యెషయా Chapter 36 TELIRV Bible Verse Images

యెషయా 36 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యెషయా 36 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యెషయా 36:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హిజ్కియా రాజు పరిపాలన 14 వ సంవత్సరంలో అష్షూరురాజు సన్హెరీబు యూదా దేశంలో సరిహద్దు గోడలు ఉన్న పట్టణాలన్నిటిపై దండెత్తి వాటిని ఆక్రమించాడు.

యెషయా 36:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత అతడు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజు పైకి పెద్ద సైన్యాన్ని ఇచ్చి పంపాడు. అతడు చాకిరేవు దారిలో ఉన్న మెరక కొలను కాలవ దగ్గరికి వచ్చాడు.

యెషయా 36:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు హిల్కీయా కొడుకు, రాజు గృహనిర్వాహకుడు ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్యం దస్తావేజుల అధికారి, ఆసాపు కొడుకు యోవాహు వారి దగ్గరికి వెళ్ళారు.

యెషయా 36:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు రబ్షాకే వారితో ఇలా అన్నాడు. “హిజ్కియాతో ఈ మాట చెప్పండి, మహారాజైన అష్షూరురాజు నన్నిలా చెప్పమన్నాడు, దేనిపైన నువ్వు నమ్మకం పెట్టుకున్నావు?

యెషయా 36:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం వ్యర్ధం. ఎవరి భరోసాతో నా మీద తిరగబడుతున్నావు?

యెషయా 36:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నలిగిపోయిన గడ్డిపరక లాంటి ఐగుప్తుపై ఆధారపడుతున్నావు గదా! ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుంటుంది. ఐగుప్తు రాజు ఫరో కూడా అలాంటివాడే.

యెషయా 36:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా దేవుడైన యెహోవాను నమ్ముకుంటున్నాం అని అంటారా? ఆ యెహోవా ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టి యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు పూజలు చేయాలి అని యూదావారికి, యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చింది?

యెషయా 36:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నా యజమాని అయిన అష్షూరు రాజుతో పందెం వెయ్యి. రెండు వేల గుర్రాలకు సరిపడిన రౌతులు నీ దగ్గర ఉంటే చెప్పు, నేను వాటిని నీకిస్తాను.

యెషయా 36:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా యజమాని సేవకుల్లో తక్కువ వాడైన ఒక్క అధిపతిని నువ్వు ఎదిరించగలవా? రథాలను, రౌతులను పంపుతాడని ఐగుప్తురాజు మీద ఆశ పెట్టుకున్నావా?

యెషయా 36:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా యెహోవా అనుమతి లేకుండానే ఈ దేశాన్ని నాశనం చేయడానికి నేను వచ్చాననుకున్నావా? లేదు, ఈ దేశం పైకి దండెత్తి దీన్ని నాశనం చేయమని యెహోవాయే నాకు ఆజ్ఞాపించాడు.”

యెషయా 36:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఎల్యాకీము, షెబ్నా, యోవాహులు రబ్షాకేతో “మేము నీ దాసులం. మాకు సిరియా భాష తెలుసు కాబట్టి దయచేసి ఆ భాషలో మాట్లాడు. ప్రాకారం మీద ఉన్న ప్రజలకు అర్థమయ్యేలా యూదుల భాషలో మాట్లాడవద్దు” అని అన్నారు.

యెషయా 36:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే రబ్షాకే “ఈ మాటలు చెప్పడానికేనా, నా యజమాని నన్ను నీ యజమాని దగ్గరకీ నీ దగ్గరకీ పంపింది? నీతో కలిసి తమ స్వంత మలాన్ని తిని, తమ మూత్రాన్ని తాగబోతున్న ప్రాకారం మీద ఉన్న వారి దగ్గరకి కూడా పంపాడు కదా” అన్నాడు.

యెషయా 36:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదుల భాషతో అతడు బిగ్గరగా ఇలా అన్నాడు. “మహారాజైన అష్షూరు రాజు చెబుతున్న మాటలు వినండి.

యెషయా 36:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హిజ్కియా చేతిలో మోసపోకండి. మిమ్మల్ని విడిపించడానికి అతని శక్తి సరిపోదు.

యెషయా 36:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘యెహోవా మనలను విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కదు’ అని చెబుతూ హిజ్కియా మిమ్మల్ని నమ్మిస్తున్నాడు.

యెషయా 36:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హిజ్కియా చెప్పిన ఆ మాట మీరు అంగీకరించవద్దు. అష్షూరు రాజు చెబుతున్నదేమిటంటే, మీరు బయటికి వచ్చి, నాతో సంధి చేసుకోండి. అప్పుడు మీలో ప్రతి ఒక్కరూ తన ద్రాక్ష, అంజూరు చెట్ల పండ్లు తింటూ తన బావిలో నీళ్లు తాగుతూ ఉంటారు.

యెషయా 36:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరవాత నేను వచ్చి మీ దేశంలాంటి దేశానికి, అంటే గోదుమలు, ద్రాక్షరసం దొరికే దేశానికి, ఆహారం, ద్రాక్షచెట్లు ఉన్న దేశానికి మిమ్మల్ని తీసుకుపోతాను. యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు.

యెషయా 36:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వివిధ ప్రజల దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించాడా? హమాతు దేవుళ్ళేమయ్యారు?

యెషయా 36:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అర్పాదు దేవుళ్ళేమయ్యారు? సెపర్వయీము దేవుళ్ళేమయ్యారు? షోమ్రోను దేశపు దేవుడు నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించాడా?

యెషయా 36:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని నా చేతిలో నుండి విడిపించి ఉంటేనే కదా యెహోవా యెరూషలేమును విడిపిస్తాడు అనుకోడానికి?” అన్నాడు.

యెషయా 36:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అతనికి జవాబు చెప్పవద్దని రాజు ఆజ్ఞాపించడం వలన వారు బదులు పలకలేదు.

యెషయా 36:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజ గృహనిర్వాహకుడు, హిల్కీయా కొడుకు అయిన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్యందస్తావేజుల మీద అధికారి, ఆసాపు కొడుకు యోవాహు తమ బట్టలు చింపుకుని హిజ్కియా దగ్గరికి వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నిటినీ తెలియజేశారు.

Available Bible Translations

American Standard Version
Isaiah 36 (ASV) »
King James Version
Isaiah 36 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 36 (GW) »
World English Bible
Isaiah 36 (WEB) »
Louis Segond 1910
Ésaïe 36 (LSG) »
Luther Bibel 1912
Jesaja 36 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यशायाह 36 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਸਾਯਾਹ 36 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিচয়া 36 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஏசாயா 36 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यशया 36 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યશાયા 36 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಶಾಯನು 36 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِشَعْيَاءَ 36 (AVD) »
תנ ך עברי מודרני
ישעיה 36 (HEB) »
Bíblia Sagrada Português
Isaías 36 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
I-sai-a 36 (VIE) »
Reina Valera Antigua
Isaías 36 (RVA) »
La Sacra Bibbia
Isaia 36 (RIV) »
圣 经 简体中文和合本
以 赛 亚 书 36 (CUVS) »
聖 經 繁體中文和合本
以 賽 亞 書 36 (CUVT) »
Bibla e Shenjtë
Isaia 36 (ALB) »
Svenska Bibeln 1917
Jesaja 36 (SV1917) »
Библия на русском
Исаия 36 (RUSV) »
Українська Біблія
Ісая 36 (UKR) »
Szent Biblia - Magyar
Ézsaiás 36 (KAR) »
Българска Библия
Исая 36 (BULG) »
Det Norsk Bibel
Jesaja 36 (NORSK) »
Biblia Takatifu
Isaya 36 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Ishacyaah 36 (SOM) »
De Heilige Schrift
Jesaja 36 (NLD) »
Dansk Bibel 1871
Esajas 36 (DA1871) »

యెషయా (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List