1 దినవృత్తాంతాలు Chapter 2 TELIRV Bible Verse Images

1 దినవృత్తాంతాలు 2 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 దినవృత్తాంతాలు 2 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 దినవృత్తాంతాలు 2:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు కొడుకులు వీళ్ళు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,

1 దినవృత్తాంతాలు 2:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.

1 దినవృత్తాంతాలు 2:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా అనేవాళ్ళు. ఈ ముగ్గురి తల్లి ఒక కనానీయురాలు. ఆమె షూయ అనేవాడి కూతురు. యూదా పెద్దకొడుకు పేరు ఏరు. ఇతడు యెహోవా దృష్టిలో పాపం చేశాడు. అందుకని యెహోవా అతణ్ణి చంపాడు.

1 దినవృత్తాంతాలు 2:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం ఐదుగురు కొడుకులు.

1 దినవృత్తాంతాలు 2:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు అనేవాళ్ళు.

1 దినవృత్తాంతాలు 2:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జెరహుకు ఐదుగురు కొడుకులు కలిగారు. వీరు జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దారా.

1 దినవృత్తాంతాలు 2:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కర్మీ కొడుకుల్లో ఒకడి పేరు ఆకాను. ఇతడు శాపానికి గురైన వస్తువుల్లో కొన్నిటిని దొంగతనం చేశాడు. అలా చేసి ఇశ్రాయేలీయులను ఎంతో యాతన పెట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏతాను కొడుకు పేరు అజర్యా.

1 దినవృత్తాంతాలు 2:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హెస్రోనుకు పుట్టిన కొడుకులు యెరహ్మెయేలు, రము, కెలూబై.

1 దినవృత్తాంతాలు 2:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రముకు అమ్మీనాదాబు, అమ్మీనాదాబుకు నయస్సోను పుట్టాడు. ఈ నయస్సోను యూదా ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు.

1 దినవృత్తాంతాలు 2:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నయస్సోనుకు శల్మాను పుట్టాడు, శల్మానుకు బోయజు పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బోయజుకు ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యెష్షయి పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెష్షయి పెద్ద కొడుకు పేరు ఏలీయాబు. రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా,

1 దినవృత్తాంతాలు 2:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాల్గోవాడు నెతనేలు, ఐదోవాడు రద్దయి,

1 దినవృత్తాంతాలు 2:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆరోవాడు ఓజెము, ఏడోవాడు దావీదు.

1 దినవృత్తాంతాలు 2:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వాళ్ళు సెరూయా అబీగయీలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.

1 దినవృత్తాంతాలు 2:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీగయీలుకు అమాశా పుట్టాడు. ఈ అమాశా తండ్రి యెతెరు అనే ఇష్మాయేలీయుడు.

1 దినవృత్తాంతాలు 2:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హెస్రోను కొడుకు కాలేబుకు అజూబా అనే తన భార్య వల్లా, యెరీయోతు అనే ఆమె వల్లా పిల్లలు కలిగారు. అజూబా కొడుకులు యేషెరు, షోబాబు, అర్దోను.

1 దినవృత్తాంతాలు 2:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతా అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి హూరు పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హూరుకు ఊరీ పుట్టాడు. ఊరీకి బెసలేలు పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత హెస్రోను అరవై ఏళ్ల వయస్సప్పుడు మాకీరు కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఈ మాకీరు గిలాదుకు తండ్రి. హెస్రోనుకు సెగూబు పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సెగూబుకు యాయీరు పుట్టాడు. ఇతని ఆధీనంలో గిలాదు దేశంలో ఇరవై మూడు పట్టణాలు ఉండేవి.

1 దినవృత్తాంతాలు 2:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళ దగ్గరనుండి యాయీరు పట్టణాలనూ, కెనాతునూ, వీటి చుట్టూ ఉన్న మరో అరవై ఊళ్లనూ గెషూరు వాళ్లూ అరామీయులూ తీసుకున్నారు. వీళ్ళంతా గిలాదుకు తండ్రి అయిన మాకీరు సంతానం.

1 దినవృత్తాంతాలు 2:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హెస్రోను చనిపోయిన తరువాత కాలేబు-ఎఫ్రతా పట్టణంలో హెస్రోను భార్య అష్షూరును కన్నది. ఈ అష్షూరు తెకోవ అనే వాడికి తండ్రి.

1 దినవృత్తాంతాలు 2:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హెస్రోను పెద్దకొడుకు యెరహ్మెయేలు. ఈ యెరహ్మెయేలు పెద్ద కొడుకు రము. మిగిలిన కొడుకులు ఎవరంటే బూనా, ఓరెను, ఓజెము, అహీయా అనేవాళ్ళు.

1 దినవృత్తాంతాలు 2:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ యెరహ్మెయేలుకు మరో భార్య ఉంది. ఆమె పేరు అటారా. ఈమె ఓనాము తల్లి.

1 దినవృత్తాంతాలు 2:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెరహ్మెయేలు పెద్దకొడుకు రముకు మయజూ, యామీను, ఏకెరు అనే కొడుకులున్నారు.

1 దినవృత్తాంతాలు 2:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఓనాము కొడుకులు షమ్మయి, యాదాలు. షమ్మయి కొడుకులు నాదాబు, అబీషూరు.

1 దినవృత్తాంతాలు 2:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీషూరు భార్య పేరు అబీహయిలు. ఈమె ద్వారా అబీషూరుకు అహ్బాను, మొలీదు అనే పేరున్న కొడుకులు పుట్టారు.

1 దినవృత్తాంతాలు 2:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాదాబు కొడుకులు సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు పుట్టకుండానే చనిపోయాడు.

1 దినవృత్తాంతాలు 2:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పయీం కొడుకుల్లో ఇషీ అనే వాడున్నాడు. ఇషీ కొడుకుల్లో షేషాను అనే వాడున్నాడు. షేషాను కొడుకుల్లో అహ్లయి అనే వాడున్నాడు.

1 దినవృత్తాంతాలు 2:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షమ్మయికి సోదరుడైన యాదా కొడుకులు యెతెరు, యోనాతాను. వీరిలో యెతెరు ఎలాంటి సంతానం లేకుండానే చనిపోయాడు.

1 దినవృత్తాంతాలు 2:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోనాతాను కొడుకులు పేలెతు, జాజా. వీళ్ళంతా యెరహ్మెయేలు వారసులు.

1 దినవృత్తాంతాలు 2:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షేషానుకు కూతుళ్ళు పుట్టారు గానీ కొడుకులు కలగలేదు. ఈ షేషానుకు యరహా అనే ఒక దాసుడున్నాడు. వాడు ఐగుప్తీయుడు

1 దినవృత్తాంతాలు 2:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షేషాను తన కూతుర్ని ఈ యరహాకు ఇచ్చాడు. యరహాకు ఆమె ద్వారా అత్తయి పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అత్తయికి నాతాను పుట్టాడు. నాతానుకి జాబాదు పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జాబాదుకి ఎప్లాలు పుట్టాడు. ఎప్లాలుకి ఓబేదు పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఓబేదుకి యెహూ పుట్టాడు. యెహూకి అజర్యా పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అజర్యాకి హేలెస్సు పుట్టాడు. హేలెస్సుకి ఎలాశా పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలాశాకి సిస్మాయీ పుట్టాడు. సిస్మాయీకి షల్లూము పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షల్లూముకి యెకమ్యా పుట్టాడు. యెకమ్యాకి ఎలీషామా పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెరహ్మెయేలు తోడబుట్టిన వాడు కాలేబు కొడుకులెవరంటే మేషా, మారేషా. వీరిలో మేషా పెద్దవాడు. ఇతని కొడుకు జీఫు. మారేషా కొడుకు పేరు హెబ్రోను.

1 దినవృత్తాంతాలు 2:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హెబ్రోను కొడుకులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ.

1 దినవృత్తాంతాలు 2:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షెమకు రహము పుట్టాడు. ఈ రహము యోర్కెయాముకు తండ్రి. రేకెముకు షమ్మయి పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షమ్మయి కొడుకు మాయోను. ఈ మాయోను బేత్సూరుకు తండ్రి.

1 దినవృత్తాంతాలు 2:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాలేబు ఉంపుడుకత్తె అయిన ఏయిఫా హారాను, మోజాను, గాజేజులకు జన్మనిచ్చింది. హారానుకు గాజేజు పుట్టాడు.

1 దినవృత్తాంతాలు 2:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహ్దయి కొడుకులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు.

1 దినవృత్తాంతాలు 2:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాలేబు ఉంపుడుకత్తె అయిన మయకా షెబెరుకీ, తిర్హనాకీ జన్మనిచ్చింది.

1 దినవృత్తాంతాలు 2:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమెకి ఇంకా షయపు, షెవాను పుట్టారు. వీరిలో షయపుకు మద్మన్నా, షెవానుకు గిబీ వాడు మక్బేనా పుట్టారు. కాలేబు కూతురి పేరు అక్సా.

1 దినవృత్తాంతాలు 2:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక కాలేబు సంతానం ఎవరంటే, ఎఫ్రాతా వల్ల అతనికి మొదట హూరు పుట్టాడు. హూరుకు శోబాలు, శల్మా, హారేపు పుట్టారు.

1 దినవృత్తాంతాలు 2:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళలో శోబాలుకు కిర్యత్యారీము, శల్మాకు బేత్లెహేము, హారేపుకు బేత్గాదేరు పుట్టారు.

1 దినవృత్తాంతాలు 2:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు వారసులు హారోయే, ఇంకా మనుహోతీయుల్లో సగం మంది ఇతని వంశం వాళ్ళే.

1 దినవృత్తాంతాలు 2:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కిర్యత్యారీముకు చెందిన తెగలు ఎవరంటే ఇత్రీయులూ, పూతీయులూ, షుమ్మాతీయులూ, మిష్రాయీయులు. వీరినుండి జొరాతీయులూ, ఎష్తాయులీయులూ వచ్చారు.

1 దినవృత్తాంతాలు 2:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శల్మాకు సంబంధించిన తెగలు ఇవి, బేత్లెహేము, నెటోపాతీయులూ, యోవాబు కుటుంబానికి సంబంధించిన అతారోతీయులూ, మానహతీయుల్లో సగ భాగంగా ఉన్న జారీయులూ.

1 దినవృత్తాంతాలు 2:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యబ్బేజులో నివసించే లేఖికుల కుటుంబాలైన తిరాతీయులూ, షిమ్యాతీయులూ, శూకోతీయులూ. వీళ్ళు రేకాబు కుటుంబాలకు పూర్వీకుడైన హమాతుకు వారసులుగా కలిగిన కేనీయులు.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Chronicles 2 (ASV) »
King James Version (KJV)
1 Chronicles 2 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 2 (GW) »
Berean Bible (BSB)
1 Chronicles 2 (BSB) »
World English Bible (WEB)
1 Chronicles 2 (WEB) »
French Bible (LSG)
1 Chroniques 2 (LSG) »
German Bible (LUTH1912)
1 Chronik 2 (LUTH1912) »
Arabic Bible (AVD)
١ أخبار 2 (AVD) »
Portuguese Bible (BSL)
1 Crônicas 2 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sử Ký 2 (VIE) »
Spanish Bible (RVA)
1 Crónicas 2 (RVA) »
Italian Bible (RIV)
1 Cronache 2 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 上 2 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 上 2 (CUVT) »
Albanian Bible (ALB)
1 Kronikave 2 (ALB) »
Swedish Bible (SV1917)
1 Krönikeboken 2 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 хроніки 2 (UKR) »
Hungarian Bible (KAR)
1 Krónika 2 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Летописи 2 (BULG) »
Japanese Bible (JPN)
歴代志上 2 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Krønikebok 2 (NORSK) »

1 దినవృత్తాంతాలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List