1 కొరింథీయులకు Chapter 6 TELIRV Bible Verse Images

1 కొరింథీయులకు 6 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 కొరింథీయులకు 6 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 కొరింథీయులకు 6:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీలో ఒకరితో ఒకరికి వివాదం ఏమైనా ఉంటే అతడు పరిశుద్ధుల ఎదుట కాకుండా అవిశ్వాసి అయిన న్యాయాధిపతి ఎదుట వాదించడానికి పూనుకుంటాడా?

1 కొరింథీయులకు 6:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? మీరు ఈ లోకానికి తీర్పు తీర్చవలసి ఉండగా, చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకొనే సామర్ధ్యం మీకు లేదా?

1 కొరింథీయులకు 6:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు మరి ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా?

1 కొరింథీయులకు 6:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఈ లోక సంబంధమైన వివాదాలు మీకు కలిగినపుడు వాటిని పరిష్కరించడానికి సంఘంలో ఎలాటి స్థానం లేని వారి దగ్గరికి వెళ్తారా?

1 కొరింథీయులకు 6:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను, తన సోదరీసోదరుల మధ్య వివాదం పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు మీలో ఎవరూ లేరా?

1 కొరింథీయులకు 6:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఒక సోదరుడు మరొక సోదరుని మీద వ్యాజ్యెమాడుతున్నాడు. అది కూడా అవిశ్వాసి అయిన న్యాయాధికారి ఎదుట!

1 కొరింథీయులకు 6:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అసలు క్రైస్తవుల మధ్య ఒకరితో ఒకరికి వివాదం ఉండడమే మీ అపజయం. దాని కంటే మీరు అన్యాయం సహించడం మంచిది కదా? దానికంటే మీ వస్తువులు పోగొట్టుకోవడం మంచిది కదా?

1 కొరింథీయులకు 6:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే మీరే ఇతరులకు, మీ సోదర సోదరీలకే అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు.

1 కొరింథీయులకు 6:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ,

1 కొరింథీయులకు 6:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

1 కొరింథీయులకు 6:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు.

1 కొరింథీయులకు 6:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు గాని అన్ని విషయాలూ ప్రయోజనకరం కాదు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని దేనినీ నన్ను లోపరచుకోనివ్వను.

1 కొరింథీయులకు 6:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆహార పదార్ధాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్ధాల కోసమూ ఉన్నాయి. కానీ దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. శరీరం ఉన్నది లైంగిక దుర్నీతి కోసం కాదు, ప్రభువు కోసమే. ప్రభువే శరీర పోషణ సమకూరుస్తాడు.

1 కొరింథీయులకు 6:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు. మనలను కూడా తన శక్తితో లేపుతాడు.

1 కొరింథీయులకు 6:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా జరగకూడదు.

1 కొరింథీయులకు 6:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వేశ్యతో కలిసేవాడు దానితో ఏక శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరం అవుతారు” అని లేఖనాలు చెబుతున్నాయి కదా?

1 కొరింథీయులకు 6:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు.

1 కొరింథీయులకు 6:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.

1 కొరింథీయులకు 6:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు.

1 కొరింథీయులకు 6:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Corinthians 6 (ASV) »
King James Version (KJV)
1 Corinthians 6 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 6 (GW) »
Berean Bible (BSB)
1 Corinthians 6 (BSB) »
World English Bible (WEB)
1 Corinthians 6 (WEB) »
French Bible (LSG)
1 Corinthiens 6 (LSG) »
German Bible (LUTH1912)
1 Korinther 6 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Coríntios 6 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Cô-rinh-tô 6 (VIE) »
Spanish Bible (RVA)
1 Corintios 6 (RVA) »
Italian Bible (RIV)
1 Corinzi 6 (RIV) »
Chinese Simplified (CUVS)
哥 林 多 前 书 6 (CUVS) »
Chinese Traditional (CUVT)
歌 林 多 前 書 6 (CUVT) »
Albanian Bible (ALB)
1 Korintasve 6 (ALB) »
Swedish Bible (SV1917)
1 Korinthierbrevet 6 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 коринтян 6 (UKR) »
Hungarian Bible (KAR)
1 Korinthus 6 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Коринтяни 6 (BULG) »
Norwegian Bible (NORSK)
1 Korinter 6 (NORSK) »

1 కొరింథీయులకు (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

TELIRV Book Selection List