లూకా Chapter 22 TELIRV Bible Verse Images

లూకా 22 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share లూకా 22 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


లూకా 22:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది.

లూకా 22:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు.

లూకా 22:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు.

లూకా 22:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాంతో యూదా వెళ్ళి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాజకులతో, అధికారులతో మాట్లాడాడు.

లూకా 22:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి వారు సంతోషించారు. అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు.

లూకా 22:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు.

లూకా 22:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది.

లూకా 22:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు పేతురు యోహానులతో, “మీరు వెళ్ళి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి” అన్నాడు.

లూకా 22:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు, “మేము దాన్ని ఎక్కడ సిద్ధం చేయాలి?” అని అడిగారు.

లూకా 22:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన, “మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి.

లూకా 22:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా గురువు, ‘నేను నా శిష్యులతో కలసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది?’ అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి.

లూకా 22:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు అన్ని సదుపాయాలూ ఉన్న ఒక పెద్ద మేడ గది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని వారితో చెప్పాడు.

లూకా 22:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి. దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధపరిచారు.

లూకా 22:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు.

లూకా 22:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడాయన, “నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను.

లూకా 22:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను.”

లూకా 22:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి, “మీరు దీన్ని తీసుకుని పంచుకోండి.

లూకా 22:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు.

లూకా 22:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దాన్ని విరిచి వారికిచ్చి, “ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అని చెప్పాడు.

లూకా 22:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన.

లూకా 22:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“వినండి, నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు.

లూకా 22:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని నిర్ణయం ప్రకారం మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం యాతన తప్పదు” అన్నాడు,

లూకా 22:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు.

లూకా 22:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది.

లూకా 22:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు.

లూకా 22:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి.

లూకా 22:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను.

లూకా 22:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నాకు కలిగిన విషమ పరీక్షల్లో మీరే నాతో నిలిచి ఉన్నారు.

లూకా 22:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు. నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి,

లూకా 22:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను.

లూకా 22:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు.

లూకా 22:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.”

లూకా 22:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు.

లూకా 22:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు.

లూకా 22:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా ఆయన “నేను డబ్బు సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా?” అని అడిగాడు. దానికి వారు, “ఏమీ తక్కువ కాలేదు” అన్నారు.

లూకా 22:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన, “కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేని వాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి.

లూకా 22:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు’ అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను” అన్నాడు.

లూకా 22:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శిష్యులు, “ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి” అన్నారు. ఆయన, “చాలు” అన్నాడు.

లూకా 22:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు.

లూకా 22:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో, “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు.

లూకా 22:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి దగ్గర నుండి ఆయన రాతివేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేశాడు.

లూకా 22:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.”

లూకా 22:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు.

లూకా 22:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది.

లూకా 22:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు.

లూకా 22:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారితో, “మీరెందుకు నిద్ర పోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి” అన్నాడు.

లూకా 22:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు. పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు.

లూకా 22:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యేసు, “యూదా, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?” అన్నాడు.

లూకా 22:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుతున్నదేమిటో గ్రహించి, “ప్రభూ, కత్తితో నరకమంటావా?” అని అడిగారు.

లూకా 22:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈలోగా వారిలో ఒకడు ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి వాడి చెవి నరికాడు.

లూకా 22:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి యేసు, “అంతటితో ఆగండి” అని అతని చెవిని తాకి బాగుచేశాడు.

లూకా 22:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తనను పట్టుకోడానికి వచ్చిన పెద్దలతో, ప్రధాన యాజకులతో, దేవాలయం అధికారులతో, “ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులతో దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా?

లూకా 22:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ప్రతిరోజూ మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, చీకటి ఆధిపత్యం” అన్నాడు.

లూకా 22:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆయనను పట్టుకుని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడి ఇంట్లోకి తీసుకు వెళ్ళారు. పేతురు దూరంగా వారి వెనకే వెళ్ళాడు.

లూకా 22:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు కొంతమంది ఆ ఇంటి ఆవరణలో చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని ఉన్నారు. పేతురు కూడా వెళ్ళి వారితో కూర్చున్నాడు.

లూకా 22:56 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఒక పనిపిల్ల మంట వెలుతురులో కూర్చుని ఉన్న పేతురును పరీక్షగా చూసి, “ఈ మనిషి కూడా అతనితో ఉన్నవాడే” అంది.

లూకా 22:57 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి పేతురు, “అమ్మాయీ, అతనెవరో నాకు తెలియదు” అన్నాడు.

లూకా 22:58 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాసేపటికి మరొకడు పేతురును చూసి, “నువ్వు కూడా వారిలో ఒకడివే” అన్నాడు. దానికి పేతురు, “నేను కాదయ్యా” అన్నాడు.

లూకా 22:59 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మరో గంట గడిచాక ఇంకొకడు పేతురును చూసి, “ఇతడు కచ్చితంగా అతనితో కూడా ఉన్నాడు. ఇతడు గలిలయ వాడే” అని నొక్కి చెప్పాడు.

లూకా 22:60 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు పేతురు, “నువ్వు అంటున్నదేమిటో నాకు తెలియడం లేదు” అన్నాడు. అతడు ఇలా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది.

లూకా 22:61 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు. “నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తరువాత కోడి కూస్తుందని” ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది.

లూకా 22:62 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు.

లూకా 22:63 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు.

లూకా 22:64 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టి “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు” అన్నారు.

లూకా 22:65 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక దూషణ మాటలు పలికారు.

లూకా 22:66 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉదయం కాగానే ప్రజల నాయకులూ, ముఖ్య యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ సమావేశమయ్యారు. ఆయనను మహాసభకు తీసుకువెళ్ళారు.

లూకా 22:67 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నువ్వు అభిషిక్తుడివైతే అది మాకు చెప్పు” అన్నారు. అందుకాయన, “నేను మీతో చెప్పినా మీరు నమ్మరు.

లూకా 22:68 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతే కాకుండా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే జవాబివ్వరు.

లూకా 22:69 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఇకపై మనుష్య కుమారుడు బల ప్రభావాలున్న దేవుని కుడి వైపున కూర్చుని ఉంటాడు” అన్నాడు.

లూకా 22:70 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అయితే నువ్వు దేవుని కుమారుడివా?” అన్నారు. ఆయన వారితో, “మీరన్నట్టు ఆయనను నేనే” అన్నాడు.

లూకా 22:71 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు వారు, “మనకిక సాక్షులతో పనేముంది? ఇతని నోటి మాట మనమే విన్నాం కదా” అన్నారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Luke 22 (ASV) »
King James Version (KJV)
Luke 22 (KJV) »
GOD’S WORD® (GW)
Luke 22 (GW) »
Berean Bible (BSB)
Luke 22 (BSB) »
World English Bible (WEB)
Luke 22 (WEB) »
French Bible (LSG)
Luc 22 (LSG) »
German Bible (LUTH1912)
Lukas 22 (LUTH1912) »
Hindi Bible (HINIRV)
लूका 22 (HINIRV) »
Punjabi Bible (PANIRV)
ਲੂਕਾ 22 (PANIRV) »
Bengali Bible (BENIRV)
লূক 22 (BENIRV) »
Marathi Bible (MARIRV)
लूक 22 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
લૂક 22 (GUJIRV) »
Kannada Bible (KANIRV)
ಲೂಕನು 22 (KANIRV) »
Arabic Bible (AVD)
لُوقا 22 (AVD) »
Portuguese Bible (BSL)
Lucas 22 (BSL) »
Vietnamese Bible (VIE)
Lu-ca 22 (VIE) »
Spanish Bible (RVA)
Lucas 22 (RVA) »
Italian Bible (RIV)
Luca 22 (RIV) »
Chinese Simplified (CUVS)
路 加 福 音 22 (CUVS) »
Chinese Traditional (CUVT)
路 加 福 音 22 (CUVT) »
Albanian Bible (ALB)
Luka 22 (ALB) »
Swedish Bible (SV1917)
Lukas 22 (SV1917) »
Russian Bible (RUSV)
Луки 22 (RUSV) »
Ukrainian Bible (UKR)
Луки 22 (UKR) »
Hungarian Bible (KAR)
Lukács 22 (KAR) »
Bulgarian Bible (BULG)
Лука 22 (BULG) »
Norwegian Bible (NORSK)
Lukas 22 (NORSK) »

లూకా (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List