1 కొరింథీయులకు Chapter 7 TELIRV Bible Verse Images

1 కొరింథీయులకు 7 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 కొరింథీయులకు 7 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 కొరింథీయులకు 7:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టుకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి.

1 కొరింథీయులకు 7:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.

1 కొరింథీయులకు 7:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి.

1 కొరింథీయులకు 7:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు.

1 కొరింథీయులకు 7:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.

1 కొరింథీయులకు 7:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు.

1 కొరింథీయులకు 7:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏది ఏమైనా, మనుషులందరూ నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కడికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకడికి ఒక వరం, ఇంకొకడికి ఇంకొక వరం ఇచ్చాడు.

1 కొరింథీయులకు 7:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాలాగా ఉండడం వారికి మంచిదని అవివాహితులతో, వితంతువులతో చెబుతున్నాను.

1 కొరింథీయులకు 7:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే కోరికలను నిగ్రహించుకోలేకపోతే పెండ్లి చేసుకోవచ్చు. విరహాగ్నితో వేగి పోవడం కంటే పెండ్లి చేసుకోవడం మంచిది.

1 కొరింథీయులకు 7:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక పెళ్ళయిన వారికి నేను కాక, ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు.

1 కొరింథీయులకు 7:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకవేళ వేరైతే మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.

1 కొరింథీయులకు 7:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిగిలిన వారితో ప్రభువు కాక, నేనే చెప్పేదేమంటే, ఒక సోదరునికి అవిశ్వాసి అయిన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు.

1 కొరింథీయులకు 7:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే, ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి, అతడు ఆమెతో కాపురం చేయడానికి తన సమ్మతి తెలిపితే, ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు.

1 కొరింథీయులకు 7:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రులే.

1 కొరింథీయులకు 7:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్ళిపోతానంటే పోనివ్వండి. అప్పుడు సోదరుడైనా సోదరి ఐనా తన పెళ్ళినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు.

1 కొరింథీయులకు 7:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు?

1 కొరింథీయులకు 7:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ప్రభువు ప్రతివాడికీ ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను.

1 కొరింథీయులకు 7:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరినైనా దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అతడు సున్నతి పొంది ఉన్నాడా? అతడు ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కర లేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వచ్చాడా? అతడు సున్నతి పొందనక్కర లేదు.

1 కొరింథీయులకు 7:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం గానీ సున్నతి పొందడంలో గానీ, పొందక పోవటంలో గానీ ఏమీ లేదు,

1 కొరింథీయులకు 7:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండాలి.

1 కొరింథీయులకు 7:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసగా ఉన్నావా? దాని గురించి చింతించవద్దు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి శక్తి ఉంటే స్వేచ్ఛ పొందడమే మంచిది.

1 కొరింథీయులకు 7:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందిన వాడు క్రీస్తుకు బానిస.

1 కొరింథీయులకు 7:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు మిమ్మల్ని వెల చెల్లించి కొన్నాడు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు.

1 కొరింథీయులకు 7:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, మనలో ప్రతి ఒక్కరినీ ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నిలిచి ఉందాం.

1 కొరింథీయులకు 7:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పెళ్లి కానివారి విషయంలో ప్రభువు నుండి నాకు ఆదేశమేదీ లేదు గానీ ప్రభువు కృప చేత నమ్మదగిన వాడుగా ఉన్న నేను నా భావం చెబుతున్నాను.

1 కొరింథీయులకు 7:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఇప్పుడున్న కష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండడం మేలని నా ఉద్దేశం.

1 కొరింథీయులకు 7:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వివాహ వ్యవస్థలో భార్యకు కట్టుబడి ఉన్నావా? వేరు కావాలనుకోవద్దు. భార్య లేకుండా స్వేచ్ఛగా, లేక అవివాహితుడుగా ఉన్నావా? భార్య కావాలని కోరవద్దు.

1 కొరింథీయులకు 7:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకవేళ నీవు పెళ్ళి చేసుకున్నా పాపమేమీ చేసినట్టు కాదు. అవివాహిత పెళ్ళి చేసుకున్నా ఆమె పాపమేమీ చేసినట్టు కాదు. అయితే అలాటి వారికి దైనందిన కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకుండా ఉండాలని నా కోరిక.

1 కొరింథీయులకు 7:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, నేను చెప్పేదేమంటే, సమయం కొద్దిగానే ఉంది కాబట్టి ఇక ముందు భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి.

1 కొరింథీయులకు 7:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏడ్చేవారు ఏడవనట్టు, సంతోషించేవారు సంతోషించనట్టు ఉండాలి. కొనేవారు తాము కొన్నది తమది కానట్టు ఉండాలి.

1 కొరింథీయులకు 7:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ లోక వ్యవహారాలు సాగించేవారు లోకంతో తమకేమీ సంబంధం లేనట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోక వ్యవస్థ గతించిపోతూ ఉంది.

1 కొరింథీయులకు 7:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు.

1 కొరింథీయులకు 7:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పెళ్ళయిన వాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోకవిషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు.

1 కొరింథీయులకు 7:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. అదే విధంగా పెళ్ళయిన స్త్రీకీ, పెళ్ళికాని స్త్రీకీ తేడా ఉంది. కన్య శరీరంలో ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది.

1 కొరింథీయులకు 7:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకు ఆటంకంగా ఉండాలని కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు మంచి నడవడితో, ఇతర ధ్యాసలేమీ లేకుండా ప్రభువుపై దృష్టి ఉంచి ఆయన సేవ చేయాలని నా ఆశ.

1 కొరింథీయులకు 7:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావిస్తే, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటం వల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావిస్తే, అతడు తన ఇష్ట ప్రకారం చేయవచ్చు. అతడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు. అది పాపం కాదు.

1 కొరింథీయులకు 7:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఎవరైనా పెళ్ళి చేసుకోనని హృదయంలో నిశ్చయించుకుని, దానికి తగిన మనోబలం ఉండి, తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడయితే అతడు చేసేది మంచి పని.

1 కొరింథీయులకు 7:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.

1 కొరింథీయులకు 7:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భార్య తన భర్త బతికి ఉన్నంత వరకూ అతనికి కట్టుబడి ఉండాలి. భర్త మరణిస్తే తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకోడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆమె విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి.

1 కొరింథీయులకు 7:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఆమె ఉన్న రీతిగా ఉండిపోతే మరింత శ్రేష్ఠమని నా అభిప్రాయం. ఈ విషయంలో దేవుని ఆత్మ నాతో ఉన్నాడని నా నమ్మకం.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Corinthians 7 (ASV) »
King James Version (KJV)
1 Corinthians 7 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 7 (GW) »
Berean Bible (BSB)
1 Corinthians 7 (BSB) »
World English Bible (WEB)
1 Corinthians 7 (WEB) »
French Bible (LSG)
1 Corinthiens 7 (LSG) »
German Bible (LUTH1912)
1 Korinther 7 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Coríntios 7 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Cô-rinh-tô 7 (VIE) »
Spanish Bible (RVA)
1 Corintios 7 (RVA) »
Italian Bible (RIV)
1 Corinzi 7 (RIV) »
Chinese Simplified (CUVS)
哥 林 多 前 书 7 (CUVS) »
Chinese Traditional (CUVT)
歌 林 多 前 書 7 (CUVT) »
Albanian Bible (ALB)
1 Korintasve 7 (ALB) »
Swedish Bible (SV1917)
1 Korinthierbrevet 7 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 коринтян 7 (UKR) »
Hungarian Bible (KAR)
1 Korinthus 7 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Коринтяни 7 (BULG) »
Norwegian Bible (NORSK)
1 Korinter 7 (NORSK) »

1 కొరింథీయులకు (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

TELIRV Book Selection List