1 సమూయేలు Chapter 25 TELIRV Bible Verse Images

1 సమూయేలు 25 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 సమూయేలు 25 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 సమూయేలు 25:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా సమావేశమై అతని కోసం ఏడ్చారు. రమాలో ఉన్న అతని సొంత ఇంట్లో సమాధి చేశారు. తరువాత దావీదు లేచి పారాను అరణ్య ప్రాంతానికి వెళ్లిపోయాడు.

1 సమూయేలు 25:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మాయోను గ్రామంలో ఒకడున్నాడు. అతని ఆస్తిపాస్తులన్నీ కర్మెలులో ఉన్నాయి. అతడు చాలా ధనవంతుడు, అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు.

1 సమూయేలు 25:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈమె జ్ఞానం గలదీ, అందగత్తే. అయితే అతడు మాత్రం మొరటు వాడు, తన వ్యవహారాలన్నిటిలో దుర్మార్గుడు. అతడు కాలేబు సంతతివాడు.

1 సమూయేలు 25:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాబాలు గొర్రెలబొచ్చు కత్తిరిస్తున్నాడని ఎడారిలో ఉన్న దావీదు విన్నాడు.

1 సమూయేలు 25:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన దగ్గరున్న వారిలో పదిమంది యువకులను పిలిచి వారితో ఇలా అన్నాడు. “మీరు కర్మెలుకు నాబాలు దగ్గరికి పోయి, నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి

1 సమూయేలు 25:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ధనికునితో ఇలా అనండి. మీరు వర్ధిల్లుతారు గాక. మీకూ మీ ఇంటికీ మీ ఆస్తిపాస్తులకూ క్షేమం ఉండాలి.

1 సమూయేలు 25:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీతో గొర్రెబొచ్చు కత్తిరించే వారున్నారని నాకు తెలిసింది. మీ గొర్రెల కాపరులు మా దగ్గరున్నప్పుడు మేము వారికి ఏ కీడూ తలపెట్టలేదు. వారు కర్మెలు ప్రాంతంలో ఉన్నంతకాలం వారేదీ పోగొట్టుకోలేదు.

1 సమూయేలు 25:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పనివారిని అడగండి, వారే చెబుతారు. కాబట్టి నేను పంపిన కుర్రాళ్ళకు దయ చూపండి. మేము పండగ పూట వచ్చాం గదా. మీ మనసుకు తోచింది మీ దాసులకు, మీ కుమారుడు దావీదుకు ఇచ్చి పంపండి.”

1 సమూయేలు 25:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు పంపిన యువకులు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చున్నారు.

1 సమూయేలు 25:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు సేవకులతో నాబాలు “దావీదు ఎవడు? యెష్షయి కొడుకెవడు? ఈ రోజుల్లో తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు చాలా మంది ఉన్నారు.

1 సమూయేలు 25:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా అన్నపానాలను, నా గొర్రెల బొచ్చు కత్తిరించే వారికోసం సిద్ధపరచిన నా మాంసాన్ని, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని వాడికి ఇవ్వాలా?” అన్నాడు.

1 సమూయేలు 25:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు కుర్రాళ్ళు తిరుగు ముఖం పట్టి, వచ్చి ఈ మాటలన్నీ అతనికి చెప్పారు.

1 సమూయేలు 25:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు దావీదు వారితో “మీరంతా నడుముకు కత్తులు ధరించుకోండి” అని చెప్పాడు. వారు కత్తులు ధరించుకున్నారు. దావీదు కూడా ఒక కత్తి ధరించాడు. దావీదుతో పాటు దాదాపు 400 మంది బయలుదేరారు. 200 మంది సామాను దగ్గర ఉన్నారు.

1 సమూయేలు 25:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పనివాడొకడు నాబాలు భార్య అబీగయీలుతో “అమ్మా, మన అయ్యగారిని కుశల ప్రశ్నలు అడగడానికి దావీదు అరణ్యంలో నుండి మనుషులను పంపాడు. ఆయన వారితో కఠినంగా మాట్లాడాడు.

1 సమూయేలు 25:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారం చేసిన వాళ్ళు. మేము గడ్డి మైదానాల్లో వారి మధ్య ఉన్నంత కాలమూ ప్రమాదం గానీ నష్టం గాని మాకు కలగలేదు.

1 సమూయేలు 25:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేము గొర్రెలను కాచుకొంటూ ఉన్నంత కాలం వారు పగలూ రాత్రీ మా చుట్టూ ప్రాకారం లాగా ఉండేవారు.

1 సమూయేలు 25:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఇప్పుడు మా యజమానికీ అతని ఇంటివారందరికీ వాళ్ళు కీడు తలపెట్టారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించు. మన అయ్యగారు పనికిమాలిన దుష్టుడు, ఎవరి మాటా వినడు.”

1 సమూయేలు 25:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పకుండా గబగబా 200 రొట్టెలు, రెండు ద్రాక్షారసం తిత్తులు, వండిన ఐదు గొర్రెల మాంసం, ఐదు మానికల వేయించిన ధాన్యం, 100 ఎండు ద్రాక్షగెలలు, 200 అంజూరు పండ్ల ముద్దలు గాడిదలకెక్కించి

1 సమూయేలు 25:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన పనివాళ్ళతో “మీరు నాకంటే ముందుగా వెళ్ళండి., నేను మీ వెనుక వస్తాను” అని చెప్పింది.

1 సమూయేలు 25:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె గాడిద ఎక్కి కొండ లోయలోబడి వస్తుంటే దావీదు, అతని మనుషులు ఆమెకు ఎదురుపడ్డారు. ఆమె వారిని కలుసుకుంది.

1 సమూయేలు 25:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతకుముందు దావీదు “నాబాలు ఆస్తిపాస్తులన్నింటిలో ఏదీ పోకుండా ఈ అడివి ప్రాంతంలో అతని ఆస్తి అంతటికీ నేను అనవసరంగా కాపలా కాశాను. అతడు మాత్రం ఉపకారానికి ప్రతిగా నాకు అపకారం చేశాడు గదా”

1 సమూయేలు 25:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అనుకుని “అతనికి చెందిన వారిలో ఒక మగపిల్లవాడి నైనా తెల్లవారే సరికి ఉండయ్యను. లేదా దేవుడు మరి గొప్ప అపాయం దావీదు శత్రువులకు కలుగజేయుగాక” అని శపథం చేశాడు.

1 సమూయేలు 25:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీగయీలు దావీదును చూసి, గాడిద మీదనుంచి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలపై బడి ఇలా అంది.

1 సమూయేలు 25:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ప్రభూ, ఈ అపరాధం నాదిగా ఎంచు. నీ దాసినైన నన్ను మాటలాడనియ్యి, నీ దాసినైన నేను చెప్పేమాటలు ఆలకించు.

1 సమూయేలు 25:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయ్యా, దుష్టుడైన ఈ నాబాలును పట్టించుకోవద్దు. అతడు అతని పేరుకు తగిన వాడే. అతనిపేరు నాబాలు కదా, మోటుతనం అతని లక్షణం. నా ప్రభువైన మీరు పంపించిన కుర్రాళ్ళు నీ దాసినైన నాకు కనబడలేదు.

1 సమూయేలు 25:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రభూ, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, రక్తపాతం జరిగించకుండా, నీవే స్వయంగా పగ తీర్చుకోకుండా యెహోవా నిన్ను ఆపాడు. నీ శత్రువులు, నా యేలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించే వారందరికీ నాబాలుకు పట్టే గతే పట్టాలి అని యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు అని ప్రమాణం చేస్తున్నాను.”

1 సమూయేలు 25:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇప్పుడు నేను నా యేలినవాడవైన నీకోసం నీ దాసి తెచ్చిన ఈ కానుకను నా యేలినవాడవైన నిన్ను ఆశ్రయించి ఉన్న పనివారికి ఇప్పించు.

1 సమూయేలు 25:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ దాసినైన నా తప్పు క్షమించు. నా యేలినవాడవైన నీవు, యెహోవా యుద్ధాలు చేస్తున్నావు గనక నా యేలినవాడవైన నీకు ఆయన శాశ్వతమైన రాజ వంశాన్ని ఇస్తాడు. నీ జీవిత కాలమంతటా నీకు అపాయం కలుగదు.

1 సమూయేలు 25:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిన్ను హింసించడానికైనా, నీ ప్రాణం తీయడానికైనా ఎవడైనా పూనుకుంటే, నా యేలినవాడవైన నీ ప్రాణాన్ని నీ దేవుడైన యెహోవా తన దగ్గరున్న జీవపుమూటలో భద్రపరుస్తాడు. ఒకడు వడిసెలతో రాయి విసరినట్టు ఆయన నీ శత్రువుల ప్రాణాలు విసిరేస్తాడు.

1 సమూయేలు 25:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నా యేలినవాడవైన నిన్ను గురించిసెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నియమిస్తాడు. ఆ తరువాత

1 సమూయేలు 25:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు అకారణంగా రక్తం చిందించినందుకూ పగ తీర్చుకొన్నందుకూ మనోవేదన, పరితాపం నా యేలినవాడవైన నీకు ఎంతమాత్రం కలగకూడదు. యెహోవా నా యేలినవాడవైన నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసినైన నన్ను జ్ఞాపకం చేసుకో” అంది.

1 సమూయేలు 25:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు దావీదు అబీగయీలుతో “నాకు ఎదురు రావడానికి నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తుతి.

1 సమూయేలు 25:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను పగ తీర్చుకోకుండా ఈ రోజున రక్తపాతం చేయకుండా నన్ను వివేకంతో ఆపినందుకు నీకు ఆశీర్వాదం కలుగు గాక.

1 సమూయేలు 25:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకవేళ ఈ రోజు నీవు త్వరగా నన్ను ఎదుర్కొనక పోయినట్టయితే, నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవం పైన ఆన బెట్టి చెబుతున్నాను, తెల్లవారేలోగా నాబాలుకు మగవాడొకడు కూడా మిగిలేవాడు కాదు” అని చెప్పాడు.

1 సమూయేలు 25:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకు “నీ మాటలు నేను విన్నాను, నీ విన్నపం అంగీకరించాను. నిశ్చింతగా నీ ఇంటికి వెళ్ళు” అని ఆమెతో చెప్పాడు.

1 సమూయేలు 25:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరికి వచ్చినప్పుడు, రాజుల్లాగా అతడు ఇంట్లో విందు చేసి, తప్ప తాగుతూ కులుకుతూ మత్తుగా ఉన్నాడు. అందుకని తెల్లవారే వరకూ ఆమె అతనితో ఏమాటా చెప్పలేదు.

1 సమూయేలు 25:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉదయాన నాబాలు మత్తు దిగిన తరువాత అతని భార్య అతనితో ఆ విషయం చెప్పగానే భయంతో అతని గుండె పగిలింది. అతడు రాయి లాగా బిగుసుకు పోయాడు.

1 సమూయేలు 25:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పది రోజుల తరువాత యెహోవా నాబాలును దెబ్బ తీయగా అతడు చనిపోయాడు.

1 సమూయేలు 25:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాబాలు చనిపోయాడని దావీదు విని “నాబాలు చేసిన కీడును యెహోవా అతని తలమీదికే రప్పించాడు. ఆయన సేవకుడినైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి, నాబాలు వలన నేను పొందిన అవమానం తీర్చిన యెహోవాకు స్తుతి కలుగు గాక” అన్నాడు. తరవాత దావీదు అబీగయీలును తాను పెళ్లి చేసుకోవాలని ఆమెతో మాటలాడడానికి తన వారిని పంపాడు.

1 సమూయేలు 25:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు సేవకులు కర్మెలులో అబీగయీలు దగ్గరికి వచ్చి “దావీదు నిన్ను పెళ్లి చేసుకోడానికి తీసుకు రమ్మని మమ్మల్ని పంపించాడు” అని చెప్పారు.

1 సమూయేలు 25:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె లేచి సాగిలపడి “నా స్వామి ఇష్టం. నా యేలినవాని సేవకుల కాళ్లు కడగడానికైనా నా యేలినవాని దాసీనైన నేను సిద్దం” అని చెప్పింది.

1 సమూయేలు 25:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె త్వరగా లేచి గాడిదనెక్కి ఐదుగురు పనికత్తెలు వెంట రాగా దావీదు పంపిన దూతలవెంట వెళ్ళింది. దావీదు ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

1 సమూయేలు 25:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు యెజ్రెయేలు వాసి అహీనోయమును కూడా పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ అతనికి భార్యలయ్యారు.

1 సమూయేలు 25:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సౌలు కూతురు మీకాలు దావీదు భార్య. సౌలు ఆమెను గల్లీము ఊరివాడైన లాయీషు కొడుకు పల్తీయేలుకు ఇచ్చాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Samuel 25 (ASV) »
King James Version (KJV)
1 Samuel 25 (KJV) »
GOD’S WORD® (GW)
1 Samuel 25 (GW) »
Berean Bible (BSB)
1 Samuel 25 (BSB) »
World English Bible (WEB)
1 Samuel 25 (WEB) »
French Bible (LSG)
1 Samuel 25 (LSG) »
German Bible (LUTH1912)
1 Samuel 25 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
1 ਸਮੂਏਲ 25 (PANIRV) »
Gujarati Bible (GUJIRV)
1 શમુએલ 25 (GUJIRV) »
Hebrew Bible (HEB)
שמואל א 25 (HEB) »
Portuguese Bible (BSL)
1 Samuel 25 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sa-mu-ên 25 (VIE) »
Spanish Bible (RVA)
1 Samuel 25 (RVA) »
Italian Bible (RIV)
1 Samuele 25 (RIV) »
Chinese Simplified (CUVS)
撒 母 耳 记 上 25 (CUVS) »
Chinese Traditional (CUVT)
撒 母 耳 記 上 25 (CUVT) »
Albanian Bible (ALB)
1 Samuelit 25 (ALB) »
Swedish Bible (SV1917)
1 Samuelsboken 25 (SV1917) »
Russian Bible (RUSV)
1 Царств 25 (RUSV) »
Hungarian Bible (KAR)
1 Sámuel 25 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Царе 25 (BULG) »
Norwegian Bible (NORSK)
1 Samuel 25 (NORSK) »

1 సమూయేలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List