1 రాజులు Chapter 14 TELIRV Bible Verse Images

1 రాజులు 14 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 రాజులు 14 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 రాజులు 14:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదే రోజుల్లో యరొబాము కొడుకు అబీయాకు జబ్బు చేసింది.

1 రాజులు 14:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు. “నీవు లేచి యరొబాము భార్యవని ఎవరికీ తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహు వెళ్ళు. ఈ ప్రజల మీద నేను రాజునవుతానని నాకు చెప్పిన ప్రవక్త అహీయా అక్కడున్నాడు.

1 రాజులు 14:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నీవు పది రొట్టెలూ కొన్ని తీపి రొట్టెలు, ఒక సీసా నిండా తేనె తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. అబ్బాయికి ఏమవుతుందో అతడు నీకు చెబుతాడు.”

1 రాజులు 14:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యరొబాము భార్య అలానే చేసింది. ఆమె షిలోహులోని అహీయా ఇంటికి వెళ్ళింది. ముసలితనం వలన అహీయా కళ్ళు కనిపించడం లేదు.

1 రాజులు 14:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా అహీయాతో “యరొబాము కొడుకు జబ్బుగా ఉన్నాడు కాబట్టి అతని గురించి నీ దగ్గర సలహా కోసం యరొబాము భార్య వస్తూ ఉంది. ఆమె మారువేషం వేసుకుని మరొక స్త్రీలాగా నటిస్తుంది. నేను నీకు చెప్పేది నీవు ఆమెతో చెప్పాలి” అన్నాడు.

1 రాజులు 14:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గుమ్మం గుండా ఆమె వస్తున్న కాలి చప్పుడు విని అహీయా ఆమెతో ఇలా అన్నాడు. “యరొబాము భార్యా, లోపలికి రా! నీవు వేషం వేసుకుని రావడం ఎందుకు? కఠినమైన మాటలు నీకు చెప్పాలని దేవుడు నాకు చెప్పాడు.

1 రాజులు 14:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు వెళ్లి యరొబాముతో ఇలా చెప్పు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, ‘నేను నిన్ను ప్రజల్లో నుంచి హెచ్చించి నా ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను అధికారిగా నియమించాను.

1 రాజులు 14:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు వంశం నుంచి రాజ్యాన్ని తీసి నీకిచ్చాను. అయినా నీవు నా సేవకుడైన దావీదు చేసినట్టు చేయలేదు. అతడు హృదయపూర్వకంగా నన్ను అనుసరించి, నా ఆజ్ఞలు గైకొని నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేశాడు.

1 రాజులు 14:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి బదులు నీవు నీకు ముందున్న వారందరికంటే ఎక్కువ దుర్మార్గం చేశావు. నన్ను పూర్తిగా వదిలేశావు. నీ కోసం ఇతర దేవుళ్ళను చేయించుకున్నావు, పోత విగ్రహాలను పెట్టించుకుని నాకు కోపం పుట్టించావు.

1 రాజులు 14:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నీ కుటుంబం మీదకు నేను కీడు రప్పిస్తాను. ఇశ్రాయేలు వారిలో చిన్నవారనీ పెద్దవారనీ తేడా లేకుండా చెత్తనంతా పూర్తిగా కాల్చినట్టు మగపిల్లలందరినీ నిర్మూలం చేస్తాను.

1 రాజులు 14:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పట్టణంలో చనిపోయే నీ కుటుంబానికి చెందిన వారిని కుక్కలు తింటాయి. బయట పొలంలో చనిపోయే వారిని రాబందులు తింటాయి. ఈ మాటలు చెప్పేది, యెహోవానైన నేనే.’

1 రాజులు 14:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నీవు లేచి నీ ఇంటికి వెళ్ళు, నీవు పట్టణంలో అడుగుపెట్టగానే నీ బిడ్డ చనిపోతాడు.

1 రాజులు 14:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని కోసం ఇశ్రాయేలు వారంతా దుఃఖిస్తూ అతన్ని సమాధి చేస్తారు. ఇతన్ని మాత్రమే సమాధి చేస్తారు, ఎందుకంటే యరొబాము వంశంలో ఇతడొక్కడిలోనే ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కొంచెం మంచి కనిపించింది.

1 రాజులు 14:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతేకాక యెహోవా ఇశ్రాయేలు వారి మీద ఒక రాజును నియమించబోతున్నాడు. ఆ రోజునే అతడు యరొబాము వంశాన్ని నాశనం చేస్తాడు. ఇదే ఆ రోజు.

1 రాజులు 14:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలువారు అషేరా దేవతా స్తంభాలను నిలబెట్టి యెహోవాకు కోపం పుట్టించారు, కాబట్టి నీళ్ళల్లో రెల్లు ఊగుతున్నట్టు యెహోవా ఇశ్రాయేలు వారిని ఊపేస్తాడు. వారి పూర్వీకులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని ఊడబెరికి, వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొడతాడు.

1 రాజులు 14:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తానే పాపం చేసి ఇశ్రాయేలువారు పాపం చేయడానికి కారణమైన యరొబాము పాపాలను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని శిక్షించబోతున్నాడు.”

1 రాజులు 14:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యరొబాము భార్య లేచి, తిర్సా పట్టణానికి వెళ్లిపోయింది. ఆమె వాకిట్లో అడుగు పెట్టడంతోనే ఆమె కొడుకు చనిపోయాడు.

1 రాజులు 14:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తన సేవకుడు అహీయా ప్రవక్త ద్వారా చెప్పినట్టు ఇశ్రాయేలు వారంతా అతన్ని సమాధి చేసి అతని కోసం దుఖించారు.

1 రాజులు 14:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యరొబాము గురించిన ఇతర విషయాలను, అతడు చేసిన యుద్ధాలను గురించి, పరిపాలన గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.

1 రాజులు 14:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యరొబాము 22 ఏళ్ళు పాలించాడు. అతడు చనిపోయినప్పుడు అతన్ని పూర్వీకుల సరసన పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు నాదాబు రాజయ్యాడు.

1 రాజులు 14:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదాదేశంలో సొలొమోను కొడుకు రెహబాము పాలించాడు. రెహబాము 41 ఏళ్ల వయస్సులో పరిపాలించడం మొదలెట్టాడు. తన పేరు నిలపడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న యెరూషలేము అనే పట్టణంలో అతడు 17 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా.

1 రాజులు 14:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదావారు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. తమ పూర్వీకులకంటే ఎక్కువ పాపం చేస్తూ ఆయనకు రోషం పుట్టించారు.

1 రాజులు 14:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా పూజా స్థలాలను కట్టి, విగ్రహాలు నిలిపి, అషేరా దేవతాస్తంభాలను ఉంచారు.

1 రాజులు 14:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా దేశంలో దేవస్థానాలకు అనుబంధంగా మగ వ్యభిచారులు కూడా ఉన్నారు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజలు చేసే నీచమైన పనులను యూదావారు కూడా చేస్తూ వచ్చారు.

1 రాజులు 14:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెహబాము రాజు పాలిస్తున్న ఐదో సంవత్సరంలో ఐగుప్తు రాజు షీషకు యెరూషలేముపై దండెత్తాడు.

1 రాజులు 14:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మందిరపు ఖజనాలోని వస్తువులు, రాజభవనపు ఖజనాలోని వస్తువులు, అన్నిటినీ దోచుకుపోయాడు. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను కూడా అతడు దోచుకుపోయాడు.

1 రాజులు 14:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెహబాము రాజు వీటికి బదులు ఇత్తడి డాళ్లను చేయించి, రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల నాయకునికి అప్పచెప్పాడు.

1 రాజులు 14:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు యెహోవా మందిరానికి వెళ్ళే ప్రతిసారీ భటులు వాటిని మోసుకు పోయేవారు. తరువాత వాటిని భద్రమైన గదిలో ఉంచేవారు.

1 రాజులు 14:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెహబాము గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి వుంది.

1 రాజులు 14:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బ్రతికినంత కాలం రెహబాముకూ యరొబాముకూ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది.

1 రాజులు 14:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెహబాము చనిపోయినప్పుడు దావీదు నగరంలోని అతని పూర్వీకుల సమాధిలో అతన్ని పాతిపెట్టారు. అతని తల్లి నయమా అమ్మోనీయురాలు. అతని కొడుకు అబీయా అతని స్థానంలో రాజయ్యాడు.

Available Bible Translations

American Standard Version
1 Kings 14 (ASV) »
King James Version
1 Kings 14 (KJV) »
GOD’S WORD® (GW)
1 Kings 14 (GW) »
World English Bible
1 Kings 14 (WEB) »
Louis Segond 1910
1 Rois 14 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 राजाओं 14 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਰਾਜਿਆਂ 14 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 ৰাজাৱলী 14 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 இராஜாக்கள் 14 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 राजे 14 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
1 રાજાઓ 14 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಅರಸುಗಳು 14 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمُلُوكِ ٱلْأَوَّلُ 14 (AVD) »
תנ ך עברי מודרני
מלכים א 14 (HEB) »
Bíblia Sagrada Português
1 Reis 14 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Các Vua 14 (VIE) »
Reina Valera Antigua
1 Reyes 14 (RVA) »
La Sacra Bibbia
1 Re 14 (RIV) »
圣 经 简体中文和合本
列 王 记 上 14 (CUVS) »
聖 經 繁體中文和合本
列 王 紀 上 14 (CUVT) »
Svenska Bibeln 1917
1 Kungaboken 14 (SV1917) »
Библия на русском
3 Царств 14 (RUSV) »
Українська Біблія
1 царів 14 (UKR) »
Szent Biblia - Magyar
1 Királyok 14 (KAR) »
Българска Библия
3 Царе 14 (BULG) »
Kitaabka Quduuska Ah
Boqorradii Kowaad 14 (SOM) »
De Heilige Schrift
1 Koningen 14 (NLD) »

1 రాజులు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List