1 రాజులు Chapter 7 TELIRV Bible Verse Images

1 రాజులు 7 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 రాజులు 7 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 రాజులు 7:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోను 13 సంవత్సరాల పాటు తన రాజ గృహాన్ని కూడా కట్టించి పూర్తి చేశాడు.

1 రాజులు 7:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు లెబానోను అరణ్య రాజగృహాన్ని కట్టించాడు. దీని పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. దాన్ని నాలుగు వరసల దేవదారు స్తంభాలతో కట్టారు. ఆ స్తంభాలపై మీద దేవదారు దూలాలు వేశారు.

1 రాజులు 7:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పక్కగదులు 45 స్తంభాలతో కట్టి పైన దేవదారు కలపతో కప్పారు. ఆ స్తంభాలు ఒక్కో వరసకి 15 చొప్పున మూడు వరుసలు ఉన్నాయి.

1 రాజులు 7:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూడు వరుసల కిటికీలు ఉన్నాయి. మూడు వరుసల్లో కిటికీలు ఒక దానికొకటి ఎదురుగా ఉన్నాయి.

1 రాజులు 7:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తలుపుల, కిటికీల గుమ్మాలు చతురస్రాకారంగా ఉన్నాయి. మూడు వరసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.

1 రాజులు 7:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు స్తంభాలు ఉన్న ఒక మంటపాన్ని కట్టించాడు. దాని పొడవు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. వాటి ఎదుట ఒక స్తంభాల ఆధారంగా ఉన్న మంటపం ఉంది. స్తంభాలు, మందమైన దూలాలు వాటి ఎదుట ఉన్నాయి.

1 రాజులు 7:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత అతడు తాను న్యాయ విచారణ చేయడానికి ఒక అధికార మంటపాన్ని కట్టించాడు. దాన్ని అడుగు నుండి పైకప్పు వరకూ దేవదారు కర్రతో కప్పారు.

1 రాజులు 7:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోను లోపలి ఆవరణలో తన రాజప్రాసాదాన్ని ఆ విధంగానే కట్టించాడు. తన భార్య అయిన ఫరో కుమార్తెకు ఇదే నమూనాలో మరొక అంతఃపురం కట్టించాడు.

1 రాజులు 7:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ కట్టడాలన్నీ పునాది నుండి పైకప్పు వరకూ లోపలా బయటా వాటి పరిమాణం ప్రకారం తొలిచి రంపాలతో కోసి చదును చేసిన బహు విలువైన రాళ్లతో నిర్మితమైనాయి. ఈ విధంగానే విశాలమైన ఆవరణం బయటి వైపున కూడా ఉన్నాయి.

1 రాజులు 7:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని పునాది పదేసి, ఎనిమిదేసి మూరలు ఉన్న బహు విలువైన, పెద్ద రాళ్లతో కట్టి ఉంది.

1 రాజులు 7:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పై భాగంలో పరిమాణం ప్రకారం చెక్కిన బహు విలువైన రాళ్లు, దేవదారు కర్రలు ఉన్నాయి.

1 రాజులు 7:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆవరణానికి చుట్టూ మూడు వరుసల చెక్కిన రాళ్లు, ఒక వరుస దేవదారు దూలాలు ఉన్నాయి. యెహోవా మందిరంలోని ఆవరణం కట్టిన విధంగానే ఆ మందిరం మంటపం కూడా కట్టారు.

1 రాజులు 7:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోను రాజు తూరు పట్టణం నుండి హీరామును పిలిపించాడు.

1 రాజులు 7:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతడు నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలి కొడుకు. ఇతని తండ్రి తూరు పట్టణానికి చెందిన ఇత్తడి పనివాడు. ఈ హీరాము గొప్ప నైపుణ్యం, జ్ఞానం గలవాడు, ఇత్తడితో చేసే పనులన్నిటిలో బాగా ఆరితేరిన వాడు, అనుభవజ్ఞుడు. అతడు సొలొమోను దగ్గరికి వచ్చి అతని పని అంతా చేశాడు.

1 రాజులు 7:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలాగంటే, అతడు రెండు ఇత్తడి స్తంభాలు పోత పోశాడు. ఒక్కొక్క స్తంభం 18 మూరల పొడవు, 12 మూరల చుట్టు కొలత ఉంది.

1 రాజులు 7:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్తంభాల మీద ఉంచడానికి ఇత్తడితో రెండు పీటలు పోత పోశాడు. ఒక్కొక్క పీట ఎత్తు 5 మూరలు.

1 రాజులు 7:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్తంభాల మీద ఉన్న పీటలకి అల్లిన గొలుసులతో వలల వంటి వాటిని చేసారు. గొలుసు పని దండలు పోత పోసి ఉంది. అవి ఒక్కో పీటకి ఏడేసి ఉన్నాయి.

1 రాజులు 7:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా అతడు స్తంభాలు చేసి వాటి పైని పీటలను కప్పడానికి చుట్టూ అల్లిక పని రెండు వరసలు దానిమ్మ పండ్లతో చేశాడు. రెండు పీటలకీ అతడు అదే విధంగా చేశాడు.

1 రాజులు 7:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్తంభాల మీది పీటలపై 4 మూరల వరకూ తామర పూవుల్లాంటి ఆకృతులు ఉన్నాయి.

1 రాజులు 7:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రెండు స్తంభాల మీద ఉన్న పీటలమీది అల్లిక పని దగ్గర ఉన్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉన్నాయి. రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పీట చుట్టూ వరుసలుగా ఉన్నాయి.

1 రాజులు 7:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ స్తంభాలను అతడు పరిశుద్ధ స్థలం మంటపంలో నిలబెట్టాడు. కుడి పక్కన ఉన్న స్తంభానికి “యాకీను” అని పేరు పెట్టాడు. ఎడమ పక్కన ఉన్న స్తంభానికి “బోయజు” అని పేరు పెట్టాడు.

1 రాజులు 7:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ స్తంభాల మీద తామర పూవుల్లాంటి చెక్కడం పని ఉంది. ఈ విధంగా స్తంభాల పని పూర్తి అయ్యింది.

1 రాజులు 7:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హీరాము పోత పనితో ఒక గుండ్రని సరస్సు తొట్టిని చేశాడు. అది ఈ చివరి పై అంచు నుండి ఆ చివరి పై అంచు దాకా 10 మూరలు. దాని ఎత్తు 5 మూరలు, చుట్టుకొలత 30 మూరలు.

1 రాజులు 7:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని పై అంచుకు కింద, చుట్టూ గుబ్బలున్నాయి. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సరస్సు చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఆ సరస్సును పోత పోసినప్పుడు ఆ గుబ్బలను రెండు వరసలుగా పోత పోశారు.

1 రాజులు 7:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సరస్సు 12 ఎద్దుల ఆకారాల మీద నిలబడి ఉంది. వీటిలో మూడు ఉత్తర దిక్కుకూ మూడు పడమర దిక్కుకూ మూడు దక్షిణ దిక్కుకూ మూడు తూర్పు దిక్కుకూ చూస్తున్నాయి. వీటి మీద ఆ సరస్సు నిలబెట్టి ఉంది. ఎద్దుల వెనక భాగాలన్నీ లోపలి వైపుకు ఉన్నాయి.

1 రాజులు 7:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సరస్సు మందం బెత్తెడు. దాని పై అంచుకు పాత్రకు పై అంచులాగా తామర పూవుల్లాంటి పోత పని ఉంది. అందులో సుమారు 2,000 తొట్టెలు నీరు పడుతుంది.

1 రాజులు 7:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హీరాము 10 ఇత్తడి స్తంభాలు చేశాడు. ఒక్కొక్క స్తంభం 4 మూరల పొడవు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు ఉన్నాయి.

1 రాజులు 7:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ స్తంభాలు ఏ విధంగా చేశారంటే, వాటికి పార్శ్వాల్లో పలకలు ఉన్నాయి. ఆ పక్క పలకలు చట్రాల మధ్య అమర్చారు.

1 రాజులు 7:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చట్రాల మధ్యలో ఉన్న పక్క పలకల మీదా చట్రాల మీదా సింహాల, ఎద్దుల, కెరూబుల రూపాలు ఉన్నాయి. సింహాల కిందా ఎద్దుల కిందా వేలాడుతున్న పూదండలు ఉన్నాయి.

1 రాజులు 7:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి స్తంభానికీ నాలుగేసి ఇత్తడి చక్రాలు, ఇత్తడి ఇరుసులు ఉన్నాయి. ప్రతిపీఠం నాలుగు మూలల్లో దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలను తొట్టి కింద అతికిన ప్రతి స్థలం దగ్గరా పోత పోశారు.

1 రాజులు 7:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పీఠం పైన దాని మూతి ఉంది. దాని వెడల్పు మూరెడు. అయితే మూతి కింద స్తంభం గుండ్రంగా ఉండి మూరన్నర వెడల్పు ఉంది. ఆ మూతి మీద పక్కలు గల చెక్కిన పనులు ఉన్నాయి. ఇవి గుండ్రంగా గాక చదరంగా ఉన్నాయి.

1 రాజులు 7:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పక్క పలకల కింద 4 చక్రాలు ఉన్నాయి. చక్రాల ఇరుసులు స్తంభాలతో అతికించి ఉన్నాయి. ఒక్కొక్క చక్రం మూరన్నర వెడల్పు ఉన్నాయి.

1 రాజులు 7:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ చక్రాల పని రథ చక్రాల పనిలాగా ఉంది. వాటి ఇరుసులూ అంచులూ అడ్డకర్రలూ నడిమి భాగాలూ పోత పనితో చేశారు.

1 రాజులు 7:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి స్తంభం నాలుగు మూలల్లో నాలుగు దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలూ స్తంభమూ కలిపే పోత పోశారు.

1 రాజులు 7:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పీఠం పైన చుట్టూ జానెడు ఎత్తు ఉన్న గుండ్రని బొద్దు ఉంది. పీఠం పైన ఉన్న మోతలూ పక్క పలకలూ దానితో కలిసిపోయి ఉన్నాయి.

1 రాజులు 7:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని మోతల పలకల మీదా దాని పక్క పలకల మీదా, హీరాము కెరూబులనూ సింహాలనూ తమాల వృక్షాలనూ ఒక్కొక్కదాని చోటును బట్టి చుట్టూ దండలతో వాటిని చెక్కాడు.

1 రాజులు 7:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా అతడు పదింటిని చేశాడు. అన్నిటి పోత, పరిమాణం, రూపం ఒకేలా ఉన్నాయి.

1 రాజులు 7:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత అతడు 10 ఇత్తడి తొట్టెలు చేశాడు. ప్రతి తొట్టి 880 లీటర్లు నీరు పడుతుంది. ఒక్కొక్క తొట్టి వైశాల్యం 4 మూరలు. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి ఉంచాడు.

1 రాజులు 7:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరం కుడి పక్కన 5 స్తంభాలు, ఎడమ పక్కన 5 స్థంభాలు ఉంచాడు. సరస్సు దేవాలయానికి కుడి వైపు ఆగ్నేయ దిశగా మందిరం కుడి పక్కన ఉంచాడు.

1 రాజులు 7:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హీరాము తొట్లనూ చేటలనూ గిన్నెలనూ చేశాడు. ఈ విధంగా హీరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం పని అంతా పూర్తి చేశాడు.

1 రాజులు 7:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న పైపీటల పళ్ళేలు, వాటిని కప్పిన రెండు అల్లికలు ఉన్నాయి.

1 రాజులు 7:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ స్తంభాల మీద ఉన్న పై పీటల రెండు పళ్ళాలను, కప్పిన అల్లిక ఒకదానికి రెండు వరసలతో రెండు అల్లికలకు 400 దానిమ్మపండ్లనూ

1 రాజులు 7:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
10 స్తంభాలనూ స్తంభాల మీద 10 తొట్లనూ

1 రాజులు 7:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక సరస్సును, సరస్సు కింద 12 ఎద్దులూ,

1 రాజులు 7:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బిందెలూ, చేటలూ, గిన్నెలూ వీటినన్నిటినీ సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం హీరాము యెహోవా మందిరానికి చేశాడు. ఈ వస్తువులన్నీ మెరుగు పెట్టిన ఇత్తడితో చేసారు.

1 రాజులు 7:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యొర్దాను మైదానంలో సుక్కోతు, సారెతానుల మధ్య ఉన్న బంక మట్టి నేలలో రాజు వాటిని పోత పోయించాడు.

1 రాజులు 7:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఈ వస్తువులు చాలా ఎక్కువగా ఉండడం వలన సొలొమోను వాటి బరువు తూయడం మానేశాడు. ఇత్తడి బరువు ఎంతో తెలుసుకోడానికి వీల్లేకుండా పోయింది.

1 రాజులు 7:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోను యెహోవా మందిరానికి చెందిన ఇతర సామగ్రిని కూడా చేయించాడు. అవేవంటే, బంగారు బలిపీఠం, సముఖపు రొట్టెలను ఉంచే బంగారు బల్లలు,

1 రాజులు 7:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గర్భాలయం ఎదుట కుడి పక్కన 5, ఎడమ పక్కన 5, మొత్తం పది బంగారు దీపస్తంభాలు, బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పట్టుకారులు.

1 రాజులు 7:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే మేలిమి బంగారు పాత్రలు, కత్తెరలు, గిన్నెలు, ధూపకలశాలు, లోపలి మందిరం అనే అతి పరిశుద్ధ స్థలం తలుపులు, ఆలయం హాలు తలుపులు, వాటి బంగారు బందులు, వీటన్నిటినీ చేయించాడు.

1 రాజులు 7:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా సొలొమోను రాజు యెహోవా మందిరానికి చేసిన పని అంతా పూర్తి అయ్యింది. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారాన్ని, సామగ్రిని తెప్పించి యెహోవా మందిరం ఖజానాలో ఉంచాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Kings 7 (ASV) »
King James Version (KJV)
1 Kings 7 (KJV) »
GOD’S WORD® (GW)
1 Kings 7 (GW) »
Berean Bible (BSB)
1 Kings 7 (BSB) »
World English Bible (WEB)
1 Kings 7 (WEB) »
French Bible (LSG)
1 Rois 7 (LSG) »
German Bible (LUTH1912)
1 Könige 7 (LUTH1912) »
Marathi Bible (MARIRV)
1 राजे 7 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
1 રાજાઓ 7 (GUJIRV) »
Hebrew Bible (HEB)
מלכים א 7 (HEB) »
Portuguese Bible (BSL)
1 Reis 7 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Các Vua 7 (VIE) »
Spanish Bible (RVA)
1 Reyes 7 (RVA) »
Italian Bible (RIV)
1 Re 7 (RIV) »
Chinese Simplified (CUVS)
列 王 记 上 7 (CUVS) »
Chinese Traditional (CUVT)
列 王 紀 上 7 (CUVT) »
Albanian Bible (ALB)
1 Mbretërve 7 (ALB) »
Swedish Bible (SV1917)
1 Kungaboken 7 (SV1917) »
Russian Bible (RUSV)
3 Царств 7 (RUSV) »
Ukrainian Bible (UKR)
1 царів 7 (UKR) »
Hungarian Bible (KAR)
1 Királyok 7 (KAR) »
Bulgarian Bible (BULG)
3 Царе 7 (BULG) »
Japanese Bible (JPN)
列王紀上 7 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Kongebok 7 (NORSK) »

1 రాజులు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List