యోబు Chapter 38 TELIRV Bible Verse Images

యోబు 38 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యోబు 38 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యోబు 38:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.

యోబు 38:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జ్ఞానం లేని మాటలు చెప్పి నా పథకాలను చెడగొడుతున్న వీడెవడు?

యోబు 38:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పౌరుషంగా నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను. నాకు జవాబియ్యాలి.

యోబు 38:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు.

యోబు 38:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకు తెలిస్తే చెప్పు, దాని పరిమాణం ఎవరు నిర్ణయించారు? దానికి కొలతలు వేసిన దెవరు?

యోబు 38:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని పునాదులు దేనిపై ఉన్నాయి? ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు చేస్తుండగా దాని మూలరాయి నిలబెట్టింది ఎవరు?

యోబు 38:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని పునాదులు దేనిపై ఉన్నాయి? ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు చేస్తుండగా దాని మూలరాయి నిలబెట్టింది ఎవరు?

యోబు 38:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సముద్రం దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపులు వేసి దాన్ని మూసిన వాడెవడు?

యోబు 38:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మేఘాలకు బట్టలు తొడిగినప్పుడు గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా?

యోబు 38:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సముద్రానికి నా సరిహద్దు నియమించి, దాని తలుపులను, గడియలను అమర్చినప్పుడు,

యోబు 38:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నువ్వు ఇంతవరకే మరి దగ్గరికి రాకూడదు, ఇక్కడే నీ తరంగాల గర్వం అణిగిపోవాలి” అని నేను సముద్రానికి చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా?

యోబు 38:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ జీవితకాలమంతటిలో ఎప్పుడైనా ప్రాతఃకాలాన్ని రమ్మని ఆజ్ఞాపించావా? తెల్లవారి సూర్యోదయానికి దాని స్థానాన్ని నియమించావా?

యోబు 38:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుష్టులు దానిలో ఉండకుండా దులిపివేసేలా భూమి అంచులను అది ఒడిసి పట్టేలా ఉదయాన్ని పంపించావా?

యోబు 38:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముద్ర బంకమట్టి రూపాన్ని మార్చినట్టు భూతలం రూపాంతరం చెందుతూ ఉంటుంది. దానిపై ఉన్నవన్నీ వస్త్రం మీది మడతల్లాగా స్పష్టంగా కనబడతాయి.

యోబు 38:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుష్టుల వెలుగు వారి నుండి తొలిగిపోతుంది. వారు ఎత్తిన చెయ్యి విరగ్గొట్టబడుతుంది.

యోబు 38:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సముద్రపు ఊటల్లోకి నువ్వు చొరబడ్డావా? సముద్రం అడుగున తిరుగులాడావా?

యోబు 38:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మరణద్వారాలు నీకు తెరుచుకున్నాయా? మరణాంధకార ద్వారాలను నువ్వు చూశావా?

యోబు 38:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించావా? ఇదంతా నీకేమైనా తెలిస్తే చెప్పు.

యోబు 38:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెలుగు విశ్రాంతి తీసుకునే చోటుకు దారి ఏది? చీకటి అనేదాని ఉనికిపట్టు ఏది?

యోబు 38:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెలుగును, చీకటిని అవి ఉద్యోగాలు చేసే చోటులకు నువ్వు తీసుకుపోగలవా? వాటి పని అయిపోయాక వాటిని మళ్లీ వాటి ఇళ్ళకు తీసుకుపోగలవా?

యోబు 38:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవన్నీ నీకు తెలుసు కదా! నువ్వు అప్పటికే పుట్టావట గదా. నువ్వు బహు వృద్ధుడివి మరి.

యోబు 38:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు మంచును నిలవ చేసిన గిడ్డంగుల్లోకి వెళ్లావా? వడగండ్లను దాచి ఉంచిన కొట్లను నువ్వు చూశావా? ఆపత్కాలం కోసం యుద్ధ దినాల కోసం నేను వాటిని దాచి ఉంచాను.

యోబు 38:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు మంచును నిలవ చేసిన గిడ్డంగుల్లోకి వెళ్లావా? వడగండ్లను దాచి ఉంచిన కొట్లను నువ్వు చూశావా? ఆపత్కాలం కోసం యుద్ధ దినాల కోసం నేను వాటిని దాచి ఉంచాను.

యోబు 38:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెరుపులను వాటి వాటి దారుల్లోకి పంపించే చోటు ఏది? తూర్పు గాలి ఎక్కడనుండి బయలుదేరి భూమి మీద నఖముఖాలా వీస్తుంది?

యోబు 38:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనుషులు లేని తావుల్లో వర్షం కురిపించడానికి, నిర్జన ప్రదేశాల్లో వాన కురియడానికి,

యోబు 38:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చవిటి నేలలను, జన సంచారం లేని ఎడారులను తృప్తి పరచడానికి, అక్కడ లేత గడ్డి పరకలు మొలిపించడానికి,

యోబు 38:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వర్ష ధారలకోసం కాలవలను, ఉరుములు గర్జించడానికి దారులను ఏర్పరచిన వాడెవడు?

యోబు 38:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను కన్నది ఎవరు?

యోబు 38:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మంచు గడ్డ ఎవరి గర్భంలోనుండి వస్తుంది? ఆకాశం నుండి జాలువారే మంచును ఎవరు పుట్టించారు?

యోబు 38:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జలాలు దాక్కుని రాయిలాగా గడ్డకట్టుకుపోతాయి. అగాధజలాల ఉపరితలం ఘనీభవిస్తుంది.

యోబు 38:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కృత్తిక నక్షత్రాలను నువ్వు బంధించగలవా? మృగశిరకు కట్లు విప్పగలవా?

యోబు 38:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి కాలాల్లో నక్షత్ర రాసులను వచ్చేలా చేయగలవా? సప్తర్షి నక్షత్రాలను వాటి ఉపనక్షత్రాలను నువ్వు నడిపించగలవా?

యోబు 38:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకాశమండల నియమాలు నీకు తెలుసా? అది భూమిని పరిపాలించే విధానం నువ్వు స్థాపించగలవా?

యోబు 38:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జడివాన నిన్ను కప్పేలా మేఘాలకు గొంతెత్తి నువ్వు ఆజ్ఞ ఇయ్యగలవా?

యోబు 38:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెరుపులు బయలుదేరి వెళ్లి “చిత్తం ఇదుగో ఉన్నాం” అని నీతో చెప్పేలా నువ్వు వాటిని బయటికి రప్పించగలవా?

యోబు 38:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేఘాల్లో జ్ఞానం ఉంచిన వాడెవడు? పొగమంచుకు తెలివినిచ్చిన వాడెవడు?

యోబు 38:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నైపుణ్యంగా మేఘాలను లెక్కబెట్ట గలవాడెవడు?

యోబు 38:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మట్టి గడ్డల్లోకి ధూళి దూరి అవి ఒక దానికొకటి అంటుకొనేలా మేఘ కలశాల్లో నుండి నీటిని ఒలికించగలిగింది ఎవరు?

యోబు 38:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆడసింహం కోసం నువ్వు జంతువును వేటాడతావా?

యోబు 38:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సింహం పిల్లలు తమ గుహల్లో పడుకుని ఉన్నప్పుడు, తమ మాటుల్లో పొంచి ఉన్నప్పుడు నువ్వు వాటి ఆకలి తీరుస్తావా?

యోబు 38:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాకి పిల్లలు దేవునికి మొరపెట్టేటప్పుడు, ఆకలికి అలమటించేటప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడెవడు?

Available Bible Translations

American Standard Version
Job 38 (ASV) »
King James Version
Job 38 (KJV) »
GOD’S WORD® (GW)
Job 38 (GW) »
Berean Bible
Job 38 (BSB) »
World English Bible
Job 38 (WEB) »
Louis Segond 1910
Job 38 (LSG) »
Luther Bibel 1912
Hiob 38 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
अय्यूब 38 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅੱਯੂਬ 38 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইয়োব 38 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யோபு 38 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
ईयोब 38 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
અયૂબ 38 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೋಬನು 38 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَيُّوبَ 38 (AVD) »
תנ ך עברי מודרני
איוב 38 (HEB) »
Bíblia Sagrada Português
Jó 38 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Gióp 38 (VIE) »
Reina Valera Antigua
Job 38 (RVA) »
La Sacra Bibbia
Giobbe 38 (RIV) »
圣 经 简体中文和合本
约 伯 记 38 (CUVS) »
聖 經 繁體中文和合本
約 伯 記 38 (CUVT) »
Bibla e Shenjtë
Jobi 38 (ALB) »
Svenska Bibeln 1917
Job 38 (SV1917) »
Библия на русском
Иов 38 (RUSV) »
Українська Біблія
Йов 38 (UKR) »
Szent Biblia - Magyar
Jób 38 (KAR) »
Българска Библия
Йов 38 (BULG) »
聖書 日本語
ヨブ記 38 (JPN) »
Det Norsk Bibel
Job 38 (NORSK) »
Biblia Takatifu
Ayubu 38 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Ayuub 38 (SOM) »
De Heilige Schrift
Job 38 (NLD) »
Dansk Bibel 1871
Job 38 (DA1871) »

యోబు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List