న్యాయాధిపతులు Chapter 13 TELIRV Bible Verse Images

న్యాయాధిపతులు 13 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share న్యాయాధిపతులు 13 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


న్యాయాధిపతులు 13:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ప్రజలు మరోసారి యెహోవా దృష్టిలో దోషులయ్యారు. కాబట్టి ఆయన వారిని ఒక నలభై సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు.

న్యాయాధిపతులు 13:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజుల్లో దాను వంశం వాడు ఒకడు జోర్యా పట్టణంలో ఉండేవాడు. అతడి పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.

న్యాయాధిపతులు 13:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు “చూడు, నువ్వు గొడ్రాలివి. బిడ్డను కనలేకపోయావు. అయితే నువ్వు గర్భం ధరిస్తావు. నీకు కొడుకు పుడతాడు

న్యాయాధిపతులు 13:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షా రసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకు. అపవిత్రమైనదేదీ తినకు.

న్యాయాధిపతులు 13:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్ గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు.”

న్యాయాధిపతులు 13:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరికి వచ్చి “దేవుని మనిషి ఒకాయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన రూపం ఒక దేవదూతలా, భయం పుట్టించేది గా ఉంది. ఆయన ఎక్కడ్నించి వచ్చాడో నేను అడగలేదు. తన పేరేమిటో ఆయన నాకు చెప్పలేదు.

న్యాయాధిపతులు 13:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నాతో, ‘చూడు నువ్వు గర్భవతివి అవుతావు. కొడుకుని కంటావు. కాబట్టి నువ్వు ద్రాక్షారసాన్ని గానీ, మద్యాన్ని గానీ తాగకు. అలాగే ధర్మశాస్త్రం అపవిత్రమని చెప్పిన దేనినీ తినకు. ఎందుకంటే నీ బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి చనిపోయేంత వరకూ దేవుని కోసం నాజీర్ గా ఉంటాడు’ అని చెప్పాడు” అంది.

న్యాయాధిపతులు 13:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మనోహ “నా ప్రభూ, పుట్టబోయే ఆ బిడ్డకు మేము ఏమేమి చేయాలో మాకు నేర్పించడానికి నువ్వు పంపిన ఆ దేవుని మనిషి మరోసారి మా దగ్గరికి వచ్చేట్లుగా చెయ్యి” అని యెహోవాకు ప్రార్థన చేసాడు.

న్యాయాధిపతులు 13:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు మనోహ ప్రార్థన విన్నాడు. ఆ స్త్రీ పొలంలో కూర్చుని ఉన్నప్పుడు దేవుని దూత ఆమెకు కన్పించాడు.

న్యాయాధిపతులు 13:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆమె భర్త మనోహ ఆమె దగ్గర లేడు. కాబట్టి ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి “ఆ రోజు నాకు కన్పించిన వ్యక్తి మళ్ళీ కన్పించాడు” అని చెప్పింది.

న్యాయాధిపతులు 13:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మనోహ లేచి తన భార్య వెంట వెళ్లి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. “నా భార్యతో మాట్లాడింది నువ్వేనా” అని అడిగాడు. అందుకా వ్యక్తి “నేనే” అన్నాడు.

న్యాయాధిపతులు 13:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మానోహ “నీ మాట ప్రకారమే జరుగుతుంది గాక. ఆ బిడ్డ కోసం పాటించాల్సిన నియమాలేమిటో ఆ బిడ్డ ఏమవుతాడో మాకు తెలియ చేయండి” అన్నాడు.

న్యాయాధిపతులు 13:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు జవాబుగా యెహోవా దూత “నేను ఆ స్త్రీకి చెప్పినదంతా ఆమె జాగ్రత్తగా చేయాలి. ఆమె ద్రాక్ష నుండి వచ్చేది ఏదీ తినకూడదు,

న్యాయాధిపతులు 13:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె ద్రాక్షారసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకూడదు. అలాగే ధర్మశాస్త్రం అపవిత్రంగా చెప్పిన దేనినీ తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతా ఆమె పాటించాలి” అని మనోహకు చెప్పాడు.

న్యాయాధిపతులు 13:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మనోహ “మేము నీ కోసం ఒక మేకపిల్లను పట్టుకుని వంట చేసే వరకూ ఆగమని మనవి చేస్తున్నాను” అని యెహోవా దూతతో అన్నాడు.

న్యాయాధిపతులు 13:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి యెహోవా దూత మనోహ “నేను ఆగినా నీ భోజనాన్ని మాత్రం ఆరగించను. ఒక వేళ నువ్వు దహన బలి అర్పించాలనుకుంటే దాన్ని యెహోవాకు అర్పించాలి” అన్నాడు. ఆయన యెహోవా దూత అని మనోహకు తెలియలేదు.

న్యాయాధిపతులు 13:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనోహ “నువ్వు చెప్పిన ప్రకారం జరిగిన తరువాత నిన్ను సన్మానించాలి గదా, మరి నీ పేరు ఏమిటి?” అని అడిగాడు.

న్యాయాధిపతులు 13:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి యెహోవా దూత “నా పేరెందుకు అడుగుతున్నావు? అది ఆశ్చర్యకరం” అన్నాడు.

న్యాయాధిపతులు 13:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మనోహ కొంత ధాన్యం తో పాటు ఒక మేకపిల్లను అక్కడ ఒక రాయి మీద యెహోవాకు బలిగా అర్పించాడు. మనోహా అతని భార్యా చూస్తుండగా యెహోవా దూత ఒక ఆశ్చర్యకార్యం చేశాడు.

న్యాయాధిపతులు 13:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదేమిటంటే బలిపీఠం నుండి జ్వాలలు ఆకాశానికి లేస్తుండగా ఆ జ్వాలలతోబాటు పరలోకానికి ఆరోహణం అయ్యాడు. మనోహ అతని భార్యా అది చూసి నేలపై పడి నమస్కారం చేసారు.

న్యాయాధిపతులు 13:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత యెహోవా దూత మళ్ళీ వారికి ప్రత్యక్షం కాలేదు.

న్యాయాధిపతులు 13:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనోహ తన భార్యతో “మనం దేవుణ్ణి చూశాం కాబట్టి కచ్చితంగా చనిపోతాం” అన్నాడు.

న్యాయాధిపతులు 13:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ అతని భార్య “యెహోవా మనలను చంపాలనుకుంటే మనం అర్పించిన దహనబలినీ ధాన్యపు నైవేద్యాన్నీ అంగీకరించి ఉండేవాడు కాదు. ఈ విషయాలను మనకు చూపించి ఉండేవాడూ కాదు. ఈ రోజుల్లో ఇలాంటి సంగతులను మనకు చెప్పేవాడూ కాదు,” అంది.

న్యాయాధిపతులు 13:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత ఆ స్త్రీ ఒక కొడుకుని కన్నది. అతనికి సంసోను అనే పేరు పెట్టింది. ఆ పిల్లవాడు పెద్దయ్యాక యెహోవా అతణ్ణి ఆశీర్వదించాడు.

న్యాయాధిపతులు 13:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక అతడు జొర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న మహనెదానులో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతణ్ణి పురికొల్పడం మొదలు పెట్టాడు.

Available Bible Translations

American Standard Version
Judges 13 (ASV) »
King James Version
Judges 13 (KJV) »
GOD’S WORD® (GW)
Judges 13 (GW) »
World English Bible
Judges 13 (WEB) »
Louis Segond 1910
Juges 13 (LSG) »
Luther Bibel 1912
Richter 13 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
न्यायियों 13 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਕਜ਼ਾૃ 13 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
বিচাৰকর্তাবিলাক 13 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
நியாயாதிபதிகள் 13 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
शास्ते 13 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ન્યાયાધીશો 13 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ನ್ಯಾಯಸ್ಥಾಪಕರು 13 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْقُضَاة 13 (AVD) »
תנ ך עברי מודרני
שפטים 13 (HEB) »
Bíblia Sagrada Português
Juízes 13 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Các Thủ Lãnh 13 (VIE) »
Reina Valera Antigua
Jueces 13 (RVA) »
La Sacra Bibbia
Giudici 13 (RIV) »
圣 经 简体中文和合本
士 师 记 13 (CUVS) »
聖 經 繁體中文和合本
士 師 記 13 (CUVT) »
Bibla e Shenjtë
Gjyqtarët 13 (ALB) »
Svenska Bibeln 1917
Domarboken 13 (SV1917) »
Библия на русском
Книга Судей 13 (RUSV) »
Українська Біблія
Книга Суддів 13 (UKR) »
Szent Biblia - Magyar
Bírák 13 (KAR) »
Българска Библия
Съдии 13 (BULG) »
聖書 日本語
士師記 13 (JPN) »
Kitaabka Quduuska Ah
Xaakinnada 13 (SOM) »
De Heilige Schrift
Richtere 13 (NLD) »
Dansk Bibel 1871
Dommer 13 (DA1871) »

న్యాయాధిపతులు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List