇష్మాయేలుతోపాటు ఉన్న ప్రజలు ఎంతో సంతోషించారు.

యిర్మీయా 41:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇష్మాయేలు మిస్పానుంచి బందీలుగా తీసుకెళ్ళిన ప్రజలందరు అతన్ని విడిచి కారేహ కొడుకు యోహానానుతో కలిశారు.

యిర్మీయా 41:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని, నెతన్యా కొడుకు ఇష్మాయేలూ, ఎనిమిదిమంది మనుషులు, యోహానాను చేతిలోనుంచి తప్పించుకుని, అమ్మోనీయుల దగ్గరికి పారిపోయారు.

యిర్మీయా 41:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నెతన్యా కొడుకు ఇష్మాయేలు అహీకాము కొడుకు గెదల్యాను చంపిన తరువాత,

యిర్మీయా 41:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కారేహ కొడుకు యోహానానూ, అతనితోపాటు ఉన్న సేనల అధిపతులందరూ, మిస్పా దగ్గర నుంచి, ఇష్మాయేలు చేతిలో నుంచి రక్షించిన మిగిలిన ప్రజలందరినీ, అంటే, గిబియోను దగ్గరనుంచి ఇష్మాయేలు తీసుకెళ్ళిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజకుటుంబాన్ని, మళ్ళీ తీసుకొచ్చారు.

యిర్మీయా 41:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే వాళ్ళు బబులోను రాజు దేశం మీద అధికారిగా నియమించిన అహీకాము కొడుకు గెదల్యాను నెతన్యా కొడుకు ఇష్మాయేలు చంపిన కారణంగా వాళ్ళు కల్దీయులకు భయపడి, ఐగుప్తుకు వెళ్దాం అనుకుని, బేత్లెహేము దగ్గర ఉన్న గెరూతు కింహాములో కొంత కాలం ఉన్నారు.

Available Bible Translations

American Standard Version
Jeremiah 41 (ASV) »
King James Version
Jeremiah 41 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 41 (GW) »
World English Bible
Jeremiah 41 (WEB) »
Louis Segond 1910
Jérémie 41 (LSG) »
Luther Bibel 1912
Jeremia 41 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 41 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 41 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 41 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 41 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 41 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 41 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 41 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 41 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 41 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 41 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 41 (VIE) »
Reina Valera Antigua
Jeremías 41 (RVA) »
La Sacra Bibbia
Geremia 41 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 41 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 41 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 41 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 41 (SV1917) »
Библия на русском
Иеремия 41 (RUSV) »
Українська Біблія
Єремія 41 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 41 (KAR) »
Българска Библия
Еремия 41 (BULG) »
Det Norsk Bibel
Jeremia 41 (NORSK) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 41 (SOM) »
De Heilige Schrift
Jeremia 41 (NLD) »
Dansk Bibel 1871
Jeremias 41 (DA1871) »

యిర్మీయా (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List