యోబు Chapter 9 TELIRV Bible Verse Images

యోబు 9 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యోబు 9 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యోబు 9:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు.

యోబు 9:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిజమే, ఆ విషయం అలాగే ఉంటుందని నాకు తెలుసు. మనిషి దేవుని దృష్టిలో లోపం లేనివాడుగా ఎలా ఉండగలడు?

యోబు 9:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనిషి ఆయనతో వివాదం పెట్టుకుంటే ఆయన అడిగే వెయ్యి ప్రశ్నల్లో ఒక్కదానికైనా జవాబు చెప్పలేడు.

యోబు 9:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన అత్యంత వివేకం, బల ప్రభావాలు గలవాడు. ఆయనతో పోరాడాలని తెగించిన వాళ్ళు తప్పక కీడు పాలవుతారు.

యోబు 9:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పర్వతాలను వాటికి తెలియకుండానే ఆయన తొలగిస్తాడు. కోపంతో వాటిని బోర్లాపడేలా చేస్తాడు.

యోబు 9:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భూమిని కూడా అది ఉన్న స్థలం నుండి కదిలించివేస్తాడు. భూమి పునాదులు ఊగిపోయేలా చేస్తాడు.

యోబు 9:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన సూర్యుడికి ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాలను కనబడకుండా దాచివేస్తాడు.

యోబు 9:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలం చేస్తాడు. సముద్ర అలల మీద ఆయన నడుస్తున్నాడు.

యోబు 9:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్వాతి, మృగశీర్షం, కృత్తిక అనే నక్షత్రాలను, దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే కలగజేశాడు.

యోబు 9:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరికీ అంతు చిక్కని మహిమ గల కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడు.

యోబు 9:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇదిగో, ఆయన నా సమీపంలో ఉంటున్నాడు, కానీ నేను ఆయనను గుర్తించలేదు. నా పక్కనుండి నడుస్తూ వెళ్తున్నాడు కానీ ఆయన నాకు కనబడడు.

యోబు 9:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తీసుకువెళ్తుంటే ఆయనను అడ్డగించేవాడెవడు? “నువ్వేం చేస్తున్నావు?” అని ఆయనను అడగగలిగే వాళ్ళు ఎవరు?

యోబు 9:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని కోపం చల్లారదు. రాహాబుకు సహాయం చేసిన వాళ్ళు ఆయనకు లొంగిపోయారు.

యోబు 9:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఆయనకు జవాబివ్వడానికి నేనేపాటి వాణ్ణి? సూటియైన మాటలు పలుకుతూ ఆయనతో వాదించడానికి నేనెంతటి వాణ్ణి?

యోబు 9:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను న్యాయవంతుణ్ణి అయినా ఆయనకు జవాబు చెప్పలేను. నా న్యాయాధిపతిని కరుణించమని వేడుకోవడం మాత్రమే చేయగలను.

యోబు 9:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు జవాబిచ్చినా ఆయన నా మాట వింటాడని నాకు నమ్మకం లేదు.

యోబు 9:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నా మొర వినకుండా నన్ను తుఫాను చేత నలగగొడుతున్నాడు. కారణం లేకుండా నా గాయాలను రేగగొడుతున్నాడు.

యోబు 9:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడు. చేదు పదార్థాలు నాకు తినిపిస్తాడు.

యోబు 9:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బలవంతుల శక్తిని గూర్చి ప్రశ్న వస్తే “నేనే ఉన్నాను” అని ఆయన అంటాడు. న్యాయ నిర్ణయం గూర్చి వివాదం రేగినప్పుడు “నాకు విరోధంగా వాదించేది ఎవరు?” అని ఆయన అడుగుతాడు.

యోబు 9:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను చేసే వాదన న్యాయంగా ఉన్నప్పటికీ నా మాటలే నా మీద నేరం మోపుతాయి. నేను న్యాయవంతుడినైప్పటికీ దోషినని నా మాటలు రుజువు చేస్తాయి.

యోబు 9:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నిర్దోషిని అయినప్పటికీ నా మీద నాకు ఇష్టం పోయింది. నా ప్రాణం అంటే నాకు లెక్క లేదు.

యోబు 9:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తేడా ఏమీ లేదు. అందుకే అంటున్నాను, ఆయన నీతిమంతులు, దుర్మార్గులు అనే భేదం లేకుండా అందరినీ నాశనం చేస్తున్నాడు.

యోబు 9:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకస్మాత్తుగా సమూల నాశనం సంభవిస్తే నిరపరాధులు పడే అవస్థను చూసి ఆయన నవ్వుతాడు.

యోబు 9:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భూమి దుర్మార్గుల ఆధీనంలో ఉంది. ఆయన న్యాయాధిపతులకు మంచి చెడ్డల విచక్షణ లేకుండా చేస్తాడు. ఇవన్నీ చేయగలిగేది ఆయన గాక ఇంకెవరు?

యోబు 9:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరుగు తీసే వాడి కంటే వేగంగా, ఎలాంటి మంచీ లేకుండానే నా రోజులు గడిచిపోతున్నాయి.

యోబు 9:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెల్లుతో కట్టిన పడవలు సాగిపోతున్నట్టు, గరుడపక్షి ఎరను చూసి హటాత్తుగా దానిపై వాలినట్టు నా రోజులు దొర్లిపోతున్నాయి.

యోబు 9:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా బాధలు మరచిపోతాననీ, నా దుఃఖం పోయి సంతోషంగా ఉంటాననీ నేను అనుకున్నానా?

యోబు 9:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాకు వచ్చిన బాధలన్నిటిని బట్టి భయపడుతున్నాను. నువ్వు నన్ను నిర్దోషిగా ఎంచవన్న విషయం నాకు స్పష్టంగా తెలిసిపోయింది.

యోబు 9:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను దోషిని అని నిర్ణయం అయిపొయింది గదా. ఇక నాకెందుకు ఈ వృథా ప్రయాస?

యోబు 9:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నన్ను నేను మంచులాగా శుభ్రం చేసుకున్నా, సబ్బుతో నా చేతులు తోముకున్నా,

యోబు 9:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నన్ను గుంటలో పడేస్తావు. అప్పుడు నేను వేసుకున్న బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.

యోబు 9:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనకు జవాబు చెప్పడానికి దేవుడు నాలాగా మనిషి కాదు. ఆయనతో వాదించడానికి మేమిద్దరం కలసి న్యాయస్థానానికి వెళ్ళడం ఎలా?

యోబు 9:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా ఇద్దరి మీద చెయ్యి ఉంచి తీర్పు చెప్పగలిగే వ్యక్తి మాకు లేడు.

యోబు 9:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన శిక్షాదండం నా మీద నుండి తొలగించాలి. ఆయన భయంకర చర్యలు నాలో వణుకు పుట్టించకుండా ఉండాలి.

యోబు 9:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నేను భయం లేకుండా ఆయనతో మాట్లాడతాను, అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను అలా చెయ్యలేను.

Available Bible Translations

American Standard Version (ASV)
Job 9 (ASV) »
King James Version (KJV)
Job 9 (KJV) »
GOD’S WORD® (GW)
Job 9 (GW) »
Berean Bible (BSB)
Job 9 (BSB) »
World English Bible (WEB)
Job 9 (WEB) »
French Bible (LSG)
Job 9 (LSG) »
German Bible (LUTH1912)
Hiob 9 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਅੱਯੂਬ 9 (PANIRV) »
Bengali Bible (BENIRV)
ইয়োব 9 (BENIRV) »
Tamil Bible (TAMIRV)
யோபு 9 (TAMIRV) »
Marathi Bible (MARIRV)
ईयोब 9 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
અયૂબ 9 (GUJIRV) »
Kannada Bible (KANIRV)
ಯೋಬನು 9 (KANIRV) »
Hebrew Bible (HEB)
איוב 9 (HEB) »
Portuguese Bible (BSL)
Jó 9 (BSL) »
Vietnamese Bible (VIE)
Gióp 9 (VIE) »
Spanish Bible (RVA)
Job 9 (RVA) »
Italian Bible (RIV)
Giobbe 9 (RIV) »
Chinese Simplified (CUVS)
约 伯 记 9 (CUVS) »
Chinese Traditional (CUVT)
約 伯 記 9 (CUVT) »
Albanian Bible (ALB)
Jobi 9 (ALB) »
Swedish Bible (SV1917)
Job 9 (SV1917) »
Russian Bible (RUSV)
Иов 9 (RUSV) »
Ukrainian Bible (UKR)
Йов 9 (UKR) »
Hungarian Bible (KAR)
Jób 9 (KAR) »
Bulgarian Bible (BULG)
Йов 9 (BULG) »
Japanese Bible (JPN)
ヨブ記 9 (JPN) »
Norwegian Bible (NORSK)
Job 9 (NORSK) »

యోబు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List