యోబు Chapter 32 TELIRV Bible Verse Images

యోబు 32 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యోబు 32 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యోబు 32:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోబు తన దృష్టికి తాను నీతిమంతుడుగా ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు గ్రహించి అతనికి జవాబు చెప్పడం చాలించుకున్నారు.

యోబు 32:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు రము వంశస్థుడు, బూజీయుడు, బరకెయేలు కుమారుడు అయిన ఎలీహు, యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకోవడం చూసి అతని మీద ఎంతో కోపగించాడు.

యోబు 32:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోబు ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకుండా యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు ఎంతో కోపగించాడు.

యోబు 32:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సు గలవారు గనక అతడు యోబుతో మాటలాడాలని ఎదురు చూస్తున్నాడు.

యోబు 32:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఆ ముగ్గురూ ప్రత్యుత్తరమేమీ ఇయ్యక పోవడం చూసి అతనికి కోపం రేగింది.

యోబు 32:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి బూజీయుడైన బరకెయేలు కుమారుడు ఎలీహు ఇలా మాటలాడసాగాడు. నేను వయస్సులో చిన్నవాణ్ణి. మీరు బహు వృద్ధులు. ఆ కారణం చేత నేను భయపడి నా ఉద్దేశం మీకు తెలియజేయడానికి తెగించలేదు.

యోబు 32:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వృద్ధాప్యం మాట్లాడాలి, అధిక సంఖ్యగల సంవత్సరాలు జ్ఞానం బోధించడానికి తగినవి, అని నేను అనుకున్నాను.

యోబు 32:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా మనుషుల్లో ఆత్మ ఒకటి ఉంది. సర్వశక్తుడైన దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేస్తుంది.

యోబు 32:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు. పెద్ద వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసినవారు కారు.

యోబు 32:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నా మాట అంగీకరించమని మనవి చేస్తున్నాను. నేను కూడా నా అభిప్రాయం తెలుపుతాను.

యోబు 32:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏమి పలకాలా అని మీరు ఆలోచిస్తుండగా నేను మీ మాటల కోసం కనిపెట్టుకున్నాను. మీ అభిప్రాయాలు చెవిని వేసుకోవడం కోసం మీరు చెప్పిన వాటిపై బహు జాగ్రత్తగా ధ్యాస పెట్టాను. అయితే మీలో ఎవరూ యోబును ఖండించలేదు. ఎవరూ అతని మాటలకు జవాబు ఇయ్యలేదు.

యోబు 32:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏమి పలకాలా అని మీరు ఆలోచిస్తుండగా నేను మీ మాటల కోసం కనిపెట్టుకున్నాను. మీ అభిప్రాయాలు చెవిని వేసుకోవడం కోసం మీరు చెప్పిన వాటిపై బహు జాగ్రత్తగా ధ్యాస పెట్టాను. అయితే మీలో ఎవరూ యోబును ఖండించలేదు. ఎవరూ అతని మాటలకు జవాబు ఇయ్యలేదు.

యోబు 32:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మాకు జ్ఞానం లభించిందని, దేవుడు తప్ప మనుషులు అతన్ని ఓడించలేరని మీరు అనకూడదు.

యోబు 32:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి నేనతనికి జవాబు ఇయ్యను.

యోబు 32:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఆశ్చర్యపడి ఇక జవాబు చెప్పడం మానుకున్నారు. పలకడానికి వారికి మాట ఒకటి కూడా లేదు.

యోబు 32:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాగా వారిక ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. వారు మాటలాడక పోవడం చూసి నేను ఊరుకుంటానా?

యోబు 32:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ఇయ్యవలసిన జవాబు నేనిస్తాను. నేను కూడా నా అభిప్రాయం తెలుపుతాను.

యోబు 32:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా మనస్సునిండా మాటలున్నాయి. నా అంతరంగంలో ఉన్న ఆత్మ నన్ను బలవంతం చేస్తున్నది.

యోబు 32:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా మనస్సు తెరవని ద్రాక్షారసపు తిత్తి లాగా ఉంది. కొత్త తిత్తుల్లాగా అది పిగిలిపోడానికి సిద్ధంగా ఉంది.

యోబు 32:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మాట్లాడి బరువు దించుకుంటాను. నా పెదాలు విప్పి ప్రత్యుత్తరమిస్తాను.

యోబు 32:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు దయచేసి వినండి. నేను ఎవరి విషయంలోనూ పక్షపాతం చూపించను. నేను ముఖస్తుతి కోసం ఎవరికీ బిరుదులు తగిలించను.

యోబు 32:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముఖస్తుతి చేయడం నా చేత కాదు. అలా చేస్తే నన్ను చేసినవాడు శీఘ్రంగా నన్ను నిర్మూలం చేస్తాడు.

Available Bible Translations

American Standard Version
Job 32 (ASV) »
King James Version
Job 32 (KJV) »
GOD’S WORD® (GW)
Job 32 (GW) »
Berean Bible
Job 32 (BSB) »
World English Bible
Job 32 (WEB) »
Louis Segond 1910
Job 32 (LSG) »
Luther Bibel 1912
Hiob 32 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
अय्यूब 32 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅੱਯੂਬ 32 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইয়োব 32 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யோபு 32 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
ईयोब 32 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
અયૂબ 32 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೋಬನು 32 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَيُّوبَ 32 (AVD) »
תנ ך עברי מודרני
איוב 32 (HEB) »
Bíblia Sagrada Português
Jó 32 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Gióp 32 (VIE) »
Reina Valera Antigua
Job 32 (RVA) »
La Sacra Bibbia
Giobbe 32 (RIV) »
圣 经 简体中文和合本
约 伯 记 32 (CUVS) »
聖 經 繁體中文和合本
約 伯 記 32 (CUVT) »
Bibla e Shenjtë
Jobi 32 (ALB) »
Svenska Bibeln 1917
Job 32 (SV1917) »
Библия на русском
Иов 32 (RUSV) »
Українська Біблія
Йов 32 (UKR) »
Szent Biblia - Magyar
Jób 32 (KAR) »
Българска Библия
Йов 32 (BULG) »
聖書 日本語
ヨブ記 32 (JPN) »
Det Norsk Bibel
Job 32 (NORSK) »
Biblia Takatifu
Ayubu 32 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Ayuub 32 (SOM) »
De Heilige Schrift
Job 32 (NLD) »
Dansk Bibel 1871
Job 32 (DA1871) »

యోబు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List