లేవీకాండం Chapter 11 TELIRV Bible Verse Images

లేవీకాండం 11 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share లేవీకాండం 11 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


లేవీకాండం 11:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు.

లేవీకాండం 11:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీరు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి. భూమి పై ఉన్న జంతువులన్నిటిలో మీరు తినదగ్గవి ఇవి.

లేవీకాండం 11:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చీలిన డెక్కలు ఉండి ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో ఆ జంతువుని మీరు ఆహారంగా తీసుకోవచ్చు.

లేవీకాండం 11:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే జంతువుల్లో కొన్ని నెమరు వేస్తాయి. కొన్నిటికి చీలిన డెక్కలుంటాయి. ఇలాంటి వాటిని మీరు ఆహారంగా తీసుకోకూడదు. ఒంటె లాంటి జంతువులు నెమరు వేస్తాయి. కానీ దానికి చీలిన డెక్కలుండవు. కాబట్టి ఒంటెను మీరు అపవిత్రంగా ఎంచాలి.

లేవీకాండం 11:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పొట్టి కుందేలు నెమరు వేస్తుంది, కానీ దానికి చీలిన డెక్కలు లేవు. కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి.

లేవీకాండం 11:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే కుందేలు నెమరు వేస్తుంది. కానీ దానికి చీలిన డెక్కలు లేవు. కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి.

లేవీకాండం 11:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక పందికి చీలిన డెక్కలు ఉన్నాయి. కానీ అది నెమరు వేయదు కాబట్టి దాన్ని మీరు అపవిత్రంగా ఎంచాలి.

లేవీకాండం 11:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీటి మాంసాన్ని మీరు తినకూడదు. వాటి కళేబరాలను అంటుకోకూడదు. అవి మీకు అపవిత్రం.

లేవీకాండం 11:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జలచరాల్లో వీటిని తినవచ్చు. సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో నివసించే అన్ని రకాల జీవుల్లో రెక్కలూ, పొలుసులూ ఉన్న వాటిని మీరు తినవచ్చు.

లేవీకాండం 11:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సముద్రంలోనైనా, నదిలో నైనా నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోనూ, జల జంతువుల్లోనూ రెక్కలూ, పొలుసులూ లేని వాటిని మీరు అసహ్యించుకోవాలి.

లేవీకాండం 11:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి మీకు అసహ్యం కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు. వాటి కళేబరాలను అసహ్యించుకోవాలి.

లేవీకాండం 11:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీళ్లలో దేనికి రెక్కలూ, పొలుసులూ ఉండవో అది మీకు అసహ్యం.

లేవీకాండం 11:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పక్షుల్లో మీరు అసహ్యించుకోవాల్సినవీ, తినకూడనివీ ఏవంటే, గద్ద, రాబందు,

లేవీకాండం 11:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గరుడ పక్షి, డేగ జాతిలో ప్రతి పక్షీ,

లేవీకాండం 11:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాకి జాతిలోని ప్రతి పక్షీ,

లేవీకాండం 11:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొమ్ముల గుడ్లగూబ, తీతువు పిట్ట, సముద్రపు కొంగ, గద్ద జాతిలో అన్ని పక్షులూ.

లేవీకాండం 11:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా పైగిడి కంటె, గుడ్లగూబ, సముద్రపు డేగ,

లేవీకాండం 11:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెల్ల గుడ్లగూబ, క్షేత గుడ్లగూబ, సముద్రపు రాబందు,

లేవీకాండం 11:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొక్కిరాయి, అన్ని రకాల కొంగలు, కుకుడు గువ్వ, గబ్బిలం.

లేవీకాండం 11:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెక్కలు ఉండి నాలుగుకాళ్లతో నడిచే జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.

లేవీకాండం 11:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే రెక్కలు ఉండి నలుగు కాళ్ళతో నడిచే, ఎగరగలిగే జీవులు, నేలపై గంతులు వేయడానికి తొడలు గల పురుగులన్నిటినీ మీరు తినవచ్చు.

లేవీకాండం 11:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు. ఆకు మిడత, కీచురాయి, గడ్డి మిడత ఇలా అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు.

లేవీకాండం 11:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే నాలుగు కాళ్లు గల ఎగిరే తక్కిన జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.

లేవీకాండం 11:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీటిలో దేని కళేబరాన్ని అయినా మీరు తాకితే మీరు సాయంత్రం వరకూ అపవిత్రంగా ఉంటారు.

లేవీకాండం 11:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు.

లేవీకాండం 11:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండు డెక్కలు గల అన్ని జంతువుల్లో డెక్కలు పూర్తిగా చీలకుండా ఉండి నెమరు వేయకుండా ఉన్నవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలు మీరు ముట్టుకోకూడదు. అలాటి వాటిని తాకిన వాడు అపవిత్రుడు అవుతాడు.

లేవీకాండం 11:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాలుగు కాళ్లపై నడిచే జంతువుల్లో ఏవి తమ పంజాపై నడుస్తాయో అవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలు ముట్టుకున్న వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు.

లేవీకాండం 11:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు. ఈ జంతువులు మీకు అపవిత్రమైనవి.

లేవీకాండం 11:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేలపైన పాకే జంతువుల్లో మీకు అపవిత్రమైనవి ఇవి. ముంగిస, ఎలుక, బల్లి జాతికి చెందిన ప్రతి జీవీ,

లేవీకాండం 11:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తొండ, ఉడుము, బల్లి, తొండ, చిట్టి ఉడుము, ఊసరవెల్లి.

లేవీకాండం 11:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాకే జీవులన్నిటిలో ఇవి మీకు అపవిత్రం. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టుకునేవాడు సాయంకాలం వరకూ అపవిత్రుడుగా ఉంటాడు.

లేవీకాండం 11:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకవేళ అవి చనిపోయిన తరువాత వాటి కళేబరాలు దేని పైన పడతాయో అవి చెక్క వస్తువులైనా, వస్త్రంతో చేసినవైనా, చర్మంతో చేసినవైనా, గోనె గుడ్డతో చేసినవైనా అవి అపవిత్రం అవుతాయి. ఆ వస్తువు ఏదైనా, దేనికోసం వాడుతున్నా అపవిత్రం అయినప్పుడు దాన్ని నీళ్ళలో ఉంచాలి. సాయంకాలం వరకూ అది అపవిత్రంగా ఉంటుంది. తరువాత అది పవిత్రం అవుతుంది.

లేవీకాండం 11:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీటిలో ఏ జంతువైనా ఏదైనా మట్టిపాత్ర పైన గానీ, మట్టిపాత్రలో గానీ పడితే, ఆ పాత్రలో ఉన్నది ఏదైనా అపవిత్రం అవుతుంది. అప్పుడు మీరు ఆ మట్టిపాత్రను పగలగొట్టాలి.

లేవీకాండం 11:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పవిత్రమూ తినదగినదీ అయిన ఏ ఆహారంలోనైనా ఆ అపవిత్రం అయిన ఆ మట్టిపాత్రలోని నీళ్ళు పడితే ఆ ఆహారం అపవిత్రం అవుతుంది. అలాంటి పాత్ర లోంచి ఏ పానీయం తాగినా అది అపవిత్రం అవుతుంది.

లేవీకాండం 11:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి కళేబరాల్లో ఏ కొంచెమన్నా దేనిపైనన్నా పడితే అది అపవిత్రం అవుతుంది. అది పొయ్యి అయినా, వంటపాత్ర అయినా దాన్ని ముక్కలుగా పగలగొట్టాలి. అది అపవిత్రం, అది మీకు అపవిత్రంగానే ఉండాలి.

లేవీకాండం 11:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీళ్ళు చేదుకునే పెద్ద తొట్టిలో గానీ, ఊటలో గానీ అలాంటి కళేబరం పడినా ఆ నీళ్ళు అపవిత్రం కావు. అయితే ఆ నీటిలో పడిన కళేబరాన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు అపవిత్రం అవుతారు.

లేవీకాండం 11:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కళేబరాల్లో ఏదో ఒక భాగం నాటేందుకు సిద్ధంగా ఉన్న విత్తనాలపై పడినా ఆ విత్తనాలు అపవిత్రం కావు.

లేవీకాండం 11:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ నానబెట్టిన విత్తనాలపైన అపవిత్రమైన కళేబరం పడితే అవి మీకు అపవిత్రం అవుతాయి.

లేవీకాండం 11:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు తిన దగ్గ జంతువుల్లో ఏదన్నా చస్తే దాని కళేబరాన్ని ముట్టుకునే వాడు ఆ సాయంత్రం వరకూ అపవిత్రుడిగా ఉంటాడు.

లేవీకాండం 11:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కళేబరములోనుండి దేనినైనా తినేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంత్రం వరకూ అపవిత్రుడిగా ఉంటాడు. దాని కళేబరాన్ని మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి.

లేవీకాండం 11:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేలమీద పాకే జీవులన్నీ అసహ్యం. వాటిని మీరు తినకూడదు.

లేవీకాండం 11:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేలపై పాకే అన్ని జంతువులు, అంటే తమ పొట్టతో పాకే జీవులైనా, నాలుగు కాళ్ళపై నడిచేవైనా, అనేకమైన కాళ్ళు ఉన్నవైనా ఇవన్నీ మీరు తినకూడదు. ఇవి మీకు అసహ్యంగా ఉండాలి.

లేవీకాండం 11:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇలా పాకే జీవులను తిని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు. వాటి ద్వారా మీరు అపవిత్రం కాకూడదు. అశుద్ధం కాకూడదు.

లేవీకాండం 11:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే నేను యెహోవాని. మీ దేవుణ్ణి. నేను పరిశుద్ధుణ్ణి. కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండేలా శుద్ధీకరణ చేసుకోండి. నేలపైన పాకే జీవుల మూలంగా మిమ్మల్ని మీరు మలినం చేసుకోవద్దు.

లేవీకాండం 11:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకు దేవుడిగా ఉండటానికి మిమ్మల్ని ఐగుప్తుదేశంలో నుండి బయటకు తీసుకు వచ్చిన యెహోవాను నేను. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి.”

లేవీకాండం 11:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది జంతువులూ, పక్షులూ, నీళ్ళలో నివసించే ప్రాణులూ, నేలపైన పాకే జీవులను గూర్చిన శాసనం.

లేవీకాండం 11:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో తెలియజేయడం దీని ఉద్దేశం.

Available Bible Translations

American Standard Version
Leviticus 11 (ASV) »
King James Version
Leviticus 11 (KJV) »
GOD’S WORD® (GW)
Leviticus 11 (GW) »
World English Bible
Leviticus 11 (WEB) »
Louis Segond 1910
Lévitique 11 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लैव्यव्यवस्था 11 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਹਬਾਰ 11 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লেবীয়া 11 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லேவியராகமம் 11 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लेवीय 11 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
લેવીય 11 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯಾಜಕಕಾಂಡ 11 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَللَّاوِيِّينَ 11 (AVD) »
תנ ך עברי מודרני
ויקרא 11 (HEB) »
Bíblia Sagrada Português
Levítico 11 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lê-vi 11 (VIE) »
Reina Valera Antigua
Levítico 11 (RVA) »
La Sacra Bibbia
Levitico 11 (RIV) »
圣 经 简体中文和合本
利 未 记 11 (CUVS) »
聖 經 繁體中文和合本
利 未 記 11 (CUVT) »
Bibla e Shenjtë
Levitiku 11 (ALB) »
Svenska Bibeln 1917
3 Mosebok 11 (SV1917) »
Библия на русском
Левит 11 (RUSV) »
Українська Біблія
Левит 11 (UKR) »
Szent Biblia - Magyar
3 Mózes 11 (KAR) »
Българска Библия
Левит 11 (BULG) »
聖書 日本語
レビ記 11 (JPN) »
Kitaabka Quduuska Ah
Laawiyiintii 11 (SOM) »
De Heilige Schrift
Leviticus 11 (NLD) »

లేవీకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List