ఎఫెసీ పత్రిక Chapter 5 TELIRV Bible Verse Images

ఎఫెసీ పత్రిక 5 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఎఫెసీ పత్రిక 5 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఎఫెసీ పత్రిక 5:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి.

ఎఫెసీ పత్రిక 5:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.

ఎఫెసీ పత్రిక 5:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన.

ఎఫెసీ పత్రిక 5:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు.

ఎఫెసీ పత్రిక 5:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం.

ఎఫెసీ పత్రిక 5:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది.

ఎఫెసీ పత్రిక 5:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి వారికి దూరంగా ఉండండి.

ఎఫెసీ పత్రిక 5:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి.

ఎఫెసీ పత్రిక 5:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం.

ఎఫెసీ పత్రిక 5:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ,

ఎఫెసీ పత్రిక 5:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.

ఎఫెసీ పత్రిక 5:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.

ఎఫెసీ పత్రిక 5:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా?

ఎఫెసీ పత్రిక 5:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది.

ఎఫెసీ పత్రిక 5:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి.

ఎఫెసీ పత్రిక 5:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.

ఎఫెసీ పత్రిక 5:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.

ఎఫెసీ పత్రిక 5:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.

ఎఫెసీ పత్రిక 5:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి.

ఎఫెసీ పత్రిక 5:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.

ఎఫెసీ పత్రిక 5:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.

ఎఫెసీ పత్రిక 5:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి.

ఎఫెసీ పత్రిక 5:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు.

ఎఫెసీ పత్రిక 5:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.

ఎఫెసీ పత్రిక 5:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి.

ఎఫెసీ పత్రిక 5:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి,

ఎఫెసీ పత్రిక 5:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.

ఎఫెసీ పత్రిక 5:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే.

ఎఫెసీ పత్రిక 5:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.

ఎఫెసీ పత్రిక 5:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.

ఎఫెసీ పత్రిక 5:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు”

ఎఫెసీ పత్రిక 5:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ మాటల అర్థం గ్రహించడం కష్టం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను.

ఎఫెసీ పత్రిక 5:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.

Available Bible Translations

American Standard Version (ASV)
Ephesians 5 (ASV) »
King James Version (KJV)
Ephesians 5 (KJV) »
GOD’S WORD® (GW)
Ephesians 5 (GW) »
Berean Bible (BSB)
Ephesians 5 (BSB) »
World English Bible (WEB)
Ephesians 5 (WEB) »
French Bible (LSG)
Éphésiens 5 (LSG) »
German Bible (LUTH1912)
Epheser 5 (LUTH1912) »
Arabic Bible (AVD)
أفَسُس 5 (AVD) »
Portuguese Bible (BSL)
Efésios 5 (BSL) »
Vietnamese Bible (VIE)
Ê-phê-sô 5 (VIE) »
Spanish Bible (RVA)
Efesios 5 (RVA) »
Italian Bible (RIV)
Efesini 5 (RIV) »
Chinese Simplified (CUVS)
以 弗 所 书 5 (CUVS) »
Chinese Traditional (CUVT)
以 弗 所 書 5 (CUVT) »
Albanian Bible (ALB)
Efesianëve 5 (ALB) »
Swedish Bible (SV1917)
Efesierbrevet 5 (SV1917) »
Russian Bible (RUSV)
Ефесянам 5 (RUSV) »
Ukrainian Bible (UKR)
ефесян 5 (UKR) »
Hungarian Bible (KAR)
Efézus 5 (KAR) »
Bulgarian Bible (BULG)
Ефесяни 5 (BULG) »
Norwegian Bible (NORSK)
Efeserne 5 (NORSK) »

ఎఫెసీ పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6

TELIRV Book Selection List