విలాపవాక్యాలు Chapter 3 TELIRV Bible Verse Images

విలాపవాక్యాలు 3 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share విలాపవాక్యాలు 3 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


విలాపవాక్యాలు 3:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను యెహోవా ఆగ్రహదండం వల్ల బాధ అనుభవించిన వాణ్ణి.

విలాపవాక్యాలు 3:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు.

విలాపవాక్యాలు 3:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిజంగా ఆయన నా మీద తిరగబడ్డాడు. రోజంతా నన్ను శిక్షిస్తున్నాడు.

విలాపవాక్యాలు 3:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నా మాంసం, నా చర్మం చీకిపోయేలా చేస్తున్నాడు, నా ఎముకలను విరగ్గొట్టాడు.

విలాపవాక్యాలు 3:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాకు విరుద్ధంగా ముట్టడి కంచె నిర్మించాడు. క్రూరత్వం, కష్టం నా చుట్టూ ఉంచాడు.

విలాపవాక్యాలు 3:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉండే చీకటి తావుల్లో నేను ఉండేలా చేశాడు.

విలాపవాక్యాలు 3:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నా చుట్టూ గోడ కట్టాడు. నేను తప్పించుకోలేను. నా సంకెళ్ళు బరువుగా చేశాడు.

విలాపవాక్యాలు 3:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు.

విలాపవాక్యాలు 3:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నా దారికి అడ్డంగా చెక్కుడు రాళ్ళ గోడలను ఉంచాడు. నేను ఎక్కడికి తిరిగినా నాకు దారి కనిపించలేదు.

విలాపవాక్యాలు 3:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా పాలిట ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలా ఉన్నాడు. దాగి ఉన్న సింహంలా ఉన్నాడు.

విలాపవాక్యాలు 3:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాకు దారి లేకుండా చేసి నన్ను చీల్చి చెండాడి నాకు దిక్కు లేకుండా చేశాడు.

విలాపవాక్యాలు 3:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విల్లు ఎక్కుపెట్టి బాణానికి గురిగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు.

విలాపవాక్యాలు 3:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు.

విలాపవాక్యాలు 3:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రజలందరికీ నేను నవ్వులాటగా ఉన్నాను. ప్రతి రోజూ వాళ్ళు నా గురించి ఆక్షేపణ పాటలు పాడుతున్నారు.

విలాపవాక్యాలు 3:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చేదు పదార్ధాలు ఆయన నాకు తినిపించాడు. విష ద్రావకంతో నన్ను మత్తెక్కేలా చేశాడు.

విలాపవాక్యాలు 3:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాళ్లతో నా పళ్ళు విరగ్గొట్టాడు. బూడిదలోకి నన్ను అణగ దొక్కాడు.

విలాపవాక్యాలు 3:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు.

విలాపవాక్యాలు 3:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నేను “నా శోభ అంతరించి పోయింది, యెహోవాలో నాకు ఇంక ఆశ మిగల లేదు” అనుకున్నాను.

విలాపవాక్యాలు 3:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను.

విలాపవాక్యాలు 3:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను.

విలాపవాక్యాలు 3:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.

విలాపవాక్యాలు 3:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

విలాపవాక్యాలు 3:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు. నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!

విలాపవాక్యాలు 3:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.

విలాపవాక్యాలు 3:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.

విలాపవాక్యాలు 3:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది.

విలాపవాక్యాలు 3:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది.

విలాపవాక్యాలు 3:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగానూ, మౌనంగానూ కూర్చుని ఉండాలి.

విలాపవాక్యాలు 3:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకవేళ నిరీక్షణ కలుగవచ్చేమో గనుక అతడు బూడిదలో తన మూతి పెట్టుకోవాలి.

విలాపవాక్యాలు 3:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తనను కొట్టేవాడివైపు తన చెంపను తిప్పాలి. అతడు పూర్తిగా అవమానంతో నిండి ఉండాలి.

విలాపవాక్యాలు 3:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు.

విలాపవాక్యాలు 3:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు.

విలాపవాక్యాలు 3:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు.

విలాపవాక్యాలు 3:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేశంలో బందీలుగా ఉన్నవాళ్ళందరినీ కాళ్ల కింద తొక్కడం,

విలాపవాక్యాలు 3:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మహోన్నతుని సన్నిధిలో మనుషులకు న్యాయం దొరకక పోవడం,

విలాపవాక్యాలు 3:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా?

విలాపవాక్యాలు 3:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు ఆజ్ఞలేకుండా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చ గలవాడెవడు?

విలాపవాక్యాలు 3:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా?

విలాపవాక్యాలు 3:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బతికున్న వాళ్ళల్లో ఎవరికైనా తమ పాపాలకు శిక్ష వేస్తే మూలగడం ఎందుకు?

విలాపవాక్యాలు 3:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం.

విలాపవాక్యాలు 3:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం.

విలాపవాక్యాలు 3:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు.

విలాపవాక్యాలు 3:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు.

విలాపవాక్యాలు 3:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘంతో నిన్ను నువ్వు కప్పుకొన్నావు.

విలాపవాక్యాలు 3:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జాతుల మధ్య మమ్మల్ని విడనాడి, పనికిరాని చెత్తగా చేశావు.

విలాపవాక్యాలు 3:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా శత్రువులందరూ మమ్మల్ని చూసి నోరు తెరిచి ఎగతాళి చేశారు.

విలాపవాక్యాలు 3:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి.

విలాపవాక్యాలు 3:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రజల కుమారికి కలిగిన నాశనం నేను చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతోంది.

విలాపవాక్యాలు 3:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ,

విలాపవాక్యాలు 3:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా కన్నీరు ఆగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది.

విలాపవాక్యాలు 3:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా పట్టణపు ఆడపిల్లలందరినీ చూస్తూ నా కళ్ళకు తీవ్రమైన బాధ కలుగుతోంది.

విలాపవాక్యాలు 3:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు పక్షిని తరిమినట్టు నా శత్రువులు అకారణంగా నన్ను కనికరం లేకుండా తరిమారు.

విలాపవాక్యాలు 3:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు నన్ను బావిలో పడేసి నా మీద రాయిని పెట్టారు.

విలాపవాక్యాలు 3:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను.

విలాపవాక్యాలు 3:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, అగాధమైన గుంటలోనుంచి నేను నీ నామాన్ని పిలిచాను.

విలాపవాక్యాలు 3:56 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సాయం కోసం నేను మొర్ర పెట్టినప్పుడు నీ చెవులు మూసుకోవద్దు అని నేనన్నప్పుడు, నువ్వు నా స్వరం ఆలకించావు.

విలాపవాక్యాలు 3:57 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో “భయపడవద్దు” అని చెప్పావు.

విలాపవాక్యాలు 3:58 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు.

విలాపవాక్యాలు 3:59 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు.

విలాపవాక్యాలు 3:60 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు చేసే ఆలోచనలన్నీ నీకు తెలుసు.

విలాపవాక్యాలు 3:61 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు, వాళ్ళు పలికే దూషణ నువ్వు విన్నావు.

విలాపవాక్యాలు 3:62 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా మీదికి లేచిన వాళ్ళు పలికే మాటలు, రోజంతా వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు నీకు తెలుసు.

విలాపవాక్యాలు 3:63 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, వాళ్ళు కూర్చున్నా లేచినా, వాళ్ళు ఎగతాళిగా పాడే పాటలకు నేనే గురి.

విలాపవాక్యాలు 3:64 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు.

విలాపవాక్యాలు 3:65 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళ గుండెల్లో భయం పుట్టిస్తావు. వాళ్ళను శపిస్తావు.

విలాపవాక్యాలు 3:66 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, ఉగ్రతతో వాళ్ళను వెంటాడుతావు. ఆకాశం కింద ఉండకుండాా వాళ్ళను నాశనం చేస్తావు.

Available Bible Translations

American Standard Version (ASV)
Lamentations 3 (ASV) »
King James Version (KJV)
Lamentations 3 (KJV) »
GOD’S WORD® (GW)
Lamentations 3 (GW) »
Berean Bible (BSB)
Lamentations 3 (BSB) »
World English Bible (WEB)
Lamentations 3 (WEB) »
French Bible (LSG)
Lamentations 3 (LSG) »
German Bible (LUTH1912)
Klagelieder 3 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਵਿਰਲਾਪ 3 (PANIRV) »
Bengali Bible (BENIRV)
বিলাপ 3 (BENIRV) »
Hebrew Bible (HEB)
איכה 3 (HEB) »
Portuguese Bible (BSL)
Lamentações 3 (BSL) »
Vietnamese Bible (VIE)
Ai Ca 3 (VIE) »
Spanish Bible (RVA)
Lamentaciones 3 (RVA) »
Italian Bible (RIV)
Lamentazioni 3 (RIV) »
Chinese Simplified (CUVS)
耶 利 米 哀 歌 3 (CUVS) »
Chinese Traditional (CUVT)
耶 利 米 哀 歌 3 (CUVT) »
Albanian Bible (ALB)
Vajtimet 3 (ALB) »
Swedish Bible (SV1917)
Klagovisorna 3 (SV1917) »
Hungarian Bible (KAR)
Jeremiás siralmai 3 (KAR) »
Japanese Bible (JPN)
哀歌 3 (JPN) »
Norwegian Bible (NORSK)
Klagesangene 3 (NORSK) »

విలాపవాక్యాలు (TELIRV) Chapter Selection

1 2 3 4 5

TELIRV Book Selection List