1 కొరింథీయులకు Chapter 14 TELIRV Bible Verse Images

1 కొరింథీయులకు 14 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 కొరింథీయులకు 14 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 కొరింథీయులకు 14:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో కోరుకోండి. ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం కోరుకోండి.

1 కొరింథీయులకు 14:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే తెలియని భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు పలికేది ఎవరికీ అర్థం కాదు. అతడు ఆత్మ ద్వారా రహస్య సత్యాలను పలుకుతున్నాడు.

1 కొరింథీయులకు 14:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే దైవసందేశం ప్రకటించేవాడు వినేవారికి క్షేమాభివృద్ధి, ఆదరణ, ఓదార్పు కలిగే విధంగా మనుషులతో మాట్లాడుతున్నాడు.

1 కొరింథీయులకు 14:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భాషతో మాట్లాడేవాడు తనకు మాత్రం మేలు చేసుకుంటాడు గాని దైవసందేశం ప్రకటించేవాడు ఆదరణ, ఓదార్పు కలిగిస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు.

1 కొరింథీయులకు 14:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరంతా తెలియని భాషలతో మాట్లాడాలని నేను కోరుతున్నాను గాని, మీరు దైవసందేశం ప్రకటించేవారుగా ఉండాలని మరెక్కువగా కోరుతున్నాను. సంఘం అభివృద్ధి చెందడానికి భాషలతో మాట్లాడే వాడి కంటే (అర్థం చెబితే తప్ప) దేవుని పక్షంగా దేవుడు తెలియ చేసిన సందేశాన్ని ప్రకటించే వాడే గొప్పవాడు.

1 కొరింథీయులకు 14:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, ఆలోచించండి. నేను మీ దగ్గరికి భాషలతో మాట్లాడుతూ వచ్చాననుకోండి. నా మాటలు మీకు అర్థం కాక, వాటిలో దేవుడు బయలు పరచిన విషయాలను గానీ, జ్ఞానం గానీ, దేవుడు చెప్పమన్న సందేశం గానీ, లేక ఎదైనా ఉపదేశం గానీ లేకుండా ఉంటే నా వలన మీకు ప్రయోజనమేమిటి?

1 కొరింథీయులకు 14:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిర్జీవమైన వస్తువులైన వేణువు ఊదినా, వీణ వాయించినా, అవి వేరు వేరు స్వరాలు పలకకపోతే, వాడిన వాయిద్యమేదో ఎలా తెలుస్తుంది?

1 కొరింథీయులకు 14:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాకా స్పష్టంగా వినిపించకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు?

1 కొరింథీయులకు 14:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే మీ నాలుకతో స్పష్టమైన మాటలు పలకకపోతే వినేవారికి ఏం అర్థమౌతుంది? అది మీరు గాలితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కదా!

1 కొరింథీయులకు 14:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లోకంలో ఎన్నో భాషలున్నా, వాటన్నిటికీ స్పష్టమైన అర్థాలు ఉంటాయి.

1 కొరింథీయులకు 14:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మాటల అర్థం నాకు తెలియకపోతే మాట్లాడేవాడు నాకూ, నాకు అతడూ పరాయివారంగా ఉంటాం.

1 కొరింథీయులకు 14:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఆత్మ సంబంధమైన వరాల విషయంలో ఆసక్తిగలవారు గనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను కోరుకుని వాటిలో అమితంగా అభివృద్ధి చెందండి.

1 కొరింథీయులకు 14:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి తెలియని భాషతో మాట్లాడేవాడు దానికి అర్థం చెప్పే సామర్ధ్యం కోసం ప్రార్థన చేయాలి.

1 కొరింథీయులకు 14:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను తెలియని భాషతో ప్రార్థన చేసినపుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది గాని నా మనసు చురుకుగా ఉండదు.

1 కొరింథీయులకు 14:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నేనేం చెయ్యాలి? నా ఆత్మతో ప్రార్ధిస్తాను, మనసుతో కూడా ప్రార్ధిస్తాను. ఆత్మతో పాడతాను, మనసుతో కూడా పాడతాను.

1 కొరింథీయులకు 14:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా కాకుండా, నీవు ఆత్మతో మాత్రమే స్తుతులు చెల్లిస్తే నీవు పలికిన దాన్ని గ్రహించలేని వ్యక్తి నీవు చెప్పిన కృతజ్ఞతలకు, “ఆమేన్‌” అని చెప్పలేడు కదా!

1 కొరింథీయులకు 14:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకై నీవు బాగానే స్తుతులు చెల్లిస్తావు గానీ ఎదుటి వ్యక్తికి మేలు కలగదు.

1 కొరింథీయులకు 14:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవునికి స్తుతులు! నేను మీ అందరికంటే ఎక్కువగా తెలియని భాషలతో మాట్లాడతాను.

1 కొరింథీయులకు 14:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా సంఘంలో తెలియని భాషతో పదివేల మాటలు పలకడం కంటే, ఇతరులకు ఉపదేశం దొరికేలా నా మనసుతో ఐదు మాటలు చెప్పడం మంచిది.

1 కొరింథీయులకు 14:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, ఆలోచనలో చిన్న పిల్లల్లాగా ఉండవద్దు. చెడు విషయంలో పసివారిలాగా ఉండండి గానీ ఆలోచించడంలో పరిణతి చెందినవారుగా ఉండండి.

1 కొరింథీయులకు 14:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది, “తెలియని భాషలు మాట్లాడే ప్రజల ద్వారా, తెలియని మనుషుల పెదవుల ద్వారా, ఈ ప్రజలతో మాట్లాడతాను. అయినప్పటికీ వారు నా మాట వినరు అని ప్రభువు చెబుతున్నాడు.”

1 కొరింథీయులకు 14:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచన. దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించడం అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచన.

1 కొరింథీయులకు 14:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సంఘమంతా ఒకేసారి తెలియని భాషలతో మాట్లాడుతున్నప్పుడు, బయటి వ్యక్తులు లేక అవిశ్వాసులు లోపలికి వచ్చి చూస్తే మిమ్మల్ని వెర్రివారు అని చెప్పుకొంటారు కదా?

1 కొరింథీయులకు 14:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అందరూ దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటే బయటి వ్యక్తి లేక అవిశ్వాసి లోపలికి వచ్చి చూస్తే మీ అందరి ఉపదేశం వలన తాను పాపినని గ్రహిస్తాడు, అందరి మూలంగా అతనికి ఒప్పుదల కలుగుతుంది.

1 కొరింథీయులకు 14:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడతని హృదయ రహస్యాలు బయలుపడతాయి. అప్పుడతడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి, దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రకటిస్తాడు.

1 కొరింథీయులకు 14:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, ఇప్పుడేం జరుగుతున్నది? మీరు సమావేశమైనప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని, ఇంకొకడు దేవుని మాటలు ఉపదేశించాలని చూస్తున్నాడు, వేరొకడు దేవుడు తనకు బయలు పరచిన దాన్ని ప్రకటించాలని చూస్తున్నాడు. ఒకడు తెలియని భాషతో మాటలాడాలని చూస్తుండగా మరొకడు దానికి అర్థం చెప్పాలని కనిపెడుతున్నాడు. సరే, అంతటినీ సంఘాభివృద్ధి కోసం జరిగించండి.

1 కొరింథీయులకు 14:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా తెలియని భాషతో మాట్లాడితే, ఇద్దరు, అవసరమైతే ముగ్గురికి మించకుండా, ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలి. ఒకరు దానికి అర్థం చెప్పాలి.

1 కొరింథీయులకు 14:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అర్థం చెప్పేవాడు లేకపోతే అతడు సంఘంలో మౌనంగా ఉండాలి. అయితే అతడు తనతో, దేవునితో మాట్లాడుకోవచ్చు.

1 కొరింథీయులకు 14:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చు. మిగిలినవారు ఆ ఉపదేశాన్ని వివేచనాపూర్వకంగా వినాలి.

1 కొరింథీయులకు 14:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అక్కడ కూర్చున్న మరొకనికి ఏదైనా వెల్లడి అయితే మొదటివాడు మౌనంగా ఉండాలి.

1 కొరింథీయులకు 14:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందరూ నేర్చుకొనేలా, ప్రోత్సాహం పొందేలా మీరంతా ఒకడి తరవాత ఒకడు దేవుడిచ్చిన సందేశం ప్రకటించ వచ్చు.

1 కొరింథీయులకు 14:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి.

1 కొరింథీయులకు 14:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే దేవుడు శాంతి సమాధానాలు కలిగించే వాడే గాని గందరగోళం కలిగించేవాడు కాడు. పరిశుద్ధుల సంఘాలన్నిటిలో

1 కొరింథీయులకు 14:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్త్రీలు సంఘ సమావేశాల్లో మౌనంగా ఉండాలి. వారు లోబడి ఉండవలసిందే. వారికి మాట్లాడేందుకు అనుమతి లేదు. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రం కూడా చెబుతున్నది.

1 కొరింథీయులకు 14:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు దేనినైనా తెలుసుకోవాలంటే వారి ఇంట్లో తమ భర్తలను అడగాలి. సంఘంలో స్త్రీ మాట్లాడడం అవమానకరం.

1 కొరింథీయులకు 14:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏం, దేవుని వాక్కు మీ నుండే బయలుదేరిందా? మీ దగ్గరికి మాత్రమే వచ్చిందా?

1 కొరింథీయులకు 14:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా తాను ప్రవక్తననీ లేక ఆత్మీయ వ్యక్తిననీ భావిస్తే ఇక్కడ నేను మీకు రాస్తున్నవి ప్రభువు చెప్పిన ఆజ్ఞలని అతడు కచ్చితంగా తెలుసుకోవాలి.

1 కొరింథీయులకు 14:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా దీన్ని పట్టించుకోక పొతే అ వ్యక్తిని పట్టించుకోకండి.

1 కొరింథీయులకు 14:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నా సోదరులారా, దేవుడిచ్చిన సందేశం ప్రకటించడం అనే వరాన్ని ఆసక్తితో కోరుకోండి. తెలియని భాషలతో మాట్లాడటాన్ని ఆపకండి.

1 కొరింథీయులకు 14:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతా మర్యాదగా, క్రమంగా జరగనీయండి.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Corinthians 14 (ASV) »
King James Version (KJV)
1 Corinthians 14 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 14 (GW) »
Berean Bible (BSB)
1 Corinthians 14 (BSB) »
World English Bible (WEB)
1 Corinthians 14 (WEB) »
French Bible (LSG)
1 Corinthiens 14 (LSG) »
German Bible (LUTH1912)
1 Korinther 14 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Coríntios 14 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Cô-rinh-tô 14 (VIE) »
Spanish Bible (RVA)
1 Corintios 14 (RVA) »
Italian Bible (RIV)
1 Corinzi 14 (RIV) »
Chinese Simplified (CUVS)
哥 林 多 前 书 14 (CUVS) »
Chinese Traditional (CUVT)
歌 林 多 前 書 14 (CUVT) »
Albanian Bible (ALB)
1 Korintasve 14 (ALB) »
Ukrainian Bible (UKR)
1 коринтян 14 (UKR) »
Hungarian Bible (KAR)
1 Korinthus 14 (KAR) »
Norwegian Bible (NORSK)
1 Korinter 14 (NORSK) »

1 కొరింథీయులకు (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

TELIRV Book Selection List