1 కొరింథీయులకు Chapter 10 TELIRV Bible Verse Images

1 కొరింథీయులకు 10 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 కొరింథీయులకు 10 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 కొరింథీయులకు 10:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొదరీ సోదరులారా, మన పితరులు మేఘం కిందుగా ప్రయాణాలు చేశారు. వారంతా సముద్రంలో గుండా నడిచి వెళ్ళారు.

1 కొరింథీయులకు 10:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందరూ మోషేను వెంబడించి అతనిని బట్టి మేఘంలో, సముద్రంలో, బాప్తిసం పొందారు.

1 కొరింథీయులకు 10:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారంతా ఆధ్యాత్మికమైన ఒకే ఆహారం తిన్నారు.

1 కొరింథీయులకు 10:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆధ్యాత్మికమైన ఒకే పానీయాన్ని తాగారు. ఎలాగంటే వారు తమ వెంటే వచ్చిన ఆత్మసంబంధమైన బండలో నుండి ప్రవహించిన నీటిని తాగారు. ఆ బండ క్రీస్తే.

1 కొరింథీయులకు 10:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే వారిలో అత్యధికులు తమ జీవితాల్లో దేవుణ్ణి సంతోషపెట్టలేదు. కాబట్టి వారి శవాలు అరణ్యంలోనే రాలిపోయేలా వారంతా చనిపోయారు.

1 కొరింథీయులకు 10:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు చేసినట్టుగా మనం కూడా చెడ్డ సంగతులను ఆశించకుండా ఉండాలని ఈ సంగతులు ఉదాహరణలుగా మన కోసం రాసి ఉన్నాయి.

1 కొరింథీయులకు 10:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ప్రజలు తినడానికీ తాగడానికీ కూర్చున్నారు, కామసంబంధమైన నాట్యాలకు లేచారు” అని రాసి ఉన్నట్టు వారిలాగా మీరు విగ్రహారాధకులు కావద్దు.

1 కొరింథీయులకు 10:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిలాగా లైంగిక దుర్నీతిలో మునిగిపోవద్దు. వారిలో కొందరు వ్యభిచారం జరిగించి ఒక్క రోజునే ఇరవై మూడు వేలమంది చనిపోయారు.

1 కొరింథీయులకు 10:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిలో చాలామంది ప్రభువును వ్యతిరేకించి పాము కాటుకు లోనై చనిపోయినట్టు మనమూ చేసి ప్రభువును పరీక్షించవద్దు.

1 కొరింథీయులకు 10:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే మీరు సణుక్కోవద్దు. వారిలో చాలామంది దేవునిపై సణిగి సంహార దూత చేతిలో నాశనమయ్యారు.

1 కొరింథీయులకు 10:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాశనమయ్యారు మనకు ఉదాహరణలుగా ఉండడానికే. వాటిని చూసి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోడానికి అవి రాసి ఉన్నాయి.

1 కొరింథీయులకు 10:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి.

1 కొరింథీయులకు 10:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

1 కొరింథీయులకు 10:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపొండి.

1 కొరింథీయులకు 10:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెలివైన వారితో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయాలను మీకై మీరే ఆలోచించి నిర్ణయించుకోండి.

1 కొరింథీయులకు 10:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం స్తుతులు చెల్లించే పాత్రలో నుండి తాగడం క్రీస్తు రక్తంలో భాగం పంచుకోవడమే. మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో భాగం పంచుకోవడమే.

1 కొరింథీయులకు 10:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనమంతా ఒకే రొట్టెలో భాగం పంచుకొంటున్నాం. రొట్టె ఒక్కటే కాబట్టి దాన్ని తీసుకొనే మనం అనేకులమైనప్పటికీ ఒక్కటే శరీరం అయ్యాం.

1 కొరింథీయులకు 10:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులను చూడండి. బలిపీఠం మీద అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంలో పాలిభాగస్తులే కదా?

1 కొరింథీయులకు 10:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విషయంలో అభిప్రాయం ఇది. విగ్రహాల్లో గాని, వాటికి అర్పించిన వాటిలో గానీ ఏమైనా ఉన్నదని నేను చెప్పడం లేదు.

1 కొరింథీయులకు 10:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు.

1 కొరింథీయులకు 10:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్ల మీదా, ఈ రెంటి మీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు.

1 కొరింథీయులకు 10:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా?

1 కొరింథీయులకు 10:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్నీ చట్టబద్దమైనవే కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ మనుషులకు వృద్ధి కలిగించవు.

1 కొరింథీయులకు 10:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి ఒక్కడూ తన సొంత క్షేమం కాక ఇతరుల క్షేమం కోసం చూడాలి.

1 కొరింథీయులకు 10:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనస్సాక్షి వేసే ప్రశ్నల గురించి ఆలోచించకుండా దుకాణంలో అమ్మే మాంసాన్ని కొని తినవచ్చు.

1 కొరింథీయులకు 10:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే ఈ భూమీ దానిలోని సమస్తమూ దేవునివే.

1 కొరింథీయులకు 10:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువుని నమ్మని ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, మీకు ఇష్టమైతే వెళ్ళండి. అక్కడ మీకు వడ్డించినది ఏదైనా సరే, మీ మనస్సాక్షి ననుసరించి ప్రశ్నలేవీ అడగకుండా తినండి.

1 కొరింథీయులకు 10:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే, “ఇది విగ్రహాలకు అర్పించినది” అని ఎవరైనా మీతో చెబితే, అతడి నిమిత్తమూ, మీ మనస్సాక్షి నిమిత్తమూ దాన్ని తినవద్దు.

1 కొరింథీయులకు 10:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక్కడ మనస్సాక్షి అంటే, నీ సొంత మనస్సాక్షి కాదు, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తమే అని చెబుతున్నాను. నా స్వేచ్ఛ విషయంలో వేరొకడి మనస్సాక్షి ఎందుకు తీర్పు చెప్పాలి?

1 కొరింథీయులకు 10:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి?

1 కొరింథీయులకు 10:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.

1 కొరింథీయులకు 10:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదులకు గానీ, గ్రీసుదేశస్థులకు గానీ, దేవుని సంఘానికి గానీ అభ్యంతరం కలిగించకండి.

1 కొరింథీయులకు 10:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను కూడా ఇదే విధంగా సొంత ప్రయోజనాలు చూసుకోకుండా, చాలా మంది పాప విమోచన పొందాలని వారికి ప్రయోజనం కలగాలని కోరుకుంటూ అన్ని విషయాల్లో, అందరినీ సంతోషపెడుతున్నాను.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Corinthians 10 (ASV) »
King James Version (KJV)
1 Corinthians 10 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 10 (GW) »
Berean Bible (BSB)
1 Corinthians 10 (BSB) »
World English Bible (WEB)
1 Corinthians 10 (WEB) »
French Bible (LSG)
1 Corinthiens 10 (LSG) »
German Bible (LUTH1912)
1 Korinther 10 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Coríntios 10 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Cô-rinh-tô 10 (VIE) »
Spanish Bible (RVA)
1 Corintios 10 (RVA) »
Italian Bible (RIV)
1 Corinzi 10 (RIV) »
Chinese Simplified (CUVS)
哥 林 多 前 书 10 (CUVS) »
Chinese Traditional (CUVT)
歌 林 多 前 書 10 (CUVT) »
Albanian Bible (ALB)
1 Korintasve 10 (ALB) »
Ukrainian Bible (UKR)
1 коринтян 10 (UKR) »
Hungarian Bible (KAR)
1 Korinthus 10 (KAR) »
Norwegian Bible (NORSK)
1 Korinter 10 (NORSK) »

1 కొరింథీయులకు (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

TELIRV Book Selection List