యోబు 13 TELIRV
యోబు Chapter 13 TELIRV Bible Verse Images
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.
Creative Commons License
- Title: Indian Revised Version (IRV) Telugu - 2019
- Creator: Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS)
- Source: Digital Bible Library
- License: CC BY-SA 4.0
Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.
Square Portrait Landscape 4K UHD
ఇదిగో వినండి, నా కళ్ళకు ఇదంతా కనబడింది, నా చెవులకు అంతా వినబడింది,
Square Portrait Landscape 4K UHD
మీకు తెలిసిన విషయాలన్నీ నాక్కూడా తెలుసు. నాకున్న జ్ఞానం కంటే మీకున్న జ్ఞానం ఎక్కువేమీ కాదు.
Square Portrait Landscape 4K UHD
నేను సర్వశక్తుడైన దేవునితోనే మాట్లాడాలని చూస్తున్నాను. ఆయనతోనే నేను వాదిస్తాను.
Square Portrait Landscape 4K UHD
మీరంతా అబద్ధాలు కల్పించి చెబుతారు. మీరు ఎందుకూ పనికిరాని వైద్యుల వంటివారు.
Square Portrait Landscape 4K UHD
మీరేమీ మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అదే మీకు ఉత్తమం.
Square Portrait Landscape 4K UHD
దయచేసి నేను చెప్పేది వినండి. నా పక్షంగా నేను చేసుకుంటున్న వాదన ఆలకించండి.
Square Portrait Landscape 4K UHD
మీరు దేవుని పక్షంగా నిలబడి అన్యాయంగా వాదించ వచ్చా? ఆయన తరపున వంచన మాటలు పలక వచ్చా?
Square Portrait Landscape 4K UHD
ఆయన పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తారా? మీరు దేవుని పక్షాన నిలబడి వాదిస్తారా?
Square Portrait Landscape 4K UHD
ఒకవేళ ఆయన మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమకరమా? ఒకడు ఇతరులను మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేస్తారా?
Square Portrait Landscape 4K UHD
మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన తప్పకుండా మిమ్మల్ని గద్దిస్తాడు.
Square Portrait Landscape 4K UHD
ఆయన ప్రభావం మీకు భయం కలిగించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా?
Square Portrait Landscape 4K UHD
మీరు చెప్పే గద్దింపు మాటలు బూడిదలాంటి సామెతలు. మీరు చేస్తున్న వాదాలు మట్టిగోడలవంటివి.
Square Portrait Landscape 4K UHD
నా జోలికి రాకుండా మౌనంగా ఉండండి. నేను చెప్పేది వినండి. నాకు ఏమి జరగాలని ఉందో అదే జరుగు గాక.
Square Portrait Landscape 4K UHD
నా ప్రాణాన్ని నేనే ఎరగా ఎందుకు చేసుకోవాలి? నా ప్రాణానికి తెగించి మాట్లాడతాను.
Square Portrait Landscape 4K UHD
వినండి, ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసం ఆశతో ఎదురుచూస్తున్నాను. ఆయన సమక్షంలో నా న్యాయ ప్రవర్తనను రుజువు పరుచుకుంటాను.
Square Portrait Landscape 4K UHD
దీని వల్ల నాకు విడుదల చేకూరుతుంది. భక్తిహీనుడు ఆయన సమక్షంలో నిలవడానికి సాహసం చెయ్యడు.
Square Portrait Landscape 4K UHD
నా సాక్షం జాగ్రత్తగా వినండి. నేను చేసే ప్రమాణాలు మీ చెవుల్లో మారుమ్రోగనియ్యండి.
Square Portrait Landscape 4K UHD
ఆలోచించండి, నేను నా వివాదాన్ని చక్కబరచుకున్నాను. నేను నిర్దోషిగా తీర్చబడతానని నాకు తెలుసు.
Square Portrait Landscape 4K UHD
నాతో వాదం పెట్టుకుని గెలవ గలిగేవాడు ఎవరు? ఎవరైనా ఎదుటికి వస్తే నేను నోరు మూసుకుని ప్రాణం విడిచిపెడతాను.
Square Portrait Landscape 4K UHD
దేవా, ఈ రెండు విషయాలు నా పక్షంగా జరిగించు. అప్పుడు నేను దాక్కోకుండా నీ ఎదుట కనపడతాను.
Square Portrait Landscape 4K UHD
నీ బలమైన చెయ్యి నా మీద నుండి తొలగించు. నీ భయం వల్ల నేను బెదిరిపోయేలా చెయ్యకు.
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నువ్వు పిలిస్తే నేను పలుకుతాను. లేదా నేను పిలుస్తాను, నాకు జవాబు చెప్పు.
Square Portrait Landscape 4K UHD
నేను చేసిన దోషాలు ఎన్ని? నేను చేసిన పాపాలు ఎన్ని? నా అపరాధాలు, నా పాపాలు నాకు తెలియబరచు.
Square Portrait Landscape 4K UHD
నీ ముఖాన్ని నాకు చాటు చేసుకుంటున్నావెందుకు? నన్నెందుకు నీ శత్రువుగా భావిస్తున్నావు?
Square Portrait Landscape 4K UHD
అటూ ఇటూ కొట్టుకుపోయే ఆకులాంటి నన్ను భయపెడతావా? ఎండిపోయిన చెత్త వెంటబడతావా?
Square Portrait Landscape 4K UHD
నువ్వు నాకు కఠినమైన శిక్ష విధించావు. నేను చిన్నతనంలో చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించేలా చేశావు.
Square Portrait Landscape 4K UHD
నా కాళ్ళకు బొండ వేసి బిగించావు. నా నడవడి అంతా నువ్వు కనిపెడుతున్నావు. నా అడుగులకు నువ్వే గిరి గీశావు.
Square Portrait Landscape 4K UHD
కుళ్ళిపోయిన శవంలాగా ఉన్నవాడి చుట్టూ, చిమ్మటలు తినివేసిన గుడ్డపేలికలాంటివాడి చుట్టూ గిరి గీసి కాపు కాస్తున్నావు.
Available Bible Translations
Job 13 (ASV) »
Job 13 (KJV) »
Job 13 (GW) »
Job 13 (BSB) »
Job 13 (WEB) »
Job 13 (LSG) »
Hiob 13 (LUTH1912) »
अय्यूब 13 (HINIRV) »
ਅੱਯੂਬ 13 (PANIRV) »
ইয়োব 13 (BENIRV) »
யோபு 13 (TAMIRV) »
ईयोब 13 (MARIRV) »
અયૂબ 13 (GUJIRV) »
ಯೋಬನು 13 (KANIRV) »
أَيُّوبَ 13 (AVD) »
איוב 13 (HEB) »
Jó 13 (BSL) »
Gióp 13 (VIE) »
Job 13 (RVA) »
Giobbe 13 (RIV) »
约 伯 记 13 (CUVS) »
約 伯 記 13 (CUVT) »
Jobi 13 (ALB) »
Job 13 (SV1917) »
Иов 13 (RUSV) »
Йов 13 (UKR) »
Jób 13 (KAR) »
Йов 13 (BULG) »
ヨブ記 13 (JPN) »
Job 13 (NORSK) »