1 రాజులు Chapter 15 TELIRV Bible Verse Images

1 రాజులు 15 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 రాజులు 15 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 రాజులు 15:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెబాతు కొడుకు యరొబాము రాజు పరిపాలన 18 వ సంవత్సరంలో అబీయా యూదాను పాలించడం మొదలెట్టాడు.

1 రాజులు 15:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యెరూషలేములో మూడేళ్ళు రాజుగా ఉన్నాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కూతురు.

1 రాజులు 15:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు గతంలో తన తండ్రి చేసిన దుర్మార్గాలన్నిటినీ చేశాడు. తన పూర్వీకుడైన దావీదు హృదయం తన దేవుడు యెహోవా పట్ల యథార్ధంగా ఉన్నట్టుగా అతని హృదయం యథార్ధంగా లేదు.

1 రాజులు 15:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప తన జీవితమంతా యెహోవా దృష్టికి యథార్ధంగా నడుచుకొంటూ యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో ఏ విషయంలోనూ తప్పిపోలేదు.

1 రాజులు 15:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకే దావీదు కోసం అతని తరువాత అతని సంతానం వాణ్ణి నిలపడానికీ యెరూషలేమును స్థిరపరచడానికీ అతని దేవుడు యెహోవా యెరూషలేములో ఒక దీపంగా అతనిని ఉంచాడు.

1 రాజులు 15:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెహబాము బతికిన రోజులన్నీ అతనికీ యరొబాముకూ యుద్ధం జరుగుతూ ఉండేది.

1 రాజులు 15:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీయా యరొబాముల మధ్య కూడా యుద్ధం జరుగుతూ ఉండేది. అబీయా గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన వాటన్నిటిని గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

1 రాజులు 15:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీయా చనిపోగా తన పూర్వీకులతో పాటు దావీదు పట్టణంలో అతన్ని సమాధిచేశారు. అతని కొడుకు ఆసా అతనికి బదులు రాజయ్యాడు.

1 రాజులు 15:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు రాజు యరొబాము పాలన 25 వ సంవత్సరంలో ఆసా యూదా వారిని పరిపాలించడం మొదలెట్టాడు.

1 రాజులు 15:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు 40 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని అవ్వ పేరు మయకా, ఈమె అబీషాలోము కూతురు.

1 రాజులు 15:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆసా తన పూర్వీకుడైన దావీదులాగా యెహోవా దృష్టికి యథార్ధంగా నడుచుకుని

1 రాజులు 15:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మగ వ్యభిచారులను దేశంలోనుండి వెళ్లగొట్టి తన పూర్వీకులు చేయించిన విగ్రహాలన్నిటినీ పడగొట్టాడు.

1 రాజులు 15:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన అవ్వ మయకా అసహ్యమైన ఒక అషేరా దేవతా స్తంభాన్ని చేయిస్తే ఆసా ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి, కిద్రోను లోయ పక్కన దాన్ని కాల్చివేశాడు. పట్టపు రాణి పదవి నుండి ఆమెను తొలగించాడు.

1 రాజులు 15:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆసా తన జీవితమంతా హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాడు గాని ఉన్నత స్థలాలను తీసి వేయలేదు.

1 రాజులు 15:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులనూ తాను ప్రతిష్ఠించిన వస్తువులనూ వెండి బంగారాన్నీ యెహోవా మందిరంలోకి తెప్పించాడు.

1 రాజులు 15:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆసాకు, ఇశ్రాయేలు రాజు బయెషాకు వారు బతికిన రోజులన్నీ యుద్ధం జరుగుతూ ఉండేది.

1 రాజులు 15:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు రాజు బయెషా యూదా వారికి విరోధిగా ఉండి, యూదా రాజు ఆసా దగ్గరనుండి ఎవరూ రాకుండా అతని దగ్గరికి ఎవరూ పోకుండా రమా పట్టణాన్ని కట్టించాడు.

1 రాజులు 15:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోనూ రాజభవనపు ఖజానాలోనూ మిగిలిన వెండి బంగారమంతా తీసి తన సేవకులకు ఇచ్చి, దమస్కులో నివసిస్తున్న సిరియా రాజు బెన్హదదుకు పంపించాడు. బెన్హదదు హెజ్యోనుకు పుట్టిన టబ్రిమ్మోను కొడుకు. ఆసా ఇలా మనవి చేశాడు.

1 రాజులు 15:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీ నాన్నకూ మా నాన్నకూ ఒప్పందం ఉన్నట్టుగా నీకూ నాకూ ఒప్పందం ఉండాలి. వెండి బంగారాలను నీకు కానుకగా పంపిస్తున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజు బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీకున్న పొత్తు రద్దు చేసుకో.”

1 రాజులు 15:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి బెన్హదదు ఆసా రాజు చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపి, ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు ప్రాంతాలనూ నఫ్తాలి దేశాన్నీ కొల్లగొట్టాడు.

1 రాజులు 15:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బయెషాకు అది తెలిసి, రమా పట్టణం కట్టడం మాని తిర్సాకు వెళ్లి అక్కడే నివసించాడు.

1 రాజులు 15:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆసా రాజు ఎవరినీ మినహాయించకుండా యూదా దేశం వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు సమకూడి వచ్చి బయెషా కట్టిస్తున్న రమా పట్టణం రాళ్లనూ కర్రలనూ ప్రజలు తీసుకొచ్చేశారు. ఆసా రాజు వాటిని బెన్యామీను ప్రాంతంలో గెబ, మిస్పా కట్టించడానికి ఉపయోగించాడు.

1 రాజులు 15:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆసా గురించిన మిగతా విషయాలు, అతని బలప్రభావాలూ అతడు చేసినదంతా అతడు కట్టించిన పట్టణాలను గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి వుంది. ముసలితనంలో అతని పాదాలకు జబ్బు చేసింది.

1 రాజులు 15:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆసా చనిపోయాడు. అతనిని దావీదు పట్టణంలో తన పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు. అతనికి బదులు అతని కొడుకు యెహోషాపాతు రాజయ్యాడు.

1 రాజులు 15:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదారాజు ఆసా పరిపాలన రెండో ఏట యరొబాము కొడుకు నాదాబు పరిపాలించడం మొదలుపెట్టి ఇశ్రాయేలు వారిని రెండేళ్ళు పాలించాడు.

1 రాజులు 15:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన దారిలో నడిచి, తన తండ్రి దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో ఆ పాపాన్ని అనుసరించి ప్రవర్తించాడు.

1 రాజులు 15:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్శాఖారు గోత్రీకుడూ అహీయా కొడుకు బయెషా నాదాబుపై కుట్ర చేశాడు. నాదాబు, ఇశ్రాయేలు వారంతా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును ముట్టడిస్తూ ఉన్న సమయంలో గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపాడు.

1 రాజులు 15:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజైన ఆసా పాలన మూడో ఏట బయెషా అతన్ని చంపి అతనికి బదులు రాజయ్యాడు.

1 రాజులు 15:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తాను రాజు కాగానే అతడు యరొబాము వంశం వారందరినీ చంపేశాడు. యరొబాము వంశంలో ప్రాణంతో ఉన్న ఎవర్నీ వదిలి పెట్టకుండా అందరినీ చంపేశాడు. తన సేవకుడు షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా చెప్పినట్టు ఇది జరిగింది.

1 రాజులు 15:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యరొబాము చేసిన పాపాలను బట్టి, ఇశ్రాయేలువారు పాపం చేయడానికి అతడు కారణమైనందుకు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం రేపినందుకు ఇలా జరిగింది.

1 రాజులు 15:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాదాబు గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.

1 రాజులు 15:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు బతికినంత కాలం, ఆసాకూ ఇశ్రాయేలు రాజు బయెషాకూ మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది.

1 రాజులు 15:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదారాజు ఆసా పాలన మూడో ఏట అహీయా కొడుకు బయెషా తిర్సా పట్టణంలో ఇశ్రాయేలు వారందరినీ పాలించడం మొదలుపెట్టి 24 ఏళ్ళు పాలించాడు.

1 రాజులు 15:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతడు కూడాయెహోవా దృష్టికి చెడుగా నడుచుకుని యరొబాము ఎలా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో దానంతటినీ అనుసరించి ప్రవర్తించాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Kings 15 (ASV) »
King James Version (KJV)
1 Kings 15 (KJV) »
GOD’S WORD® (GW)
1 Kings 15 (GW) »
Berean Bible (BSB)
1 Kings 15 (BSB) »
World English Bible (WEB)
1 Kings 15 (WEB) »
French Bible (LSG)
1 Rois 15 (LSG) »
German Bible (LUTH1912)
1 Könige 15 (LUTH1912) »
Marathi Bible (MARIRV)
1 राजे 15 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
1 રાજાઓ 15 (GUJIRV) »
Hebrew Bible (HEB)
מלכים א 15 (HEB) »
Portuguese Bible (BSL)
1 Reis 15 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Các Vua 15 (VIE) »
Spanish Bible (RVA)
1 Reyes 15 (RVA) »
Italian Bible (RIV)
1 Re 15 (RIV) »
Chinese Simplified (CUVS)
列 王 记 上 15 (CUVS) »
Chinese Traditional (CUVT)
列 王 紀 上 15 (CUVT) »
Albanian Bible (ALB)
1 Mbretërve 15 (ALB) »
Swedish Bible (SV1917)
1 Kungaboken 15 (SV1917) »
Russian Bible (RUSV)
3 Царств 15 (RUSV) »
Ukrainian Bible (UKR)
1 царів 15 (UKR) »
Hungarian Bible (KAR)
1 Királyok 15 (KAR) »
Bulgarian Bible (BULG)
3 Царе 15 (BULG) »
Japanese Bible (JPN)
列王紀上 15 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Kongebok 15 (NORSK) »

1 రాజులు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List