1 సమూయేలు Chapter 18 TELIRV Bible Verse Images

1 సమూయేలు 18 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 సమూయేలు 18 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 సమూయేలు 18:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తరువాత, యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకు పోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకుని అతణ్ణి ప్రేమించాడు.

1 సమూయేలు 18:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజు దావీదును అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయకుండా సౌలు తన దగ్గరే ఉంచుకున్నాడు.

1 సమూయేలు 18:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోనాతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు.

1 సమూయేలు 18:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోనాతాను తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.

1 సమూయేలు 18:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు, సౌలు తనను పంపిన ప్రతి చోటుకీ వెళ్ళి, తెలివిగా పనులు సాధించుకుంటూ వచ్చాడు. సౌలు తన సైన్యంలో అధిపతిగా అతణ్ణి నియమించాడు. ప్రజల దృష్టిలో, సౌలు సేవకుల దృష్టిలో దావీదు అనుకూలంగా ఉన్నాడు.

1 సమూయేలు 18:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు.

1 సమూయేలు 18:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ: “సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు.

1 సమూయేలు 18:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ పాట సౌలుకు నచ్చలేదు, అతనికి చాలా కోపం వచ్చింది. “వారు దావీదుకు పదివేలమంది అన్నారు కానీ నాకు వెయ్యిమందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు” అని మనసులో అనుకున్నాడు.

1 సమూయేలు 18:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పటినుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు.

1 సమూయేలు 18:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతి వాద్యం తీసుకుని వాయించాడు.

1 సమూయేలు 18:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటెతో దావీదును గోడకు గుచ్చేస్తాననుకుని ఆ ఈటెను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది తనకు తగలకుండా దావీదు రెండుసార్లు తప్పించుకున్నాడు.

1 సమూయేలు 18:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదు పట్ల భయం పెంచుకున్నాడు.

1 సమూయేలు 18:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకని సౌలు దావీదును తన దగ్గర ఉండకుండాా సైనికులకు నాయకుడుగా నియమించాడు. అతడు ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నాడు.

1 సమూయేలు 18:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదుకు యెహోవా తోడుగా ఉండడంవల్ల అన్ని విషయాల్లో తెలివితేటలతో ప్రవర్తిస్తూ వచ్చాడు.

1 సమూయేలు 18:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు మరింతగా అభివృద్ధి పొందడం సౌలు చూసి ఇంకా ఎక్కువగా భయపడ్డాడు.

1 సమూయేలు 18:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు ఇశ్రాయేలువారితో, యూదావారితో కలిసిమెలిసి ఉండడంవల్ల వారు అతణ్ణి ప్రేమించారు.

1 సమూయేలు 18:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు “నా చేతిలో అతడు చావకూడదు, ఫిలిష్తీయుల చేతిలో పడాలి” అనుకుని దావీదుతో “నా పెద్ద కూతురు మేరబు ఇదిగో. ఆమెను నీకు భార్యగా ఇస్తాను. కేవలం నీవు నా కోసం ధైర్యంగా ఉండి, యెహోవా యుద్ధాలు చేస్తూ ఉండు” అన్నాడు.

1 సమూయేలు 18:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు “రాజువైన నీకు అల్లుణ్ణి కావడానికి నేనెంతటివాణ్ణి? నా స్తోమతు ఎంతటిది? ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబం ఏపాటిది?” అని సౌలుతో అన్నాడు.

1 సమూయేలు 18:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే సౌలు తన కుమార్తె మేరబును దావీదుకు ఇచ్చి పెళ్లి చేయవలసి ఉండగా, ఆమెను మెహోల గ్రామం వాడైన అద్రీయేలుకు ఇచ్చి పెళ్లి చేశాడు.

1 సమూయేలు 18:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే సౌలు కూతురు మీకాలు దావీదును ప్రేమించింది. సౌలు అది విని సంతోషించాడు.

1 సమూయేలు 18:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఆమెను అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరి లాగా ఉంటుంది, ఫిలిష్తీయుల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది.” అని అనుకున్నాడు. సౌలు, రెండోసారి దావీదుతో “నువ్వు నా అల్లుడౌతున్నావు” అని చెప్పాడు.

1 సమూయేలు 18:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు తన సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి, ‘రాజుకు నువ్వంటే ఇష్టం కలిగింది. రాజు సేవకులంతా నీపట్ల స్నేహంగా ఉన్నారు. కాబట్టి నువ్వు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పండి.”

1 సమూయేలు 18:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు సేవకులు దావీదుతో మాట్లాడినప్పుడు అతడు “నేను పేదవాణ్ణి, పేరు ప్రఖ్యాతులు లేనివాణ్ణి. రాజుకు అల్లుడు కావడమంటే ఆది చిన్న విషయంగా మీకు అనిపిస్తుందా?” అని వారితో అన్నాడు.

1 సమూయేలు 18:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు అతనికి తెలియచేశారు.

1 సమూయేలు 18:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫిలిష్తీయుల చేతికి దావీదు చిక్కేలా చేయాలన్న తలంపుతో సౌలు “రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు, అయితే రాజు శత్రువులమీద పగతీర్చుకోవడానికి కేవలం వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి” అన్నాడు.

1 సమూయేలు 18:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు చెప్పినప్పుడు, రాజుకు అల్లుడు కావాలన్న కోరికతో

1 సమూయేలు 18:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గడువుకంటే ముందుగానే లేచి తన మనుషులతో వెళ్ళి ఫిలిష్తీయుల్లో 200 మందిని చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చి, రాజుకు అల్లుడు అయ్యేందుకు అవసరమైన లెక్క పూర్తిచేసి అప్పగించాడు. సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేశాడు.

1 సమూయేలు 18:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, తన కుమార్తె మీకాలు అతణ్ణి ప్రేమించడం చూసి,

1 సమూయేలు 18:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు దావీదు అంటే మరింత భయం పెంచుకున్నాడు, దావీదుపై శత్రుభావం పెంచుకున్నాడు.

1 సమూయేలు 18:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫిలిష్తీయ నాయకులు తరుచుగా యుద్ధానికి దండెత్తి వస్తూ ఉండేవారు. వారు దండెత్తినప్పుడల్లా దావీదు ఎక్కువ వివేకంతో ప్రవర్తించడం వల్ల సౌలు సేవకులందరికంటే అతని పేరు ఎంతో ప్రఖ్యాతి చెందింది.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Samuel 18 (ASV) »
King James Version (KJV)
1 Samuel 18 (KJV) »
GOD’S WORD® (GW)
1 Samuel 18 (GW) »
Berean Bible (BSB)
1 Samuel 18 (BSB) »
World English Bible (WEB)
1 Samuel 18 (WEB) »
French Bible (LSG)
1 Samuel 18 (LSG) »
German Bible (LUTH1912)
1 Samuel 18 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
1 ਸਮੂਏਲ 18 (PANIRV) »
Gujarati Bible (GUJIRV)
1 શમુએલ 18 (GUJIRV) »
Hebrew Bible (HEB)
שמואל א 18 (HEB) »
Portuguese Bible (BSL)
1 Samuel 18 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sa-mu-ên 18 (VIE) »
Spanish Bible (RVA)
1 Samuel 18 (RVA) »
Italian Bible (RIV)
1 Samuele 18 (RIV) »
Chinese Simplified (CUVS)
撒 母 耳 记 上 18 (CUVS) »
Chinese Traditional (CUVT)
撒 母 耳 記 上 18 (CUVT) »
Albanian Bible (ALB)
1 Samuelit 18 (ALB) »
Swedish Bible (SV1917)
1 Samuelsboken 18 (SV1917) »
Russian Bible (RUSV)
1 Царств 18 (RUSV) »
Hungarian Bible (KAR)
1 Sámuel 18 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Царе 18 (BULG) »
Norwegian Bible (NORSK)
1 Samuel 18 (NORSK) »

1 సమూయేలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List