1 కొరింథీయులకు Chapter 11 TELIRV Bible Verse Images

1 కొరింథీయులకు 11 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 కొరింథీయులకు 11 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 కొరింథీయులకు 11:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి.

1 కొరింథీయులకు 11:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నేను మీకు ఉపదేశించిన పద్ధతులను అనుసరిస్తున్నారని మిమ్మల్ని మెచ్చుకొంటున్నాను.

1 కొరింథీయులకు 11:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు తెలుసుకోవలసింది ఏమంటే, పురుషునికి శిరస్సు క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు.

1 కొరింథీయులకు 11:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన తల కప్పుకుని ప్రార్థన చేసే పురుషుడు తన తలను అవమానపరచినట్టే.

1 కొరింథీయులకు 11:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన తల కప్పుకోకుండా ప్రార్థన చేసే, లేక ప్రవచించే స్త్రీ తన తల అవమానపరచినట్టే. ఎందుకంటే అది ఆమె తల గొరిగించుకున్న దానితో సమానం.

1 కొరింథీయులకు 11:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన తల కప్పుకోని స్త్రీ తన తలవెంట్రుకలు కత్తిరించుకోవాలి. అలా కత్తిరించుకోవడం, లేక పూర్తిగా వెంట్రుకలు తీసివేయడం ఆమెకు అవమానమైతే ఆమె తల కప్పుకోవాలి.

1 కొరింథీయులకు 11:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పురుషుడు దేవుని పోలిక, ఆయన మహిమ. కాబట్టి అతడు తన తల కప్పుకోకూడదు. స్త్రీ పురుషుని మహిమ.

1 కొరింథీయులకు 11:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదెలాగంటే, స్త్రీ పురుషుని నుండి కలిగింది గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు.

1 కొరింథీయులకు 11:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్త్రీని పురుషుని కోసం సృష్టించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీ కోసం కాదు.

1 కొరింథీయులకు 11:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి దేవదూతల కారణంగా స్త్రీకి తల మీద ఒక అధికార సూచన ఉండాలి.

1 కొరింథీయులకు 11:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు.

1 కొరింథీయులకు 11:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏ విధంగా స్త్రీ పురుషుని నుండి కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు. అయితే సమస్తమూ దేవునినుండే కలుగుతాయి.

1 కొరింథీయులకు 11:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరే చెప్పండి. స్త్రీ తల కప్పుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం సరైనదేనా?

1 కొరింథీయులకు 11:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడం అతనికి అవమానమని సహజంగా మీకు అనిపించడం లేదా?

1 కొరింథీయులకు 11:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు స్త్రీకి తల వెంట్రుకలు పైటచెంగుగా ఇచ్చాడు కాబట్టి ఆమె వాటిని పెంచుకోవడం ఆమెకు ఘనత అని మీకు స్వతహాగా తెలుసు కదా!

1 కొరింథీయులకు 11:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విషయంలో వేరే వాదనలు చేసేవాడు, మాలో గానీ, దేవుని సంఘంలో గానీ దీనికి వ్యతిరేకంగా వేరొకఅభిప్రాయం లేదని తెలుసుకోవాలి.

1 కొరింథీయులకు 11:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకు ఈ క్రింది ఆజ్ఞనిస్తూ మిమ్మల్నేమీ మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే మీరు సమావేశం కావడం ఎక్కువ కీడుకే కారణమౌతున్నది గానీ మేలుకు కాదు.

1 కొరింథీయులకు 11:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మొదటి సంగతి, మీరు సమావేశమైనప్పుడు మీలో తగాదాలు ఉన్నాయని వింటున్నాను. కొంతమట్టుకు ఇది నిజమే అనిపిస్తుంది.

1 కొరింథీయులకు 11:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీలో నిజంగా యోగ్యులు ఎవరో తెలియాలంటే మీలో భిన్నాభిప్రాయాలు ఉండవలసిందే.

1 కొరింథీయులకు 11:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరంతా సమావేశమై కలిసి తినేది ప్రభు రాత్రి భోజనం కాదు.

1 కొరింథీయులకు 11:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే మీరు ఆ భోజనం తినేటప్పుడు ఒకడికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే తింటున్నాడు. దీనివలన ఒకడు ఆకలితో ఉండగానే ఇంకొకడు బాగా తిని తాగి మత్తులో మునిగిపోతాడు.

1 కొరింథీయులకు 11:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏమిటిది? తిని తాగడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తూ లేని వారిని చిన్నచూపు చూస్తూ? మీతో ఏమి చెప్పాలి? మిమ్మల్ని మెచ్చుకోమంటారా? ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోలేను.

1 కొరింథీయులకు 11:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువే నాకు ఇచ్చాడు. ప్రభు యేసు అప్పగించబడిన రాత్రి, ఆయన ఒక రొట్టె చేత పట్టుకున్నాడు.

1 కొరింథీయులకు 11:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్తుతులు చెల్లించిన తరువాత దాన్ని విరిచి, “ఇది మీ కోసమైన నా శరీరం. తీసుకుని తినండి. నా జ్ఞాపకార్థం దీన్ని చేయండి” అని చెప్పాడు.

1 కొరింథీయులకు 11:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భోజనం చేసిన తరువాత ఆ విధంగానే ఆయన పాత్రను చేత పట్టుకుని, “ఈ పాత్ర నా రక్తం మూలంగా చేసిన కొత్త నిబంధన. మీరు దీన్ని తాగిన ప్రతిసారీ నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అన్నాడు.

1 కొరింథీయులకు 11:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోది తాగిన ప్రతిసారీ ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు.

1 కొరింథీయులకు 11:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఎవరైతే అయోగ్యమైన విధానంలో ప్రభువు రొట్టెను తిని ఆయన పాత్రలోది తాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం విషయంలో అపరాధులు అవుతారు.

1 కొరింథీయులకు 11:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ప్రతి ఒక్కడూ తనను తాను పరీక్షించుకుని ఆ రొట్టె తిని, ఆ పాత్రలోది తాగాలి.

1 కొరింథీయులకు 11:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే ప్రభువు శరీరం గురించి సరైన అవగాహన లేకుండా దాన్ని తిని, తాగేవాడు తన మీదికి శిక్ష కొని తెచ్చుకుంటున్నాడు.

1 కొరింథీయులకు 11:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ కారణం చేతనే మీలో చాలామంది నీరసంగా, అనారోగ్యంగా ఉన్నారు. చాలామంది చనిపోయారు కూడా.

1 కొరింథీయులకు 11:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే మనలను మనం పరిశీలించుకుంటూ ఉంటే మన పైకి తీర్పు రాదు.

1 కొరింథీయులకు 11:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం తీర్పు పొందినా లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి సరిదిద్దుతున్నాడు.

1 కొరింథీయులకు 11:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నా సోదర సోదరీలారా, మీరు భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఒకడి కోసం ఒకడు వేచి ఉండండి.

1 కొరింథీయులకు 11:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఇలా కలుసుకోవడం మీపై తీర్పు రావడానికి కారణం కాకుండేలా, ఆకలి వేసినవాడు తన ఇంట్లోనే భోజనం చేసి రావాలి. మీరు రాసిన మిగతా సంగతులను నేను మీ దగ్గరకి వచ్చినప్పుడు సరిచేస్తాను.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Corinthians 11 (ASV) »
King James Version (KJV)
1 Corinthians 11 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 11 (GW) »
Berean Bible (BSB)
1 Corinthians 11 (BSB) »
World English Bible (WEB)
1 Corinthians 11 (WEB) »
French Bible (LSG)
1 Corinthiens 11 (LSG) »
German Bible (LUTH1912)
1 Korinther 11 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Coríntios 11 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Cô-rinh-tô 11 (VIE) »
Spanish Bible (RVA)
1 Corintios 11 (RVA) »
Italian Bible (RIV)
1 Corinzi 11 (RIV) »
Chinese Simplified (CUVS)
哥 林 多 前 书 11 (CUVS) »
Chinese Traditional (CUVT)
歌 林 多 前 書 11 (CUVT) »
Albanian Bible (ALB)
1 Korintasve 11 (ALB) »
Ukrainian Bible (UKR)
1 коринтян 11 (UKR) »
Hungarian Bible (KAR)
1 Korinthus 11 (KAR) »
Norwegian Bible (NORSK)
1 Korinter 11 (NORSK) »

1 కొరింథీయులకు (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

TELIRV Book Selection List