1 దినవృత్తాంతాలు Chapter 26 TELIRV Bible Verse Images

1 దినవృత్తాంతాలు 26 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 దినవృత్తాంతాలు 26 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 దినవృత్తాంతాలు 26:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది ద్వారపాలకుల విభజన గూర్చిన సంగతి. ఆసాపు సంతానంలో కోరే కొడుకు మెషెలెమ్యా కోరహు సంతానం వాడు.

1 దినవృత్తాంతాలు 26:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెషెలెమ్యా కొడుకులు ఎవరంటే జెకర్యా పెద్దవాడు, యెదీయవేలు రెండోవాడు, జెబద్యా మూడోవాడు, యత్నీయేలు నాల్గోవాడు.

1 దినవృత్తాంతాలు 26:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏలాము అయిదోవాడు, యెహోహనాను ఆరోవాడు, ఎల్యోయేనై ఏడోవాడు.

1 దినవృత్తాంతాలు 26:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కొడుకులను దయ చేశాడు. వాళ్ళెవరంటే, షెమయా పెద్దవాడు, యెహోజాబాదు రెండోవాడు, యోవాహు మూడోవాడు, శాకారు నాల్గోవాడు, నెతనేలు అయిదోవాడు,

1 దినవృత్తాంతాలు 26:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమ్మీయేలు ఆరోవాడు, ఇశ్శాఖారు ఏడోవాడు, పెయుల్లెతై ఎనిమిదోవాడు.

1 దినవృత్తాంతాలు 26:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని కొడుకు షెమయాకు కొడుకులు పుట్టారు. వాళ్ళు పరాక్రమశాలులుగా ఉండి తమ తండ్రి కుటుంబంలో పెద్దలయ్యారు.

1 దినవృత్తాంతాలు 26:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షెమయా కొడుకులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, యెల్జాబాదు, బలవంతులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా.

1 దినవృత్తాంతాలు 26:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఓబేదెదోము కొడుకులూ, వాళ్ళ కొడుకులూ వాళ్ళ సహోదరులూ అరవై ఇద్దరు, వాళ్ళు తమ పని చెయ్యడంలో గట్టివాళ్ళు.

1 దినవృత్తాంతాలు 26:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెషెలెమ్యాకు పుట్టిన కొడుకులూ, సహోదరులూ, పరాక్రమశాలురు. వీళ్ళు పద్దెనిమిది మంది.

1 దినవృత్తాంతాలు 26:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెరారీయుల్లో హోసా అనే అతనికి పుట్టిన కొడుకులు పెద్దవాడు షిమ్రీ, అతడు పెద్దకొడుకు కాకపోయినా అతని తండ్రి అతన్ని నాయకునిగా చేశాడు.

1 దినవృత్తాంతాలు 26:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండోవాడు హిల్కీయా, మూడోవాడు టెబల్యాహు, నాలుగోవాడు జెకర్యా, హోసా కొడుకులూ, సహోదరులూ అందరూ కలిసి పదముగ్గురు.

1 దినవృత్తాంతాలు 26:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరంలో వంతుల ప్రకారం తమ సోదరులు సేవ చెయ్యడానికి ఈ ద్వారపాలకులు, అంటే వాళ్ళలో ఉన్న పెద్దలు వాళ్ళను జవాబుదారులుగా నియమించడం జరిగింది.

1 దినవృత్తాంతాలు 26:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చిన్నలకైనా పెద్దలకైనా పూర్వీకుల ఇంటి వరసనుబట్టి ఒక్కొక్క ద్వారం దగ్గర కావలి ఉండడానికి వాళ్ళు చీట్లు వేశారు.

1 దినవృత్తాంతాలు 26:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తూర్పు వైపు కావలి షెలెమ్యాకు పడింది, వివేకం గలిగి ఆలోచన చెప్పగలిగిన అతని కొడుకు జెకర్యాకు చీటివేసినప్పుడు ఉత్తరం వైపు కావలి అతనికి పడింది.

1 దినవృత్తాంతాలు 26:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఓబేదెదోముకు దక్షిణం వైపు కావలీ, అతని కొడుకులకు గిడ్డంగుల కావలి పడింది.

1 దినవృత్తాంతాలు 26:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షుప్పీముకూ, హోసాకూ, పడమటి వైపున ఉన్న షల్లెకెతు గుమ్మానికి ఎక్కే రాజమార్గాన్ని కాయడానికి చీటి పడింది.

1 దినవృత్తాంతాలు 26:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తూర్పున లేవీయులైన ఆరుగురు, ఉత్తరాన రోజుకు నలుగురూ, దక్షిణాన రోజుకు నలుగురూ, గిడ్డంగుల దగ్గర ఇద్దరిద్దరూ,

1 దినవృత్తాంతాలు 26:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బయట ద్వారం దగ్గర పడమరగా ఎక్కి వెళ్ళే రాజమార్గం దగ్గర నలుగురూ, బయట దారిలో ఇద్దరూ, ఏర్పాటు అయ్యారు.

1 దినవృత్తాంతాలు 26:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కోరే సంతానంలోనూ, మెరారీయుల్లోనూ ద్వారం కావలి కాసే వాళ్లకు ఈ విధంగా వంతులు వచ్చాయి.

1 దినవృత్తాంతాలు 26:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చివరికి లేవీయుల్లో అహీయా అనేవాడు దేవుని మందిరపు గిడ్డంగులనూ, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులనూ కాసేవాడుగా నియామకం జరిగింది.

1 దినవృత్తాంతాలు 26:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది లద్దాను సంతానం గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కొడుకులు, అంటే, గెర్షోనీయులుగా ఉంటూ తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలై ఉన్నవాళ్ళను గూర్చినది.

1 దినవృత్తాంతాలు 26:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహీయేలీ కొడుకులైన జేతాము, అతని సహోదరుడు యోవేలు, యెహోవా మందిరపు గిడ్డంగులకు కావలి కాసేవాళ్ళు.

1 దినవృత్తాంతాలు 26:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు, అనేవాళ్ళను గూర్చినది.

1 దినవృత్తాంతాలు 26:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే కొడుకు గెర్షోముకు పుట్టిన షెబూయేలుకు గిడ్డంగుల మీద ప్రధానిగా నియామకం జరిగింది.

1 దినవృత్తాంతాలు 26:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలీయెజెరు సంతానం వాళ్ళు షెబూయేలు సహోదరులు ఎవరంటే, అతని కొడుకు రెహబ్యా, రెహబ్యా కొడుకు యెషయా, యెషయా కొడుకు యెహోరాము, యెహోరాము కొడుకు జిఖ్రీ, జిఖ్రీ కొడుకు షెలోమీతు.

1 దినవృత్తాంతాలు 26:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజైన దావీదూ, పూర్వీకుల కుటుంబాల పెద్దలూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, సైన్యాధిపతులూ ప్రతిష్ఠించిన ప్రత్యేకమైన సామగ్రి ఉన్న గిడ్డంగులకు షెలోమీతూ, అతని సహోదరులూ కావలి కాసేవాళ్ళయ్యారు.

1 దినవృత్తాంతాలు 26:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మందిరం మరమ్మతు పనుల కోసం యుద్ధాల్లో పట్టుకున్న కొల్లసొమ్ము కొంత భాగాన్ని వీరు సమర్పించారు.

1 దినవృత్తాంతాలు 26:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రవక్త అయిన సమూయేలు, కీషు కొడుకు సౌలు, నేరు కొడుకు అబ్నేరు, సెరూయా కొడుకు యోవాబు ప్రతిష్ఠించిన సొమ్మంతటినీ షెలోమీతు, అతని సహోదరుల ఆధీనంలో ఉంచారు.

1 దినవృత్తాంతాలు 26:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది ఇస్హారీయులను గూర్చినది. వాళ్ళల్లో కెనన్యా, అతని కొడుకులను, పురపాలన జరిగించడానికి ఇశ్రాయేలీయులకు లేఖికులుగా, న్యాయాధిపతులుగా నియమించారు.

1 దినవృత్తాంతాలు 26:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యా, అతని సహోదరులు పరాక్రమశాలురు. వీళ్ళు పదిహేడువేల మంది. వీళ్ళు యొర్దాను ఇవతల పడమటి వైపున ఉండే ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ, రాజు నియమించిన పని విషయంలోనూ, పర్యవేక్షకులుగా నియమితులయ్యారు.

1 దినవృత్తాంతాలు 26:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పూర్వీకుల ఇంటి పెద్దలందరికీ యెరీయా పెద్ద. దావీదు ఏలుబడిలో నలభయ్యవ సంవత్సరంలో వాళ్ళ సంగతి పరిశీలించినప్పుడు, వాళ్ళల్లో గిలాదు దేశంలోని యాజేరులో ఉన్న వాళ్ళు పరాక్రమశాలురుగా కనిపించారు.

1 దినవృత్తాంతాలు 26:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరాక్రమశాలురైన అతని సంబంధులు రెండువేల ఏడువందల మంది కుటుంబ పెద్దలుగా కనిపించారు. దావీదు దైవసంబంధమైన కార్యాల విషయంలోనూ, రాజకార్యాల విషయంలోనూ, రూబేనీయుల మీదా, గాదీయుల మీదా, మనష్షే అర్థగోత్రపు వాళ్ళ మీదా వాళ్ళను నియమించాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Chronicles 26 (ASV) »
King James Version (KJV)
1 Chronicles 26 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 26 (GW) »
Berean Bible (BSB)
1 Chronicles 26 (BSB) »
World English Bible (WEB)
1 Chronicles 26 (WEB) »
French Bible (LSG)
1 Chroniques 26 (LSG) »
German Bible (LUTH1912)
1 Chronik 26 (LUTH1912) »
Arabic Bible (AVD)
١ أخبار 26 (AVD) »
Portuguese Bible (BSL)
1 Crônicas 26 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sử Ký 26 (VIE) »
Spanish Bible (RVA)
1 Crónicas 26 (RVA) »
Italian Bible (RIV)
1 Cronache 26 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 上 26 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 上 26 (CUVT) »
Albanian Bible (ALB)
1 Kronikave 26 (ALB) »
Swedish Bible (SV1917)
1 Krönikeboken 26 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 хроніки 26 (UKR) »
Hungarian Bible (KAR)
1 Krónika 26 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Летописи 26 (BULG) »
Japanese Bible (JPN)
歴代志上 26 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Krønikebok 26 (NORSK) »

1 దినవృత్తాంతాలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List