యోబు Chapter 3 TELIRV Bible Verse Images

యోబు 3 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యోబు 3 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యోబు 3:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరువాత యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను పుట్టిన దినాన్ని శపించాడు.

యోబు 3:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోబు ఇలా అన్నాడు.

యోబు 3:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బాగుండేది. “మగ పిల్లవాడు పుట్టాడు” అని చెప్పే రాత్రి సమయం లేకపోయినట్టయితే బాగుండేది. నా తల్లి గర్భాన్ని ఆ రోజు మూసి ఉంచితే బాగుండేది. ఆ రోజు నా కళ్ళకు బాధను మరుగు చేయలేకపోయింది.

యోబు 3:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజు చీకటిమయం కావాలి. దాని మీద వెలుగు ప్రకాశించకూడదు. పైన ఉన్న దేవుడు ఆ రోజును లెక్కించకూడదు.

యోబు 3:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరికి తీసుకోవాలి. దాన్ని మేఘాలు ఆవరించాలి. పగటివేళ చీకటి కమ్మినట్టు దానికి భయాందోళన కలగాలి.

యోబు 3:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కటిక చీకటి ఆ రాత్రిని ఒడిసి పట్టాలి. సంవత్సరం రోజుల్లో నేనూ ఒకదాన్నని అది చెప్పుకోకుండా ఉండాలి. ఏ నెలలోనూ అది భాగం కాకూడాదు.

యోబు 3:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రాత్రి ఎవ్వరూ పుట్టకపోతే బాగుండేది. అప్పుడు ఎవ్వరూ హర్ష ధ్వానాలు చెయ్యకపోతే బాగుండేది.

యోబు 3:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శపించేవాళ్ళు ఆ రోజును శపించాలి. సముద్ర రాక్షసిని రెచ్చగొట్టే వాళ్ళు దాన్ని శపించాలి.

యోబు 3:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ దినాన సంధ్యవేళలో ప్రకాశించే నక్షత్రాలకు చీకటి కమ్మాలి. వెలుగు కోసం అది ఎదురు చూసినప్పుడు వెలుగు కనబడకూడదు.

యోబు 3:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది ఉదయ సూర్య కిరణాలు చూడకూడదు. పుట్టిన వెంటనే నేనెందుకు చనిపోలేదు?

యోబు 3:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తల్లి గర్భం నుండి బయటపడగానే నా ప్రాణం ఎందుకు పోలేదు?

యోబు 3:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నన్నెందుకు మోకాళ్ల మీద పడుకోబెట్టుకున్నారు? నేనెందుకు తల్లి పాలు తాగాను?

యోబు 3:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేకపోతే ఇప్పుడు నేను పడుకుని ప్రశాంతంగా ఉండేవాణ్ణి. నేను చనిపోయి విశ్రాంతిగా ఉండేవాణ్ణి.

యోబు 3:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శిథిలమైపోయిన భవనాలు తిరిగి కట్టించుకునే భూరాజుల్లాగా, మంత్రుల్లాగా నేను కూడా చనిపోయి ప్రశాంతంగా ఉండేవాణ్ణి.

యోబు 3:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బంగారం సంపాదించుకుని, తమ ఇంటినిండా వెండిని నింపుకున్న అధికారుల్లాగా నేను కన్నుమూసి ఉండేవాణ్ణి.

యోబు 3:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భూమిలో పాతిపెట్టబడిన పిండంలాగా వెలుగు చూడని పసికందులాగా నాకిప్పుడు ఉనికి ఉండేది కాదు.

యోబు 3:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ దుర్మార్గులు ఇక బాధపెట్టరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు.

యోబు 3:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ బంధితులైన వారు కలసి విశ్రమిస్తారు. వాళ్ళ చేత పనులు చేయించేవాళ్ళ ఆజ్ఞలు వాళ్లకు వినిపించవు.

యోబు 3:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేదవారు, గొప్పవారు అంతా అక్కడ ఉన్నారు. దాసులు తమ యజమానుల చెర నుండి తప్పించుకుని స్వతంత్రులయ్యారు.

యోబు 3:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుర్దశలో ఉన్నవారికి వెలుగు ఎందుకు? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఎందుకు?

యోబు 3:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు మరణం కోరుకుంటారు. దాచిపెట్టిన నిధి కోసం వాళ్ళు లోతుగా తవ్వుతున్నారు గాని అది వారికి దొరకడం లేదు.

యోబు 3:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు సమాధికి చేరినప్పుడు వారు ఆనందిస్తారు, ఎంతో సంబరపడతారు.

యోబు 3:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మార్గం కనుగొనలేని వాడికి, దేవుడు చుట్టూ కంచె వేసిన వాడికి జీవం ఎందుకు?

యోబు 3:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భోజనం చేయడానికి బదులు నాకు నిట్టూర్పులు కలుగుతున్నాయి. నేను చేసే ఆక్రందనలు నీళ్లలాగా పారుతున్నాయి.

యోబు 3:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏమి జరుగుతుందని నేను భయపడ్డానో అదే నాకు జరిగింది. నేను భయపడినదే నా మీదికి వచ్చింది.

యోబు 3:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాకు శాంతి లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. వీటికి బదులు కష్టాలే వచ్చాయి.

Available Bible Translations

American Standard Version
Job 3 (ASV) »
King James Version
Job 3 (KJV) »
GOD’S WORD® (GW)
Job 3 (GW) »
Berean Bible
Job 3 (BSB) »
World English Bible
Job 3 (WEB) »
Louis Segond 1910
Job 3 (LSG) »
Luther Bibel 1912
Hiob 3 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
अय्यूब 3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅੱਯੂਬ 3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইয়োব 3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யோபு 3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
ईयोब 3 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
અયૂબ 3 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೋಬನು 3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَيُّوبَ 3 (AVD) »
תנ ך עברי מודרני
איוב 3 (HEB) »
Bíblia Sagrada Português
Jó 3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Gióp 3 (VIE) »
Reina Valera Antigua
Job 3 (RVA) »
La Sacra Bibbia
Giobbe 3 (RIV) »
圣 经 简体中文和合本
约 伯 记 3 (CUVS) »
聖 經 繁體中文和合本
約 伯 記 3 (CUVT) »
Bibla e Shenjtë
Jobi 3 (ALB) »
Svenska Bibeln 1917
Job 3 (SV1917) »
Библия на русском
Иов 3 (RUSV) »
Українська Біблія
Йов 3 (UKR) »
Szent Biblia - Magyar
Jób 3 (KAR) »
Българска Библия
Йов 3 (BULG) »
聖書 日本語
ヨブ記 3 (JPN) »
Det Norsk Bibel
Job 3 (NORSK) »
Biblia Takatifu
Ayubu 3 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Ayuub 3 (SOM) »
De Heilige Schrift
Job 3 (NLD) »
Dansk Bibel 1871
Job 3 (DA1871) »

యోబు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List