యోహాను Chapter 10 TELIRV Bible Verse Images

యోహాను 10 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యోహాను 10 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యోహాను 10:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే.

యోహాను 10:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి.

యోహాను 10:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు.

యోహాను 10:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.

యోహాను 10:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి.

యోహాను 10:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు.

యోహాను 10:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే.

యోహాను 10:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు.

యోహాను 10:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు.

యోహాను 10:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

యోహాను 10:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.

యోహాను 10:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది.

యోహాను 10:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు.

యోహాను 10:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు.

యోహాను 10:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను.

యోహాను 10:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.

యోహాను 10:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రాణం మళ్ళీ పొందడానికి దాన్ని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు.

యోహాను 10:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.”

యోహాను 10:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ మాటలవల్ల యూదుల్లో మళ్ళీ విభేదాలు వచ్చాయి.

యోహాను 10:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిలో చాలా మంది, “ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?” అన్నారు.

యోహాను 10:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకొంతమంది, “ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?” అన్నారు.

యోహాను 10:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత యెరూషలేములో ప్రతిష్ట పండగ వచ్చింది. అది చలికాలం.

యోహాను 10:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సొలొమోను మంటపంలో నడుస్తూ ఉండగా

యోహాను 10:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో. “ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహంలో ఉంచుతావు? నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు.

యోహాను 10:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “నేను మీకు చెప్పాను గాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.

యోహాను 10:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా, మీరు నా గొర్రెలు కానందువల్ల మీరు నమ్మడం లేదు.

యోహాను 10:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి.

యోహాను 10:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని ఎవరూ నా చేతిలోనుంచి లాగేసుకోలేరు.

యోహాను 10:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవరూ వాటిని లాగేసుకోలేరు.

యోహాను 10:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను, నా తండ్రి, ఒకటే!”

యోహాను 10:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యూదులు ఆయనను కొట్టడానికి రాళ్ళు పట్టుకున్నారు.

యోహాను 10:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు వారితో, “తండ్రి నుంచి ఎన్నో మంచి పనులు మీకు చూపించాను. వాటిలో ఏ మంచి పనినిబట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?” అన్నాడు.

యోహాను 10:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు యూదులు, “నువ్వు మనిషివై ఉండి నిన్ను నీవు దేవుడుగా చేసుకుంటున్నావు. దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నాం. మంచి పనులు చేసినందుకు కాదు” అని ఆయనతో అన్నారు.

యోహాను 10:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “‘మీరు దేవుళ్ళని నేనన్నాను’ అని మీ ధర్మశాస్త్రంలో రాసి లేదా?

యోహాను 10:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేఖనం వ్యర్థం కాదు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో, వారిని ఆయన దేవుళ్ళని పిలిస్తే,

యోహాను 10:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తండ్రి పవిత్రంగా ఈ లోకంలోకి పంపినవాడు ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అంటే ‘నువ్వు దేవదూషణ చేస్తున్నావు’ అని మీరు అంటారా?

యోహాను 10:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నా తండ్రి పనులు చెయ్యకపోతే నన్ను నమ్మకండి.

యోహాను 10:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే, నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.”

యోహాను 10:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు మళ్ళీ ఆయనను పట్టుకోవాలనుకున్నారు గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకున్నాడు.

యోహాను 10:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు మళ్ళీ యొర్దాను నది అవతలికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. యోహాను మొదట బాప్తిసం ఇస్తూ ఉన్న స్థలం ఇదే.

యోహాను 10:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. వారు, “యోహాను ఏ సూచక క్రియలూ చేయలేదు గాని ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ నిజమే” అన్నారు.

యోహాను 10:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ చాలా మంది యేసుని నమ్మారు.

Available Bible Translations

American Standard Version (ASV)
John 10 (ASV) »
King James Version (KJV)
John 10 (KJV) »
GOD’S WORD® (GW)
John 10 (GW) »
Berean Bible (BSB)
John 10 (BSB) »
World English Bible (WEB)
John 10 (WEB) »
French Bible (LSG)
Jean 10 (LSG) »
German Bible (LUTH1912)
Johannes 10 (LUTH1912) »
Bengali Bible (BENIRV)
যোহন 10 (BENIRV) »
Marathi Bible (MARIRV)
योहान 10 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
યોહાન 10 (GUJIRV) »
Arabic Bible (AVD)
يوحنَّا 10 (AVD) »
Portuguese Bible (BSL)
João 10 (BSL) »
Vietnamese Bible (VIE)
Giăng 10 (VIE) »
Spanish Bible (RVA)
Juan 10 (RVA) »
Italian Bible (RIV)
Giovanni 10 (RIV) »
Chinese Simplified (CUVS)
约 翰 福 音 10 (CUVS) »
Chinese Traditional (CUVT)
約 翰 福 音 10 (CUVT) »
Albanian Bible (ALB)
Gjoni 10 (ALB) »
Swedish Bible (SV1917)
Johannes 10 (SV1917) »
Russian Bible (RUSV)
Иоанна 10 (RUSV) »
Ukrainian Bible (UKR)
Івана 10 (UKR) »
Hungarian Bible (KAR)
János 10 (KAR) »
Bulgarian Bible (BULG)
Йоан 10 (BULG) »
Norwegian Bible (NORSK)
Johannes 10 (NORSK) »

యోహాను (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List