లేవీకాండం Chapter 27 TELIRV Bible Verse Images

లేవీకాండం 27 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share లేవీకాండం 27 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


లేవీకాండం 27:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.

లేవీకాండం 27:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఎవరన్నా విశేషమైన మ్రొక్కుబడి చేస్తే నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లించాలి.

లేవీకాండం 27:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు నిర్ణయించవలసిన వెల ఇది. ఇరవై ఏళ్ళు మొదలు అరవై ఏళ్ల వయస్సు వరకూ పురుషుడికి పరిశుద్ధ స్థలం తులం లెక్క ప్రకారం ఏభై తులాల వెండి నిర్ణయించాలి.

లేవీకాండం 27:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్త్రీకి ముప్ఫై తులాలు నిర్ణయించాలి.

లేవీకాండం 27:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐదేళ్ళు మొదలు ఇరవై ఏళ్ల లోపలి వయస్సు గల పురుషుడికి ఇరవై తులాల వెలను, స్త్రీకి పది తులాల వెలను నిర్ణయించాలి.

లేవీకాండం 27:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక నెల మొదలు ఐదేళ్ళ లోపు వయస్సుగల పురుషుడికి ఐదు తులాల వెండి వెలను స్త్రీకి మూడు తులాల వెండి వెలను నిర్ణయించాలి.

లేవీకాండం 27:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అరవై ఏళ్ల వయసు దాటిన పురుషుడికి పదిహేను తులాల వెలను స్త్రీకి పది తులాల వెలను నిర్ణయించాలి.

లేవీకాండం 27:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా నీవు నిర్ణయించిన వెల చెల్లించలేనంత పేద వాడైతే అతడు యాజకుని ఎదుటికి రావాలి. అప్పుడు యాజకుడు అతని వెల నిర్ణయిస్తాడు. మొక్కుకున్న వాడి తాహతు చొప్పున వాడికి వెలను నిర్ణయించాలి.

లేవీకాండం 27:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాకు అర్పణంగా అర్పించే పశువుల్లో ప్రతిదాన్నీ యెహోవాకు ప్రతిష్ఠితంగా ఎంచాలి.

లేవీకాండం 27:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాన్ని మార్చకూడదు. చెడ్డదానికి బదులు మంచిదాన్ని గానీ మంచిదానికి బదులు చెడ్డదాన్ని గానీ ఒక దానికి బదులు మరొక దాన్నిగానీ ఇయ్యకూడదు. మొక్కుకున్న జంతువుకు బదులు వేరొక జంతువును మారిస్తే అదీ దానికి బదులుగా ఇచ్చినదీ కూడా ప్రతిష్ఠితం అయిపోతుంది.

లేవీకాండం 27:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజలు యెహోవాకు అర్పించకూడని అపవిత్ర జంతువుల్లో ఒకదాన్ని తెస్తే ఆ జంతువును యాజకుని ఎదుట నిలబెట్టాలి.

లేవీకాండం 27:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది మంచిదైనా చెడ్డదైనా యాజకుడు దాని వెలను నిర్ణయించాలి. యాజకుడివైన నీవు నిర్ణయించిన వెల ఖాయం.

లేవీకాండం 27:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఎవరైనా అలాటి జంతువును విడిపించుకోవాలనుకుంటే నీవు నిర్ణయించిన వెలలో ఐదో వంతు దానితో కలపాలి.

లేవీకాండం 27:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా తన ఇల్లు యెహోవాకు సమర్పించడానికి దాన్ని ప్రతిష్ఠించినట్టయితే అది మంచిదైనా చెడ్డదైనా యాజకుడు దాని వెల నిర్ణయించాలి. యాజకుడు నిర్ణయించిన వెల ఖాయం అవుతుంది.

లేవీకాండం 27:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన ఇల్లు దేవునికి అర్పించిన వాడు దాన్ని విడిపించుకోవాలనుకుంటే అతడు నీవు నిర్ణయించిన వెలలో ఐదో వంతు దానితో కలపాలి. అప్పుడు ఆ ఇల్లు అతనిదవుతుంది.

లేవీకాండం 27:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు తన పిత్రార్జితమైన పొలంలో కొంత యెహోవాకు ప్రతిష్ఠించినట్టయితే దానిలో చల్లే విత్తనాల కొలత చొప్పున దాని వెల నిర్ణయించాలి. పది తూముల బార్లీ విత్తనాలకు ఏభై తులాల వెండి నిర్ణయించాలి.

లేవీకాండం 27:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు సునాద సంవత్సరం మొదలు తన పొలాన్ని ప్రతిష్ఠించినట్టయితే నీవు నిర్ణయించే వెల ఖాయం.

లేవీకాండం 27:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలాన్ని ప్రతిష్ఠించినట్టయితే యాజకుడు మిగిలిన సంవత్సరాల లెక్క చొప్పున, అంటే మరుసటి సునాద సంవత్సరం వరకూ ఉన్న సంవత్సరాలను బట్టి వెలను నిర్ణయించాలి. నీవు నిర్ణయించిన వెలలో దాని అంచనాను తగ్గించాలి.

లేవీకాండం 27:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పొలాన్ని ప్రతిష్ఠించినవాడు దాన్ని విడిపించుకోవాలనుకుంటే నీవు నిర్ణయించిన వెలలో ఐదో వంతును అతడు దానితో కలపాలి. అప్పుడు అది అతనిదవుతుంది.

లేవీకాండం 27:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు ఆ పొలాన్ని విడిపించకపోతే లేదా దాన్ని వేరొకడికి అమ్మితే ఇక ఎన్నటికీ దాన్ని విడిపించడం వీలు కాదు.

లేవీకాండం 27:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పొలం సునాద సంవత్సరంలో విడుదల అయితే అది ప్రతిష్ఠించిన పొలం లాగానే యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది. ఆ ఆస్తి యాజకునిది అవుతుంది.

లేవీకాండం 27:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు తాను కొన్న పొలాన్ని, అంటే తన ఆస్తిలో చేరని దాన్ని యెహోవాకు ప్రతిష్ఠించినట్టయితే

లేవీకాండం 27:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకుడు సునాద సంవత్సరం వరకూ నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమించాలి. ఆ రోజునే నీవు నిర్ణయించిన వెల చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితంగా దాని చెల్లించాలి.

లేవీకాండం 27:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సునాద సంవత్సరంలో ఆ భూమి ఎవరి పిత్రార్జితమో వాడికి, అంటే ఆ పొలాన్ని అమ్మిన వాడికి అది తిరిగి రావాలి.

లేవీకాండం 27:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ వెలలన్నీ పరిశుద్ధ స్థలం వెల చొప్పున నిర్ణయించాలి. ఒక తులం ఇరవై చిన్నాలు.

లేవీకాండం 27:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జంతువుల్లో తొలిపిల్ల యెహోవాది గనక ఎవరూ దాన్ని ప్రతిష్ఠించకూడదు. అది ఎద్దు అయినా గొర్రెమేకల మందలోనిదైనా యెహోవాదే.

లేవీకాండం 27:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది అపవిత్ర జంతువైతే వాడు నీవు నిర్ణయించే వెలలో ఐదో వంతు దానితో కలిపి దాని విడిపించవచ్చు. దాని విడిపించకపోతే నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మాలి.

లేవీకాండం 27:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే మనుషుల్లోగాని జంతువుల్లోగాని సొంత పొలంలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్టించినట్టయితే ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపించ కూడదు. ప్రతిష్ఠించిన ప్రతిదీ యెహోవాకు అతి పరిశుద్ధంగా ఉంటుంది.

లేవీకాండం 27:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషులు ప్రతిష్ఠించే వాటిలో దేనినైనా విడిపించకుండా చంపి వేయాలి.

లేవీకాండం 27:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ధాన్యంలో, చెట్ల కాయల్లో, భూమి ఫలమంతటిలో పదవ వంతు యెహోవా స్వంతం. అది యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది.

లేవీకాండం 27:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు తాను చెల్లించవలసిన దశమభాగాల్లో దేనినైనా విడిపించుకోవాలి అనుకుంటే దానిలో ఐదో వంతును దానితో కలపాలి.

లేవీకాండం 27:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆవుల్లోగాని, గొర్రె మేకల్లోగాని, కాపరి కర్రతో తోలే వాటన్నిటిలో దశమభాగం ప్రతిష్ఠితం అవుతుంది.

లేవీకాండం 27:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది మంచిదో చెడ్డదో పరీక్ష చెయ్యకూడదు, దాన్ని మార్చకూడదు. దాని మారిస్తే అదీ దానికి బదులుగా ఇచ్చినది కూడా ప్రతిష్ఠితాలు అవుతాయి. అలాటి దాన్ని విడిపించ కూడదు అని చెప్పు.”

లేవీకాండం 27:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కోసం మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.

Available Bible Translations

American Standard Version
Leviticus 27 (ASV) »
King James Version
Leviticus 27 (KJV) »
GOD’S WORD® (GW)
Leviticus 27 (GW) »
World English Bible
Leviticus 27 (WEB) »
Louis Segond 1910
Lévitique 27 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लैव्यव्यवस्था 27 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਹਬਾਰ 27 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লেবীয়া 27 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லேவியராகமம் 27 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लेवीय 27 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
લેવીય 27 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯಾಜಕಕಾಂಡ 27 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَللَّاوِيِّينَ 27 (AVD) »
תנ ך עברי מודרני
ויקרא 27 (HEB) »
Bíblia Sagrada Português
Levítico 27 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lê-vi 27 (VIE) »
Reina Valera Antigua
Levítico 27 (RVA) »
La Sacra Bibbia
Levitico 27 (RIV) »
圣 经 简体中文和合本
利 未 记 27 (CUVS) »
聖 經 繁體中文和合本
利 未 記 27 (CUVT) »
Bibla e Shenjtë
Levitiku 27 (ALB) »
Svenska Bibeln 1917
3 Mosebok 27 (SV1917) »
Библия на русском
Левит 27 (RUSV) »
Українська Біблія
Левит 27 (UKR) »
Szent Biblia - Magyar
3 Mózes 27 (KAR) »
Българска Библия
Левит 27 (BULG) »
聖書 日本語
レビ記 27 (JPN) »
Kitaabka Quduuska Ah
Laawiyiintii 27 (SOM) »
De Heilige Schrift
Leviticus 27 (NLD) »

లేవీకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List