యోబు Chapter 11 TELIRV Bible Verse Images

యోబు 11 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యోబు 11 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యోబు 11:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు ఇచ్చాడు,

యోబు 11:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రవాహంలాగా బయటకు వస్తున్న నీ మాటలకు జవాబు చెప్పాలి గదా. వదరుబోతును నిర్దోషి అని ఎంచడం జరుగుతుందా?

యోబు 11:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ పొగరుబోతు మాటలు విని మనుషులు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండాలా? నీ మాటలను బట్టి ఎవ్వరూ నిన్ను మందలించకూడదా?

యోబు 11:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు దేవునితో “నేను అనుసరించేది సక్రమం, నీ దృష్టిలో నేను పవిత్రంగా ఉన్నాను” అంటున్నావు గదా.

యోబు 11:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు దేవునితో మాట్లాడితే మంచిది. ఆయనే నీతో వాదులాటకు దిగితే బాగుంటుంది.

యోబు 11:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనే నీకు జ్ఞాన రహస్యాలు తెలియజేయాలి. ఆయన జ్ఞాన పూర్ణుడు. నువ్వు చేసిన దోషాలకు తగినదాని కంటే తక్కువ సంజాయిషీయే దేవుడు నీ నుండి కోరుతున్నాడని తెలుసుకో.

యోబు 11:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని నిగూఢ సత్యాలు నువ్వు తెలుసుకోగలవా? సర్వశక్తుడైన దేవుణ్ణి గూర్చిన పరిపూర్ణ జ్ఞానం నీకు ఉంటుందా?

యోబు 11:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు ఏమి చేయగలవు? అది ఆకాశ విశాలం కంటే ఉన్నతమైనది. నీకేం తెలుసు? అది పాతాళంకంటే లోతుగా ఉన్నది.

యోబు 11:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని కొలత భూమికంటే పొడవు, దాని వెడల్పు సముద్రంకన్నా విశాలం.

యోబు 11:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన సంచారం చేస్తూ ఒకణ్ణి బంధించి, తీర్పులో విచారణ జరిగిస్తే ఆయనకు ఎదురు చెప్పగలిగేవాడు ఎవరు?

యోబు 11:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పనికిమాలిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. ఎక్కడ పాపం జరుగుతుందో ఆయన ఇట్టే కనిపెట్టగలడు.

యోబు 11:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అడవి గాడిదపిల్ల మనిషిగా పుట్టగలిగితే బుద్ధిహీనుడు తెలివిగలవాడు కావచ్చు.

యోబు 11:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నీ హృదయాన్ని సవ్యంగా ఉంచుకో. నీ చేతులు ఆయన వైపు చాపు.

యోబు 11:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ చేతిలో చెడుతనం ఉందని గ్రహించి దాన్ని విడిచిపెట్టు. నీ గుడారంలో ఉన్న అక్రమాన్ని పూర్తిగా తొలగించు.

యోబు 11:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా చేస్తే నువ్వు తప్పకుండా ఎలాంటి కళంకం లేనివాడవై నిర్భయంగా, స్థిరంగా, సంతోషంగా ఉంటావు.

యోబు 11:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తప్పకుండా నువ్వు నీ గడ్డుకాలాన్ని మరచిపోతావు. ప్రవహిస్తూ దాటిపోయిన నీటిని గుర్తు పెట్టుకున్నట్టు నువ్వు దాన్ని గుర్తు చేసుకుంటావు.

యోబు 11:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నీ జీవితం మధ్యాహ్నం ఉండే ఎండ కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. చీకటి ఆవరించినా అది సూర్యోదయపు వెలుగులాగా కనిపిస్తుంది.

యోబు 11:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ నమ్మకానికి ఒక ఆధారం దొరుకుతుంది. కనుక నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ ఇల్లు మొత్తం కలయజూసి క్షేమంగా విశ్రాంతి తీసుకుంటావు.

యోబు 11:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరి భయమూ లేకుండా నువ్వు నిద్రపోతావు. అనేకమంది నీ సహాయం కోరుకుంటారు.

యోబు 11:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుర్మార్గుల కంటిచూపు మందగిస్తుంది. వాళ్లకు ఎలాంటి ఆశ్రయమూ దొరకదు. తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Job 11 (ASV) »
King James Version (KJV)
Job 11 (KJV) »
GOD’S WORD® (GW)
Job 11 (GW) »
Berean Bible (BSB)
Job 11 (BSB) »
World English Bible (WEB)
Job 11 (WEB) »
French Bible (LSG)
Job 11 (LSG) »
German Bible (LUTH1912)
Hiob 11 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਅੱਯੂਬ 11 (PANIRV) »
Bengali Bible (BENIRV)
ইয়োব 11 (BENIRV) »
Tamil Bible (TAMIRV)
யோபு 11 (TAMIRV) »
Marathi Bible (MARIRV)
ईयोब 11 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
અયૂબ 11 (GUJIRV) »
Kannada Bible (KANIRV)
ಯೋಬನು 11 (KANIRV) »
Hebrew Bible (HEB)
איוב 11 (HEB) »
Portuguese Bible (BSL)
Jó 11 (BSL) »
Vietnamese Bible (VIE)
Gióp 11 (VIE) »
Spanish Bible (RVA)
Job 11 (RVA) »
Italian Bible (RIV)
Giobbe 11 (RIV) »
Chinese Simplified (CUVS)
约 伯 记 11 (CUVS) »
Chinese Traditional (CUVT)
約 伯 記 11 (CUVT) »
Albanian Bible (ALB)
Jobi 11 (ALB) »
Swedish Bible (SV1917)
Job 11 (SV1917) »
Russian Bible (RUSV)
Иов 11 (RUSV) »
Ukrainian Bible (UKR)
Йов 11 (UKR) »
Hungarian Bible (KAR)
Jób 11 (KAR) »
Bulgarian Bible (BULG)
Йов 11 (BULG) »
Japanese Bible (JPN)
ヨブ記 11 (JPN) »
Norwegian Bible (NORSK)
Job 11 (NORSK) »

యోబు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List