న్యాయాధిపతులు Chapter 16 TELIRV Bible Verse Images

న్యాయాధిపతులు 16 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share న్యాయాధిపతులు 16 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


న్యాయాధిపతులు 16:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత సంసోను గాజాకు వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూసి ఆమెతో ఉండిపోయాడు.

న్యాయాధిపతులు 16:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సంసోను అక్కడికి వచ్చాడని గాజా వారికి తెలిసింది. దాంతో వారు రహస్యంగా ఆ స్థలాన్ని చుట్టుముట్టారు. తెల్లవారిన తరువాత సంసోనును చంపాలని కాచుకుని ఉన్నారు.

న్యాయాధిపతులు 16:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సంసోను అర్థ రాత్రి వరకూ పండుకున్నాడు. అర్థ రాత్రి వేళ ఆ పట్టణం ద్వారం తలుపులను వాటి రెండు దర్వాజాలనూ అడ్డకర్రలతో సహా ఊడబెరికి వాటిని మోసుకుంటూ హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండశిఖరానికి వాటిని తీసుకు వెళ్ళాడు.

న్యాయాధిపతులు 16:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత సంసోను శోరేకు లోయలో నివాసముండే ఒక స్త్రీని ప్రేమించాడు. ఆమె పేరు దెలీలా.

న్యాయాధిపతులు 16:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫిలిష్తీయుల అధికారులు ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో “నువ్వు అతణ్ణి ఏమార్చి అతడి గొప్ప బలం దేంట్లో ఉందో, మేము అతణ్ణి బంధించడానికి ఎలా అతణ్ణి గెలవవచ్చో తెలుసుకో. మేము అతణ్ణి బంధించి అతని గర్వం అణచివేస్తాం. నువ్వు దీన్ని చేస్తే మాలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందల వెండి నాణేలిస్తాం” అన్నారు.

న్యాయాధిపతులు 16:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి దెలీలా “నువ్వు ఇంత బలంగా ఉండటానికి కారణమేంటో, నిన్ను ఓడించాలంటే దేంతో నిన్ను బంధించాలో దయచేసి నాకు చెప్పు” అని సంసోనును అడిగింది.

న్యాయాధిపతులు 16:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి సంసోను “ఏడు పచ్చి వింటినారలతో నన్ను కట్టిపడేస్తే నాలో బలం పోయి అందరిలానే ఉంటాను” అన్నాడు.

న్యాయాధిపతులు 16:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫిలిష్తీయుల అధికారులు ఏడు పచ్చి వింటినారలను తెచ్చి ఆమెకు ఇచ్చారు. ఆమె వాటితో అతణ్ణి బంధించింది.

న్యాయాధిపతులు 16:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె ఇంట్లోని లోపలి గదిలో కొంతమంది దాగి ఉన్నారు. ఆమె “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అంది. అతడు తనను బంధించిన వింటినారలను కాలిపోయిన నారపోగుల్లా తెంపేశాడు. కాబట్టి అతని బలం వెనుక రహస్యం వెల్లడి కాలేదు.

న్యాయాధిపతులు 16:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు దెలీలా “చూడు, నువ్వు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. దయచేసి నిన్ను ఎలా లొంగదీసుకోవచ్చో నాకు చెప్పు” అని సంసోనుతో అంది.

న్యాయాధిపతులు 16:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సంసోను “కొత్తగా పేనిన, ఇంత వరకూ వాడని తాళ్ళతో నన్ను బంధించాలి. అప్పుడు నేను అందరిలాగా బలహీనుడి నౌతాను” అన్నాడు.

న్యాయాధిపతులు 16:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు దెలీలా కొత్తగా పేనిన తాళ్లతో అతణ్ణి బంధించింది. “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అని సంసోనుతో అంది. అప్పటికే ఆమె గదిలో కొందరు వేచి చూస్తున్నారు. సంసోను లేచి ఆ తాళ్ళను నూలు పోగుల్లా తెంపేశాడు.

న్యాయాధిపతులు 16:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు దెలీలా “ఇప్పటివరకూ నువ్వు నన్ను మోసం చేస్తూ అబద్ధమే చెప్పావు. దేనితో నిన్ను బంధించవచ్చో నాకు చెప్పు” అంది. అప్పుడు సంసోను “నా తలపై ఉన్న ఏడు జడలను మగ్గంలో నేతలాగ అల్లితే సరి” అన్నాడు.

న్యాయాధిపతులు 16:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అతడు నిద్రిస్తున్నప్పుడు ఆమె అతని తలపై ఏడు జడలు మగ్గంపై అల్లి మేకుతో మగ్గానికి దిగగొట్టింది. తరువాత “సంసోనూ, ఫిలిష్తీయులు వచ్చేశారు!” అంటూ అతణ్ణి నిద్ర లేపింది. సంసోను నిద్ర నుండి లేచి మగ్గపు మేకునూ నేతనూ ఊడబెరికాడు.

న్యాయాధిపతులు 16:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆమె “నీ రహస్యాలేవీ నాకు చెప్పకుండా నన్ను ప్రేమిస్తున్నానని ఎలా అనగలుగుతున్నావు? ఇప్పటికి మూడు సార్లు నన్ను మోసం చేశావు. నీ మహాబలం దేనిలో ఉందో ఇంతవరకూ నాకు చెప్పలేదు” అంది.

న్యాయాధిపతులు 16:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక ఆమె ప్రతిరోజూ తన మాటలతో అతణ్ణి విసికించడం ప్రారంభించింది. దాంతో అతనికి విసుగు పుట్టి “చావే నయం” అనిపించింది.

న్యాయాధిపతులు 16:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు సంసోను సమస్తం ఆమెకు తెలియచేశాడు. “నేను పుట్టిన దగ్గర్నుంచి మంగలి కత్తి నా తలపైకి రాలేదు. ఎందుకంటే నేను నా తల్లి గర్భంలోనే దేవునికి నాజీరుగా ఉన్నాను. నా తలపై జుట్టును క్షౌరం చేస్తే నేను అందరిలాగానే సామాన్యుడిగా మారతాను” అని ఆమెకు చెప్పాడు.

న్యాయాధిపతులు 16:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన రహస్యాన్ని చెప్పేశాడని దెలీలాకు అర్థమైంది. ఆమె ఫిలిష్తీయుల అధికారులకు కబురు పంపింది. “మరోసారి రండి. ఇతను నాకు తన రహస్యాన్ని చెప్పాడు” అంది. ఫిలిష్తీయుల అధికారులు డబ్బు తీసుకుని ఆమె దగ్గరికి వచ్చారు.

న్యాయాధిపతులు 16:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె తన తొడ మీద అతణ్ణి నిద్ర పోయేలా చేసి ఒక మనిషిని పిలిపించి అతని ద్వారా సంసోను తల పై ఉన్న ఏడు జడలనూ క్షౌరం చేయించింది. అతణ్ణి లొంగదీసుకోసాగింది. ఎందుకంటే అప్పటికి అతనిలోని బలం తొలగిపోయింది.

న్యాయాధిపతులు 16:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అంది. సంసోను నిద్ర లేచి “ఎప్పటి లానే లేచి విసిరికొట్టి విడిపించుకుంటాను” అనుకున్నాడు. కానీ యెహోవా తనను విడిచి పెట్టాడని అతనికి తెలియలేదు.

న్యాయాధిపతులు 16:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఫిలిష్తీయులు అతణ్ణి బంధించి అతని కళ్ళు ఊడబెరికారు. గాజాకు అతణ్ణి తీసుకు వచ్చి ఇత్తడి సంకెళ్ళతో బంధించారు.

న్యాయాధిపతులు 16:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతణ్ణి చెరసాల్లో తిరగలి విసరడానికి పెట్టారు. కాని క్షౌరం చేశాక అతని తలపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమయ్యాయి.

న్యాయాధిపతులు 16:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫిలిష్తీయుల అధికారులు “మన దేవుడు మన శత్రువైన సంసోనును జయించి మన చేతికి అప్పగించాడు” అని చెప్పుకుని, వారి దేవుడైన దాగోనుకు గొప్ప బలి అర్పించడానికీ, పండగ చేసుకోడానికీ ఒక చోట చేరారు.

న్యాయాధిపతులు 16:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ చేరిన ప్రజలంతా దాగోనును చూసి “మన దేశాన్ని నాశనం చేసి మనలో అనేకులను చంపిన మన శత్రువును మన దేవుడు జయించాడు” అంటూ తమ దేవుణ్ణి కీర్తించారు.

న్యాయాధిపతులు 16:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళంతా సంబరం చేసుకుంటూ ఉన్నారు “సంసోనును తీసుకు రండి. అతణ్ణి చూసి ఎగతాళి చేసి నవ్వుదాం” అన్నారు. వాళ్ళు అతణ్ణి తీసుకు వచ్చి రెండు స్తంభాల మధ్య అతణ్ణి నిలబెట్టారు.

న్యాయాధిపతులు 16:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సంసోను తన చెయ్యి పట్టుకుని ఉన్న కుర్రాడితో “ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను ఆనుకుని నిల్చుంటాను” అన్నాడు.

న్యాయాధిపతులు 16:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఆలయం అంతా స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిష్తీయుల అధికారులంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా సంసోనును ఎగతాళి చేస్తున్నారు. ఆలయం కప్పు పైన సుమారు మరో మూడు వేలమంది స్త్రీలూ పురుషులూ చూస్తూ ఉన్నారు.

న్యాయాధిపతులు 16:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు సంసోను “ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారికి నాకు బలం దయచెయ్యి. నా కళ్ళు ఊడబెరికిన వారిపై నన్ను పగ తీర్చుకోనీయి” అని యెహోవాకు మొర్ర పెట్టాడు.

న్యాయాధిపతులు 16:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఆలయానికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో ఒక దాన్ని కుడిచేతితో మరోదాన్ని ఎడమచేతితో పట్టుకుని నిలబడ్డాడు.

న్యాయాధిపతులు 16:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నేనూ, నాతో కూడా ఫిలిష్తీయులూ చనిపోతాం” అంటూ బలంగా ముందుకి వంగినప్పుడు ఆ ఆలయం కూలిపోయింది. దానిలో ఉన్న అధికారుల మీదా, ప్రజలందరి మీదా అదికూలింది. సంసోను తన జీవిత కాలంలో చంపిన వారి కంటే చనిపోయే సమయంలో హతమార్చిన సంఖ్యే ఎక్కువ.

న్యాయాధిపతులు 16:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అతని సహోదరులూ, అతని తండ్రి ఇంటివారూ వచ్చి అతణ్ణి తీసుకు వెళ్ళారు. అతణ్ణి జోర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న అతని తండ్రియైన మానోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Judges 16 (ASV) »
King James Version (KJV)
Judges 16 (KJV) »
GOD’S WORD® (GW)
Judges 16 (GW) »
Berean Bible (BSB)
Judges 16 (BSB) »
World English Bible (WEB)
Judges 16 (WEB) »
French Bible (LSG)
Juges 16 (LSG) »
German Bible (LUTH1912)
Richter 16 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਕਜ਼ਾૃ 16 (PANIRV) »
Hebrew Bible (HEB)
שפטים 16 (HEB) »
Portuguese Bible (BSL)
Juízes 16 (BSL) »
Vietnamese Bible (VIE)
Các Thủ Lãnh 16 (VIE) »
Spanish Bible (RVA)
Jueces 16 (RVA) »
Italian Bible (RIV)
Giudici 16 (RIV) »
Chinese Simplified (CUVS)
士 师 记 16 (CUVS) »
Chinese Traditional (CUVT)
士 師 記 16 (CUVT) »
Albanian Bible (ALB)
Gjyqtarët 16 (ALB) »
Swedish Bible (SV1917)
Domarboken 16 (SV1917) »
Hungarian Bible (KAR)
Bírák 16 (KAR) »
Bulgarian Bible (BULG)
Съдии 16 (BULG) »
Japanese Bible (JPN)
士師記 16 (JPN) »
Norwegian Bible (NORSK)
Dommerne 16 (NORSK) »

న్యాయాధిపతులు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List