మత్తయి Chapter 24 TELIRV Bible Verse Images

మత్తయి 24 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share మత్తయి 24 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


మత్తయి 24:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు.

మత్తయి 24:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకాయన, “మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా. నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ కూలదోస్తారు” అని వారితో అన్నాడు.

మత్తయి 24:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు.

మత్తయి 24:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసు వారితో ఇలా అన్నాడు, “ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి.

మత్తయి 24:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చాలామంది నా నామంలో వచ్చి ‘నేనే క్రీస్తుని’ అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు.

మత్తయి 24:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు. వాటి గురించిన వార్తలు వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు.

మత్తయి 24:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి.

మత్తయి 24:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే.

మత్తయి 24:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు, చంపుతారు. నా నామం కారణంగా మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు.

మత్తయి 24:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు, ఒకరినొకరు ద్వేషించుకుని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు.

మత్తయి 24:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు.

మత్తయి 24:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది.

మత్తయి 24:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది.

మత్తయి 24:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.

మత్తయి 24:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన ‘వినాశకారి అయిన హేయ వస్తువు’ అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక),

మత్తయి 24:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి.

మత్తయి 24:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లో నుండి దేనినైనా తీసుకుపోవడానికి దిగి రాకూడదు.

మత్తయి 24:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు.

మత్తయి 24:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం.

మత్తయి 24:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి.

మత్తయి 24:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు, ఇక ముందు రాదు.

మత్తయి 24:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజులను దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. అయితే, ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజులను దేవుడు తక్కువ చేస్తాడు.

మత్తయి 24:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు’ అని చెబితే నమ్మవద్దు.

మత్తయి 24:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు.

మత్తయి 24:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను.

మత్తయి 24:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఎవరైనా ‘ఇదిగో, క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు’ అని చెప్పినా, ‘ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు’ అని చెప్పినా మీరు నమ్మవద్దు. వారి వెంట వెళ్ళవద్దు.

మత్తయి 24:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది.

మత్తయి 24:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి.

మత్తయి 24:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి.

మత్తయి 24:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు.

మత్తయి 24:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు.

మత్తయి 24:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు.

మత్తయి 24:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదే విధంగా ఈ సంగతులన్నీ జరగడం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే, ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.

మత్తయి 24:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతరించదని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.

మత్తయి 24:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.

మత్తయి 24:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారుడికి కూడా తెలియదు.

మత్తయి 24:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నోవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది.

మత్తయి 24:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ, మనుషులు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు.

మత్తయి 24:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకునిపోయే వరకూ వారికి తెలియలేదు. ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడ ఉంటుంది.

మత్తయి 24:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు.

మత్తయి 24:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే, ఒకామె వెళ్ళిపోతుంది, మరొకామె ఉండిపోతుంది.

మత్తయి 24:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి.

మత్తయి 24:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకుని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా!

మత్తయి 24:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి.

మత్తయి 24:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడు ఎవరు?

మత్తయి 24:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు.

మత్తయి 24:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.

మత్తయి 24:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని

మత్తయి 24:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే,

మత్తయి 24:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు.

మత్తయి 24:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు. అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.”

Available Bible Translations

American Standard Version
Matthew 24 (ASV) »
King James Version
Matthew 24 (KJV) »
GOD’S WORD® (GW)
Matthew 24 (GW) »
World English Bible
Matthew 24 (WEB) »
Louis Segond 1910
Matthieu 24 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मत्ती 24 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮੱਤੀ 24 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মথি 24 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மத்தேயு 24 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मत्तय 24 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
માથ્થી 24 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮತ್ತಾಯನು 24 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَتَّى 24 (AVD) »
תנ ך עברי מודרני
הבשורה על־פי מתי 24 (HEB) »
Bíblia Sagrada Português
Mateus 24 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ma-thi-ơ 24 (VIE) »
Reina Valera Antigua
Mateo 24 (RVA) »
La Sacra Bibbia
Matteo 24 (RIV) »
圣 经 简体中文和合本
马 太 福 音 24 (CUVS) »
聖 經 繁體中文和合本
馬 太 福 音 24 (CUVT) »
Bibla e Shenjtë
Mateu 24 (ALB) »
Svenska Bibeln 1917
Matteus 24 (SV1917) »
Библия на русском
Матфея 24 (RUSV) »
Українська Біблія
Матвія 24 (UKR) »
Szent Biblia - Magyar
Máté 24 (KAR) »
Българска Библия
Матей 24 (BULG) »
Det Norsk Bibel
Matteus 24 (NORSK) »
Kitaabka Quduuska Ah
Matayos 24 (SOM) »
De Heilige Schrift
Mattheüs 24 (NLD) »

మత్తయి (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List