1 రాజులు Chapter 4 TELIRV Bible Verse Images

1 రాజులు 4 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 రాజులు 4 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 రాజులు 4:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి మీదా రాజయ్యాడు.

1 రాజులు 4:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని దగ్గర ఉన్న అధికారులు ఎవరంటే, సాదోకు కొడుకు అజర్యా యాజకుడు,

1 రాజులు 4:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షీషా కొడుకులు ఎలీహోరెపు, అహీయా ప్రధాన మంత్రులు, అహీలూదు కొడుకు యెహోషాపాతు లేఖికుడు.

1 రాజులు 4:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోయాదా కొడుకు బెనాయా సైన్యాధిపతి, సాదోకు, అబ్యాతారు యాజకులు.

1 రాజులు 4:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాతాను కొడుకు అజర్యా అధికారుల పైఅధికారిగా ఉన్నాడు. నాతాను మరో కొడుకు జాబూదు యాజకుడు, రాజు చెలికాడు.

1 రాజులు 4:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కొడుకు అదోనీరాము వెట్టి చాకిరీ పనివాళ్ళపై అధికారి.

1 రాజులు 4:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులందరి మీదా సొలొమోను 12 మంది అధికారులను నియమించాడు. వీరు రాజుకు, అతని ఇంటివారికి ఆహారం ఏర్పాటు చేసేవారు. సంవత్సరంలో ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారం సరఫరా చేసే బాధ్యత వహించాడు.

1 రాజులు 4:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారెవరంటే, ఎఫ్రాయిము మన్యంలో ఉండే హూరు కొడుకు,

1 రాజులు 4:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మాకస్సులో, షయల్బీములో, బేత్షెమెషులో, ఏలోన్ బేత్ హనాన్లో దెకెరు కొడుకు,

1 రాజులు 4:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అరుబ్బోతులో హెసెదు కొడుకు, ఇతనికి శోకో, హెపెరు దేశాలు అప్పగించారు.

1 రాజులు 4:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీనాదాబు కొడుక్కి దోరు మన్య ప్రదేశమంతా అప్పగించారు. సొలొమోను కూతురు టాపాతు ఇతని భార్య.

1 రాజులు 4:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహీలూదు కొడుకు బయనాకు తానాకు, మెగిద్దో, బేత్షెయాను ప్రదేశమంతా అప్పగించారు. ఇది యెజ్రెయేలు దగ్గర ఉన్న సారెతా నుండి బేత్షెయాను మొదలు ఆబేల్మెహోలా వరకూ యొక్నెయాము అవతలి స్థలం వరకూ వ్యాపించింది.

1 రాజులు 4:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గెబెరు కొడుకు రామోత్గిలాదులో కాపురమున్నాడు. ఇతనికి గిలాదులో ఉన్న మనష్షే కుమారుడు యాయీరు గ్రామాలు, బాషానులో ఉన్న అర్గోబు దేశం అప్పగించారు. అది ప్రాకారాలు, ఇత్తడి అడ్డగడియలు ఉన్న 60 గొప్ప పట్టణాలున్న ప్రాంతం.

1 రాజులు 4:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇద్దో కొడుకు అహీనాదాబు మహనయీములో ఉండగా

1 రాజులు 4:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నఫ్తాలీము దేశంలో అహిమయస్సు ఉన్నాడు. ఇతడు సొలొమోను కూతురు బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు.

1 రాజులు 4:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆషేరులో, ఆలోతులో హూషై కొడుకైన బయనా ఉండేవాడు.

1 రాజులు 4:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్శాఖారు దేశంలో పరూయహు కొడుకు యెహోషాపాతు ఉండేవాడు.

1 రాజులు 4:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీను దేశంలో ఏలా కొడుకు షిమీ ఉండేవాడు.

1 రాజులు 4:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గిలాదు దేశంలో, అమోరీయుల రాజు సీహోను దేశంలో, బాషాను రాజు ఓగు దేశంలో, ఊరీ కొడుకైన గెబెరు ఉన్నాడు. అతడు ఒక్కడే ఆ దేశంలో అధికారి.

1 రాజులు 4:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యూదావారూ ఇశ్రాయేలు వారూ సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సమూహంగా ఉండి తింటూ, తాగుతూ, సంబరపడుతూ ఉన్నారు.

1 రాజులు 4:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నది (యూఫ్రటీసు) మొదలుకుని ఐగుప్తు సరిహద్దు వరకూ ఆ మధ్యలో ఉన్న రాజ్యాలన్నిటి మీదా ఫిలిష్తీయుల దేశమంతటి మీదా సొలొమోను అధికారం ఉంది. సొలొమోను బతికిన కాలమంతా ఆ ప్రజలు అతనికి పన్ను చెల్లిస్తూ, అణిగిమణిగి ఉన్నారు.

1 రాజులు 4:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రోజుకి సొలొమోను భోజన సామగ్రి 600 తూముల మెత్తని గోదుమ పిండి, 1, 200 తూముల ముతక పిండి,

1 రాజులు 4:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పది కొవ్విన ఎద్దులు, గడ్డి మైదానాల నుండి తెచ్చిన ఎద్దులు 20, గొర్రెలు 100. ఇవిగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు.

1 రాజులు 4:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూఫ్రటీసు నది ఇవతల తిప్సహు నుండి గాజా వరకూ నది ఇవతల ఉన్న రాజులందరి మీదా సొలోమోనుకు అధికారముంది. అతని కాలంలో నాలుగు దిక్కులా శాంతి నెలకొంది.

1 రాజులు 4:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోను కాలమంతా ఇశ్రాయేలు వారూ యూదా వారూ దాను నుండి బెయేర్షెబా వరకూ తమ తమ ద్రాక్షచెట్ల కిందా అంజూరపు చెట్ల కిందా నిర్భయంగా నివసించారు.

1 రాజులు 4:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోను రాజు రథాల కోసం శాలల్లో 40,000 గుర్రాలు, అశ్విక దళానికి 12,000 గుర్రాలు ఉండేవి.

1 రాజులు 4:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోనుకు, అతని భోజనపు బల్ల దగ్గరికి వచ్చిన వారికందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ప్రతి ఒక్కడూ తనకు అప్పగించిన నెలను బట్టి ఆహారం పంపుతూ వచ్చారు.

1 రాజులు 4:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్న వివిధ స్థలాలకు ప్రతివాడూ తన బాధ్యతను బట్టి బార్లీ, ఎండు గడ్డి తెచ్చి ఇచ్చేవాడు.

1 రాజులు 4:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్నీ బుద్ధినీ అత్యంత వివేచన గల మనస్సునూ దయ చేశాడు.

1 రాజులు 4:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనికి కలిగిన జ్ఞానం తూర్పుదేశాల వారి జ్ఞానం కంటే, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటే మించిపోయింది.

1 రాజులు 4:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు మానవులందరి కంటే, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కొడుకులు హేమాను, కల్కోలు, దర్ద అనేవారి కంటే జ్ఞానవంతుడు. కాబట్టి అతని కీర్తి చుట్టూ ఉన్న ప్రజలందరిలో వ్యాపించింది.

1 రాజులు 4:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు 3,000 సామెతలు చెప్పాడు. 1,005 కీర్తనలు రచించాడు.

1 రాజులు 4:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లెబానోనులో పెరిగే దేవదారు వృక్షమే గాని, గోడలో నుండి మొలిచే హిస్సోపు మొక్కే గాని, చెట్లన్నిటిని గూర్చీ అతడు రాశాడు. ఇంకా మృగాలు, పక్షులు, పాకే జంతువులు, జలచరాలు, అన్నిటిని గురించీ అతడు రాశాడు.

1 రాజులు 4:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని జ్ఞానం గురించి వినిన భూరాజులందరిలో నుండీ ప్రజలందరిలో నుండీ అతని జ్ఞానవాక్కులు తెలుసుకోడానికి మనుషులు సొలొమోను దగ్గరకి వచ్చారు.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Kings 4 (ASV) »
King James Version (KJV)
1 Kings 4 (KJV) »
GOD’S WORD® (GW)
1 Kings 4 (GW) »
Berean Bible (BSB)
1 Kings 4 (BSB) »
World English Bible (WEB)
1 Kings 4 (WEB) »
French Bible (LSG)
1 Rois 4 (LSG) »
German Bible (LUTH1912)
1 Könige 4 (LUTH1912) »
Marathi Bible (MARIRV)
1 राजे 4 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
1 રાજાઓ 4 (GUJIRV) »
Hebrew Bible (HEB)
מלכים א 4 (HEB) »
Portuguese Bible (BSL)
1 Reis 4 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Các Vua 4 (VIE) »
Spanish Bible (RVA)
1 Reyes 4 (RVA) »
Italian Bible (RIV)
1 Re 4 (RIV) »
Chinese Simplified (CUVS)
列 王 记 上 4 (CUVS) »
Chinese Traditional (CUVT)
列 王 紀 上 4 (CUVT) »
Albanian Bible (ALB)
1 Mbretërve 4 (ALB) »
Swedish Bible (SV1917)
1 Kungaboken 4 (SV1917) »
Russian Bible (RUSV)
3 Царств 4 (RUSV) »
Ukrainian Bible (UKR)
1 царів 4 (UKR) »
Hungarian Bible (KAR)
1 Királyok 4 (KAR) »
Bulgarian Bible (BULG)
3 Царе 4 (BULG) »
Japanese Bible (JPN)
列王紀上 4 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Kongebok 4 (NORSK) »

1 రాజులు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List