యోహాను Chapter 6 TELIRV Bible Verse Images

యోహాను 6 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యోహాను 6 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యోహాను 6:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ సంగతులు జరిగిన తరువాత యేసు తిబెరియ సముద్రం, అంటే గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తీరానికి వెళ్ళాడు.

యోహాను 6:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రోగుల విషయంలో ఆయన చేసే అద్భుతాలను చూస్తున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెనక వెళ్తూ ఉన్నారు.

యోహాను 6:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చున్నాడు.

యోహాను 6:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదుల పస్కా పండగ దగ్గర పడింది.

యోహాను 6:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది. అప్పుడు ఆయన ఫిలిప్పుతో, “వీరంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాం?” అని అడిగాడు.

యోహాను 6:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు.

యోహాను 6:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి ఫిలిప్పు, “రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు” అన్నాడు.

యోహాను 6:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన శిష్యుల్లో మరొకడు, అంటే సీమోను పేతురు సోదరుడు అంద్రెయ

యోహాను 6:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలూ రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?” అని ఆయనతో అన్నాడు.

యోహాను 6:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు “ప్రజలందర్నీ కూర్చోబెట్టండి” అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వారంతా పురుషులే సుమారు ఐదువేల మంది ఉంటారు.

యోహాను 6:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు ఆ రొట్టెలను చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత వడ్డించాడు.

యోహాను 6:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందరూ కడుపు నిండా తిన్నారు. తరువాత ఆయన, “మిగిలిన రొట్టెల, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్థం కానీయవద్దు” అని శిష్యులతో చెప్పాడు.

యోహాను 6:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందరూ తిన్న తరువాత మిగిలిన ఐదు బార్లీ రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి.

యోహాను 6:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారందరూ యేసు చేసిన అద్భుతాన్ని చూసి, “ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకున్నారు.

యోహాను 6:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు.

యోహాను 6:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరికి వెళ్ళి పడవ పైన సముద్రానికి అవతల ఉన్న కపెర్నహూముకు వెళ్తున్నారు.

యోహాను 6:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పటికే చీకటి పడింది. యేసు వారి దగ్గరికి ఇంకా రాలేదు.

యోహాను 6:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు పెనుగాలి వీయడం మొదలైంది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.

యోహాను 6:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాక యేసు సముద్రం మీద నడుస్తూ రావడం చూసి భయపడ్డారు.

యోహాను 6:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఆయన, “నేనే, భయపడవద్దు” అని వారితో చెప్పాడు.

యోహాను 6:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన అలా చెప్పాక వారు ఆయనను పడవ ఎక్కించుకోడానికి ఇష్టపడ్డారు. వెంటనే ఆ పడవ తీరానికి చేరింది.

యోహాను 6:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాతి రోజు సముద్రానికి ఇవతల ఉండిపోయిన జన సమూహం అక్కడికి వచ్చారు. అక్కడ ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. మరో పడవ వారికి కనిపించలేదు. శిష్యులు యేసు లేకుండానే పడవలో ప్రయాణమై వెళ్ళారని వారు తెలుసుకున్నారు.

యోహాను 6:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ప్రభువు కృతజ్ఞతలు చెప్పి వారికి రొట్టెలు పంచగా వారు తిన్న స్థలానికి దగ్గరలో ఉన్న తిబెరియ నుండి వేరే చిన్న పడవలు వచ్చాయి.

యోహాను 6:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసూ ఆయన శిష్యులూ అక్కడ లేక పోవడంతో ప్రజలందరూ ఆ చిన్న పడవలెక్కి యేసును వెతుకుతూ కపెర్నహూముకు వచ్చారు.

యోహాను 6:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సముద్రం అవతలి తీరాన వారు ఆయనను చూశారు. “బోధకా, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు?” అని అడిగారు.

యోహాను 6:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు, “కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు, రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు.

యోహాను 6:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాడైపోయే ఆహారం కోసం కష్టపడవద్దు, నిత్యజీవం కలగజేసే పాడైపోని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు” అని చెప్పాడు.

యోహాను 6:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు వారు, “దేవుని పనులు చేయాలంటే మేమేం చేయాలి?” అని ఆయనను అడిగారు.

యోహాను 6:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి యేసు, “దేవుడు పంపిన వ్యక్తి పైన విశ్వాసముంచడమే దేవుని కార్యాలు చేయడమంటే” అన్నాడు.

యోహాను 6:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు, “అలా అయితే మేము నిన్ను నమ్మడానికి నువ్వు ఏ అద్భుతం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తావు?

యోహాను 6:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘వారు తినడానికి పరలోకం నుండి ఆయన ఆహారం ఇచ్చాడు’ అని రాసి ఉన్నట్టుగా మన పూర్వీకులు అరణ్యంలో మన్నాను భుజించారు” అని చెప్పారు.

యోహాను 6:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “పరలోకం నుండి వచ్చే ఆహారాన్ని మోషే మీకివ్వలేదు. పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారాన్ని నా తండ్రే మీకిస్తున్నాడు.

యోహాను 6:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుచేత దేవుడిచ్చే ఆహారం ఏమిటంటే, పరలోకంనుంచి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే” అని వారితో అన్నాడు.”

యోహాను 6:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు వారు, “ప్రభూ, మాకు ఎప్పుడూ ఈ ఆహారాన్ని ఇస్తూ ఉండు” అన్నారు.

యోహాను 6:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి జవాబుగా యేసు, “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు.

యోహాను 6:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని నేను మీతో చెప్పినట్టు, నన్ను చూసి కూడా మీరు నమ్మలేదు.

యోహాను 6:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తండ్రి నాకు ఇచ్చే వారంతా నా దగ్గరికి వస్తారు. ఇక నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రం నా దగ్గర నుండి తోలివేయను.

యోహాను 6:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను.

యోహాను 6:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండడమూ, వారందరినీ అంత్యదినాన లేపడమూ నన్ను పంపిన వాడి ఇష్టం.

యోహాను 6:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. అంత్యదినాన నేను వారిని సజీవంగా లేపుతాను.”

యోహాను 6:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని’ అని ఆయన చెప్పినందుకు యూదు నాయకులు సణగడం మొదలు పెట్టారు.

యోహాను 6:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఈయన యోసేపు కుమారుడు యేసు కదా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలుసు కదా! ‘నేను పరలోకం నుండి వచ్చాను’ అని ఎలా చెబుతున్నాడు?” అనుకున్నారు.

యోహాను 6:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీలో మీరు సణుక్కోవడం ఆపండి.

యోహాను 6:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తండ్రి ఆకర్షించకపోతే ఎవరూ నా దగ్గరికి రాలేరు. అలా వచ్చిన వాణ్ణి నేను అంత్యదినాన సజీవంగా లేపుతాను.

యోహాను 6:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారికి దేవుడు ఉపదేశిస్తాడు, అని ప్రవక్తలు రాశారు. కాబట్టి తండ్రి దగ్గర విని నేర్చుకున్నవాడు నా దగ్గరికి వస్తాడు.

యోహాను 6:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని దగ్గర నుండి వచ్చినవాడు తప్ప తండ్రిని ఎవరూ చూడలేదు. ఆయనే తండ్రిని చూశాడు.

యోహాను 6:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కచ్చితంగా చెబుతున్నాను. విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడు.

యోహాను 6:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పూర్వీకులు అరణ్యంలో మన్నాను తిన్నారు. అయినా చనిపోయారు.

యోహాను 6:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీన్ని తిన్నవాడు చనిపోడు.

యోహాను 6:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్నిచ్చే ఆహారం నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే వాడు కలకాలం జీవిస్తాడు. లోకానికి జీవాన్నిచ్చే ఈ ఆహారం నా శరీరమే.”

యోహాను 6:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదులకు కోపం వచ్చింది. “ఈయన తన శరీరాన్ని ఎలా తిననిస్తాడు” అంటూ తమలో తాము వాదించుకున్నారు.

యోహాను 6:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యేసు వారితో ఇలా చెప్పాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. మీరు మనుష్య కుమారుడి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగకపోతే మీలో మీకు జీవం ఉండదు.

యోహాను 6:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు. అంత్యదినాన నేను అతణ్ణి లేపుతాను.

యోహాను 6:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం.

యోహాను 6:56 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడు నాలో ఉండిపోతాడు. నేను అతనిలో ఉండిపోతాను.

యోహాను 6:57 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సజీవుడైన తండ్రి నన్ను పంపాడు. ఆయన వల్లనే నేను జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవాడు కూడా నా వల్ల జీవిస్తాడు.

యోహాను 6:58 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఈ ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు.”

యోహాను 6:59 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ఈ మాటలన్నీ కపెర్నహూములోని సమాజ మందిరంలో ఉపదేశిస్తూ చెప్పాడు.

యోహాను 6:60 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు, “ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు.

యోహాను 6:61 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన శిష్యులు ఇలా సణుక్కుంటున్నారని యేసుకు తెలిసింది. ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీకు అభ్యంతరంగా ఉన్నాయా?

యోహాను 6:62 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుష్య కుమారుడు ఇంతకు ముందు ఉన్న చోటికే ఆరోహణం కావడం చూస్తే మీరు ఏమంటారు?

యోహాను 6:63 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం.

యోహాను 6:64 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు.” తన మీద నమ్మకం ఉంచని వారెవరో, తనను పట్టి ఇచ్చేదెవరో యేసుకు మొదటి నుంచీ తెలుసు.

యోహాను 6:65 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన, “నా తండ్రి ఇస్తే తప్ప ఎవరూ నా దగ్గరికి రాలేరని ఈ కారణం బట్టే చెప్పాను” అన్నాడు.

యోహాను 6:66 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు.

యోహాను 6:67 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యేసు, “మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?” అని తనతో ఉన్న పన్నెండుమంది శిష్యులను అడిగాడు.

యోహాను 6:68 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, మేము ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీదగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి.

యోహాను 6:69 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని మేము విశ్వసించాం, తెలుసుకున్నాం” అని చెప్పాడు.

యోహాను 6:70 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు వారితో, “నేను మీ పన్నెండు మందిని ఎంపిక చేసుకున్నాను కదా, అయినా మీలో ఒకడు సాతాను” అని చెప్పాడు.

యోహాను 6:71 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పన్నెండు మందిలో ఒకడుగా ఉండి ఆయనకు ద్రోహం చెయ్యబోతున్న సీమోను ఇస్కరియోతు కొడుకు యూదా గురించి ఆయన ఈ మాట చెప్పాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
John 6 (ASV) »
King James Version (KJV)
John 6 (KJV) »
GOD’S WORD® (GW)
John 6 (GW) »
Berean Bible (BSB)
John 6 (BSB) »
World English Bible (WEB)
John 6 (WEB) »
French Bible (LSG)
Jean 6 (LSG) »
German Bible (LUTH1912)
Johannes 6 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਯੂਹੰਨਾ 6 (PANIRV) »
Bengali Bible (BENIRV)
যোহন 6 (BENIRV) »
Marathi Bible (MARIRV)
योहान 6 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
યોહાન 6 (GUJIRV) »
Arabic Bible (AVD)
يوحنَّا 6 (AVD) »
Portuguese Bible (BSL)
João 6 (BSL) »
Vietnamese Bible (VIE)
Giăng 6 (VIE) »
Spanish Bible (RVA)
Juan 6 (RVA) »
Italian Bible (RIV)
Giovanni 6 (RIV) »
Chinese Simplified (CUVS)
约 翰 福 音 6 (CUVS) »
Chinese Traditional (CUVT)
約 翰 福 音 6 (CUVT) »
Albanian Bible (ALB)
Gjoni 6 (ALB) »
Swedish Bible (SV1917)
Johannes 6 (SV1917) »
Russian Bible (RUSV)
Иоанна 6 (RUSV) »
Ukrainian Bible (UKR)
Івана 6 (UKR) »
Hungarian Bible (KAR)
János 6 (KAR) »
Bulgarian Bible (BULG)
Йоан 6 (BULG) »
Norwegian Bible (NORSK)
Johannes 6 (NORSK) »

యోహాను (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List