మత్తయి Chapter 12 TELIRV Bible Verse Images

మత్తయి 12 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share మత్తయి 12 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


మత్తయి 12:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజుల్లో యేసు ఒక విశ్రాంతి దినాన పంటచేలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులకు ఆకలి వేసి కంకులు తుంచి తింటున్నారు.

మత్తయి 12:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరిసయ్యులు అది చూసి, “చూడు, విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు” అని ఆయనతో అన్నారు.

మత్తయి 12:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన వారితో, “దావీదుకూ అతనితో ఉన్న వారికీ ఆకలి వేస్తే అతడు చేసిన దాని గురించి మీరు చదవలేదా?

మత్తయి 12:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులే తప్ప తాను గానీ తనతో ఉన్నవారు గానీ తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు.

మత్తయి 12:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విశ్రాంతి దినాన దేవాలయంలోని యాజకులు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా కూడా నిర్దోషులుగానే ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా?

మత్తయి 12:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను.

మత్తయి 12:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘కనికరాన్నే కోరుతున్నాను, బలిని కోరను’ అనే వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చరు.

మత్తయి 12:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాగా మనుష్యకుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు” అన్నాడు.

మత్తయి 12:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించాడు. అక్కడ చచ్చుబడిన చేతితో ఒకడు కనిపించాడు.

మత్తయి 12:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరిసయ్యులు ఆయన మీద నేరం మోపాలని, “విశ్రాంతి దినాన బాగు చేయడం న్యాయమా?” అని ఆయనను అడిగారు.

మత్తయి 12:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకాయన, “మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి, అది విశ్రాంతి దినాన గుంటలో పడితే అతడు దాన్ని పైకి తీయడా?

మత్తయి 12:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గొర్రె కంటే మనిషి ఎంతో విలువైన వాడు కాబట్టి విశ్రాంతి దినాన మంచి చేయడం న్యాయమే” అని చెప్పి

మత్తయి 12:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ మనిషితో, “నీ చెయ్యి చాపు” అన్నాడు. వాడు చెయ్యి చాపగానే అది రెండవ చెయ్యి లాగా బాగుపడింది.

మత్తయి 12:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరిసయ్యులు బయటికి పోయి, ఆయనను ఎలా చంపాలా అని ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు.

మత్తయి 12:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు.

మత్తయి 12:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు.

మత్తయి 12:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే,

మత్తయి 12:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఈయన నా సేవకుడు. ఈయనను నేను ఏర్పరచుకున్నాను. ఈయన నాకెంతో ప్రియమైన వాడు. ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను. ఈయన యూదేతరులకు న్యాయం ప్రకటిస్తాడు.

మత్తయి 12:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈయన పోట్లాడడు, కేకలు వేయడు. ఈయన స్వరం వీధిలో వారికెవ్వరికీ వినిపించదు.

మత్తయి 12:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
న్యాయాన్ని గెలిపించే వరకూ, ఈయన నలిగిన రెల్లును విరవడు. ఆరిపోతున్న వత్తిని నలపడు.

మత్తయి 12:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈయన నామంలో యూదేతరులకు నిరీక్షణ కలుగుతుంది” అనే ప్రవచనం.

మత్తయి 12:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు. అతడు గుడ్డివాడు, మూగవాడు కూడా. ఆయన అతణ్ణి బాగుచేశాడు. అతనికి మాట, చూపు రెండూ వచ్చాయి.

మత్తయి 12:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడి, “దావీదు కుమారుడు ఈయనే అయి ఉంటాడా” అని చెప్పుకున్నారు.

మత్తయి 12:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరిసయ్యులు ఆ మాట విని, “వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరెవరి వలనా కాదు” అన్నారు.

మత్తయి 12:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, “ఏ రాజ్యమైనా సరే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడైపోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ ఇల్లయినా నిలవదు.

మత్తయి 12:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకవేళ సాతాను సాతానును వెళ్ళగొడితే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు కదా. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది?

మత్తయి 12:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను బయెల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ వారు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులవుతారు.

మత్తయి 12:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్టే.

మత్తయి 12:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలడు.

మత్తయి 12:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే.

మత్తయి 12:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు.

మత్తయి 12:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు.

మత్తయి 12:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“చెట్టు మంచిదయితే దాని పండూ మంచిదవుతుంది. అలా కాక, చెట్టు చెడ్డదయితే దాని పండూ చెడ్డదవుతుంది. చెట్టు ఎలాటిదో దాని పండు వలన తెలుసుకోవచ్చు.

మత్తయి 12:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది.

మత్తయి 12:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మంచివాడు తన హృదయంలోని మంచి సంపదలో నుండి మంచి వాటిని బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన హృదయంలోని చెడ్డ సంపదలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు.

మత్తయి 12:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను.

మత్తయి 12:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు.”

మత్తయి 12:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యుల్లో కొందరు ఆయనకు జవాబిస్తూ, “బోధకుడా, నువ్వు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది” అన్నారు. ఆయన ఇలా అన్నాడు,

మత్తయి 12:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“వ్యభిచారులైన ఈ దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వబడదు.

మత్తయి 12:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోనా మూడు రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు.

మత్తయి 12:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీనెవె ప్రజలు యోనా ప్రకటన విని పశ్చాత్తాప పడ్డారు కాబట్టి నీనెవె వారు ఈ తరం వారితో నిలబడి తీర్పు రోజున వారి మీద నేరం మోపుతారు. చూడండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

మత్తయి 12:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. అయితే చూడండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

మత్తయి 12:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది.

మత్తయి 12:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది ‘నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను’ అనుకుని వచ్చి, ఆ ఇంట్లో ఎవరూ లేక అది ఊడ్చి చక్కగా సర్దిపెట్టి ఉండడం చూస్తుంది.

మత్తయి 12:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యాలను వెంటబెట్టుకుని వస్తుంది. అవన్నీ అక్కడే నివాసముంటాయి. అందుచేత ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దాని కంటే అధ్వాన్నం అవుతుంది. ఈ దుష్టతరం వారికీ అలాగే అవుతుంది.”

మత్తయి 12:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ప్రజలతో ఇంకా మాట్లాడుతూ ఉండగా, ఆయన తల్లీ సోదరులూ ఆయనతో మాట్లాడాలని వచ్చి బయట నిలబడి ఉన్నారు.

మత్తయి 12:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడొకడు, “నీ తల్లీ నీ సోదరులూ నీతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు” అని ఆయనతో చెప్పాడు.

మత్తయి 12:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూసి, “నా తల్లి ఎవరు? నా సోదరులెవరు?” అని చెప్పి

మత్తయి 12:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన శిష్యులవైపు చెయ్యి చాపి, “నా తల్లి, నా సోదరులు వీరే!

మత్తయి 12:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా పరలోకపు తండ్రి ఇష్టం చొప్పున చేసేవాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అన్నాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Matthew 12 (ASV) »
King James Version (KJV)
Matthew 12 (KJV) »
GOD’S WORD® (GW)
Matthew 12 (GW) »
Berean Bible (BSB)
Matthew 12 (BSB) »
World English Bible (WEB)
Matthew 12 (WEB) »
French Bible (LSG)
Matthieu 12 (LSG) »
German Bible (LUTH1912)
Matthäus 12 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਮੱਤੀ 12 (PANIRV) »
Bengali Bible (BENIRV)
মথি 12 (BENIRV) »
Marathi Bible (MARIRV)
मत्तय 12 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
માથ્થી 12 (GUJIRV) »
Arabic Bible (AVD)
مَتَّى 12 (AVD) »
Portuguese Bible (BSL)
Mateus 12 (BSL) »
Vietnamese Bible (VIE)
Ma-thi-ơ 12 (VIE) »
Spanish Bible (RVA)
Mateo 12 (RVA) »
Italian Bible (RIV)
Matteo 12 (RIV) »
Chinese Simplified (CUVS)
马 太 福 音 12 (CUVS) »
Chinese Traditional (CUVT)
馬 太 福 音 12 (CUVT) »
Albanian Bible (ALB)
Mateu 12 (ALB) »
Swedish Bible (SV1917)
Matteus 12 (SV1917) »
Russian Bible (RUSV)
Матфея 12 (RUSV) »
Ukrainian Bible (UKR)
Матвія 12 (UKR) »
Hungarian Bible (KAR)
Máté 12 (KAR) »
Bulgarian Bible (BULG)
Матей 12 (BULG) »
Norwegian Bible (NORSK)
Matteus 12 (NORSK) »

మత్తయి (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List