1 దినవృత్తాంతాలు Chapter 11 TELIRV Bible Verse Images

1 దినవృత్తాంతాలు 11 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 దినవృత్తాంతాలు 11 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 దినవృత్తాంతాలు 11:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇదంతా అయ్యాక ఇశ్రాయేలు ప్రజలందరూ హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. “ఇలా చూడు, మేము నీకు రక్తమాంసాల్లాంటి వాళ్ళం. నీ సొంత బంధువులం.

1 దినవృత్తాంతాలు 11:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇటీవల సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు ఇశ్రాయేలు సైన్యాలను నడిపిస్తూ ఉన్నావు. నీ దేవుడైన యెహోవా నీతో ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు కాపరిగా ఉంటావు. వారిమీద అధిపతిగా ఉండి పరిపాలన చేస్తావు’ అని చెప్పాడు కదా” అని దావీదుతో అన్నారు.

1 దినవృత్తాంతాలు 11:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇలా ఇశ్రాయేలు ప్రజల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో నిబంధన చేశాడు. వారంతా కలసి ఇశ్రాయేలు ప్రజలందరి పై రాజుగా దావీదుకి అభిషేకం చేశారు. ఈ విధంగా సమూయేలు ప్రకటించిన యెహోవా మాట నెరవేరింది.

1 దినవృత్తాంతాలు 11:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత దావీదూ, ఇశ్రాయేలు ప్రజలంతా యెరూషలేము అనే పేరున్న యెబూసుకి వెళ్ళారు. అప్పటికి ఆ దేశంలో స్థానికులైన యెబూసీయులు నివసిస్తున్నారు.

1 దినవృత్తాంతాలు 11:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెబూసులో నివసించే స్థానికులు దావీదుతో “నువ్వు ఇక్కడికి రాలేవు” అన్నారు. కాని దావీదు అక్కడి సీయోను కోటని ఆక్రమించాడు. ఈ సీయోనునే “దావీదు పట్టణం” అంటారు.

1 దినవృత్తాంతాలు 11:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి ముందు దావీదు “ఎవరు మొదట యెబూసీయులపై దాడి చేస్తాడో అతడే సైన్యాధిపతి అవుతాడు” అని ప్రకటించాడు. దాంతో సెరూయా కొడుకైన యోవాబు అందరి కన్నా ముందుగా వారిపై దాడి చేశాడు. కాబట్టి యోవాబునే సైన్యాధిపతిగా నియమించారు.

1 దినవృత్తాంతాలు 11:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత దావీదు ఆ కోటలోనే నివసించాడు. కాబట్టి దానికి “దావీదు పట్టణం” అనే పేరు కలిగింది.

1 దినవృత్తాంతాలు 11:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. మిల్లో నుండి ప్రాకారం వరకూ పటిష్ట పరిచాడు. పట్టణంలో మిగిలిన ప్రాంతాలను యోవాబు పటిష్టపరిచాడు.

1 దినవృత్తాంతాలు 11:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు అంతకంతకూ ఘనత పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.

1 దినవృత్తాంతాలు 11:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ప్రజల విషయంలో యెహోవా మాటకు లోబడి ఇశ్రాయేలు ప్రజలందరితో కలసి దావీదుని రాజుగా చేసినవాళ్ళూ, దావీదుతో కూడా శూరులుగా, బలవంతులుగా నిలిచిన వాళ్ళూ, నాయకులుగా ఉన్నవాళ్ళూ వీళ్ళే.

1 దినవృత్తాంతాలు 11:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు దగ్గర శ్రేష్ఠులుగా ఉన్న ఆ శూరుల జాబితాలో ముప్ఫై మంది ఉన్నారు. వారిలో ప్రముఖుడు ఒక హక్మోనీ వాడి కొడుకైన యాషాబాము. ఇతను ఒక యుద్ధంలో కేవలం తన ఈటెతో మూడు వందల మందిని చంపాడు.

1 దినవృత్తాంతాలు 11:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతని తరువాత పేరు అహోహీయుడైన దోదో కొడుకైన ఎలియాజరుది. ఇతడు ముగ్గురు బలవంతులుగా పేరు పొందిన వారిలో ఒకడు.

1 దినవృత్తాంతాలు 11:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతడు పస్దమ్మీములో ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో దావీదుతో కూడా ఉన్నాడు. అక్కడ ఒక బార్లీ చేను ఉంది. మిగిలిన సైన్యం ఫిలిష్తీయులను చూసి పారిపోయారు.

1 దినవృత్తాంతాలు 11:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే వీళ్ళు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిష్తీయులను అడ్డుకుని వారిని హతమార్చారు. యెహోవా వారిని రక్షించి వాళ్లకు గొప్ప విజయం అనుగ్రహించాడు.

1 దినవృత్తాంతాలు 11:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ముప్ఫై మంది శూరుల్లో ప్రముఖులైన ఈ ముగ్గురూ అదుల్లాము అనే రాతి గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీ సైన్యం రెఫాయీము లోయలో మజిలీ చేశారు.

1 దినవృత్తాంతాలు 11:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సమయంలో దావీదు తన స్థావరం అయిన గుహలో ఉండగా ఫిలిష్తీ సైన్యం బేత్లెహేములో మకాం చేశారు.

1 దినవృత్తాంతాలు 11:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు బేత్లెహేము నీటి కోసం ఆశ పడ్డాడు. “బేత్లెహేములోని బావిలో నీళ్ళు నాకెవరు తెస్తారు? ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు నా దాహం తీర్చడానికి నాకెవరు తెస్తారు?” అన్నాడు.

1 దినవృత్తాంతాలు 11:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఆ ముగ్గురు బలవంతులూ ఫిలిష్తీ సైన్యంలోకి చొరబడ్డారు. వారి మధ్యలో నుండి వెళ్ళి ఆ ఊరి ద్వారం దగ్గర బావిలోని నీళ్ళు తోడుకుని వాటిని దావీదుకు తెచ్చి ఇచ్చారు. కానీ దావీదు ఆ నీళ్ళు తాగేందుకు నిరాకరించాడు. వాటిని యెహోవాకు అర్పణగా పారబోసాడు.

1 దినవృత్తాంతాలు 11:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత ఇలా అన్నాడు “నేను ఈ నీళ్ళు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక. వీళ్ళు తమ ప్రాణాలకు తెగించి తెచ్చిన ఈ నీళ్ళు వాళ్ళ రక్తం లాంటిది. దాన్నినేను ఎలా తాగగలను?” అన్నాడు. ఈ ముగ్గురు బలవంతులు ఇలాంటి కార్యాలు చేశారు.

1 దినవృత్తాంతాలు 11:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోవాబు సోదరుడైన అబీషై ముగ్గురికీ నాయకుడు. ఒక యుద్ధంలో ఇతడు మూడు వందల మందిని కేవలం తన ఈటెతో హతమార్చాడు. అలా ఆ ముగ్గురితో పాటు తరచుగా ఇతని పేరు కూడా వినిపించేది.

1 దినవృత్తాంతాలు 11:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముగ్గురిలో ఇతనికి ఎక్కువ గౌరవం, కీర్తీ కలిగాయి. అయితే అతనికి కలిగిన కీర్తి పేరు మోసిన ఆ ముగ్గురు సైనికుల కీర్తికి సాటి కాలేదు.

1 దినవృత్తాంతాలు 11:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా కబ్సెయేలు ఊరివాడు యెహోయాదా కొడుకు బెనాయా ఎంతో బలవంతుడు. తన పరాక్రమ కార్యాల వల్ల ఇతడు ఎంతో ప్రసిద్ధికెక్కాడు. ఇతడు మోయాబు వాడు అరీయేలు కొడుకులిద్దర్నీ చంపాడు. ఇంకా ఇతడు మంచు పడే కాలంలో ఒక బిలంలోకి దిగి అక్కడ ఒక సింహాన్ని చంపివేశాడు.

1 దినవృత్తాంతాలు 11:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకసారి ఇతను ఏడున్నర అడుగుల ఎత్తున్న ఒక ఐగుప్తీయున్నిచంపాడు. ఆ ఐగుప్తీయుడి చేతిలో సాలెవాడి దండె అంత పెద్ద ఈటె ఉంది. బెనాయా వాడి మీదికి ఒక కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆ ఈటెను ఐగుప్తీయుడి చేతిలోనుండి లాక్కుని దానితోనే వాణ్ణి చంపివేశాడు.

1 దినవృత్తాంతాలు 11:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇలాంటి ఘన కార్యాలు చేసిన యెహోయాదా కొడుకైన బెనాయా పేరు ఆ ముగ్గురు బలవంతుల పేర్లలో చేర్చారు.

1 దినవృత్తాంతాలు 11:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముప్ఫై మంది సైనికుల్లో అతణ్ణి గొప్పవాడిగా ఎంచారు, కానీ పేరు మోసిన ఆ ముగ్గురు వీరులకు సాటి కాలేదు. కానీ దావీదు ఇతణ్ణి అంగ రక్షకులపై అధిపతిగా నియమించాడు.

1 దినవృత్తాంతాలు 11:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ యోధులు ఎవరంటే యోవాబు తమ్ముడు అశాహేలు, బేత్లెహేము ఊరివాడు దోదో కొడుకైన ఎల్హానాను,

1 దినవృత్తాంతాలు 11:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,

1 దినవృత్తాంతాలు 11:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెకోవీయుడైన ఇక్కేషు కొడుకైన ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,

1 దినవృత్తాంతాలు 11:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,

1 దినవృత్తాంతాలు 11:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కొడుకు హేలెదు,

1 దినవృత్తాంతాలు 11:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీను సంతతికి చెందిన గిబియా ఊరివాడు రీబై కొడుకు ఈతయి, పిరాతోనీయుడు బెనాయా,

1 దినవృత్తాంతాలు 11:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాయషు లోయకు చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,

1 దినవృత్తాంతాలు 11:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బహరూమీయుడు అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాహ్బా,

1 దినవృత్తాంతాలు 11:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గిజోనీయుడైన హాషేము కొడుకులూ, హరారీయుడైన షాగే కొడుకైన యోనాతాను,

1 దినవృత్తాంతాలు 11:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హరారీయుడైన శాకారు కొడుకైన అహీయాము, ఊరు కొడుకు ఎలీపాలు,

1 దినవృత్తాంతాలు 11:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,

1 దినవృత్తాంతాలు 11:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కొడుకైన నయరై,

1 దినవృత్తాంతాలు 11:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,

1 దినవృత్తాంతాలు 11:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కొడుకైన యోవాబు ఆయుధాలు మోసేవాడూ బెరోతీయుడూ అయిన నహరై,

1 దినవృత్తాంతాలు 11:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

1 దినవృత్తాంతాలు 11:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కొడుకైన జాబాదు,

1 దినవృత్తాంతాలు 11:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రూబేనీయుడైన షీజా కొడుకూ, రూబేనీయులకు నాయకుడూ అయిన అదీనా, అతని తోటి వారైన ముప్ఫై మందీ,

1 దినవృత్తాంతాలు 11:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మయకా కొడుకైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు,

1 దినవృత్తాంతాలు 11:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కొడుకులు షామా యెహీయేలు,

1 దినవృత్తాంతాలు 11:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిమ్రీ కొడుకైన యెదీయవేలు, అతని సోదరుడూ, తిజీయుడూ అయిన యోహా,

1 దినవృత్తాంతాలు 11:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కొడుకులైన యెరీబై యోషవ్యా, మోయాబు వాడు ఇత్మా,

1 దినవృత్తాంతాలు 11:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలీయేలు, ఓబేదు, మెజోబాయా ఊరివాడు యహశీయేలు అనే వాళ్ళు.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Chronicles 11 (ASV) »
King James Version (KJV)
1 Chronicles 11 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 11 (GW) »
Berean Bible (BSB)
1 Chronicles 11 (BSB) »
World English Bible (WEB)
1 Chronicles 11 (WEB) »
French Bible (LSG)
1 Chroniques 11 (LSG) »
German Bible (LUTH1912)
1 Chronik 11 (LUTH1912) »
Arabic Bible (AVD)
١ أخبار 11 (AVD) »
Portuguese Bible (BSL)
1 Crônicas 11 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sử Ký 11 (VIE) »
Spanish Bible (RVA)
1 Crónicas 11 (RVA) »
Italian Bible (RIV)
1 Cronache 11 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 上 11 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 上 11 (CUVT) »
Albanian Bible (ALB)
1 Kronikave 11 (ALB) »
Swedish Bible (SV1917)
1 Krönikeboken 11 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 хроніки 11 (UKR) »
Hungarian Bible (KAR)
1 Krónika 11 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Летописи 11 (BULG) »
Japanese Bible (JPN)
歴代志上 11 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Krønikebok 11 (NORSK) »

1 దినవృత్తాంతాలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List