లేవీకాండం Chapter 22 TELIRV Bible Verse Images

లేవీకాండం 22 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share లేవీకాండం 22 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


లేవీకాండం 22:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.

లేవీకాండం 22:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అహరోనుతో అతని కొడుకులతో ఇది చెప్పు. వారు ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే వాటిని ప్రత్యేకమైనవిగా భావించాలి. వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

లేవీకాండం 22:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు వారితో ఇలా చెప్పు. మీ తరతరాలకు మీ సంతతి వారందరిలో ఒకడు అపవిత్రంగా ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే వాటిని సమీపిస్తే అలాంటి వాణ్ణి నా సన్నిధిలో ఉండకుండాా దూరంగా కొట్టివేస్తాను. నేను యెహోవాను.

లేవీకాండం 22:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహరోను సంతానంలో ఎవరికైనా కుష్టువ్యాధి గానీ, శరీరం నుండి రసి లాంటిది కారడం గానీ ఉంటే అలాటి వాడు పవిత్రుడయ్యే వరకూ ప్రతిష్ఠితమైన వాటిలో దేనినీ తినకూడదు. శవాన్ని తాకడం వల్లా, అపవిత్రమైన దేనినైనా ముట్టుకోవడం వల్లా, వీర్యస్కలనం చేసిన వాణ్ణి తాకడం వల్లా,

లేవీకాండం 22:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అపవిత్రమైన పురుగును, లేక ఏదో ఒక అపవిత్రత మూలంగా అపవిత్రుడైపోయిన మనిషిని ముట్టుకోవడం వల్లా, అలాటి అపవిత్రత తగిలినవాడు సాయంత్రం వరకూ అపవిత్రుడుగా ఉంటాడు.

లేవీకాండం 22:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు నీళ్లతో తన ఒళ్ళు కడుక్కునే వరకూ ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు.

లేవీకాండం 22:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడౌతాడు. ఆ తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చు. అవి అతనికి ఆహారమే గదా.

లేవీకాండం 22:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు చచ్చిన జంతువును గానీ, మృగాలు చీల్చిన వాటిని గాని తిని దాని వలన తనను అపవిత్ర పరచుకోకూడదు. నేను యెహోవాను.

లేవీకాండం 22:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నేను విధించిన నియమాన్ని మీరి, దాని పాపదోషం తనపై వేసుకుని దాని వలన చావకుండేలా చూసుకోవాలి. నేను వారిని పరిశుద్ధ పరిచే యెహోవాను.

లేవీకాండం 22:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతిష్ఠితమైన దాన్ని యూదులు కాని వారు తినకూడదు. యాజకుని ఇంట్లో నివసించే అన్యుడు గాని, సేవకుడు గాని ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు.

లేవీకాండం 22:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యాజకుడు తన డబ్బుతో కొనుక్కున్న వాడు, అతని ఇంట్లో పుట్టినవాడు అతడు తినే ఆహారం తినవచ్చు.

లేవీకాండం 22:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకుని కుమార్తెను అన్యునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె ప్రతిష్ఠితమైన అర్పణల్లో దేనినీ తినకూడదు.

లేవీకాండం 22:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకుని కుమార్తెల్లో వితంతువుగానీ, విడాకులు తీసుకున్నది గానీ పిల్లలు పుట్టక పోవడం వల్ల ఆమె తన బాల్యప్రాయంలో వలె తన తండ్రి యింటికి తిరిగి చేరితే తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు. అన్యుడు మాత్రం దాన్ని తినకూడదు.

లేవీకాండం 22:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దాన్ని తింటే వాడు ఆ ప్రతిష్ఠితమైన దాని విలువలో ఐదో వంతు కలిపి యాజకునికి తిరిగి ఇవ్వాలి.

లేవీకాండం 22:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినడం వలన అపరాధాన్ని భరించకుండా ఉండాలంటే తాము యెహోవాకు ప్రతిష్ఠించే పరిశుద్ధ వస్తువులను అపవిత్ర పరచకూడదు.

లేవీకాండం 22:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను అర్పణలను పరిశుద్ధ పరచే యెహోవానని చెప్పు.”

లేవీకాండం 22:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.

లేవీకాండం 22:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నీవు అహరోనుతో, అతని కొడుకులతో, ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పు. ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో గానీ ఇశ్రాయేలీయుల్లో నివసించే పరదేశుల్లోగాని యెహోవాకు దహన బలి అర్పించదలిస్తే అది స్వేచ్ఛార్పణగానివ్వండి, మొక్కుబడి గానివ్వండి

లేవీకాండం 22:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ అర్పణ దేవుడు అంగీకరించేలా ఆవుల్లో నుండి గానీ, గొర్రె మేకల్లో నుండి గానీ దోషంలేని మగదాన్ని అర్పించాలి.

లేవీకాండం 22:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కళంకం ఉన్న దాన్ని అర్పించ కూడదు. అది అంగీకారం కాదు.

లేవీకాండం 22:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు మొక్కుబడిగా స్వేచ్ఛార్పణంగా అర్పించడానికి శాంతి బలిగా ఆవునైనా గొర్రెనైనా మేకనైనా యెహోవాకు తెస్తే ఆయన దాన్ని అంగీకరించేలా అది దోషం లేనిదై ఉండాలి. దానిలో కళంకమేదీ ఉండకూడదు.

లేవీకాండం 22:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గుడ్డిదాన్ని గానీ కుంటిదాన్ని గానీ, పాడైపోయిన దాన్ని గానీ, గడ్డలు, గజ్జి, కురుపులు ఉన్న దాన్ని గానీ యెహోవాకు అర్పించకూడదు. అలాంటివి దేన్నీ బలివేదికపై యెహోవాకు హోమం చేయకూడదు.

లేవీకాండం 22:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంగవైకల్యం గల కోడెదూడనైనా గొర్రెల మేకల మందలోని దాన్నైనా స్వేచ్ఛార్పణంగా అర్పించవచ్చు గానీ మొక్కుబడిగా మాత్రం అది అంగీకారం కాదు.

లేవీకాండం 22:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాయపడిన, నలిగిన, మృగాలు చీల్చిన, వృషణాలు చితక గొట్టిన జంతువును యెహోవాకు అర్పించకూడదు. మీ దేశంలో అలాంటివి అర్పించకూడదు.

లేవీకాండం 22:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విదేశీయుల దగ్గర నుండి అలాటి వాటిని తీసుకుని మీ దేవుడికి నైవేద్యంగా అర్పించకూడదు. అవి లోపం గలవి, వాటికి కళంకం ఉంది. మీ పక్షంగా దేవుడు వాటిని అంగీకరించడు, అని చెప్పు.”

లేవీకాండం 22:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు.

లేవీకాండం 22:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“దూడగాని, గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని పుట్టినప్పుడు అది ఏడు రోజులు దాని తల్లితో ఉండాలి. ఎనిమిదవ రోజు మొదలు అది యెహోవాకు హోమంగా అంగీకారమే.

లేవీకాండం 22:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అది ఆవైనా గొర్రె మేకలైనా మీరు దాన్ని, దాని పిల్లను ఒక్క నాడే వధించకూడదు.

లేవీకాండం 22:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు కృతజ్ఞత బలిగా ఒక పశువును వధించినప్పుడు అది మీ కోసం అంగీకారం అయ్యేలా దాన్ని అర్పించాలి.

లేవీకాండం 22:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆనాడే దాని తినెయ్యాలి. మరుసటి రోజు దాకా దానిలో కొంచెమైనా మిగల్చకూడదు. నేను యెహోవాను.

లేవీకాండం 22:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తూ వాటి ప్రకారం నడుచుకోవాలి. నేను యెహోవాను.

లేవీకాండం 22:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయుల్లో నన్ను పరిశుద్ధునిగా చేసుకుంటాను. నేను మిమ్మల్ని పరిశుద్ధ పరిచే యెహోవాను.

లేవీకాండం 22:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మీకు దేవుడనై ఉండేలా ఐగుప్తు దేశంలోనుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను అని చెప్పు.”

Available Bible Translations

American Standard Version
Leviticus 22 (ASV) »
King James Version
Leviticus 22 (KJV) »
GOD’S WORD® (GW)
Leviticus 22 (GW) »
World English Bible
Leviticus 22 (WEB) »
Louis Segond 1910
Lévitique 22 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लैव्यव्यवस्था 22 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਹਬਾਰ 22 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লেবীয়া 22 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லேவியராகமம் 22 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लेवीय 22 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
લેવીય 22 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯಾಜಕಕಾಂಡ 22 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَللَّاوِيِّينَ 22 (AVD) »
תנ ך עברי מודרני
ויקרא 22 (HEB) »
Bíblia Sagrada Português
Levítico 22 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lê-vi 22 (VIE) »
Reina Valera Antigua
Levítico 22 (RVA) »
La Sacra Bibbia
Levitico 22 (RIV) »
圣 经 简体中文和合本
利 未 记 22 (CUVS) »
聖 經 繁體中文和合本
利 未 記 22 (CUVT) »
Bibla e Shenjtë
Levitiku 22 (ALB) »
Svenska Bibeln 1917
3 Mosebok 22 (SV1917) »
Библия на русском
Левит 22 (RUSV) »
Українська Біблія
Левит 22 (UKR) »
Szent Biblia - Magyar
3 Mózes 22 (KAR) »
Българска Библия
Левит 22 (BULG) »
聖書 日本語
レビ記 22 (JPN) »
Kitaabka Quduuska Ah
Laawiyiintii 22 (SOM) »
De Heilige Schrift
Leviticus 22 (NLD) »

లేవీకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List