1 సమూయేలు Chapter 14 TELIRV Bible Verse Images

1 సమూయేలు 14 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 సమూయేలు 14 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 సమూయేలు 14:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజున సౌలు కొడుకు యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పకుండా తన ఆయుధాలు మోసేవాణ్ణి పిలిచి “అటువైపు ఉన్న ఫిలిష్తీయుల సైన్యం కావలి వారిని చంపడానికి వెళ్దాం పద” అన్నాడు.

1 సమూయేలు 14:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు కింద డేరా వేసుకున్నాడు. అతని దగ్గర సుమారు ఆరు వందలమంది మనుషులు ఉన్నారు.

1 సమూయేలు 14:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిలోహులో యెహోవా యాజకుడైన ఏలీ కుమారుడు ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు సహోదరుడు అహీటూబుకు పుట్టిన అహీయా ఏఫోదు ధరించుకుని అక్కడ ఉన్నాడు. యోనాతాను వెళ్లిన విషయం ఎవ్వరికీ తెలియదు.

1 సమూయేలు 14:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోనాతాను ఫిలిష్తీయుల సైన్యానికి కావలి వారున్న స్థలానికి వెళ్ళాలనుకున్న దారికి రెండు ప్రక్కలా నిటారుగా ఉన్న కొండలు ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు బొస్సేసు, రెండవదాని పేరు సెనే.

1 సమూయేలు 14:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిక్మషుకు ఉత్తరంగా ఒక కొండ శిఖరం, రెండవ శిఖరం గిబియాకు ఎదురుగా దక్షిణం వైపున ఉన్నాయి.

1 సమూయేలు 14:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోనాతాను “ఈ సున్నతి లేనివారి శిబిరంపైకి వెళ్దాం పద. ఒకవేళ యెహోవా మన కార్యాన్ని సఫలం చేస్తాడేమో. అనేకమంది చేతనైనా, కొద్దిమంది చేతనైనా రక్షించడం యెహోవాకు అసాధ్యమా?” అని తన ఆయుధాలు మోసేవాడితో అన్నాడు.

1 సమూయేలు 14:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాడు “నీ మనస్సుకు తోచింది చెయ్యి. వెళ్దాం పద, నీకు నచ్చినట్టు చేయడానికి నేను నీతోపాటే ఉంటాను” అన్నాడు.

1 సమూయేలు 14:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యోనాతాను “మనం వారి దగ్గరికి వెళ్ళి వారు మనలను చూసేలా చేద్దాం.

1 సమూయేలు 14:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు మనలను చూసి, ‘మేము మీ దగ్గరికి వచ్చేవరకూ అక్కడే నిలిచి ఉండండి’ అని చెప్పినట్టైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మనం ఉన్న చోటే ఉండిపోదాం.

1 సమూయేలు 14:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘మా దగ్గరకి రండి’ అని వాళ్ళు పిలిస్తే దానివల్ల యెహోవా వారిని మన చేతికి అప్పగించాడని అర్థం చేసుకుని మనం వెళ్దాం” అని చెప్పాడు.

1 సమూయేలు 14:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిద్దరూ తమను తాము ఫిలిష్తీయుల సైన్యం కావలి వారికి కనపరచుకున్నారు. అప్పుడు ఫిలిష్తీయులు “చూడండి, దాక్కున్న గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వస్తున్నారు” అని చెప్పుకొంటూ,

1 సమూయేలు 14:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోనాతానును, అతని ఆయుధాలు మోసేవాడిని పిలిచి “మేము మీకు ఒకటి చూపిస్తాం రండి” అన్నారు. యోనాతాను “నా వెనకే రా, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించాడు” అని తన ఆయుధాలు మోసేవాడితో చెప్పి

1 సమూయేలు 14:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడూ, అతని వెనుక అతని ఆయుధాలు మోసేవాడూ తమ చేతులతో, కాళ్లతో పాకి పైకి ఎక్కారు. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడిపోగానే అతని వెనకాలే అతని ఆయుధాలు మోసేవాడు వారిని చంపివేశాడు.

1 సమూయేలు 14:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోనాతాను, అతని ఆయుధాలు మోసేవాడు చేసిన ఆ మొదటి సంహారంలో దాదాపు ఇరవై మంది చనిపోయారు. ఒక రోజులో ఒక కాడి యెడ్లు దున్నగలిగే అర ఎకరం నేల విస్తీర్ణంలో ఇది జరిగింది.

1 సమూయేలు 14:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సమూహంలో, పొలంలో ఉన్నవారందరిలో తీవ్రమైన ఆందోళన ఏర్పడింది. సైన్యానికి కావలివారు, దోచుకొనేవారూ భయపడ్డారు, నేల కంపించింది. ఇదంతా దేవుడు జరిగించిన పని అని వారు అనుకున్నారు.

1 సమూయేలు 14:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీనీయుల ప్రాంతమైన గిబియాలో ఉన్న సైనికులు చెదిరిపోయి పూర్తిగా ఓడిపోవడం సౌలు గూఢచారులు చూసి ఆ సమాచారం సౌలుకు తెలిపారు.

1 సమూయేలు 14:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు “మన దగ్గర లేనివాళ్ళెవరో తెలుసుకోడానికి అందరినీ లెక్కపెట్టండి” అని చెప్పాడు. వారు చూసి యోనాతాను, అతని ఆయుధాలు మోసేవాడు అక్కడ లేరని కనుగొన్నారు.

1 సమూయేలు 14:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సమయంలో దేవుని మందసం ఇశ్రాయేలీయుల దగ్గరే ఉంది. “దేవుని మందసాన్ని ఇక్కడికి తీసుకురండి” అని సౌలు అహీయాకు ఆజ్ఞాపించాడు.

1 సమూయేలు 14:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు యాజకునితో మాట్లాడుతుండగా, ఫిలిష్తీయుల శిబిరంలో అలజడి ఎక్కువ కాసాగింది. అప్పుడు సౌలు యాజకునితో “నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని చెప్పి

1 సమూయేలు 14:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడూ, అతనితో ఉన్నవారంతా కలిసి యుద్ధానికి బయలుదేరారు. వారిని చూసి ఫిలిష్తీయులు తికమకపడి ఒకరినొకరు చంపుకున్నారు.

1 సమూయేలు 14:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతకు ముందు ఫిలిష్తీయుల ఆధీనంలో చుట్టుపక్కల శిబిరాల్లో ఉన్న హెబ్రీయులు ఇశ్రాయేలీయులను కలుసుకోడానికి ఫిలిష్తీయులను విడిచిపెట్టి సౌలు దగ్గరకి, యోనాతాను దగ్గరకి వచ్చారు.

1 సమూయేలు 14:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతేకాక, ఫిలిష్తీయ సైన్యం పారిపోతున్నదని విని వారిని తరమడానికి ఎఫ్రాయిం కొండ ప్రాంతంలో దాక్కొన్న ఇశ్రాయేలీయులు యుద్ధంలో చేరారు.

1 సమూయేలు 14:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజున ఇశ్రాయేలీయులను యెహోవా ఈ విధంగా కాపాడాడు. యుద్ధం బేతావెను అవతల వరకూ సాగింది. ఇశ్రాయేలీయులు బాగా అలసిపోయారు.

1 సమూయేలు 14:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నేను నా శత్రువులపై పగ సాధించే వరకూ, సాయంత్రమయ్యే దాకా భోజనం చేసేవాడు శాపానికి గురి అవుతారు” అని సౌలు ప్రజల చేత ఒట్టు పెట్టించాడు. అందుకని ప్రజలు ఏమీ తినకుండా ఉన్నారు.

1 సమూయేలు 14:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సైన్యం మొత్తం అడవిలోకి వచ్చినప్పుడు ఒకచోట నేలమీద తేనె కనబడింది.

1 సమూయేలు 14:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆ అడవిలోకి వెళ్తున్నప్పుడు తేనె ధారగా కారుతూ ఉంది. తాము చేసిన ప్రమాణానికి లోబడి ఎవ్వరూ ఆ తేనె ముట్టుకోలేదు.

1 సమూయేలు 14:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యోనాతానుకు తన తండ్రి ప్రజలచేత చేయించిన ప్రమాణం గురించి తెలియదు. అతడు తన చేతికర్ర చాచి దాని అంచును తేనెపట్టులో ముంచి దాన్ని నోటిలో పెట్టుకోగానే అతని కళ్ళకు వెలుగు వచ్చింది.

1 సమూయేలు 14:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడి వారిలో ఒకడు “నీ తండ్రి ప్రజలచేత ఒట్టు పెట్టించి ‘ఈ రోజున ఆహారం తీసుకొనేవాడు కచ్చితంగా శాపానికి గురవుతాడు’ అని ఆజ్ఞాపించాడు. అందుకే ప్రజలు బాగా అలసిపోయారు” అని చెప్పాడు.

1 సమూయేలు 14:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు యోనాతాను “నా తండ్రి మనుషులను కష్టపెట్టిన వాడయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్ళు ఎంతగా వెలిగిపోయాయో చూడు.

1 సమూయేలు 14:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన మనుషులు శత్రువుల దగ్గర దోచుకున్నది బాగా తిని ఉంటే వారు ఇంకా ఎక్కువగా సంహరించేవాళ్ళు గదా” అన్నాడు.

1 సమూయేలు 14:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజు ఇశ్రాయేలు వారు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకూ తరిమి హతం చేసినందువల్ల బాగా అలసిపోయారు.

1 సమూయేలు 14:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు దోపిడీ సొమ్ము మీద ఎగబడి, గొర్రెలను, ఎద్డులను, దూడలను నేలమీద పడవేసి వాటిని వధించి రక్తంతోనే తిన్నారు.

1 సమూయేలు 14:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ప్రజలు రక్తంతోనే తిని యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు” అని కొందరు సౌలుకు చెప్పినప్పుడు అతడు “మీరు దేవునికి విశ్వాస ఘాతకులయ్యారు. ఒక పెద్ద రాయి నా దగ్గరకి దొర్లించి తీసుకురండి” అని చెప్పి,

1 సమూయేలు 14:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అందరూ తమ తమ ఎద్దులను, గొర్రెలను నా దగ్గరికి తీసుకు వచ్చి ఇక్కడే వధించి వాటిని తినాలి. రక్తంతో కలసిన మాసం తిని యెహోవా దృష్టిలో పాపం చేయవద్దు” అని వారితో చెప్పడానికి అతడు కొంతమందిని పంపించాడు. ప్రజలంతా ఆ రాత్రి తమ తమ ఎద్దులను తెచ్చి అక్కడ వధించారు.

1 సమూయేలు 14:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ సౌలు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించాడు. అతడు యెహోవాకు కట్టించిన మొదటి బలిపీఠం అదే.

1 సమూయేలు 14:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు “మనం ఈ రాత్రి ఫిలిష్తీయులను తరుముతూ తెల్లవారేదాకా దోచుకుని వాళ్ళలో ఒక్కడు కూడా లేకుండా చేద్దాం రండి” అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారంతా “నీకు ఏది మంచిదని అనిపిస్తే దాన్ని చెయ్యి” అని అన్నారు. అప్పుడు సౌలు “యాజకుడు ఇక్కడే ఉన్నాడు, అతని ద్వారా దేవుని దగ్గర విచారణ చేద్దాం రండి” అని చెప్పాడు.

1 సమూయేలు 14:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు “నేను ఫిలిష్తీయులను వెంబడిస్తే వారిని నీవు ఇశ్రాయేలీయుల చేతికి అప్పగిస్తావా” అని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఆ రోజున ఆయన అతనికి ఎలాంటి జవాబు ఇయ్యలేదు.

1 సమూయేలు 14:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు సౌలు “ప్రజల పెద్దలు నా దగ్గరకి వచ్చి ఈ రోజు ఎవరి ద్వారా తప్పిదం జరిగిందో దాన్ని కనుక్కోవాలి.

1 సమూయేలు 14:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది నా కొడుకు యోనాతాను వల్ల జరిగినా సరే, వాడు తప్పకుండా చనిపోతాడని ఇశ్రాయేలీయులను కాపాడే యెహోవా తోడని నేను ఒట్టు పెడుతున్నాను” అని చెప్పాడు. అయితే అక్కడ ఉన్నవారిలో ఎవ్వరూ సమాధానం చెప్పలేదు.

1 సమూయేలు 14:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీరంతా ఒక పక్కన ఉండండి, నేనూ, నా కొడుకు యోనాతానూ మరో పక్కన నిలబడతాం” అని సౌలు చెప్పినప్పుడు, వారంతా “నీ మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి” అన్నారు.

1 సమూయేలు 14:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు సౌలు “ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, తప్పు చేసినది ఎవరో చూపించు” అని ప్రార్థించినపుడు సౌలు, యోనాతానుల పేరున చీటీ పడింది. ప్రజలు తప్పించుకున్నారు.

1 సమూయేలు 14:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నాకూ నా కొడుకు యోనాతానుకూ మధ్య చీటీ వేయండి” అని సౌలు ఆజ్ఞ ఇచ్చినప్పుడు చీటీ యోనాతాను పేరున పడింది.

1 సమూయేలు 14:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నువ్వు చేసిన పని ఏమిటో నాకు తెలియజేయి” అని యోనాతానును అడిగినప్పుడు, యోనాతాను “నా చేతికర్ర అంచుతో కొంచెం తేనె తీసుకుని తిన్న విషయం నిజమే, కొంచెం తేనె కోసం నేను చనిపోవలసి వచ్చింది” అని సౌలుతో అన్నాడు.

1 సమూయేలు 14:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు సౌలు “యోనాతానూ, నీవు తప్పకుండా చనిపోవాలి. అందుకు నేను ఒప్పుకోకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలిగిస్తాడు” అన్నాడు.

1 సమూయేలు 14:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ప్రజలు సౌలుతో “మనకు ఇంత గొప్ప విజయం కలిగేలా చేసిన యోనాతాను చనిపోవాలా? అది ఎన్నటికీ జరగకూడదు. దేవుని సహాయంతోనే ఈ రోజు యోనాతాను మనకు జయం లభించేలా చేశాడు. యెహోవా దేవునిపై ఒట్టు. అతని తలవెండ్రుకల్లో ఒక్కటైనా కింద పడకూడదు” అని చెప్పి యోనాతాను మరణించకుండా అతణ్ణి కాపాడారు.

1 సమూయేలు 14:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత సౌలు ఫిలిష్తీయులను తరమడం మానివేసి తిరిగి వెళ్లిపోయాడు, ఫిలిష్తీయులు తమ స్వదేశానికి వెళ్ళిపోయారు.

1 సమూయేలు 14:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా సౌలు ఇశ్రాయేలీయులను పాలించడానికి అధికారం పొంది, నలు దిక్కులా ఉన్న శత్రువులైన మోయాబీయులతో, అమ్మోనీయులతో, ఎదోమీయులతో, సోబా దేశపు రాజులతో, ఫిలిష్తీయులతో యుద్ధాలు జరిగించాడు. అతడు ఎవరి మీదకు దండెత్తినా వారందరి పైనా గెలుపు సాధించాడు.

1 సమూయేలు 14:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన సైన్యంతో అమాలేకీయులను హతమార్చి వారు దోచుకుపోయిన ఇశ్రాయేలీయులను వారి చేతిలో నుండి విడిపించాడు.

1 సమూయేలు 14:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు కుమారుల పేర్లు యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ. అతని ఇద్దరు కుమార్తెల్లో పెద్దమ్మాయి పేరు మేరబు, రెండవది మీకాలు.

1 సమూయేలు 14:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు భార్య అహీనోయము. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి అబ్నేరు, ఇతడు సౌలు చిన్నాన్న నేరు కొడుకు.

1 సమూయేలు 14:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు తండ్రి కీషు, అబ్నేరు తండ్రి నేరు, ఇద్దరూ అబీయేలు కుమారులు.

1 సమూయేలు 14:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు జీవించిన కాలమంతా ఫిలిష్తీయులతో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. సౌలు తనకు తారసపడ్డ బలాఢ్యులను, వీరులను చేరదీసి తన సైన్యంలో చేర్చుకున్నాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Samuel 14 (ASV) »
King James Version (KJV)
1 Samuel 14 (KJV) »
GOD’S WORD® (GW)
1 Samuel 14 (GW) »
Berean Bible (BSB)
1 Samuel 14 (BSB) »
World English Bible (WEB)
1 Samuel 14 (WEB) »
French Bible (LSG)
1 Samuel 14 (LSG) »
German Bible (LUTH1912)
1 Samuel 14 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
1 ਸਮੂਏਲ 14 (PANIRV) »
Gujarati Bible (GUJIRV)
1 શમુએલ 14 (GUJIRV) »
Hebrew Bible (HEB)
שמואל א 14 (HEB) »
Portuguese Bible (BSL)
1 Samuel 14 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sa-mu-ên 14 (VIE) »
Spanish Bible (RVA)
1 Samuel 14 (RVA) »
Italian Bible (RIV)
1 Samuele 14 (RIV) »
Chinese Simplified (CUVS)
撒 母 耳 记 上 14 (CUVS) »
Chinese Traditional (CUVT)
撒 母 耳 記 上 14 (CUVT) »
Albanian Bible (ALB)
1 Samuelit 14 (ALB) »
Swedish Bible (SV1917)
1 Samuelsboken 14 (SV1917) »
Russian Bible (RUSV)
1 Царств 14 (RUSV) »
Hungarian Bible (KAR)
1 Sámuel 14 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Царе 14 (BULG) »
Norwegian Bible (NORSK)
1 Samuel 14 (NORSK) »

1 సమూయేలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List