1 కొరింథీయులకు Chapter 16 TELIRV Bible Verse Images

1 కొరింథీయులకు 16 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 కొరింథీయులకు 16 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 కొరింథీయులకు 16:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి.

1 కొరింథీయులకు 16:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి.

1 కొరింథీయులకు 16:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను.

1 కొరింథీయులకు 16:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు.

1 కొరింథీయులకు 16:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను.

1 కొరింథీయులకు 16:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.

1 కొరింథీయులకు 16:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు.

1 కొరింథీయులకు 16:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ పెంతెకొస్తు వరకూ ఎఫెసులో ఉంటాను.

1 కొరింథీయులకు 16:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.

1 కొరింథీయులకు 16:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిశ్చింతగా నివసించేలా చూసుకోండి. నాలాగా అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.

1 కొరింథీయులకు 16:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఎవరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. నా దగ్గరికి అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను.

1 కొరింథీయులకు 16:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరుడైన అపొల్లో విషయమేమంటే, అతనిని ఈ సోదరులతో కలిసి మీ దగ్గరికి వెళ్ళమని నేను చాలా బతిమాలాను గాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు.

1 కొరింథీయులకు 16:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి.

1 కొరింథీయులకు 16:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.

1 కొరింథీయులకు 16:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు.

1 కొరింథీయులకు 16:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి సోదరులారా, అలాటి వారికి, పనిలో సహాయం చేసే వారికి, కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను.

1 కొరింథీయులకు 16:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది.

1 కొరింథీయులకు 16:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గుర్తించి గౌరవించండి.

1 కొరింథీయులకు 16:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు.

1 కొరింథీయులకు 16:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకుని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి.

1 కొరింథీయులకు 16:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ అభివందనం రాస్తున్నాను.

1 కొరింథీయులకు 16:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు.

1 కొరింథీయులకు 16:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక.

1 కొరింథీయులకు 16:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్‌.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Corinthians 16 (ASV) »
King James Version (KJV)
1 Corinthians 16 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 16 (GW) »
Berean Bible (BSB)
1 Corinthians 16 (BSB) »
World English Bible (WEB)
1 Corinthians 16 (WEB) »
French Bible (LSG)
1 Corinthiens 16 (LSG) »
German Bible (LUTH1912)
1 Korinther 16 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Coríntios 16 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Cô-rinh-tô 16 (VIE) »
Spanish Bible (RVA)
1 Corintios 16 (RVA) »
Italian Bible (RIV)
1 Corinzi 16 (RIV) »
Chinese Simplified (CUVS)
哥 林 多 前 书 16 (CUVS) »
Chinese Traditional (CUVT)
歌 林 多 前 書 16 (CUVT) »
Albanian Bible (ALB)
1 Korintasve 16 (ALB) »
Ukrainian Bible (UKR)
1 коринтян 16 (UKR) »
Hungarian Bible (KAR)
1 Korinthus 16 (KAR) »
Norwegian Bible (NORSK)
1 Korinter 16 (NORSK) »

1 కొరింథీయులకు (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

TELIRV Book Selection List