1 రాజులు Chapter 21 TELIRV Bible Verse Images

1 రాజులు 21 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 రాజులు 21 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 రాజులు 21:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెజ్రెయేలులో సమరయ రాజు అహాబు భవనాన్ని ఆనుకుని యెజ్రెయేలు వాడు నాబోతుకు ఒక ద్రాక్షతోట ఉంది.

1 రాజులు 21:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహాబు నాబోతును పిలిపించి “నీ ద్రాక్షతోట నా భవనాన్ని ఆనుకుని ఉంది. కాబట్టి అది నాకివ్వు. దానిలో కూరగాయలు పండించుకుంటాను. దానికి బదులు దాని కంటే మంచి ద్రాక్షతోట నీకిస్తాను. లేకపోతే దాని ఖరీదైనా ఇస్తాను” అన్నాడు.

1 రాజులు 21:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు నాబోతు “నా పిత్రార్జితాన్ని నీకివ్వడానికి నాకెంత మాత్రం కుదరదు” అన్నాడు.

1 రాజులు 21:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా పిత్రార్జితాన్ని నీకివ్వనని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పినందువల్ల అహాబు విచారంగా కోపంతో తన భవనానికి వెళ్లిపోయాడు. మంచం మీద పడుకుని ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడు.

1 రాజులు 21:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అతని భార్య యెజెబెలు వచ్చి “నీవు విచారంగా భోజనం చేయకుండా ఉన్నావేంటి?” అని అడిగింది.

1 రాజులు 21:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు ఆమెతో ఇలా అన్నాడు. “నీ ద్రాక్షతోటను నాకు అమ్ము. లేకపోతే దానికి బదులు మరొక ద్రాక్షతోట నీకిస్తానని యెజ్రెయేలు వాడైన నాబోతును అడిగాను. అతడు నా ద్రాక్షతోట నీకివ్వను అన్నాడు.”

1 రాజులు 21:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు యెజెబెలు “నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడం లేదా? లేచి భోజనం చెయ్యి. మనస్సులో సంతోషంగా ఉండు. నేనే యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పిస్తాను” అంది.

1 రాజులు 21:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె అహాబు పేర ఉత్తరాలు రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ ఉత్తరాలను నాబోతు నివసిస్తున్న పట్టణ పెద్దలకూ ఇంకా ముఖ్యమైన వారికీ పంపింది.

1 రాజులు 21:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఉత్తరాల్లో ఇలా రాయించింది. “ఉపవాస దినం జరగాలని మీరు చాటింపు వేయించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టండి.

1 రాజులు 21:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు దేవుణ్ణి, రాజునూ దూషించావు, అని అతని మీద సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు నిజాయితీ లేని మనుషులను ఏర్పాటు చేయండి. తీర్పు అయిన తరువాత అతన్ని బయటికి తీసికెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి.”

1 రాజులు 21:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని నగర పెద్దలూ పట్టణంలో నివసించే ముఖ్యమైన వారూ యెజెబెలు తమకు పంపిన ఉత్తరాల్లో ఉన్నట్టుగా జరిగించారు.

1 రాజులు 21:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉపవాస దినం చాటించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టారు.

1 రాజులు 21:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇద్దరు నిజాయితీ లేని మనుషులు వచ్చి అతని ఎదుట కూర్చుని “నాబోతు దేవుణ్ణీ రాజునూ దూషించాడు” అని ప్రజల ఎదుట నాబోతు మీద సాక్ష్యం చెప్పారు. వాళ్ళు పట్టణం బయటికి అతన్ని తీసికెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు.

1 రాజులు 21:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాబోతు రాతి దెబ్బలతో చచ్చిపోయాడని వాళ్ళు యెజెబెలుకు కబురు పంపారు.

1 రాజులు 21:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది విని యెజెబెలు “నాబోతు బతికి లేడు, చచ్చిపోయాడు. కాబట్టి నీవు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ఖరీదుకు నీకివ్వనన్న అతని ద్రాక్షతోటను స్వాధీనం చేసుకో” అని అహాబుతో చెప్పింది.

1 రాజులు 21:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాబోతు చనిపోయాడని అహాబు విని లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకోడానికి వెళ్ళాడు.

1 రాజులు 21:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా తిష్బీయుడైన ఏలీయాతో ఇలా చెప్పాడు,

1 రాజులు 21:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నీవు లేచి సమరయలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును కలుసుకోడానికి బయలు దేరు. అతడు నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్ళాడు.

1 రాజులు 21:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు అతనితో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమిటంటే దీన్ని స్వాధీనం చేసుకోవాలని నీవు నాబోతును చంపించావు గదా! యెహోవా చెప్పేదేమిటంటే ఏ స్థలం లో కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలం లోనే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి.”

1 రాజులు 21:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది విని అహాబు ఏలీయాతో “నా పగవాడా, నేను నీకు దొరికానా?” అన్నాడు. అందుకు ఏలీయా ఇలా అన్నాడు. “యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నువ్వే అమ్ముకున్నావు. కాబట్టి నీవు నాకు దొరికావు.

1 రాజులు 21:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నీతో ఇలా చెబుతున్నాడు, నేను నీ మీదికి కీడు రప్పిస్తాను. నీ వంశం వారిని నాశనం చేస్తాను. ఇశ్రాయేలు వారిలో బానిస గానీ స్వతంత్రుడు గానీ అహాబు వైపు ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేస్తాను.

1 రాజులు 21:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలువారు పాపం చేయడానికి నీవు కారకుడివై నాకు కోపం పుట్టించావు. కాబట్టి నెబాతు కొడుకు యరొబాము కుటుంబానికీ అహీయా కొడుకు బయెషా కుటుంబానికీ నేను చేసినట్లు నీ కుటుంబానికీ చేస్తాను.

1 రాజులు 21:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెజెబెలు గురించి యెహోవా చెప్పేదేమిటంటే యెజ్రెయేలు ప్రాకారం దగ్గర కుక్కలు యెజెబెలును పీక్కుతింటాయి.

1 రాజులు 21:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పట్టణంలో చనిపోయే అహాబు సంబంధులను కుక్కలు తింటాయి. పొలంలో చనిపోయేవారిని రాబందులు తింటాయి” అన్నాడు.

1 రాజులు 21:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన భార్య యెజెబెలు ప్రేరేపణతో యెహోవా దృష్టిలో కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్న అహాబులాంటి వాడు ఎవ్వడూ లేడు.

1 రాజులు 21:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల దగ్గరనుంచి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయులు చేసినట్టు, అతడు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించాడు.

1 రాజులు 21:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహాబు ఆ మాటలు విని తన బట్టలు చించుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి, గోనెపట్ట మీద పడుకుని చాలా విచారించాడు.

1 రాజులు 21:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా చెప్పాడు.

1 రాజులు 21:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అహాబు నా ఎదుట తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూశావా? తనను నా ఎదుట తగ్గించుకుంటున్నాడు కాబట్టి, రాబోయే ఆ కీడును అతని కాలంలో పంపించను. నేనతని కొడుకు రోజుల్లో అతని వంశం మీదికి కీడు రానిస్తాను.”

Available Bible Translations

American Standard Version (ASV)
1 Kings 21 (ASV) »
King James Version (KJV)
1 Kings 21 (KJV) »
GOD’S WORD® (GW)
1 Kings 21 (GW) »
Berean Bible (BSB)
1 Kings 21 (BSB) »
World English Bible (WEB)
1 Kings 21 (WEB) »
French Bible (LSG)
1 Rois 21 (LSG) »
German Bible (LUTH1912)
1 Könige 21 (LUTH1912) »
Marathi Bible (MARIRV)
1 राजे 21 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
1 રાજાઓ 21 (GUJIRV) »
Hebrew Bible (HEB)
מלכים א 21 (HEB) »
Portuguese Bible (BSL)
1 Reis 21 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Các Vua 21 (VIE) »
Spanish Bible (RVA)
1 Reyes 21 (RVA) »
Italian Bible (RIV)
1 Re 21 (RIV) »
Chinese Simplified (CUVS)
列 王 记 上 21 (CUVS) »
Chinese Traditional (CUVT)
列 王 紀 上 21 (CUVT) »
Albanian Bible (ALB)
1 Mbretërve 21 (ALB) »
Swedish Bible (SV1917)
1 Kungaboken 21 (SV1917) »
Russian Bible (RUSV)
3 Царств 21 (RUSV) »
Ukrainian Bible (UKR)
1 царів 21 (UKR) »
Hungarian Bible (KAR)
1 Királyok 21 (KAR) »
Bulgarian Bible (BULG)
3 Царе 21 (BULG) »
Japanese Bible (JPN)
列王紀上 21 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Kongebok 21 (NORSK) »

1 రాజులు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List